Tuesday, September 27, 2022

శుభకృత్ దసరాకు

 [18/09, 17:46] Durga Madhuri: విజయదశమి కవిత్వం నకు:


ఆటవెలఁది


కనులు దెఱువగానె కలువ ఱేడు శిరముఁ

పరివృతము గలిగిన వ్యాఘ్ర రూఢ

యయిన దుర్గ రూపమగుపడు నట్లుగ

నిదుఱ లేచి జూచి కదులు నేను


యే రీతిన నిను గొలిచెద

నారీ రత్నమ! రవి శశి నయనా! హిమజా

నీ రాకనూ గోరుచు నే

మారామును జేసెద మఱి! మాతా గనుమా


కందము


బాల్యము నుండియె ౘల్లని

తుల్యము లేనట్టి నగవుల దుర్గను దలతున్

ఖల్యుల దఱిమెడి నారిని

శల్యపు గుణముల దయగల జననీ ప్రణతుల్


కందము


అంబకు హారతి లిడరే

సంబరము మదులను నింప ౘక్కగ మనకై

యంబరము వలె సతము తా

శంబరు జంపిన హిమజకు జననికి మదిలో


కందము


దుర్గము నందున వెలసిన

భర్గుని పత్నికి విజయకు భవితకు మేలౌ

మార్గము జూపెడి జననికి

స్వర్గము గోరక నడుగరె సాన్నిధ్యమునే


 మేదురదంతము


రక్కసి మూకల జంపిన నాయకి రక్షణ మాకని నేనిట నిత్యము

ౘక్కగ నమ్మితి! శ్రీగిరి నందున సాక్షిగణేశుని మాతను దల్చితి

మక్కువ మీరగ! కష్టము ద్రోలుచు మమ్ముల గాచుచు నిందలు పోయెడి

యక్కఱ దీర్చిన చాలని గోరుచు హారతి నిచ్చెద నంబకు! నిత్యము


నా ఈ పద్యములు పూర్తిగా నావేననీ, దేనికీ నకలూ, కాపీ, అనుసరణా, అనుకరణలు కావనీ, ఎవ్వఱనూ ఉద్దేశ్యించినవి కావనీ, ఎక్కడా ప్రచురింౘ బడలేదనీ హామీ ఇస్తున్నాను.



నా వివరమ్ములు:


పేరు: మాధురి దేవి సోమరాజు

కలం పేరు: నాగిని

ఊరు: హైదరాబాద్

చరవాణి: 9963998955 / 9618334794

[22/09, 22:51] Durga Madhuri: *వాగ్దేవీ కళా పీఠము, విజయవాడ కవన వేదిక వారు నిర్వహిస్తున్న*


*నమో దుర్గ* కవితా పోటీలను పురస్కరించుకొని, నా గీత మాలిక.


******************************


జగములు కరుణించు జనయిత్రీ

అసురుల వధియించు జగజ్జేతా ॥2॥


ఫలములనడుగము మా భవ హరిణీ

నిను నుతియించుటయే వరమమ్మా ॥2॥ ॥ జగములు॥


అండగ నీవున్నా హర్షమటా

పండును మా పంటా ప్రసన్నాక్షీ ॥2॥ ॥జగములు॥


శివునికి సతివీవూ ఛిద్రూపీ

గజముఖ షణ్ముఖుల శ్రీ మాతా ॥2॥ ॥జగముల॥


మురిసితి నాతల్లి ముగ్ధా వదనా

నీ మోమున నగవుల గని! నీల వదనా ॥2॥ ॥జగముల॥


సింహము పైనున్న నిను గాంచీ

భయమే రాదేలా! భక్తిని నమ్మంగ! మా తల్లీ ॥2॥ ॥ జగముల ॥


చంద్రుని కళలన్నీ నీవేగా శశి వదనా

ఇంద్రుని పై కరుణా నీదేగా ॥2॥ ॥జగముల॥


కనులు దెరువంగ నిను జూచీ

కలలను జూచిన నిను పోల్చితిమీ ॥2॥ ॥జగముల॥


అవనికి నీవేగా అధినేత్రీ 

అంబవు నీ రక్ష అందించుమా ॥2॥ ॥జగముల॥


నిను దెలిపెడి శక్తీ మాకేదీ

మనమున గొలిచేమో మహిమాన్వితా ॥2॥ ॥జగముల॥


*వృత్తాసుర సంసారము అమ్మ దయయే కదా! అలాగే మహిషాసుర మర్దని గా, భువిని పంటల నొసగిన హైమవతిగా అంతా ఆమెదే అనే భావన తో, 7వ చరణము*


*సుశీలమ్మ గారు పాడిన "జగముల కరుణించు జనయిత్రీ" అనే పాట లోని మొదటి పాదమును గైకొని, అదే రాగమునకు సరి పడునటుల వ్రాయ ప్రయత్నించితినీ, ఎవఱనూ కింౘ పరచేందుకు కాదు, దేనికీ అనుసరణా కాదు, ఎక్కడా ప్రచురణకు పంపలేదు అని హామీ ఇస్తున్నాను.*


నా వివరమ్ములు:


పేరు: ఇరువంటి మాధురీ దేవి

కలము పేరు: నాగిని

ఊరు: హైదరాబాద్

చరవాణి: 9963998955 / 9618334794.

No comments: