Friday, June 11, 2021

గర్భ, బంధ కవిత్వములు

 [29/05, 07:48] +91 90961 63962: శ్రీ కాళికాదేవి శతకము

కందగీత గర్భ చంపకోత్పలములు

ఉ..

 ఓ! లలితాంబనామదిని నూ యల జేసితి మంగళాంగి యం

బా! లలనా!జగజ్జనని, వాసవ వందిత సంతసింపు, నీ

వే! లలలా! లలా!యనుచు వేడ్కలయాద్భుతమై వసింపగా

జాలనటే! యిళా!దశభుజా!శరణంటిని, దాక్షి కాళికా


 గర్భకందము

లలితాంబ నామదిని నూ

యల జేసితి మంగళాంగి యంబా!లలనా!

లలలా లలా యనుచు వే

డ్క, లయాద్భుతమై వసింపగా జాలనటే!


గర్భగీతము

మదిని నూయలజేసితి మంగ ళాంగి

జనని వాసవవందిత సంత సింపు

మనుచు వేడ్కలయాద్భుతమై

వసింప

దశభుజా శరణంటిని దాక్షి కాళి 14

[08/06, 11:38] Thompella Bala Subramanyam Acharya: ఈ గోమూత్రికా బంధానికి 1,3 పాదాల్లో., 2,4 పాదాల్లో వరుసగ 2,4,6,8 అక్షరాలు ఒకటే ఉండాలి గుణింతము మారరాదు. 1,3/ 2,4 పాదాల్లో అక్షరాలు వేరేగా ఉండవచ్చు. ఇలా 32 అక్షరాల పద్యాన్ని దేన్నైన్నా ఈ గోమీత్రికా బంధంలో ఇమడ్చవచ్చు. అచల ఒక్కటే కాదు. అన్ని అనుష్టుప్ పద్యాలు ఇముడుతాయి.

[08/06, 23:23] Sujana: బంధ కవిత్వం pattern based as per my understanding. లెక్కల్లో inductive reasoning, deductive reasoning అని రెండు రకాల logics ఉంటాయి. బంధ కవిత్వం inductive reasoning లోకి వస్తుంది. ఛందస్సు is a combination of both. గురువుగారు జాగ్రత్తగా ఛందస్సులో ఉన్న inductive reasoning part మాత్రం తీసుకుని బంధ కవిత్వం తో integrate చెయ్యమంటున్నారు. ఇంత complicated గా నేను చెప్పాక గురువుగారు చెప్పేవి మీకు వీజీగా అర్థమైపోవాలి. అదీ సంగతి. (ఇక్కడొక సత్యనారాయణ విలన్ నవ్వు ఇహిహహ్హహ్హా అన్న ఆడియో రికార్డు వేసుకోండేం)

[08/06, 23:27] Thompella Bala Subramanyam Acharya: బంధ కవిత్వం వేరు. గర్భ కవిత్వం వేరు. గర్భకవిత్వానికి ఒక పెద్ద పద్యం యొక్క లక్షణాలు దెబ్బ తినకుండా అందులో వచ్చే గురు లఘువుల అమరికను చూసి ఏ ఏ పద్యాలను ఇమడ్చవచ్చో ముందుగా కనుక్కోవాలి. ( ఇది కూడా సుజన అన్నట్టు గణితమే). అటుతరువాత ఏ పద్యాని కి ఆ పద్యం సాన్వయంగా ఉండాలి.

[08/06, 23:29] Thompella Bala Subramanyam Acharya: ఇక బంధ కవిత్వము అంటే లక్షణముతో వ్రాసిన పద్యములో కొన్నిఅక్షరముల ఆవృత్తి చేత అంటే repetition వలన మనం ఎన్నుకున్న చిత్రములో బంధన చెయ్యవచ్చు అంటే ముడివెయ్యవచ్చు ( మూడుముళ్ళ బంధం తో జీవితం వలె). ఇంకా ఈ పద్యాలతో అనేక సర్కస్ లు చెయ్యవచ్చు. అది వ్రాసే వారి ఉత్సాహాన్ని బట్టి ఉంటుంది.

[11/06, 00:23] Thompella Bala Subramanyam Acharya: శ్రీరామ దశరథ తనయుడ-11 అక్షరాలు. (ఇలా మీకు నచ్చిన పాదం వ్రాసికోవచ్చు)


తగణం నల నల. మీ వాక్యం ఇలా ఉండాలి. అపుడు తేటగీతిలో గణాలు 


1 వ పాదంలో హగణం/ భగణం/సలం/హగణం/నగణం

2 వ పాదంలో హగణం/ సలం/నలం/హగణం/నగణం

3 వ పాదంలో నగణం/ నలం/నలం/నగణం/నగణం

4 వ పాదంలో హగణం/ నలం/భగణం/నగణం/నగణం


మీరు వ్రాసిన అక్షరాలు ఈ స్థానాల్లో వచ్చేలా పదాలను ఏర్పాటుచేసికోవాలి అర్థంవచ్చేలా.

1 పాదంలో  1,3,7,13 అక్షరాలు

2 వ పాదంలో 7 అక్షరాలు

3 వ పాదంలో 2,12 అక్షరాలు

4 వ పాదంలో 3,9,13,15. అక్షరాలు

[11/06, 00:25] Thompella Bala Subramanyam Acharya: గవాక్ష బంధము. 

గవాక్షము అంటే కిటికీ. ఈ బంధములో కవి యొక్క నామమును గాని, ప్రముఖమైన నామమును గారి, కావ్యము లేదా శతకము పేరు నిక్షిప్తమైనట్లు వ్రాస్తారు. ఎక్కువగా 9 అక్షరముల నామముతో కందం లో వ్రాసారు. కందంలో అయితే ప్రాస ఇబ్బంది ఉంటుంది. మొత్తం పద్యంలో 41 అక్షరాము మాత్రమే రావాలి. అయితే దీన్ని ఆటవెలది తేటగీతుల్లో వ్రాయలేము ఎందుకంటే 41 అక్షరాలతో పద్యం పూర్తికాదు కనుక. అదే 11 అక్షరాలు తీసికుంటే ఆటవెలది లేదా తేటగీతిలో చెప్పవచ్చు అప్పుడు వాడవలసిన అక్షరాలు 61. ముందుగా మీరు దాచదలచిన పద సముదాయాన్ని 11 అక్షరాలతో వ్రాసికోండి. ఆయా అక్షరాలు ఏఏస్థానాల్లో ఉండాలో వాటి వివరం ఇచ్చాను చూడండి. మొత్తం 11 వరుసలు వస్తాయి. నిలువుగా మధ్యలో మనం దాచదలచిన పదసముదాయం ఉంటుంది. ఆ మధ్య అక్షరానికి కుడి ఎడమలలో ఆరోహణ అవరోహణ క్రమంలో అక్షరాలు చేరతాయి. సాధ్యమైనంత వరకు లఘువులతో అయితే ఇబ్బంది తక్కువ. చివరి అక్షరాలు లఘులతో ఉంటేనే సుఖము.

నేను వ్రాసిన పద్యమును, అరుణమణి పద్యమును శ్యామల పద్యమును చూడగలరుమీకే తెలుస్తుంది.

No comments: