Monday, October 19, 2020

వ్రాసిన బంధ పద్యములు

1.

మేదుర దన్త వృత్తములో - కామధేనువు బంధము 


లోకము నేలెడి నాయకి! యెంచక లోపము గావుమ బిడ్డల! మమ్ముల!

యో కరుణా మృత రూపిణి! నిర్వృతి యోగము వేడెద నెన్నడు వీడక

నీకడ యుండెడి భాగ్యమె సంపద నిక్కము యంచుచు మోక్షము నిమ్మని

మా కడ గండ్లను దీరిచి నీదరి మానవ జాతికి నిమ్మని ప్రార్థన


2.  అష్ట శిశు నాగ బంధము - మేదుర దన్త వృత్తము


జంగమ దేవర తాండవ మాడెడి శైలియు నద్భుత రీతిగ నుండును

గంగయు గౌరియు పాదము చక్కగ గల్పుచు నాట్యము లాడగ జూచిన 

యంగన లందరు నేర్చుచు విద్యను హంసల ‌చందము మోదము పంచెడి

భంగిని తాళము గల్గిన తీయని పాటను పాడుచు నాట్యము జేసిరి


 3. ఉత్పలమాల - చామర బంధము


దేవికి సింహయాన శివ దేవికి శంభుని పత్ని శార్వరీ

దేవికి వాణి పల్కులిడు దేవికి విద్య నొసంగు భారతీ

దేవికి లక్ష్మి యిష్ట సఖి దేవికి సంపద లిచ్చు పార్వతీ

దేవికి వందనమ్మిడుదు ధీగుణ శోభిత తల్లి! దేవికిన్


4. శార్దూలవిక్రీడితము - గోపుర బంధము

గురువు గారుఆలపించారు ఈ పద్యము 


శార్వాణీ! హరి సన్నుతా! హిమజ! మా ధైర్యంబు నీవే కదా!

గీర్వాణీ! యసురాంతకా! యగజ! మా ఖేదంబు దీసేయవా!

పార్వాతీ! లలితాంబ! మమ్ము గనుమా! బాధల్ నివారింపుమా!

వేర్వేరౌ యవతార రూపములు నీవేగా మముబ్రోచు మా


5. మత్తేభవిక్రీడితము - దిక్సూచి బంధము నా స్వంత సృజన


లలితా! యంబిక! భ్రామరీ! యరుణ వర్ణాంగీ! ప్రణామాలివే

లలితా నెచ్చెలి! భార్గవీ! కనక వర్ణాంగీ! ప్రణామాలివే

లలితా యోషిత! భారతీ! ధవళ వర్ణాంగీ! ప్రణామాలివే!

లలితా! చింతల దీర్చు యో మిసిమి  వర్ణాంగీ! ప్రణామాలివే


Corrected version by Sri Lakshmi Prasad Garu


లలితా! అంబిక! భ్రామరీ! అరుణ వర్ణాంగీ! ప్రణామాలివే

లలితా! పద్మజ! భార్గవీ! కనక వర్ణాంగీ! ప్రణామాలివే

లలితా! శారద! భారతీ! ధవళ వర్ణాంగీ! ప్రణామాలివే!

లలితా! ఉద్యదనంత భాను శుభ  వర్ణాంగీ! ప్రణామాలివే


బంధ చిత్రము మాత్రము మిసిమి వర్ణాంగీ పద్యముకే ఉంది


[19/09, 00:19] 9963998955: 

6. శుక బంధము 

భజనలు జేసెద దేవా

భజనలు గైకొని దయగను ఫలముల దేవా

భజనలు పాడెద దేవా

భజనలు సలిపెద యొసగు సుపథములు దేవా



7.

నాసికాభరణ బంధము 

[19/09, 00:32] 9963998955: 


చందన చర్చిత మాతా

చందన సేవిత! భజింతు సతతము మాతా

చందన శోభిత మాతా

చందన లేపిత! గణేశ! స్కందుని! మాతా


8.

తటాక బంధము రెండు జతలు వ్రాసాను ఈ బ్లాగులో మరో వైపు వ్రాసాను 

9.


త్రిదళ పద్మ బంధము తేటగీతి 

కనికరమున కొరత లేదు కనక దుర్గ
విశ్వ మంతయు గెలిచెడి విజయ దుర్గ
రుద్ర సతిగను యరులకు రుధిర దుర్గ
వందనమ్ము లందుకొనుమా ప్రణతి దుర్గ

10.

నయన బంధము 

మదిని విడువక కొలుతును మంద గమన

మదిని వాసము చేసెద మదిర నయన

మదిని స్థిరముగ నిల్పెద మధుర వచన

మదిని యర్పణ చేసెద మృదుల  వదన


11.

 హంసక్క సృజించిన రంగవల్లిక బంధము


నేను వ్రాసిన కంద పద్యము


ద్రిజ! యపర్ణ వమ్మా
ద్రిజ! తపమును యొనర్చి రునొందితివీ
ద్రిజ! షడ్భుజ! భ్రామరి!
ద్రిజ! షణ్ముఖుని జనని! హారతు లివియే



No comments: