Monday, November 18, 2019

NZTA

నూ జీ లాండు వెళ్ళినా లార్డు అంటూ ఆంగ్లాన అరువక
నూజివీడు మామిడి పండు అంత తియ్యగా మెలిగే
నూతన సృష్టితో తానూ కలుస్తూ జతగా ఒదిగే
తనదైన శైలి భాష మన తెలుగును మీరంతా విడువక
తృష్ణ తో కొనసాగుతూ మాతృభాష మాట్లాడుతున్నామన్న
తృప్తితో తులతూగుతూ సొంతగడ్డ మీద ఉన్న మమ్ము
ప్రేరేపించే దిశగా ఇటువంటి ఉత్సవమ్ములతో ఉత్సాహంగా సాగిపొమ్ము

దేశభాషలందు లెస్సయైన భాష
దేదీప్యమానంగా వెలుగొందు భాష
దేవతలంతా కోరుకొను ముచ్చటైన భాషా
దేవరాయలంతటి వాడే కొలిచిన భాష
ధైర్యం నింపే నాయకులను మలిచిన భాష
దిగంతాలంతా ప్రజ్ఞాను చాటుకున్న భాషా
దినదినమూ నూతనమై చవులూరించే భాష
దిక్సూచి యై ముందు తరాలను నడపాలీ భాష

కృష్ణ దేవరాయ కొలిచిన భాష
కృష్ణ శాస్త్రి అద్భుతంగా మలిచిన పదములు
కృష్ణ వేణమ్మ ఉరకలెత్తుతూ పొంగిన నేల
కృష్ణుని వోలె కృతకమెరుగని నైజం
అచ్చమైన మన ఆంధ్రుల సొంతం
ముచ్చటైన పద్యములు సైతం
ముల్లోకాలలోనూ తెనుంగుకే సొంతం
ఎల్లలెరుగని కీర్తి కిరీటం మనదే నేస్తం


పేరు: మాధురి దేవి
కలం పేరు: నాగిని


No comments: