Sunday, June 28, 2020

తేటగీతి పద్యముల మాలిక శతకమునకై - శ్రీ కృష్ణ పరమాత్మ

వకుళ తనయుడ వసుధకు పతివీవు
వలపు కురిపించి పొందిన వనజాక్షి
వదలి వచ్చెనిలకు యని ప్రతిమ కాకు
వలదు అలక మాపై లోక బాంధవా



నిన్ను కొలిచిన ద్రౌపది నిండు మనసు
తెలిసి కొని కష్టము లనెల్ల దీర్చినావు
కాల కూట విషమునెల్ల కాల రాసి
కాల నేమి పాలిట నీవు కాలుడవయి
కాచినావు కుచేలుని కలిమి బలిమి
తోటి సిరులెల్ల ఒనగూర్చి తోయజాక్ష
యెటుల సెప్పెద నీకు నా యెదను యంత
నిండి యున్న నమ్మకమును నిర్వికార

బంటు గానైన నిను యెడ బాయనీక
భద్రముగ జూడ గోరితి పన్నగేశ
బంధువీవె మరి తమకే బానిసలము
ప్రాప్తమున నీయుమా మాకు ఫలములెల్ల


సకల జీవుల శ్వాసలో సతతముండు
వాయు నందన హనుమంత! వజ్ర దేహ
లంక నాశక పావన రామ దూత!
వందనమిడుదును కరుణ వరద నీకు

మెంతి పొడి పోపు వేసి మెరుగు పెట్టి
పెరుగును తయారుచేసి వేసుకున్న
యాహ! యేమి రుచి యనుచు యారగించి
మెచ్చుకొనెదరు యతిథులు మేటి యనుచు

No comments: