Tuesday, March 4, 2025

ఛందం సంకలనం కోసం

1.


స్వాగతమమ్మ! చంచల! కృపారసమే కనులందు పొంగగా

యాగమనంబె క్షేమమగునమ్మ! సనాతని! పూర్వ పుణ్యమే

మా గతమైన నీ దయన మన్నన సేయుౘు కాౘుౘుందువే

రాగ సుధా రసామృతము శ్రావణి! పూర్తిగ మాకొసంగుమా.

2.


ప్రీతిగ త్రికోణమితి నేర్చి లెక్కలందు

బుద్ధిమతిగ పేరును బాగ వొందినాను

పాఠశాలలోన పెరిగె! పరపతియును

బ్రహ్మ సతియె కరుణ మెండు పంచగానె.



3.

*మారికి వేసిరి ప్రియముగ మల్లెల దండల్*


రా! రాకుమారి యని సుకు

*మారికి వేసిరి ప్రియముగ మల్లెల దండల్*

హారము వలె చెలికత్తెలు

నారీ మణి పరిమళముకు నయముగ మురిసెన్.


4.

వరమేయడుగను తండ్రి! ప్రార్థన నీకే

శరణంబను పలుకేగ! శంకర! రావా

ధరపైనకు మము గాచ తాండవ రూపా

పరమేశ నుతులివే కపర్థి! త్రినేత్రా.


5.


మోక్ష పథము కొరకు నింపి మోహమంత

*శివుఁని బూజింప ముక్తి కించిత్తు రాదు*

యెట్టి కాంక్షలు లేక సహేతుకముగ

బ్రతుకు నడిపినంత కలుగు రక్ష‌ తుదకు.


6.


కమ్మని తేనెను ధధి క్షీ

*రమ్మును బోసిరి శివునకు రభసము తోడన్*

చెమ్మను తుడుచుచు పిదపన్

రమ్మా యిలకని పిలచిరి ప్రజలున్ భక్తిన్.




కథలలోన వచ్చు వ్యథలలో వాక్యంబు

*పతిని గొట్టి సతియె పరుగు దీసె*

ౘదివి నవ్వుకొనెచు ఛందమున యిటుల

వ్రాసి యిచ్చె మాకు! భళిగ హంస. (అక్క)


🙏🏻🙏🏻🙏🏻


వెండి కొండపై శంభుడు పెండ్లి యాడు

ఘట్టమును ౘూచి శివరాత్రి ఘడియ వేళ

లోకమాత పార్వతి మెడ లోన జూచి

*అయ్యఁ తాళి గట్ట మురిసెనంట తనయ*




(*ఓ*) నమాలు నేర్పి యోర్మితో నొౙ్జయే

పద్య(మ)న్న మేటి విద్య లోని

ఛందము (గు)రులఘువు సారమున్ దెలిపిరి

(వా)రికిదియె ప్రణతి! భక్తి మీర!


ఓ లలనా... సరి లేరు నీకెవ్వరుకు...


తిమిరము దరిమెడి సూర్యుని

సమముగ కష్టించు మూర్తి! చైతన్యమువే

యమవాస్య నిశిని నగవుల

సుమవదనముతో జయించు శోభవు నీవే



అనలేనీ పలుకును నే

*జనకుని కులమును జెరుపగ జానకి బుట్టెన్*

ప్రణతులనే దెలిపెద యా

మునిజన సన్నుతకు రామ మూర్తికి సతమున్.




స్వామిని చేరెడి తపనల
*కామమె మోక్షంబు నొసఁగుఁ గలిలో నెపుడున్*
ప్రామాణికమౌ విధమిది!
నామము విడువని స్మరణము! నవవిధములలో.

అండగ సతతము నుండెడి
కొండల రాయుని నిలుపుట కొంగుకు వెనకన్
నిండుదనంబవ్వదుగా
దండలు వేసిన శుభమిది! తరుణీ వినుమా.

వేడి నీరు గాచి పిల్లవానికి లాల
పోయుట మరచితిని బోలెడన్ని
పనులు కార్యాలయమువియె పట్టుకొనగ
నుదయమున చరవాణిలో! నుస్సురనుౘు.

నారీ మణులను జెరచెడి
యారాక్షసులను హరించి యాదుకొనెడి యా
శ్రీ రాముని! తమ వైరుల
*వైరిని జూచియు మురిసిరి వన్నెల వనితల్.*

దేవ లోకమున విచిత్రమే విరిసెన
*కంది చెట్టుకు మామిడి కాయ గాచె*
నేను ౘూడలేదు యిది జగాన విన్న
యో పుకారు! లేదీ వింత యుర్వినందు.






*పూలతోటను బెంచినంతనె మోక్షమెట్టుల వచ్చునో*

శ్రీలు చిందెడు రత్నగర్భను చిత్స్వరూపిణినిన్ మదిన్

వేలుపై యిల విద్య పంచెడి వీణ ధారిణి వాణినిన్

తేలికైన పదాలతో వినుతించు భాగ్యము యుండగన్




ఎండలు మండుౘుండగ రవీంద్రుని తాపము తాళలేక యో

బండన వాలిపోవగను బక్కని తాతను కాౘుకొందుకై

*గుండెల పైన గ్రుద్దుచును కొట్టుచు ప్రాణము నిల్పిరక్కటా*

నిండుగ గాలి పీల్చగనె నెమ్మదిగా తన యింట దింపిరే.



రాౙు పాత్రధారి యొకరు రానినాడు

నటుని భార్య గట్టగ వేషమిటుల! నిజము

పిదప దెలిసి యూరి జనము ముదము తోడ

*ముదిత మీసకట్టును జూచి పొగడిరంట.*



ప్రసవ / వసుధ వృత్తము, స, స‌గణములు, ప్రాస కలదు, యతి లేదు,  ఛందం పద్య కార్యశాల, 15.04.2025

విరజాజులనే

తరుణీమణియే

తురిమెన్ సిగలో

మురిసెన్ కురులే.


30/04/2025:


అట్టహాసము జేతగానిది యాంధ్ర భాషపు శోభయై

తుట్ట తేనెను మించు తీపిన తూగి యాడుచు నుండగన్

పట్టు బట్టుచు నేర్చు శిష్యులు పాడగా విని మోహమున్

పట్టెఁ జీమలు తెల్గు పద్యఁపు వాణికిన్ గడు గొప్పగన్



[17/06, 17:33] Durga Madhuri Devi Nagini:

 సుందరమైన రాణి తన ౙోడుగ జేర ప్రజాళి రక్షకై

మందిని మ్రింగు వారిని సమాజపు చీడను రాజు చంపగా

*నందము వర్షమై కురిసె నాథుఁడు నేలను గూలినంతనే*

బందియ పోటు వల్ల! తగు వైద్యము గూర్చుచు గాచె పత్ని యే.


[18/06, 11:11] Durga Madhuri Devi Nagini: 


వారిజ నేత్ర యౌ తలిని భారతి దేవిని ప్రీతితోడుతన్

ధారల దా నుతించి రస ధారణ చేయుచు నుండగా నటన్

గారెలు తీపి వంటలను గాంచిననున్ నవధానమందునన్

*పూరణ జేయగా గవికిఁ బూర్ణము కన్నను దీపినిచ్చులే*




[26/06, 11:25] Durga Madhuri Devi Nagini:


 మంజులంబుగ రామ నామము మౌన ముద్ర దలంౘగా

ఆంజనేయుడు చేరి చెంతనె యాప్తమిత్రుని రూపమై

*రంజనమ్మును గూర్చుచుండును రక్ష నిచ్చెడి మంత్రమై*

పంజరంబగు జీవితమ్మున భద్రతే యొనగూఱ్చునే

[26/06, 16:55] Durga Madhuri Devi Nagini: 


గిరి పుత్రిక యొసగిన యో

వరమే గౌరింటి యాకు పంటగ యెరుపున్

మెరయగ సిరులై మగువల

అరచేతికి సొగసు వచ్చె నాషాఢములో



ఏ పని చేసిన విడువక

లోపము వెతకెడి పతి గని రోషము గలదై

కోపముతో నొక దినమున

వేపాకుల కూర చేసె వెలది మగనికై



కలతల్ గల్గని జీవితంబు గన! సాకారంబు సాధ్యమ? యే

కలలోనైనను? మానసంబు గల లక్ష్యంబుందు మార్గంబిదే

బలమౌ పెద్దల ౘద్ది మూటలగు వాక్కులన్ని యందించు యా

*కలమే! తెచ్చును గొప్ప మార్పు వసుధన్ గాలమ్ములే మారినన్*



వారిజ నేత్ర యౌ తలిని భారతి దేవిని ప్రీతితోడుతన్

ధారల దా నుతించి రస ధారణ చేయుచు నుండగా నటన్

గారెలు తీపి వంటలను గాంచిననున్ నవధానమందునన్

*పూరణ జేయగా గవికిఁ బూర్ణము కన్నను దీపినిచ్చులే*


బంధుగణము పట్ల బ్రతుకు పట్ల మమత

*వయసు మీరుౘున్న వదలదంట*

మాయ లోన పడిన మానుష జన్మమే

దుఃఖమనుట వలదు! తోడు రక్ష.


స్పర్ధ పోటీకై అక్కా


ఏకరూపమీ సృష్టి మహేశుడొకడె

గోచరింౘునెందెందున జూచిన గద

గోవులెన్ని యున్నను పాలు గావు వేరు!

తెలిసి మసలుమ మనుజుడ! తెలివి గలిగి.


అనంతచ్ఛందము పద్య పూరణము 69 [16.05.2025]


చేదు మేలు గూర్చునని యో చెలియ! వలదు

మా ప్రయోగము! పాయసమందు వైచి

వేప పూతను కాకర పెరుగునందు!

*వంట చేయకు పెట్టుమా ప్రాణభిక్ష*



నేటి యింతుల వంటయన్నను నేర్పుౘుందురె క్రొత్తవే

వాటిలోనొకటై యీ రసము భారమున్న ఫలంబులన్

మేటిగా బహు నూతనంబుగ 

*తాట ముంజల కూరఁజేయగ ధాత తాఁదిన వచ్చెలే*



అట్టహాసము జేతగానిది యాంధ్ర భాషపు శోభయై

తుట్ట తేనెను మించు తీపిన తూగి యాడుచు నుండగన్

పట్టు బట్టుచు నేర్చు శిష్యులు పాడగా విని మోహమున్

పట్టెఁ జీమలు తెల్గు పద్యఁపు వాణికిన్ గడు గొప్పగన్


అరుగుట సులువుగ జరుగును

కరుగవు జవములు ముదమున గైకొనమని తా

పెరుగున నన్నము గలుపుౘు

*తరువాణి బలమని చెప్పె తాతమ్మ భళా*


- గురువులు, పెద్దలు దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన 🙏🏻


సీసము:


పలు విధములనుండు జల నర్తనము చూడ

కొండనుండియు జారి కోన చేరు

నీటి తీరును గన నిర్మలంబుగ నుండు

శ్వేత వర్ణముతోడ వెలుగుచుండు

నంబరమును దాటి యవని చేరెడి వాన

బిందువుగ కనుల విందు చేయు

వాగు యై పారిన వేగము యైనను

ఫణిని బోలునటుల పరుగులుండు



తేటగీతి:


గాని పడతి నీలికనుల తేలిన నేమి

పలుకు లేదు చింతల పడి యలసి సొలసి

జాలు వార్చు ధార యది! శాపాల ఫలము

గాన రాదు వర్ణన యెట్టి కవికి యైన.



మాడు చెక్క తినగ మాధుర్యమౌ రుచి

యెంత విలువ చూడ! నిండ్లలోన

అన్నమైనగాని యద్భుతమౌ పిండి

యైన గాని భళిర! యందురంట.


గురువులు, పెద్దలు దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన 🙏🏻🙏🏻🙏🏻


*జులై నెల స్పర్థ పోటీల కోసము*


ఛందము వ్యాకరణంబుల

నందనవనమున నిలచుచు నారాయణికే

వందనమొసగుట‌ బాహ్యపు

*టందము కన్నను హితమగునంగనలారా*


- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్















Old ones


[02/04, 21:03] Durga Madhuri Devi Nagini: పశ్చిమాద్రి కొరకు పనులు చేసెడి మాకు
తూరుపేది యనిన! భారతమ్ము
గాదు గనుక సబబె! కఠినమైనను వాక్కు
*భానుఁడస్తమించెఁ బ్రాచ్య దిశను*
[06/04, 19:10] Durga Madhuri Devi Nagini: ధరణిజ పెండ్లి వేడుకకు ధాత్రియె పీట!
యటు పైన నింగిలో
మురిసిన మేఘ మాలికలు ముత్యములన్నియు ౘల్లె తండ్రిపై
వరుడగు రామచంద్రునకు బంగరు తల్లియె చెంత చేరగా
హరిసిరి‌ ౙంట శోభ గన యందరి కన్నులు మోదమందెనే.
[08/04, 16:32] Durga Madhuri Devi Nagini: పద్యమల్లుట రాని నా వంటి వారు
*తేటగీతిని బదులిచ్చెనాటవెలది*
నందు నడిగినట్టి సమస్య యర్థమవక!
ఛందమెరుగనపుడు వచ్చు చచ్చు తెలివి
[22/04, 16:51] Durga Madhuri Devi Nagini: రాౙు పాత్రధారి యొకరు రానినాడు
నటుని భార్య గట్టగ వేషమిటుల! నిజము
పిదప దెలిసి యూరి జనము ముదము తోడ
ముదిత మీసకట్టును జూచి పొగడిరంట.
[25/04, 23:04] Durga Madhuri Devi Nagini: ఆంజనేయ! కడలి దాటి యమ్మ జాడ నీవెగా! 
కంజనేత్రుకు బ్రకటించి కాంతి నింపినావయా
కంజుడైనను నిను గాంచి కౌశలంబునందునే
పంజరాన నడచు మమ్ము పట్టి రక్షనీయుమా.
[28/04, 18:45] Durga Madhuri Devi Nagini: ధీరుడ! కార్యాలయమున
వారాంతము గూడ నుండి పని చేసెడి మా
కోరిక పైమాకును బా
*సై రామా! మాకు ప్రేమ సాంతము నీ పై*
[28/04, 18:45] Durga Madhuri Devi Nagini: ధీరుడ! కార్యాలయమున
వారాంతము నీవె తోడు! పని చేసెడి మా
కై రావా రక్షకు! బా
*సై రామా! మాకు ప్రేమ సాంతము నీ పై*
[29/04, 22:55] Durga Madhuri Devi Nagini: ఈ కలి కాలమందు తగు యెత్తుల జూపుచు భూమి భాగమున్
లోకులు విత్తమార్జనకు శ్రుతిని జేయుచు విక్రయంబుకై
చీకటి మ్రింగి నూతనపు చేష్టలతో‌ తమ మేధ వాడుచున్
*ఆకసమందు బెట్టిరట యంగడులెన్నియొ యమ్మకానికై*