Saturday, October 17, 2020

Sri Maataa Vrttamu successful poems

 1.


పంకజ నాభుడే పల్కెను భాష్యము నీకడ విష్ణు సన్నుతా

బింకము వీడి చేపట్టెను భిక్షువు యొప్పుచు పత్నిగా భళా

శంకలు మానినే గొల్తును శాంభవి! తల్లిగ  నిన్ను నిత్యమున్

సంకట నాశినీ! కావుమ శైలజ! నిర్వృతి నీయుమా యిటన్

1.


అమ్మ! గనంగ ముల్లోకముల నాలన జేయు సుగాత్రీ! నిన్


నమ్మిన వారి గాపాడుఁచు! నమ్మని వారికి నైనన్ మా 


కమ్మవె! వేరు భావమ్ములు హాసముకైనను చిత్తమ్మున్


గ్రమ్మని మాతృ ప్రేమామృత! ప్రాంజలి నీకిదె! శ్రీమాతా


2.

శారద! రాజ రాజేశి! ప్రసన్న ముఖీ గిరి పుత్రీ శ్రీ

భారతి! నిన్ను సేవించిన పండితులైనను నీ రూపున్

ధారగ పల్కలేమందురు తారక తేజపు రాశీ నీ

వారము మేము! మా తీయని ప్రాంజలి నందుమ శ్రీమాతా

3.

దుర్గము పైన నీవాసము! దుర్లభమే గద తల్లీ! హే

భర్గుని పత్ని! నీ దర్శన భాగ్యము నందుట చిద్రూపీ

నిర్గుణ పూజ నీ భక్తులు నిష్ఠగ సల్పిన యింకేలా

స్వర్గము శాంభవీ శ్రీకరి ప్రాంజలి నీకిదె శ్రీమాతా

4.


మాయను పోల్చలేనట్టి యమాయకులమ్ము గదా ప్రాజ్ఞీ

మోయగ లేని భారమ్ములు భూమి నివాసులమౌ మా పై

వేయకుమమ్ము కారుణ్యపు వీచిక వేడగ యిమ్మా యో

పాయగ! నీ దయాంబోధిన! ప్రాంజలి నీకిదె శ్రీమాతా


5.

రాణిని రాజరాజేశ్వరి! శ్రావ్య కథాసుధ గానమ్ముల్

వీణ కరమ్ములన్నిల్పు వింధ్య నివాసిని! నీ చెంతన్

మాణిక్య కాంతితోనుండున మంగళ దాయిని! నీదౌ యే

బాణి సమమ్ము రాదంచుచు ప్రాంజలి నిత్తుము శ్రీమాతా


కేశవు పాడు పద్యమ్ములు క్లేశముఁ దీర్పును 




5.

పంకజ నాభుడే పల్కెను భాష్యము భక్తిగ నీపైనన్

బింకము వీడి చేపట్టెను భిక్షువు నిన్ను సునేత్రా నే

శంకలు మాని నీ కీర్తన సత్కథ లన్నియు పాడెదనోపర్ణా

సంకట నాశి క్షేమంకరి శైలజ! నిర్వృతి వేడెద శ్రీమాతా



2.

వారధి బంధువే గొల్చిన వారిజ లోచని! సవ్యసాచికే

సారధి మ్రొక్కెగా నీకిట! ఛత్రము చామర సేవజేసెదన్

హారతి‌ నిచ్చి యర్చించెద హైమవతీ! యపర్ణ! మా

భారమె నీదనీ నిత్యము భద్రత నిమ్మని నేనువేడెదన్


వారధి బంధువౌ రాముఁని భ్రాతవు! 




3.


భారము నీదెయంచున్ మరి పల్కెద నీకడ నమ్మ మాకు నా

ధారము నీదు సాన్నిధ్యమె! తల్లి గ గాచుమ యో సనాతనీ!

ధారగ సన్నుతింతున్ నిను తామస నాశిని ! దైత్య హారిణీ

వీర శిఖామణీ! మాతగ బిడ్డల రక్షణ సేయు శాంకరీ!!



4.


శుంభనిశుంభ దైత్యాంతకి! సోముని పత్నికి! గౌరి మా యుమా

శాంభవి ! మమ్ము రక్షించెడి  శక్తికి హారతులిచ్చి వేడె దన్

యంబకు లాస్యమున్ జేయుచు హర్షము నిమ్మని వేడికోలు ప్రా

రంభము జేసెదన్! శంకర రంజిత దేవికి వందనమ్మిదే


5. శ్రీకరి! నిన్ను యర్చించిన శ్రేయము లెల్లయు చెంతనే యుండున్

యో కమలాసనీ విష్ణు సహోదరి! వేరగు కాంక్ష లేదమ్మా

నీకడ నేసదా వీడక నిల్చు యదృష్టము వేడితిన్ యుమా

హే కరుణామృతా యెన్నడు! యిక్కటులన్నవి యంటనీకుమా



No comments: