Saturday, June 12, 2021

చంద్ర గణములు

ఇది మన గురువు గారు ఇచ్చిన పాఠం:


చంద్రగణములు 14. ఇవిఅక్కరలుమొదలైనపద్యాలలోమాత్రమేవస్తాయి.వీటిఉపయొగంఆసందర్భంవచ్చినప్పుడుప్రస్తావిస్తాను.

నగగ, నహ, సలా, భల, భగురు, మలఘు, సవ, సహ, తల,రల,నవ,నలల, రగురు,తగ.

ఈవరుసకంఠతాపట్టినగుర్తుండును. మొత్తంపద్యంఅయితేఇంకామంచిది.

నగగ, = నగణంమీద 2 గురువులు IIIUU కమలనాభా!

నహ/నగల, = నగణంమీదహగణంఅంటే IIIUI కమఠరూప!

నవ/నలగ, = నగణంమీదవగణంఅంటే IIIIU గజవరదా ! 

నలల, = నగణంమీద 2 లఘువులుఅంటే IIIII అహిశయన ! ( 5లఘువులు)

సలా, = సగణంమీద 2 లఘువులుఅంటే IIUII అసురాంతక!

సవ/సలగ, = సగణంమీదవగణంఅంటే IIUIU భువనేశ్వరా ! ( రగణంముందు 2 లఘువులు)

సహ/సగల, = సగణంమీదహగణంఅంటే IIUUI అఘవిద్వేషి ! 

భల, = భగణంమీద 1 లఘువుఅంటే UIII అద్రిధర!

భగురు,= భగణంమీద 1 గురువుఅంటే UIIU భద్రయశా! ( సగణంముందుగురువుచేర్చినా)

మలఘు,= మగణంమీద 1 లఘువుఅంటే UUUI అంభోజాక్ష ! 

తల, = తగణంమీద 1 లఘువుఅంటే UUII పీతాంబర ! 

తగ. = తగణంమీద 1 గురువుఅంటే UUIUపద్మావతీ !

రల, = రగణంమీద 1 లఘువుఅంటే UIUI కైటభారి ! 

రగురు, = రగణంమీద 1 గురువుఅంటే UIUU దేవరాజా ! 


నగగ, నహ, సలా, భల, భగురు, మలఘు,సవ, సహ, తల,రల,నవ,నలల, రగురు,తగ.


నగణ గల లినులు, సలము నలము నగము

భరత లింద్రులు, మలఘు భగురు భల రల

నలల తల సలా సహ నహ నగగ తగురు

నవ సవ రగురు లిందు గణములు కృష్ణ !


No comments: