Monday, March 7, 2022

రాయలసీమ పద్యములు

 *1. మంగళగీతి ఛందము*

రతనాల సీమగు రాయల యేలిక

నందిన రాజ్యము! అందమైనది! మన

తెనుఁగు నేలన ఘన దివ్య ధామ ములకు

మంగళమొసగెడి మధు హర గుడులకు


*2. తేటగీతి ఛందము*


నెలవు!సంస్కృతి సాహిత్య నిలయమగుచు

ముందు తరముల వారికి ముచ్చటైన

నిధిగ నిలచిన గడ్డ! వారధిగ యెన్నొ

రాష్ట్రముల భాషలను తన ప్రాంతములన



*3. ఆటవెలఁది ఛందము*


నింపుకున్న నేల! నిండైన పున్నమి

కాకతీయరాజు! కన్నడిగుడు

కృష్ణ దేవులిౘట కీర్తించి నిలచిరి

దత్త మండలమ్ము! దైవ కృపయె




*4. కంద పద్యము*


నారాయణుడను ఘనుడీ

తారా సమమగు స్థలముకు తానుగ పెట్టెన్

తీరుగ రాయల సీమగ!

నౌరా యనునట్లునుండు నద్భుతమిదిరా



*5. ఆటవెలఁది ఛందము*

అష్టదిగ్గజమ్ములందు నైదుగురును

వేమన హజరతులు వీర బ్రహ్మ 

కట్టమంచి వంటి ఘనులు జనించిన

పుణ్య ధాత్రి వినుచు మురియరండి

No comments: