Monday, March 7, 2022

విజయ భావన సాహితీ మిత్ర సమాఖ్య

 

కందములు:

1.

చైత్రము కొఱకై మదిలో

నాత్రము గానుంటిరిచట నందఱు గనగన్

ధాత్రిన! రమ్మా త్వరగా

మిత్రమ నంతట వసంతమే నిండునటుల్

2.

గడచిన వాటిని తలువక

విడువరె జనులా మదినిక వేడుక గనరే

యిడుములకంతము లుండవు!

ముడుచుకొనవలదు నిరుటివి ముగిసినవి గదా

3.

శుభకృత్ వత్సరమా యిక

నిభమే లేదీ ధరణిన నీకు సమమ్మౌ

విభముల నొసగక జనులకు

క్షభముల దెచ్చెను! గనుక నిక శుభములిమ్మా

4.

నూతన మనగా మనుజల

గీతలు మార్చెడి ఘనమగు కృతులెటులౌనో

చేతలనందున శుద్ధియు

శీతలమౌమది గలిగిన శ్రేయమెనెపుడున్

5. వచనములు

 

గడచినవేవీ తలువము

యేలనన్న నిది యొకటే కాదీ

ధరణిన ప్రళయము లిదివఱకెన్నో

గనెనీ ధరణియె! చూడగ

విషక్రిములు అణ్వాయుధమ్ములు

ప్రపంచ యుద్ధములు ప్రకృతి విలయములు

గనుక గత రెండు వత్సరమ్ములనూ

మాత్రమే విడిగా చూస్తూ మనసుకు

నిస్పృహ రానీయక ముందుకు సాగెదము

శుభకృతమా సాయము రమ్మా

No comments: