Thursday, November 14, 2019

శ్రీ మహాలక్ష్మీ దేవి

అంబిక తలపున ఉదయించిన వాణీ నెచ్చెలి ఆమె
అంబుధి నుండి ఉద్భవించిన అమృత సోదరి ఆమె
అంబా యనెడి గోమయమున వసియించును ఆమె
అంబరము తానె ఐన ఆదినారాయణునికి పత్నియె ఆమె

భృకుటిన భగభగమను మహర్షి పుత్రిక ఈమె
భద్రుని సోదరి ఐన భ్రమరాంబ నెయ్యమె ఈమె
భువిని ఏలే పద్మ కల్పపు నాయకి ఈమె
భుజంగశయనుడి హృదయవాసిని ఈమె

చంచలా దేవిగా పిలవబడేటి సిరిమాలక్ష్మి
చైతన్యముగ కొలువబడే శక్తికి ప్రియసఖి శ్రీ లక్ష్మి
చదువుల రాణి పతికి పిత్రుని సతియె ఈ లక్ష్మి
చక్కదనాల కొదువలేని చంద్రుని సోదరి మా మహాలక్ష్మీ

####₹#₹₹#₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹


చూడరమ్మ సతులారా జోలాలి పాడరమ్మ
ఈ చిన్నది ఈప్సితునకూ ఈడైనదీ || చూడరమ్మ ||

నిదురయన్నదెరుగకనె నిను జూచు జాబిల్లి
నిశిరాతిరిని నింపేటి నగుమోముల మన తల్లి || చూడరమ్మ ||

సిరులకెల్ల నిలయమట శ్రీ హరికీ హృదయమటా
స్థిరచిత్తముండునటా సహనము దయా ఉన్న చోటా
|| చూడరమ్మ‌||

సీతమ్మ అవతారమటా పతివెంటనే నడచునటా
శ్రీ కృష్ణుని సఖియెనట పడతులెల్ల బ్రోచునట || చూడరమ్మ||

సీమంతిని శ్రీ లక్ష్మి శీఘ్ర ఫలము ఒసగునట
శారదకీ శాంభవికీ సదా ఆమె నెచ్చెలి అట
||చూడరమ్మ||

కామునికీ కమలోద్భవునికీ మాత కదా
కామితార్థమ్ములిచ్చు కల్పతరువు ఈమె కదా ||చూడరమ్మ||


********************"*""**"""""************

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు - అన్నమయ్య కీర్తనకు అనుకరణ:



సొబగుల‌ నవ్వులదీ పెండ్లి కూతురు ||2||
తాను చంచలయై వరిస్తుందీ అర్హులనే

పేర్మి గల మాతయట జలజ వాసినీ ||2||
తాను తిరుగునటా లోకములో ఖగవాహినీ ||2||

కూర్మి సేయునటా తాను కచ్ఛపీతో

  • తాను సేవలందించునూ హిమజదేవికీ ||2||


శ్రీ మహాలక్ష్మీ అష్టకం రాగంలో వ్రాసాను


ఆద్యంత రహితే దేవీ... హృద్యంతర నివాసినీ...
అత్యంత శక్తి యుతే దేవీ... హ్రీం స్వరూపిణి నమోస్తుతే...
ఆనంద ప్రదాయినే దేవీ... ఆత్మీయ స్వరూపిణీ...
ఆణిముత్యాలయవాసినీ... పక్షి వాహినీ నమోస్తుతే...
ఆలయమందలి మూలం నీవే... పంకజమందూ నిలయం నీదే...
లోకమాతగ సమమును జూపే... కరుణవరదా నమోస్తుతే...
శ్రీచక్ర అధిష్టాన దేవీ... శ్రీ కంఠార్థ సహోదరీ...శారంగధర పత్నీ... శ్రీ లక్ష్మీ నమోస్తుతే...
కొల్హాపూర్ మహాలక్ష్మి... కోటిఫలప్రదాయినీ...
కడలి తనూజాదేవీ నీవే కామదాయినీ నమోస్తుతే...
వైకుంఠ రాణీ దేవీ... వైనతేయ వాహినీ
వైజయంతి మాలాధారిణీ... వైభవ లక్ష్మీ నమోస్తుతే...
వెన్నెల రేడు సహోదరీ.. వేదవేదాంగ సారిణీ...
వేణుగానలోలుని రాణీ... వెన్న దొంగ పత్నీ నమోస్తుతే....
శుభములు కూర్చే వరదాయినీ... శ్రేయము కోరే ప్రియదాయినీ...
లోకములేలే పావనీ... వనరుహలోచని నమోస్తుతే


**********₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

విరించి మాతా వీణాపాణి పూజితా
విష్ణు హృదయ వాసినీ విహంగ వాహినీ
విరమించకుమా మము వీక్షించుట
విన్నపములు మావి వినిపించుమా వేంకటేశునికీ

విషాద వీచిక ఎన్నటికీ మము చేరవలదనీ
వినోదమున మీరున్నా మము వీడవలదనీ
విపణి దాటి వైకుంఠమును మేము అందలేమనీ
విభావరిలోని మా కీర్తనలన్నీ స్వామికి అర్పణమనీ


******************************************

శ్రీ మహాలక్ష్మీ దేవి పై వ్యాజ నిందా స్తుతి

లోకనాధుని హృదయమందే ఊయలూగేవు తల్లి
లోకువేమిటమ్మ నీకు దామోదరుడుండగా

సృష్టి చేసేను ఒక సుపుత్రుడు
ప్రేమను రంజింపజేసేను మనోజుడు

సంతానమునకూ సంబంధాలకూ
సర్దుకుపోవలిసిన అగత్యం లేదు

షణ్ముఖ పత్నీ నీ పుత్రికేగా
షడంగాలిక నీకు దాసోహమేగా

క్షీరసాగరుడు నీ పితరుడంటివీ
క్షీణము వేదిక వనరులకొరకేమన

కామధేనువు కల్పతరువూ కస్తూరికా సురభీ
చింతామణి ఉచ్ఛైశ్రవమూ అక్షయపాత్రా అందులవేగా

చందమామ తోబుట్టువు కాన చల్లదనం నిండుదనం
చక్కదనం కలువవనం సమస్తం నీ ఆధీనం

చీకోటి కోణం ఎరుగని వైనం వీటితో చేరూ
సూర్య మండల సంస్థితా నీవు సింధూర తిలకాంచితా

కశ్యప భృగువులు నీకై ఒనర్చిరి ఘోర తపములు
కలలోనైనా ఉండునా ఇక వారికి తాపములు

కమల నేత్రీ కమ్మని గాత్రీ కరవేమి నీ సోయగాలకు
కళ్యాణాభిలాషుడు జనమజనమలయందు నీ క్రమంగా

జ్యేష్ఠ దేవీ నీ అగ్రజయే నిక ఆమెను దాటి నిను
జేరగలదే ఏ దారిద్య్రం ఐననూ

వైకుంఠ వాసినీ నీ నిలయము ముత్యాల మయము
ఇక నీ కెల్లపుడునూ మది మధురసానందమయమూ

అమృతము నీ సోదరియంట గరళమేమి సేయునిక
ఆదిశేషువె తల్లమైన తల్లి నిన్ను తలచినంతనే ఆదుకొనునె


వైనతేయ వాహినీ కాదే నీది పవన గమనము
నిను కోరే భక్తుల కడకు కొనిపోయే పుణ్య ధామము


****************************************†***


మహాలక్ష్మి వమ్మా మమ్మేలవమ్మ
హేమలతా సుందరీ హరికీ ప్రియ సతి
సుమ మాల సమమా సుందరీ నీకూ
కోరికలు దీర్చవే కోమలాంగి మాకు

No comments: