Wednesday, May 11, 2022

1000 - పరిష్కరింౘ బడినవి - రామాయణమూ

రామాయణము

1. డిండిమ జ, స, న, జ, ర, ప్రాస కలదు, యతి 11

అయోధ్యయను రాజ్యమున ధరాధినాథుడై 

సుయోధుడగు పంక్తిరథుడు శోభతో దయా

పయోనిధి తనర్చు తనదు! వంశ వృద్ధి కొ

క్క యాగమును చేసె సుతుల కాంచు కాంక్ష తో

2. తరలి వృతము, భ, స, న, జ, న, ర , యతి 11

ఆ దశరథుడే గురువుల నానతి గొని వేగమే

వైదికులను పిల్చి మదిని భక్తి నిలిపి కోరికల్

వేదనలను దీర్చుటకయి వేలుపునతి శ్ర ద్ధతో

పాదముల భరించి బ్రతుకు పావనముగ చేసెదన్


3. మందర, భ, భ, న, న, గ యతి 7

యాగము జేయగ నజుని తనయుడున్

జాగును సేయక స్వయము ననలుడే

వేగమె వచ్చెను! ప్రియ వదనముతో

స్వాగతమిచ్చె దశరథుడు ముదముగన్


4. హరిహయము న స న భ న గ యతి 10

నపుడు ననలుండు కడు హర్షమున యొసగెన్

తపము ఫలమౌ యొక సుధా కలశము నా

నృపు కలల దీర్చుటకు నిండు మనసుతో

తపన విడె సంతసమునన్ సుతల వడసెన్


5. ఆట వెలఁది

రాముడును భరతడు లక్ష్మణుండు శతృఘ్న 

నామములను పెట్టి! నయము మీర

ప్రజలు వారి గనుచు రాగము పంౘగ

పెరిగినారయెధ్య పురమునందు...

6. కుసుమ న ర ర యతి లేదు 

చదువు నేర్చుచున్ బాలురు

న్నెది గిరెంతయో వేగమై

కొదవ లేదు ధైర్యంబునకున్ 

ముదమునొందిరా పెద్దలున్

7. ద్రుతవిలంబితము న భ భ ర యతి 7 

గడచె వేగముగా ధర వత్సరాల్ 

వడిగ శస్త్రము వాడు విధమ్ములున్ 

నడత యందున నమ్ర గుణమ్ములున్ 

బడప లేకనె పట్టెను రాముడున్


8. చంద్రశేఖర న జ ర జ ర ౧౩ యతి

పురమున గొల్వు తీర భూధవుండు పొల్పుగా 

గురువుగు కౌశికుండు యాగ రక్షకుండుగా 

నరులను కూర్చు శక్తశాలి వీరుడైన దా

శరథిని వెంట పంపమంచు గోరె సౌమ్యుడై

9 చంద్రిక  న న ర వ     ౭ యతి

అనిన చనెను హ్లాదమొప్పగా 

వనములకును వారి జాక్షుడే 

మునుల సవనములను కాయగా

ననుజుడయిన  నాదిశేషుతోన్


మూ.పా గణములను సరి చేశాను ఛందం ప్రకారం

అనిన చనెను హ్లాదమొప్పగా 

వనములకును వారి జాక్షుడే 

మునులకు తను మోదమీయగన్

ననుజుడయిన  నాదిశేషుతోన్


10. కామేశ భ భ న జ న గ ౧౧ యతి

జాణగు తాటకి విడువక చంపు తలపుతోన్ 

రాణము చేయుచు కదలెను రాముడు వడిగా

బాణములంపుచు నసురుల పాలిటి యముడై 

ప్రాణము లన్ బలిగొనెను శరమ్ముల పటిమన్


11. *ప్రియంవద న, భ, జ, ర, 8, ప్రాస కలదు*

అడవిలో నుపలమంట రాము కా

లడరి సుందరి యహల్య యయ్యెతాన్

బిడియ మొప్ప తెలిపెన్ లతాంగియున్

తడబడన్ గళము ధన్యవాదముల్


మొ.పా యతి సరి చేశాను ఛందం ప్రకారం

అడవిలో నుపల యగ్ని రాము కా

లడరి సుందరి యహల్య యయ్యెతాన్

బిడియ మొప్ప తెలిపెన్ లతాంగియున్

తడబడన్ గళము ధన్యవాదముల్


12. *సురభూజ రాజము, న, భ, ర, న, న, న, ర, యతి 12*

అనల నేత్రుని విల్లు పట్టియు నతి సులభముగ ద్రుంచె తా

ఘనము గా మిథిలా పురమ్మున! కమలనయన కరమ్ముతో

జనము మెచ్చగ చేరె రాజ్యము!సవతి జన ని కుయుక్తులే

తనకు కష్టము దెచ్చి కానకు దరిమె ధరణిజతోడుగా


13. శివశంకర (సురభి) స న జ న భ స యతి 11

ఖర దూషణుల వధించిన ఘన వీరుని గని సో

దరి శూర్పణఖకు కామము తగిలెన్ రఘువరుతో 

నెరవేర్చమనెను కోర్కె వినిన లక్ష్మణుడు భయం

కరుడై చెవులును ముక్కును కసితో నరికె పడన్

14.*సుందరి భ భ ర స వ 9*

బంగరు వర్ణమృగమ్ము పర్వులు తీయుచున్  

ఛెంగున దూకుట గాంచి సీత ముదమ్ముతో

పొంగుచు తెమ్మనియెన్ విభుండు వడిన్ చనెన్

రంగము సిద్ధము చేసె రావణ మాయకున్ .

15. *అపరాజితము న, న, ర, స, వ యతి 9*

ధరణిజ చెర పట్టె! దానవుడే పగన్

కరకుగ గొని కామగాముడు శత్రువుల్

చొరని పురిని లంక చొచ్చి వనమ్ములో

తరుణి నిలిపె దైత్య తన్వులకాపుతో

16. *అశ్వగతి, భ, భ, భ, భ, భ, గ యతి 10*

వానర వీరులు రాముని భార్యను జూచుటకై

యానతి గైకొని వెంటనె అందఱు బాధ్యతగన్

పూనికగా కొనసాగెను భూమికి నల్దెశలన్

కానలు కొండలు దాటిన గానక నాఖరునన్

17. *జలదము భ ర న భ గ ప్రాస కలదు యతి 10*

కారణ జన్ముడౌ ఘనుడు కాంచనుడున్

మారుతి వేగమే యెగిరి మానసమున్

ధారుణి పుత్రి జాడ గన దక్షతతో

నోరిమి గాను లంక చనె నొంటరిగన్

18. *పద్మకము న భ జ జ జ గ ప్రాస కలదు యతి 11*

భరువు = ప్రభువు, ప్రాసాక్షర పద కోశము

మరలె రాఘవుని చెంతకు మారుతి వేగమే

తరువు నీడన ధరాత్మజ దైన్యము దెల్పగన్

సరగు వారధిని గట్టుచు సాగెను నీటిపై

భరువు లక్ష్మణుని గూడియు వానర సేనతో

19.*ఘారిన = రాత్రి వేళ క్షోణము = నేల, ఆంధ్ర భారతి నిఘంటువు*

*ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము*

*ప్రతి పాదమునందు భ , భ , భ , భ , ర , స , వ(లగ)*

*అంబురుహము*

శ్రీ రఘు రాముని పత్నిని గన్గొనె శీఘ్రమే వనమందునన్

ఘారిన జూచిన తల్లికి నాథుని గాథ పాడుచు దూకి తా

చేరెను చెంతకు! నుంగరమిచ్చెను చిన్నివాడుగ మారి! యీ

శూరుడు పాఠము జెప్పెను రావణు క్షోణినంతయు గాల్చుచున్

20. శార్దూల లలితము మ న జ న త న ప్రాస కలదు యతి 13

హంకారము = గర్వము

లంకాయానము కొఱకై వడివడి రాముడు కడలి

హంకారమ్మున దశకంఠుని తగు యస్త్రము నతని

యంకమ్మునిలను ముగించుచు తన యాలిని గలిసి

సంకోచమ్ముల దరిమెన్ తరలెను స్వంత భువికిని

No comments: