ఆటవెలది
పద్య విద్య నేర్పుబాలశర్మ సుతకు
పెండ్లి వేడుకండి! పిన్న పెద్ద
జేరి పందిరింట సీతా హవీషులఁ
తోడ నందరాడి పాడరండి!
పెండ్లి వేడుకండి! పిన్న పెద్ద
జేరి పందిరింట సీతా హవీషులఁ
తోడ నందరాడి పాడరండి!
ఆటవెలది
పద్మనాభునకటపౌత్రిగ జనియించి
నాఱసింహునికిటనవవధువుగ
యడుగిడెడి శుభ సమయమున చిందించుమా
తఱగని నగవులనుతరుణి! సీత
నాఱసింహునికిటనవవధువుగ
యడుగిడెడి శుభ సమయమున చిందించుమా
తఱగని నగవులనుతరుణి! సీత
తేటగీతి
ఉషకు నాడపడుచు జూడనుషయె! లీల
గనగ చివుకుల వారింటికన్న బిడ్డ
వోలె కోడలి పై మల్లెపూలవాన
కురియు భాగ్యము గలుగుత! గురుసుతకట
గనగ చివుకుల వారింటికన్న బిడ్డ
వోలె కోడలి పై మల్లెపూలవాన
కురియు భాగ్యము గలుగుత! గురుసుతకట
తేటగీతి
చివుకుల గృహమున వెలుగు సిరుల దివ్వె
చింత యన్నదెఱుఁగకుండ చిరుఁ నగవుల
తోటి వరుడు హవీషుకు తోడు యగుచు
వర్థిలవలెను నూరేండ్ల పంటగాను
చింత యన్నదెఱుఁగకుండ చిరుఁ నగవుల
తోటి వరుడు హవీషుకు తోడు యగుచు
వర్థిలవలెను నూరేండ్ల పంటగాను
కందం
వాణిజ్య శాస్త్ర మందున
రాణించవలెను సతతము ప్రప్రథమమ్మౌ
శ్రేణిన నిలువవలయు పూ
బోణి! విజయసీమ నందిముదమొందవలెన్
రాణించవలెను సతతము ప్రప్రథమమ్మౌ
శ్రేణిన నిలువవలయు పూ
బోణి! విజయసీమ నందిముదమొందవలెన్
No comments:
Post a Comment