Tuesday, October 1, 2013

ప్రకృతి - మనిషి

వాన ధారల దారాలల్లి
నేలని తాకింది నింగి
పచ్చని పైరుతో మురిపెంగా కుట్టి
పృధ్వి ని తీర్చింది మొలక
రాలిన పూవుని సైతం అందంగా పరిచి
మెత్తగ మార్చింది వృక్షం
వర్ణం లేని వర్ణన కోరని
నీరు పారింది అంతా తడుపుతూ
కొండ పై నించి దుమికి ఎత్తు పై నించి ఎగిసి
పాల నురగయ్యింది జల పాతం
చక్కని కిరణాల బాణాలొదిలి
వెచ్చదనం పరచాడు ఉదయ భానుడు
చల్లని వెన్నెల జగమంతా పంచి
ఆనందం నింపాడు చందమామ 
అచంచలంగా నిశ్చలంగా
సేవ చేస్తున్నవి ఇన్ని వనరులు
మరి అనంతమైన స్వార్థం తో
ఎందుకు వీటన్నిటినీ తెగ పాడుచేస్తున్నాడు నరుడు




మొక్కలే కదా భవిష్యత్తుకు మొలకలు
చూపవవి ఎటువంటి స్వార్థపు మెలికలు
చేరదీస్తే చెట్లను మనకు మేలు కలుగును
చక్కదనాల చిక్కని చల్లదనాలే మనవగును

No comments: