Saturday, June 12, 2021

అక్కర పద్యములు

 

అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.

మహాక్కర , మధ్యాక్కర , మధురాక్కర , అంతరాక్కర , అల్పాక్కర

మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర.
ఈ పద్యాల గురించి విపులం గా తర్వాతి పోస్టింగు లలో తెలుసుకుందాము.


మహాక్కర పద్య లక్షణములు

  1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
  2. 21 నుండి 28 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు ఒక సూర్య , ఐదు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.

మధ్యాక్కర పద్య లక్షణములు

  1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
  2. 16 నుండి 22 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు రెండు ఇంద్ర , ఒక సూర్య , రెండు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.



మధురాక్కర పద్య లక్షణములు

  1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
  2. 15 నుండి 20 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.


అంతరాక్కర పద్య లక్షణములు

  1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
  2. 12 నుండి 16 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క చివరి అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.

అల్పాక్కర పద్య లక్షణములు

  1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
  2. 10 నుండి 13 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు రెండు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.


No comments: