Friday, June 18, 2021

పద్య భారతి చిత్ర కవిత్వ, దత్త పద సాధనలు

 [14/06, 14:59] Durga Madhuri: పాద సేవ జేసె బసివాడు ముద్దుగ

తల్లిదండ్రులకును దన్మయముగ

జగతి కెల్ల దెలిపె సందేశమిటులను

తల్లిదండ్రి సేవఁ దనరు జగతి


హంసక్క చేసిన సవరణలతో, కృతజ్ఞతలతో

[14/06, 16:10] Durga Madhuri: 


అల్పాక్కర


సుతులు సలుపు సేవ శుభమొసంగు

సతము వదలకున్న జయమునందు

పతనమెన్నడు గారు బంగరమ్ము

హితము గలుగును మహిని! నిజము



[14/06, 22:32] Durga Madhuri: కందం


స్తుతి జేయుట రాదని పశు

పతి! వదల వలదని మనవి! వసుమతి నాథా

మతి లేదని వీడకు మా

గతినీవే! ద్యుతి నొసగుమ! కాలాతీతా



[15/06, 15:03] Durga Madhuri: 

శ్రీపతీ సతము బ్రోవుమా

పాపముల్ గనక కాచుమా

యాపదల్ గలిగె జూడుమా

బాపుమా వ్యథలు బాధలన్

[15/06, 15:04] Durga Madhuri: 

భద్రకము - 1 ర/న/ర ప్రాస యుండును యతి ఉండదు


[15/06, 20:00] Durga Madhuri: ఆటవెలది


గాలి లోన యెగిఱె ఖగములు శోభగ

మింటి నంత నింపె మేఘమాల

నీట దాగి యున్న నిశ్చల రవిఁగన

సరసు నుండి విరిసె సరసిజములు



[15/06, 22:11] Durga Madhuri: 


మమత లేని చోట మనుగడెట్లు కలుగు

సమత పదము గాదు సంస్కరించు

జనత నడవడికను! జయముఁ గూర్చు! సతము

వనిత శక్తినిలను! వాస్తవమ్ము


[16/06, 00:40] Durga Madhuri: తేటగీతి


చేతనమ్ము నెఱుఁగనిది సిరినె యడిగె

మరిక మాయలోన పడెడి మనుజులెంత!

హృదయ సీమ ధ్వని యు గూడ నిదియె గోరు

వేరు మాటలేల! నిలను విత్తు ఘనము


[16/06, 11:36] Durga Madhuri:


నా ఆటవెలది ప్రయత్నము


వెన్న దొంగ తల్లి వెనక దోబూచిగా

జేర వచ్చె తాను చిన్ని కృష్ణ

పాలు పితుకుచున్న పడతి యశోదమ్మ 

ముద్దు జేసెనమ్మ మోహనుఁడను


[16/06, 19:01] Durga Madhuri: 


చందమామను గనుటకు సత్యభామ

వెలుపలకు వచ్చుట గనియె ప్రేమ మీర

చెంత చేరె కృష్ణుఁడని వ్రాసితిని కథను

దోమనెట్లు నిముడ్చెద రామ! యిచట


[18/06, 18:29] Durga Madhuri: ఆటవెలది


అరుణ వర్ణ మద్దె నాదిత్యుడిటుల తా!

బత్రములకు! గనరె! ఫయిన నుండి

యందుకొనుచు వ్రాలె నంట భువికి పూయ

తలపు తోడ! వృక్ష దళములన్ని!



[17/06, 22:42] Durga Madhuri: వరుణుడు గురియగ వడివడి

పరుగిడి గప్పెను సుతులకు పవిటను పేర్మిన్

తరువుకు చెంతన నిలచిన

సరిపోదనుచున్! సరగున జననియె! గనుమా

[17/06, 22:44] Durga Madhuri: తేటగీతి


స్వార్థ చింతన జేసి దాశరథిఁ దఱిమి

భరతునికి పదవినొసగ వలయుననుచు

భర్త సుతులకు దూరమై వగచె కైక

సౌఖ్యమే లేదు! రామ రాజ్యమ్మునందు


[18/06, 16:42] Durga Madhuri: 


బూరె బుగ్గల పసివాడు గోరె ననుచు

గారె లను జేసి దినిపించె కమ్మగాను

కూర దినలేదు మరునాడు కుర్రవాడు!

తల్లి! చారు తాపె నరుగుదలకు పిదప



No comments: