Thursday, March 31, 2022

1000 భాగవతము

దేవర్షి నారద మునీ

నీ వాక్కులను విని దేవుని కథలు గాథల్

నా వేద వ్యాసుడు ఘన

ప్రావీణ్యత తో రచించె! ప్రార్థన గొనుమా


వేద వ్యాస నాదు ప్రార్థనలను గొని

దేవ దేవుఁ లీల తెలుపునట్లు

భాగవత సుధలను వ్రాయు శక్తినిడుమ

ధరణి నిలయ! ప్రణతి! ధర్మ పోష


రామా వ్రాయదలంచితి లయముగాను

భాగవతము పై పద్యము పట్టుదలను

పూని గురువాజ్ఞ పాటించి! పూర్తి చేయు

శక్తి నీయమా నీపైన భక్తి తోడ


ప్రహ్లాద చరిత్ర 


1.

113 81 పంక్తి భ భ భ గ 7

దేవుని జూచుట తేలిక యీ
జీవిత నౌకకు జీవము యా
నావికుడే నని మ్మినచో
దీవెనలందును దివ్యముగన్




2.

77 169 వృంత న న స గ గ 9

యని విని యెగసె నబ్బురమున్

తన మనసును మదంబు వలన్

తనచెను తనను దన్ని ధరన్

చనుట నెవఱకి సాధ్యమనెన్


35 న భ ర ల గ

తనను మించిన దైవమీ యిలన్

గనగ లేరని గర్వ భావమున్

మునులనందఱి పోరు పెట్టుచున్

తనయు పైనయు దాల్చె కోపమున్

3. 170 178 శ్యేని ర జ ర వ 7

తాను గాక వేరు దైవమెవ్వఱో
భానుడై జ్వలించు వాసుదేవుడా
దావాంతకుండు దైత్య హారికిన్
హాని జేసెదంటు యాగ్రహమ్ముతో




1. రుచిరము, జ, భ, స, జ, గ యతి 9 17

హిరణ్య కశ్యపుడను యింద్ర వైరి యీ

ధరాతలమ్మునకును దైవమంటు తా

మురారి భక్తులకును బోధ సేయుచున్

విరోధి యంటు సుతుని వేటు వేసెనే


2. శ్యేని ర జ ర వ 7


తాను గాక వేరు దైవమెవ్వఱో

భానుడై జ్వలించు వాసుదేవుడా

దానవాంతకుండు దైత్య హారికిన్

హాని జేసెదంటు యాగ్రహమ్ముతో


3. 173 119 మణిభూషణము ర న భ భ ర 10

ఉక్కు కంభమును జేరి మహోజ్వల శూరుపై

యొక్క వేటునట వేయగ ఉగ్ర ముఖమ్ముతో

మ్రొక్కు వారలను గాచెడి మూర్తి నృ సింహుడే

దిక్కులన్నియును నింపుచు ధీర నఖమ్ములన్

4.

89 5 అలసగతి న స న భ య 10

బసుగుచు హిరణ్య కశిపాత్మజుని పట్టెన్

అసివలెనమాంతముగ నాతనిని ద్రుంచెన్

అసురుని వధించి తన యాశ్రితుల గాచెన్

పసి వయసు వాన్కి శత వర్షముల నిచ్చెన్


5. సుగంధి, ర జ ర జ ర యతి 9 169 in file

వేఱుమాటలేల ధీరవీరుడైన దేవుడౌ

నాఱసింహ గాథ విన్ననాశమౌను యాపదల్

తీఱునుండి గొల్చినంత! తీరు దుష్ట పీడలే

జాఱకుండ పట్టరండి సన్నుతించి స్వామినే


గజేంద్ర మోక్షము

6. 176 151 రథోద్దతము (శాంతిక) ర న ర వ 7

యాజి = యుద్ధమ యేజనము = కాంతి, చలనము

[ప్రాసాక్షర పద కోశము]

రాజసాల కరి రక్ష కోసమై

యాజి భూమిన జయమ్ము పోవగా

యేజనమ్ము చని హీనమవ్వగా

యీ జగమ్ము పతి యీశ్వరుండనే

యీ జగమ్మునకు యీశ్వరుండనే


7. 45 134 మనోజ్ఞ న జ జ భ ర 10


ప్రాసాక్షర పద కోశము

పరములు = కనుబొమ్మలు, మురి = గర్వము

ణము వేడుచు దైవ సాయము కోసమై
ములు సైతము డస్సె భారముగా నటన్
చె విడిపించుమటంచు శీఘ్రమె రమ్మనెన్
మురి మదినుండియు దించి మూసెను కన్నులన్


8. 117 108 భూతిలకము భ భ ర స జ జ గ 12

నాదను దంతయు శూన్యమే యని నమ్మినంతనె వచ్చునే

ఖేదము బాపెడి దైవమౌ హరి కీడుఁ ద్రోలుట కోసమై!

నాదియు నంత్యము తానె యైన దయాంబుధుండగు ధీరుడున్

వేదము గొల్చెడి విష్ణువీతడుఁ వేగమే చనె చెంతకున్


9. నలిని వృత్తము, 5 స గణములూ, యతి 10వ అక్షరము.

కరి దుస్థితి గాంచుచు చక్రము వేసెను యా

హరి యే మకరమ్మును తా హతమార్చగనే

చెర వీడినదై తరలెన్ సెరగుల్ కరుగన్

పరమేశుని వాక్కువలన్; పరమంది ౘనెన్

నలిని వృత్తము, 4 పాదములూ, సప్రాస, 5 స గణములూ, యతి 10వ అక్షరము.


10. భూనుతము ర న భ భ గ గ 10 172 109

తుచ్ఛమౌ తలపు లేవియు తోచని వాడౌ

స్వచ్ఛమైన మది గల్గిన బాలుని జూచెన్

యిచ్ఛ తోడ! ధృవుఁ కోసము హేలగ నిచ్చెన్

గుచ్ఛమంటి కర స్పర్శను! గోరిన రీతిన్


11. 137 95 ప్రహర్షిణి మ న జ ర గ 8

అన్నా యాదుకొనగ నాప్త బంధు రమ్మా

యన్నీ నీవెననుచు యార్తి తోడ వేడన్

కన్నీరై కరగిన కంజ నేత్ర గాచన్

కన్నయ్యే కరుణను కాన్క చీరెనిచ్చెన్



12. 99 115 మందర భ న భ న భ న ర యతి 13


పాడి నొసగెడి గోవులను తన బాల్య వయసున గాచెనే

కీడు సలిపెడి రక్కసులనిట కేళి వలెను జయించుచున్

మూడడుగలకు చోటునడుగుచు భూమి గగనము నింపగన్

ఱేడు తదుపరి వంచె శిరమును! శ్రీ హరికి తను మాటపై


13 100 37 కోకనదము భ భ భ స గణములు యతి 7

తామస నాశుడు! దైత్యుల దరిమెన్

మామగు కంసుని మత్సరమణచెన్

భామిని కుబ్జకు స్వస్థత నొసగెన్

సోముని పాలను జూచియు గెలిచెన్


14. మదన దర్పణ ఛందము భ స జ ర జ గ 11


వేదములను గాచె మత్స్య రూపియైన విష్ణువే

యీదుచు జలమ్ముల మోసె మంధరాద్రి మోపుపై

యాది పురుషుడైన యీ వరాహ మూర్తి యొక్క యా

పాదములను కొల్చు వారి పాప రాశి గాలునే


15.

25 79 నారాచ త, ర, వ, యతి లేదు

కాళింది లోతు నుండి పా

తాళమ్ము చెంతకంపె నా

వ్యాళుండు సర్పరాజు నీ

కేళీ వినోది కృష్ణుడే

16. తన్వి భ త న స భ భ న య 13 107

దేవకి పుత్రా యదుకులమునకే దీపమువై వెలిగితివయ కృష్ణా

ఆవుల గాచేవట గిరిని సునాయాసము గా నఖముఁ నిలిపినావే!

రేవున స్తీలందఱి వలువలఁ లే లేతము వౌ కరములననె నింపన్

యా వనితామూర్తులు భయముననే యాచన జేయుచు యడిగిరి! చీరల్


17.  48 న జ జ ల గ 7


విలవిల లాడు వియోగముతో

వలచిన యింతి వరించుటకై

దెలుపగ శ్రీపతి! వచ్చితివే

కలికిని పొందగ! రుక్మిణికై


18. ఇల స జ న న స 8

కలశాబ్ధి పుత్రిక! కలికి! యగు సిరితా

వలచింది యన్ని విభవములకు నెలవై

యలరారు దేవుని! హరిని! ముదముగనే

నిలిచింది మాధవుని హృదిని! స్థిరముగన్


19.

జలోద్ధతగతి, జ, స, జ, స యతి 8

యశోద తనయా! దయార్ద్ర హృదయా

కిశోరుడవు నంద కృష్ణ! మది నీ

వశమ్ము సతతమ్ము! పాండవ సఖా

విశాల నయనా యభీష్ట వరదా


20.   53 సుకేసరము న జ భ జ ర 11


ధనము సువర్ణ వెండిలను దాటు సంపదౌ

మునులు తపించు దృశ్యములు మోదమీయగన్

జనని యశోద గన్గొనెను సర్వ లోకముల్

మనసున మాయ కమ్మగనె మాయమాయెనే

No comments: