Sunday, September 20, 2020

తోపెల్ల గురువు గారి వద్ద నా మొదటి పద్యములు

 [09/04, 01:34] Durgamadhuri1: పలుకులు కావవి పదముల కూర్పులు

తేనెలు చిందే తెలుగక్షరములు

[10/05, 23:52] Durgamadhuri1: కచ్ఛపీ నీ కరుణ కలగక

కలము ఎటుయును కదపలేనిక

[12/05, 23:29] Thompella Bala Subramanyam Acharya: రగడకు అంత్య ప్రాస ఉండాలి ప్రతి రెండు పాదాంతాలలో అది లేదు. సరే చంద్రగణాలు ఉండాలి గణాలను చూస్తున్నావా? చూస్తూ సాధన ఎన్నటికీ రాదు. వచ్చాకే సాధన చెయ్యాలి. లక్షణాలు రావాలి తడుముకోకుండా. చంద్రగణాలు 16 నోటికి వచ్చా?

[21/05, 13:32] Durgamadhuri1: కాళింది మడుగులో కృష్ణయ్య తారంగమూ

కాళికా సోదరుని నాట్య సంరంభమూ

[03/07, 23:55] Durgamadhuri1: దుర్గ వాసినీ బాపుమా దుర్గతులను

దుష్ట సంహారిణీ దేవి దోష రహిత

దీన బాంధవి మా దశ దిశయు నీవు

దినకర శశి వహ్ని నయని ప్రణతి దుర్గ!


దుర్గమ్మను స్తుతిస్తూ ప్రయత్నించిన తేటగీతి పద్యము... గురువులు పెద్దలు దోషములున్న తెలుప ప్రార్థన

[05/07, 15:48] Durgamadhuri1: దైవ రూపులు గురువులు ధైర్యమిచ్చి

పద్య రచన సేయుట యందు పట్టు నిచ్చి

భయము కలిగిన స్వాంతన వచనములను

పలుకు నడిపెడి యొజ్జకు వందనమ్ము

[05/07, 17:23] Thompella Bala Subramanyam Acharya: నిర్దోషమమ్మా చాల బాగా మంచి పదాలతో వ్రాసావు శుభమస్తు గ్రూప్ లో పెట్టుమ

[05/07, 17:50] Durgamadhuri1: జీవితమున చీకట్లను చీల్చి మనను

నిలిపి సంసార మందలి నిశులనెల్ల

జ్ఞాన దీప్తితో నింపి య  జ్ఞానమెల్ల

పారద్రోలెడి యొజ్జలకు ప్రాంజలులివె

[05/07, 18:15] Durgamadhuri1: జీవితమున చీకట్లను చీల్చి మనను

నిలిపి సంసార మందలి నిశులనెల్ల 

జ్ఞాన దీప్తితో నింపి య  జ్ఞానమెల్ల

పార ద్రోలు యొజ్జలకెల్ల ప్రాంజలులివె

[09/07, 04:53] Durgamadhuri1: నింగి‌ నంతయు కప్పిన నిశిని ద్రోలు

తారల వెలుగు సైతము తరలి పోవు

కాంతు లీను పదములను కలిగి యెపుడు

ప్రజ్వరిల్లు తల్లీ నీకు ప్రణతి దుర్గ

[09/07, 15:42] Durgamadhuri1: కనికరమున కొరత లేదు కనక దుర్గ

విశ్వ మంతయు గెలిచెడి విజయ దుర్గ

రుద్ర సతిగను యరులకు రుధిర దుర్గ

వందనమ్ము లందుకొనుమా ప్రణతి దుర్గ



[24/10, 08:02] Durga Madhuri: అల్పు రాల నేను నజ్ఞాన ముననుంటి

సరియగు దిశ లేక సంచరించు 

నన్ను చేరదీసి నడిపించు గురువర్య

వందనంబు లివియె వాణి పుత్ర!

[24/10, 08:02] Durga Madhuri: పలుకు రాదు నాకు ప్రాకులాడుట తప్ప

గాలి పదములేమొ కందమాయె

నెటుల సాధ్యమిట్టి నిర్మాణములు దేవ

మీదు మార్గ మందు మేము రాగ

[24/10, 08:02] Durga Madhuri: పెద్ద బంధములను పేర్చుట రాదాయె

భక్తి తోడ నిట్టి పలుకు లమరె

దోషమున్న పేర్మి తోడ తెలుపు నొజ్జ

యేమి యిడగ దీరు ఋణము గురుల

No comments: