Sunday, September 6, 2020

మేదుర దన్త వృత్తము (కిరీటి వృత్తము) పద్యములు

 [28/08, 23:20] Durgamadhuri1:

[29/08, 11:48] Durgamadhuri1: 


లోకము నేలెడి నాయకి! యెంచక లోపము గావుమ బిడ్డల! మమ్ముల!

యో కరుణా మృత రూపిణి! నిర్వృతి యోగము వేడెద నెన్నడు వీడక

నీకడ యుండెడి భాగ్యమె సంపద నిక్కము యంచుచు మోక్షము నిమ్మని

మా కడ గండ్లను దీరిచి నీదరి మానవ జాతికి నిమ్మని ప్రార్థన

[01/09, 00:18] Durgamadhuri1: 


జంగమ దేవర తాండవ మాడెడి శైలియు నద్భుత రీతిగ నుండును

గంగయు గౌరియు పాదము చక్కగ గల్పుచు నాట్యము లాడగ జూచిన 

యంగన లందరు నేర్చుచు విద్యను హంసల ‌చందము మోదము పంచెడి

భంగిని తాళము గల్గిన తీయని పాటను పాడుచు నాట్యము జేసిరి

[01/09, 16:02] Durgamadhuri1: 

కరు లటునిటు నిల్వగ నీ కరములందు

కాంచనము కురిపించుచు కనుల నిండు

రూపమన దర్శనమిచ్చు లోక మాత!

నిన్ను నిరతము గొల్తును నీరజాక్షి

[01/09, 21:06] Durgamadhuri1: 

మత్తగజంబులు ప్రక్కన జేరెను మాధవ పత్నికి చామర వీచగ

నెత్తుచు తొండము సౌరభ పుష్పము నింపుగ జల్లెను హస్తము నందున

హత్తిన తామర భాగ్యము గన్గొని హర్షము జిమ్మెను పూర్వపు జేతుల

పుత్తడి సైతము నింతటి దీవెన పొందగ పొంగుచు జిల్గుల నద్దెను

హత్తిన - నాటిన; పోతన విరచిత శ్రీ భాగవత పద్యాలు శ్రీ గజేంద్ర మోక్షం లోనిది ఈ పదము

[04/09, 22:24] Durgamadhuri1: 


[11/09, 03:37] Durgamadhuri1: ముక్కెర జూడరె యమ్మకు మోమున ముచ్చట గొల్పెను యందము పొందెను

చక్కని తల్లిని భక్తిగ జూచుచు సంతస మొందుచు మెల్లగ తానిక

చుక్కల మధ్యన నుండెడి చల్లని సోముడు జేరెను మాత శిరస్సున 

దిక్కుల నేలెడి దేవత లందరి దేవిని జూచిన మోదము గల్గును


Failed ones:



[15/09, 16:03] Durgamadhuri1: మోహన రాగము వీనుల విందుగ ముచ్చట గొల్పుచు నుండును నెప్పుడు

మోహన రూపము దాల్చిన విష్ణువు పోరున గెల్చెను భస్ముని యుక్తిగ

మోహము నాశము గానిది యందదు మోక్షము నేర్వుము సత్యము భక్తుల!

మోహన మానస ముండిన పండును మోడుగ మారిన జీవిత గాధలు

[15/09, 16:03] Durgamadhuri1: ముత్యపు కాంతులు చల్లెడి పాదము మోహము ద్రుంచును మోక్షము నిచ్చును

రత్నపు వెల్గులు చిందుచు నాట్యము లాస్యము లాడెడి పాదము ద్వయము

నిత్యము సృష్టికి రక్షణ జేయును నిక్కము సంతస మిచ్చెడి రూపము

సత్యము చిత్తము యామెయె వేకువ ఝామున రేఖకు చేతన మామెయె


No comments: