Friday, September 27, 2024

AmmaVaaru

నాగవుల తల్లి పార్వతి! సనాతని! వందనమో ఉమా!

ఖగపతి విష్ణు సోదరి! ప్రకంపనలన్నియు దీయ నీవెగా

జగములనేలు నాయకివి! శౌర్యము ఘూపి కపర్థినీ సదా

గగనము దాటి మా దరిని కాంతిగ నిల్వుమ యద్రి వాసినీ


అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ, దసరాలలో, క్రోధి, 2024, అక్టోబర్ 4


రావమ్మా జననీ మా

భావము గమ్యము సురనుత! భ్రమరీ నీవే

పావని! యూయలనూగు

దీవింఘుమ‌ మము! శుభగుణ! ధీరా! హిమజా






కీర్తన వాళ్ళ గుడి లో, క్రోధి సంవత్సరం దసరాకు మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవికి

వాణీ శర్వాణీ యో

వీణాపాణి గొలుఘును వేదములన్నీ

శ్రేణిన నిలఘు నిన్నే

రాణి ౘదువులనొసగుమ లక్ష్యము కొఱకున్


జ్ఞానము నీవే ధరణికి

రాననబోకుమ! శుభాంగి! బ్రహ్మ కళత్రా!

ధ్యానము నిలిపెడి కరుణను

మానవులకొసంగవలె సుమధుర వచన!


నా మనస్సున వీడకుండను నాద బిందు కళాత్మికా

నీమమన్న విధంబుగా కరుణించి యాడు సమున్నతా

నామమన్నది దల్చినంతనె నాదు నేత్రములందునన్

నోము పట్టిన! కాచుచుండు మనోన్మణీ ! శరణంబిదే.

ఉత్పలమాల 


తెల్లని వస్త్రధారణయు తీయని పల్కుల తల్లి వాణి తా

ఘల్లదనమ్ముతో మనకు జ్ఞానమొసంగు సంస్కరింగా

తల్లిని గొల్చుకుందుమని ధాత్రి నివాసులు పూజ సల్పుఘున్

పల్లవి పాడుకుందురట భారతి నామము తోడ నిత్యమున్




బంగారు రంగున వెలసిన

రంగము నాయకి! సురనుత! లక్షణముగ యే

భంగము నొందని జ్ఞానము 

చెంగున నిమ్మ యని యిట చెప్పెద వినతుల్



వీణయు నక్షమాలను ప్రవీణ! ధరించెడి వాణి దీర్ఘమౌ

బాణిన రాగమాలికలు పాడుఘు వేడెద జ్ఞానమీయుమా

పాణి కలమ్ము కావ్యములు వ్రాసెడి భాగ్యమున్నఘో

శ్రేణి తలంబున జీవులిక చేరును నీ దరి! మాయ దాటుఘున్




దుర్గమ మార్గము నడిపెడి

భర్గుని పత్నీ! ప్రణవపు పంజర వాసీ

అర్గళ దేవీ మనవిది

నిర్గుణ రూపా! బ్రతుకున నింపుమ’ వెలుగుల్



ధాన్యము ధనమది యేలన

దైన్యము సరసన నిలువదు ధైర్యము నీవై

మాన్యత గాచిన చేరదు

శూన్యత బ్రతుకున! మనసున! శుభగుణ! తల్లీ!


ధాన్యము ధనమది యేలన

శూన్యము గాదైనను మది ఘూచిన నిన్నే!

దైన్యము దరిమెడి శక్తివి!

మాన్యత గాచెడి సురనుత! మంగళదాయీ



చంద్రవంక ధారి! మందర స్వరమ్మున

కీర్తనలను పాడి కేళి యాడి

శిశువులమగు మేము! యశమును ముదమును

వొందెదమిల! జనని! ఉమ! సురనుత



నవదుర్గాలుగా వెలసెనె

శివసతి ముఘ్చట గొలుపు చిరునవ్వులతో

భవభయ హారిణికివియే

నవనీతముతో ప్రణతులు! నగజకు భక్తిన్






తెలుగు లోగిలి లో నళినీ ఎఱ్ఱా గారి టపా

దీపపు కాంతుల నడుమన

శ్రీ పద్మావతి! వెలసెను సిరులను చిలికెన్

పాపపు రాశిని చీల్చు

నాపదలెల్లను దరుముఘు నంది యుండున్


కొలువరె కాచెడి తల్లిని

నిలుపరె మనమున సుగుణపు నిధియౌ సిరినే

తలచిన ఘాలును జయములు

కలిగింఘును లక్ష్మి! విష్ణు కళత్ర! పెర్మిన్




ఇంట్లో పెరట్లో రరోలు వద్ద దీపం పెట్టినపుడు కనిపించిన అమ్మ కనులకు ఈ పద్యమూ, పాట

[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: వేంచేసితివా జననీ

కంచీ పురవాసిని మము కరుణింఘుఘు నీ

పంచన చేర్చుట కొఱకని!

కంచెల తెరతీయుమిక వికాసమొసగుమా

[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: నీ కనులే మము గాంఘగ భువికి జేరెలే

శ్రీకరి శుభగుణ సుధాబ్దిజ ధన్యవాదమే ,|| నీ కనులే ||


తిమిరము హరియింఘుటకని దివి వీడిన జ్యోతి

సమరములను బాపు నడిపించే తల్లీ ||తిమిరము||

సతతము నీ స్మరణే నిరతము నీ భజనే ||సతతము||

మా యిల వేలుపు నీవేనే మంగళదాయని సురనుత || నీ కనులే||


అందఱి బంధువు నీవయి ఆడే లోకమాతవే

సుందర వదనా నిగమాగమమే మాకు నీయవే

నవ్వుల పువ్వుల కొమ్మకు పడతుల’ వందనంబులే

సకల కళల రాణి శాశ్వతి పరమేశ్వరి మంగళ దాయిని


|| నీ కనులే||



పురివిప్పిన నెమలిక తో

సరసుకు చెంతన నిలచిన జననీ ప్రణతుల్

సురనుత భారతి పద్యము

సరి యగు విధముగ రచించు జ్ఞానము నిమ్మ



అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రం: 08/11/2024

అమ్మ నీవే దిక్కని

నమ్మిన భక్తుల గృహముకు నడిచెడి కరుణే

మమ్ముల నిలుపును! వేగమె

రమ్మా యనగానె చేరి రక్షింఘు సదా


అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రం: 05/01/2024


భృగువు వారమందు మగువలంత కలిసి

సలుపు పూజ కొఱకు సంధ్య వేళ

యిలకు చేరు తల్లి! యీశ్వరీ ప్రణతులే

మమ్ము కావ మనవి! మంగళముగ




కన్న భుజమ్ము నందు గని గారము చేసెను మాతృమూర్తి యే

యన్నుల మిన్నకై మనసు నాతృత నిండును నిత్యమున్ గదా

వెన్నెల వంటి ఘల్లనగు పేర్మి ప్రతీకయె సృష్టిలో సదా

వెన్నను జిల్కు నామె సమ వేలుపు లెరుగ ఘూడగన్ ధరన్




క్షీరాబ్ధి ద్వాదశి, క్రోధి వత్సరము

క్షీర సాగర కన్యక చేర రావె

మదు గృహములకు హరిని చేదుకొను

తులసి ధాత్రి సహితముగ వెలసి మమ్ము

కనికరింఘవమ్మ! సిరి! యవని నీవు



తులసీ మాటకు ప్రణతులు

తొలితొలి ఝామున సుమముల తోరణ మాలల్

తిలకము పసుపు గంధము

తలమానికమౌ నుతులును తల్లీ గొనుమా


"త" గుణింత కంద పుష్పము




త్రిజగన్నుత! శరణము నీ

నిజ రూపము గాంఘలేని నీరసమున నే

భజనలు సహితము విడచితి

గజ రాజ సుపూజిత! నను కరుణింఘుమికన్


మౌనము ౘలునంటిని రామధవ! భౌతికలోక బాధలో

నీ నను ముంఘనేల హరి! నే కను పాపను కాన! దేవరా

ధ్యానము సేయకున్నని దైన్యత లో పడవైచి నవ్వు

పానము లాగి నావుగ! సబాంధవ! ఘాలయ శిక్షలాపుమా


జలనిధి కన్యకామణి! ప్రజాపతి మాటవు ధాత్రి నిండుగన్

కలిమిని పంఘు నాయకి! సకాలము రైతుకు పంట భాగ్యమున్

ఫలముగ నిమ్మ యచ్యుతుని పత్ని! యష్ట విధమ్ముల మేలగున్

కలి యుగ బాధలేవి యిక కానగ రావుగ శాంతి నిండినన్!



కైలాసము నిండెనుగా

తేలెను వైకుంఠమేమొ తీయందనమున్

స్త్రీలు సలుపు పూజలతో

మేలు కొలుపు గీతముల సమేతముగ భళిగా



నిదుఱన యున్న మాధవుని నెరుగ‌ చేరెను శంభుడే వెసన్

పదునుగ నున్న ప్రశ్నకు ౙవాబు కోసము సేన తోడుగన్

చెదరగ దృష్టి! శాంతము చిత్తమునందున నింపి యాతృతన్

హృదయమునీయ దాటక ప్రహేళిక పొంగును మౌనముద్రతో!


అంబుధి నిండి పోవగ మహామహ’ దేవుని సేనతో గనుల్

యంబిక గానరాక హరి యచ్చెరువొందెగ లక్ష్మి దేవియున్

యంబర వీధి దాటెనని యప్పుడు గాంచెను విష్ణు మూర్తియే

సంబర వేళ ధాత్రినని సత్యమెఱిఁగెను! దివ్య దృష్టితో 


క్షీర సముద్రమేమొ బహు చిత్రము మారెను స్త్రీలు హస్తమున్

ధారగ పూజ సల్పెడి విధానము వైచెడి పస్పు కుంకుమల్

తీరుగ చేరి రంగులను దిద్దగ కెంపులు పఘ్చదనమ్ముతో

శ్రీ రమ నాథుడున్ హరుడు జీవుల భక్తికి మెచ్చె మొదమున్


గాంఘగ శైలమంత యును



షోడశ సేవలన్ని నిను ఘూచెడి భాగ్యము కోసమే కదా

వాడలలోకి పిల్చుకొని భక్తిగ నిత్యము గొల్చినాము నీ

ౙాడను పట్టి మోదమున ఘక్కని సేవలు జేయుచుందుమే

వీడక మమ్ము నీదు మది పేర్మిని పంఘుమ విశ్వమాతగా




అల్లితిమమ్మా కరులను

ఘల్లని తల్లీ! విరులును! జగమంతా నీ

పిల్లలమే కదా! పంఘుమ

యెల్లలనెఱుఁగని మమతను! యిల వాసులకున్.



నీ కబరీబంధము గని

మా కన్నులు మురిసెనేమొ! మంగళ గౌరీ

యా కురులందున కరుణకు

శ్రీ కామాక్షీ! ప్రణతులు చేకొనుమమ్మా.



నీదయ ఘాలును నాకిల తండ్రీ నృసింహ! నిత్యము రమ్మ దరికే

వేదన లేవియునుండవు నపుడిక ప్రీతిగ నడుఘును బ్రతుకులు యురికే

మా దినచర్యలు మరఘును స్వస్థత మారము చేసేడి వైరులు పలికే

ఖేదపు తలపులు ముంచెను కావు! కీర్తించెద నిను! నిరతము వదలక! 


*హరిగతి ఱగడ, 8 చతుర్మాత్ర గణాలు, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము*



నాగిని లాగిన్

https://www.facebook.com/share/p/1BBRuEVHrn/


వెలసెను బ్రహ్మ తోడను వీణను పట్టి కరమ్ముల యందు తల్లియే

చిలుకుఘు మోమునందు వికసించిన పద్మము వోలె హాసమే

పలికెడి వాక్కులన్ని మము బంగరు బాటల వైపు నిల్పగన్

కలుగును మోక్షమే యిక సకాలము ౙాగును లేక సత్యమే.




https://www.facebook.com/share/p/1BBRuEVHrn/


కలువలనందునుండునట కాంచన వర్ణపు శోభనాంగి నీ

చెలియగదెట్లు నాడునయ చిత్తముపైన వసింఘునందురే

పలుకులదేమి యిత్తఱిని పాడుఘు తెల్పెదరంట మాకు యీ

తలపులదెల ఘాలునయ! తల్లి దయామృతంబు నిత్యమున్.






బ్రహ్మ రసనాగ్రవు జనని వాణి ప్రణతి

విద్య నొసగు జ్ఞానము ప్రీతి మీర

పంఘు హిమజ జలజ సఖి! వసుధ నిలచి




కలికీ నీదర్శనమే

కలిమాకిలపై గిరి సుత! కళ్యాణి యే

కలతలు రానీయకుమని

కలమును పట్టు యడిగెద కాఘుమ జగతిన్.

శాంతి చేకూర్చ మనవి! ప్రసన్న వదన!


శ్యామల! శారద! శాంభవి!

భ్రామరి! అంబిక! సురనుత లావణ్యముతో

మా మనసుల నిలువుమ యీ

సీమను గాచెడి శుభగుణ క్షేమమునిమ్మా.



ప్రతి వారము నీ పూజకు

యతివలమంతా నిలచుచు యనుభూతులతో

నుతియించెదమో జననీ

స్థితి గతి స్థిరముగ నిలుపుమ శ్రేయము తోడన్.



ఆట వెలింది:


నలుపు గాడు హరియు తెలుపు గాడు హరుడు

అసలు రంగదేమో! నాయు లేదె!

పసిడి యెఱుపులున్న పడతులతో గూడు

వాఱు రూపమెవఱు పట్టలేరు.


తేటగీతి:


యింతులందఱు చేయు యీవిధమగు

సేవలన్ని చేరగ నాట దేవనగరి

యిట్లు నిండిపోవగ రంగులీని జగతి

వర్ణభూరితమయె బాగ! వంక లేక.



తాటంకములే రవి శిశి

మాటలు మా కష్టములను మాట వినవా

యోటమి వెతలను తరముమ!

బాటను నీవే నడీపుమ పంజర నిలయా.



శుక్రవారపు ఘడియలో శుభములొసగు

సింధువాసిని పూజకు సిద్ధమవరె!

మేలు గలుగ జేయు తనదు లీలతోడ

తల్లి దరిని చేరిన ఘాలు! దక్కు ఫలము.



ఆట వెలఁది/ ఒడలు పులకరించి కడలిని దాటి / తుదకు దరిని చేర్చు త్రోవ ఘూపు/ సన్నివేశము యిది స్వామి దయను వొంది / సంతసించె మది వసంతమాయె

 - ఈ లింక్ కింద: https://youtube.com/shorts/qyZvquIk388?feature=shared 





ఏమని వ్రాసెదనమ్మా

నా మది నిండిన తలపులు! నాద స్వరూపా

పామర వనితను దయగొని

యీ మనవిని గైకొనుమిదె! యిమ్మా పథమున్.



గజమాలలు గైకొని నీ

నిజ దర్శనమీయవే ప్రణీతములివియే

ఋజువర్తనులమ్ము రమా

యజ గాంచుమ నీ శిశువులమమ్మ! జననీ.


కేశములనుగంటిమిగా

క్లేశములను దొలగజేసి క్షేమమునిమ్మా

యీశుని పత్నీ మమతల 

పాశము వదలని మము గను బాంధవి! ప్ర ణతుల్.




ప్రార్థన విన్నది మన శ్రీ మాతే దయతో

ప్రారంబించెను తన సంరక్షణనే

స్వస్థత స్వచ్ఛత సంపద సఖ్యతలన్నిటినీ

ౘాఘిన కరముల మనకందించెనుగా

రాముని రాజ్యము లక్ష్యముగా సాగే

మారుతి సేనకు మంగళమామేగా

వేదన స్థానము వేడుకదే యికపై

జ్ఞానపు దివ్వెతో భ్రాంతిని ద్రుంచేనే.


[నమ్మిన నా మది... పాట పల్లవి రాగానికి అనుసరణీయం లో]


సీతమ్మ తల్లి తన కళ్యాణానికి గౌరీ పూజ చేస్తున్న వేళ

నిన్నే నీవర్చించగ

దేవేరీ మాకు నందు దీవెనలన్నీ

సేవించెదమే తృప్తిగ

పావని నీపై మనమున భక్తిగ తల్లీ.


ఈ అమ్మవారి దర్శనం కలిగినప్పుడల్లా నాకు అందిన శుభములకు కృతజ్ఞతగా పై పాట, ఇక్కడ పూజ చేస్తే తప్పకుండా అమ్మ ఆ జగన్మాత స్వీకరించి మనలను కాస్తుందనే అర్థం తో..స


సఖియా,


సహనమధికమని వలదు సానుభూతి 

కొరకు ౘూపు సాగు పథము వరకు

బాధ్యతలను భారమనక బంధమన్న

తృప్తిమీర నెరపుమ! నీ దీప్తి వెలుగు.



సింహ వాహిని! కమలముల్ చేతబట్టి

కదళి వనమున గూర్చిన కనక దుర్గ 

కనకమును కురిపించెడి కళల లక్ష్మి

వాక్కు గూడ నొసగుమమ్మ! వాణి! దయను.



జీవన యానపు నౌకవు

నీవే చుక్కాని గూడ! నీరజ నేత్ర

మా వేదన దీర్పవె నీ

దీవెనలే అమ్మా! తృప్తినొసగునే.




ఉదయత్త పెట్టిన చిత్రం:


పాణిన విపంచి నల్లని

వేణియ శిరమున కలిగిన విద్వన్మణి యో

బాణిన రాగము నేర్పుమ

వైణిక కులమునకధిపతి! వాణీ! మాకు.




దండలు గైకొను మాట

దండంబుల నందుమమ్మ దైత్యుల నెల్లన్

దండన చేసేడి శక్తివి

దండిగ పూజల గొని యిల దయతో గనుమా.




చేరలేక యున్న శ్రీ గౌరి! నీ పూజ

సలుపుౘోట! ణనసు స్మరణ చేయు

నిన్నె గాన మ్రొక్క వన్నె తీరినటుల

మమ్ము గాౘ రావె! మాత! దయను.


అంతయు పసిడియె నా పూ

బంతుల చేమంతి చంద్రవంకయు పతితో

నింతి నివాసము రజతము!

వింతగ లేదే కనుటకు! పెద్దింటమ్మా.


Harini intlo Sri Saraswati Maata Photo:

ఉత్పలమాల 

భారతి! నీకు సేవలిడు భాగ్యము దక్కిన ౘాలు; వెన్నెలన్

శారద రాత్రులందు గని ౘల్లని తల్లి! స్మరించి గొల్చెదన్

ధారగ కైతలల్లు మది స్థాపన చేసెడి శక్తినీయవే

వేరగు సంపదల్ మఱిక వేడనుగా నిను! వందనంబిదే.



[25/03, 21:47] Durga Madhuri Devi Nagini: 

ఆట‌‌ వెలఁది

అంచ యాన! వెనుఁక యస్ఖలితమునకు

చిహ్నమైన నెమలి చేరె! భళిగ

నీలవర్ణమందు నీరు యా పద్మంబు

శోభ గూర్చె నిండు! సుందరాక్ష.


మత్తకోకిల 


శ్వేత వర్ణమునాడు వస్త్రము వెల్గు నింపు మనస్సులో

గీత మేటిగ తీర్చి దిద్ది లిఖింౘుమా! రస‌ భారతీ

ఖ్యాతి యప్పుడు నుండు గాద! జగాన వందనమాలలే

ప్రీతి మీరగ నిన్ను గొల్చిన విద్యనీయుమ! పేర్మితో.


[25/03, 22:05] Durga Madhuri Devi Nagini: 

PadmaNabha Vrttamu 8 Ta Ganas 5.1 Yati

రాయంౘ యందంగ నీ వెంట చేరంగ ప్రార్థింౘు మా కాంక్షలన్ దీర్చు శ్రీవాణి!

సాయంబు జ్ఞానంబు మేధావిలోకాన చైతన్యమేనింప! నాకేమొ యాభక్తి

నీయమ్మ వేరైన వర్ణాలు నాతల్లి! నే మోయలేనంటి! నాభారమే చేటు

నీ యాలయంబందు స్తోత్రంబులే వ్రాయు నేర్పున్న ధన్యాత్మనౌ జన్మ నాదేను!


విశ్వావసు ఉగాది నాడు నా అంతరాత్మ మాధురీ ఇంగువ, పంపిన సింహ వాహిని చిత్ర పటానికి:


సాయుజ్యంబును గోరనేల! జననీ! సాన్నిధ్యమందించుమా

గేయంబుల్ పద పల్లవంబులను యో కేళీవిలాసంబుగా

యే యాటంకము లేక వ్రాయ వలనే! హృద్యంబుగా యీశ్వరీ!

యా యానందముకేది సాటి! గద బ్రహ్మాణీ! వరంబీయవే.


[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: మానస నేత్రము గంటిని

నేనీ పూజను! కపర్థినీ యది యే నీ

యానతి యని నమ్మితిగా

చీనాంబరి! వందనమిది చేకొనుమమ్మా.

[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: వత్సరముల గణనము నీ

వత్సలమగుమా మనసుకు స్వస్థత కొఱకే!

సత్సాంగత్యంబీ విధి

నుత్సాహముతో జరుపుట యో రీతి గదా.

[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: కన్నుల పండువ పూజలు

వెన్నుని సోదరి! గొని మము పేర్మిని గనవే

యన్నుల మిన్నగ గాౘవె

చిన్నారులమని! మనవిదె! చేమంతులతో.



మనూ అక్క FB Story image:


పచ్చందనమే మనసుకు

నచ్చగ యల్లితి పదములు నగజా ప్రణతుల్

హెచ్చుగ జూచెద నిటునే

విచ్చేయమ యీ యవనికి! పేర్మిని పంచన్.


Dr. Prakash Sir,

Vascular Surgeon's Clinic


Ammavaari Photo

1.

కలశముఁ జిందగ సిరులను

కలలను తీర్చెడి హరి సతి! కన్నుల నిన్నే

కలవా లేవా యనకనె

కలతను బాపెడి సురనుత! గంటిని సతమున్.

02.

కమలము కరముల నిలువగ

యమర పురాధిపుడు గొల్చు నమృత వల్లీ

సుమమలు సొబగులు తూగున!

మమతల నీ వదనమునకు మంగళ రూపా.

03.

హరి పత్నీ వందనములు

విరిబోణీ నీలవేణి! వీక్షించుమ యీ

ధరపై కష్టములెల్లను

నరులను గాపాడవేల నయముగ తల్లీ.

04.

తగునా రోగము వ్యాధులు

తగవులు బిగువులు దిగులును దాక్షిణ్యముతో

వగచక నీయక మమ్ముల!

నగవులనీవే సరసిజ నామము విడువన్.

05.

కర్మన పాపము చేయని

నిర్మాల్యము లేని మమ్ము నీ కన్నులతో

ధర్మము వైపుగ నడుపవ!

మర్మమమదియేమి తల్లి! మాతవు! ప్రణతుల్.

06.

అన్యమునెరుగక నీయని

పుణ్యమునీవీయకున్న పూరుషులకు యీ

దైన్యత తొలగుటదెట్లో

శూన్యము నిండున గద మరి! ౘూపవ దయనే.

07.

పూర్వపు ఫలముల పాపము

నుర్వినివాసులకొసగుట యుత్తమమేనా

సర్వము నీవని నమ్మిన

శర్వాణీ రక్ష! శరణు శరణము తల్లీ.

08.

భయమున వడలితి వలదే

నయమగుటకు శస్త్రము యని నమ్మిన నిన్నే

ప్రియముగ వేడితి గాదే

క్షయమును జేయవె క్షితుల సుజనులాశ్రితవై.

09.

వంకలదేలన గాచగ!

శంకల! మాపై కినుకయ! సవరింౘవ నీ

బింకము కరుణా రసమును

పంకజా నేత్ర! కురిపించు! ప్రార్థనలివియే.

10.

కడలిన నున్నటి నీ దరి

వడలిన మేమెట్లు చేరి వందనలిడి నీ

యడుగుల పట్టుట తల్లీ

విడబోకుమ మా కరమును! వేదన వలదే.

11.

విత్తమదేదైనను నీ

యుత్తమమౌ ౘూపుయున్న నున్నతమవదే

చిత్తము జీవుల తలపులు

దత్తము చేసిన కలుగును! ధర్మము యొకటే.

12.

బంగరమే యంతను మా

బెంగను దీర్చెడి జననికి వెలుగే కరుణై

పొంగగ బాసెను కలతలు

యంగనులందరికెపుడిక యానందములే.


13.

నీ నామమునే విడువక

మానసమందున మెలిగెడి మంచి వరమునే

ప్రాణాధికముగ‌ జూచుచు

మానవులకొసగుమ లక్ష్మి! మాధవుఁ పత్నీ.


14.


ౘాలును ౘాలును ౘాలును

బేలతనంబు గలిగించు వెతలిక ౘాలున్

లీలలు ౙూపుౘు చిటికెన

కేళియ వలె దీయుమమ్మ! కీడును తల్లీ.


15.

యుగములు కల్పములన్నియు

జగములు గూడను విరించి జనని! నీవే

యగునే పంతములేలన

ఖగ వాహుని పత్ని! రక్ష‌గా నిలుమమ్మా.


16.


నీరసమాయెను మనసున

నీ రస‌ధార కురిపించి నీడనొసగుమా

నీరజ నేత్రా శరణము

నేరములకు క్షమ ౘూపు! నిండు మనసుతో.


17.

ఏమని వేడెదనింకను

నీ మనసే కరుగకున్న నింగియు నేలన్

మేమిట్లు గొలిచినను నీ

స్వామికి చేరున! శశిముఖి! జయములనీవే.


18.





Tuesday, September 24, 2024

పద్య కౌముది

 తరువులు తరిగెను చెరువులు

కరువాయె బరువయె నదులు కడలులు ధాత్రీ

నరులను క్షమియింౘు మనవి!

వరమీయుమ రక్షణను! నివాసము నీవే

https://www.facebook.com/share/p/yVYLhuds66f3MVZX/?mibextid=oFDknk 




తల్లితండ్రి తోడ తనయుడు గూర్చున్న

చిత్రమిటుల గనగ చిత్తమందు

సంతసమ్ము గలిగె సౌభాగ్యమిదిగాద!

ధాత్రి వాసులకు ప్రధానమిదియె


https://www.facebook.com/share/p/Wocdm1xmkiH4ZjY4/?mibextid=oFDknk




అనంత సాహితీ వేదిక


వచన కవితల పోటీ 


అంశము: వర్షింౘని మేఘము


శీర్షిక: కలికి చిలుకమ్మ కన్నులు


హామీ పత్రము: స్వీర రచన, మా కార్పొరేట్ యాజమాన్యం నిబంధనలననుసరించి నా వివరాలను ఎక్కడా పెట్టకుండా, ఇలా అజ్ఞతంగా వ్రాస్తున్నాను. అనుమతింౘ మనవి.


కలం పేరు: నాగిని


పుట్టగానే‌ "ఆడపిల్లా" అన్న రోౙున

పసి పాపగ ౙాలువారిన గంగ పొంగే

ఎదుగుతున్న కొద్దీ ఏడుపు ఎగిరి పోయె

తాత్పర్యమేమన, తగ్గలేదు వేదనలు

పెద్దరికము బాల్యమందే ఆపాదింౘ బడెను

నవ్వ వీలు లేదు ఆటలాడవలదు

ౘదువు యొకటే సాధ్యమనుౘు

కళలనైన కలలోనైన కరముకందింౘక పోయే

మాదు కాలమందు మాట లేదు మనువే చేసిరే

మగువ బ్రతుకు మౌనరాజ్యమందె

ఇక్కట్లే ఎదురవనీ ఇడుములే మీద పడనీ

ఇలలో ఇల్లే ఇంతికి ఇచ్ఛగావలెననె

కొలువు కాసులన్ని యున్న కలిమి కాదు తనది

కొరివి వోలె కొరకొర ౘూచే కుటుంబమే తన గని

తోటి వాళ్ళు తొక్కెడి వాళ్ళు తక్కెడ తమ వైపుకు

తిప్పి తప్పు గాౘుకునే వాళ్ళు 

తగవు లాడు వారు తరతమాలెఱుఁగక

తల్లడిల్ల చేయు వారు తుదకు తెగించి

తనయలు తనయులనూ దూరము చేయు వారు

తాత్సారం చేయరు తరుణిని తన్ను దూకుడులోన

ఇన్ని ఇన్నిటికిన్నీ ఎగిరెగిరి పడినా ఏవగింౘక

పంటి బిగువు బాధ నుంౘు పడతి పరదాలు తొలగించి 

పడనీయదు భావాలు బయటకెపుడు

కడదాక కంటి వెనుక నిలిపి నీరు

గుండె బరువు గుట్టుగానే యుంచినపుడు

హృదయమందలి తేమకు ఏ ఆత్మీయత

వెౘ్చని స్పర్శ తగిలినా వెతలు కక్కదు

నొౘ్చుకున్న విషయమసలు చెప్పదు

నీలి కన్నుల మాటున దాగున్న మబ్బు తెరలు

రాలనీక ఒక ౘుక్క నిలుపునతివను "నిండుగ"



వాగ్దేవి కళా పీఠము, శంకరాభరణము

వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 

23.09.2024 సోమవారము 

అంశము: సబ్బు బిళ్ళ 

ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)


ప్రక్రియ: పద్యములు


//తేటగీతులు


మోక్షగుండము వారు సమూలముగను

ౘదివి సాంకేతికతను! ప్రజలకు మేలు

చేయు తలపున మొదలిడె జిడ్డు రాని

మురికి వొదిలింౘు సాధనమ్మును ఘనముగ


దేశ సరిహద్దు దాటుౘు దెలిసికొనె

వారి సహచరుండు మన గర్వము నిలుపు

విధముగ సవాలు పూరించె విద్యనంది

యటుల సబ్బు బిళ్ళయె పుట్టె నద్భుతముగ 

అని చెప్తూ హరికథలో, "ఆ రకముగా భారతావనికి చేరిన సబ్బు బిళ్ళ, ఎల్లలు లేక, పాత్రలకూ, రేవు లోనూ, ఇళ్ళల్లోనూ బట్టలకూ, దేహ శుభ్రతకూ ఉపయోగ పడుతూ ఎందఱికో ఉపాధినీ, దేశానికి ఆదాయమీయటమే కాక, దాని తయారీ కార్యకలాపాలకూ సాఫ్ట్వేర్ ను వాడుతూ మరింతగా దూసుకు పోతోంది", అని ముగించారు.


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము

24.09.2024 మంగళవారము 

అంశము: దత్తపది: నిండిక ముండిక శిండిక పిండిక

ఇరువంటి దుర్గా మాధురీ దేవి [నాగిని]

హైదరాబాద్.


ప్రక్రియ: కంద పద్యము

ఏమాయెను? (నిండి క)రుణ 

చా(ముండి క)నులు దెరువగ; జనులకు శుభమే

యా మాత వ(శుండిక) యే

కామాంధుడకైన (పిండి క)న్నులు; ద్రుంౘున్

(కామము అంటే ఎటువంటి కల్మషం తో కూడిన కోఱిక యైనా అని పెద్దల ఉవాచ)

వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 






26 September 2024 గురువారము 


సమస్య 4893


తేటగీతి


నాటి వేమన మొదలుగ నేటి వఱకు

పలువురు ఘనులు జీవిత పాఠములను

దెలిపె గనుక నూతనముగ కలము పట్టి

యల్లు వారలు మానగ నట్టి విధము

వెదకి జూచిన గాని యా విధము నూత్న

కవుల కవనమ్ములో నీతి గానరాదు


25.09.2024 బుధవారము 

అంశము: సమస్యా పూరణము 

ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 

నవ్వులు విరియని గృహమున

పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

మువ్వల సవ్వడి చేసెడి 

దివ్వెలగు వనితలు యున్న తీర్థమునందున్



భార్గవి కళా పీఠము విజయవాడ కేంద్రము


26.09.2024 గురువారము 


అంశము: చిత్ర‌ కవిత (తిరుపతి లడ్డూ)


ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)


ఇతరములేవియు లేవా

మతులకు ప్రాధాన్యత గల మంటలు గలవే

ప్రతి ఘటనలు వానిని మన

బ్రతుకుల నుండి దరుమరను ప్రశ్నలు గలవే


బదులుగ తెలిపెద వినుమా

యుదరము గైకొను సమస్త యుత్పత్తులనే

ముదముగ నర్పణ చేసిన

కదలు తరంగములు నిౙము! కష్టము రాదే


భారత వచనము విడౘుౘు

ధారగ నితరుల పలుకులు తప్పక నమ్మే

వారలకేమని చెప్పుట!

ప్రేరణ నికనైనను గొని వేదము వినుమా


కనులకు నగుపింౘనిచో

నగుబాటు వలదు! మనమున నమ్మిన గలుగున్

చిగురులు జ్ఞానమునదియే

సెగలేలన నీ పరిధి నిశీధి! యెదుగుమా




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


27.09.2024 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇరూవంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)


(బు)ల్లి పాపాయి పలుకులు ముద్దులొలుకు

కల్ల కపటము లెఱుగరు! గ(డు)సు తనము

యూహ కందదు! (మే)టిగ స్నేహ గుణము

ౘూపుౘుందు(రు)! నవ్వులు శోభ చిలుకు


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


21.10.2024 సోమవారము 


అంశము: వర్ణన - విద్యుత్తు 


ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)


హైదరాబాద్ 


ప్రక్రియ: తేటగీతి మాలిక


ౘదువు రాదు బాలునకని సాగనంపి

పత్రమంద చేసిన ఘన పాఠశాల

తలను వంౘునట్లు తనదు చేతల నందు

పట్టుదలను ౘూపుౘు బాలుడైన

సుతుని మేధావిగా నిల్పి జ్యోతి నింపె

నేడు విశ్వమంతటికిని ఱేడు యతడు

యెడిసనుడు నాన్సికి జయము నిచ్చె! ఘనుడు



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


22.10.2024 మంగళవారము 


అంశము: దత్తపది 


ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)


హైదరాబాద్ 


ప్రక్రియ: కంద పద్యము 


పాణిన పట్టెను వీణను 

వాణి! సరస్వతి! విరించి పత్ని శిరమ్మున్

వేణియ నీలపు వర్ణము!

రాణింౘును మది జననిని ప్రార్థించినచో


గురువులు పెద్దలు దోషములున్న మన్నించి తెలుప మనవి 



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


04.11.2024 సోమవారము


అంశము: వర్ణన (కార్తిక సోమవారము)


ఇటువంటి నాగ దుర్గ మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


మా తల్లి యుమా సహితము

భూతలమున జీవుల గన! ముగ్ధయు హరుడున్

శీతలమగు శిఖరము విడి

యేతెంచెడి వారము యిది! హితమును గూర్చన్




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


05.04.2024 మంగళవారము 


అంశము: దత్తపది 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(ముద్దు)లొలుకు బాలలతో

(ప్రొద్దు) సుళువుగా ౙరుగును మువ్వల సడితో

(బొద్దుగ) పెంౘుట మోదము

మొద్దుగ నుంౘ వలదు గద మోహము తోడన్



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


బుధవారము 06.04.2024


అంశము: సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)


హైదరాబాద్ 


కలికాలపు మాయ జనుల!

చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

కలమును పట్టిన కవి మది

తలపులనందున! హతవిథి! తగునా హయ్యో


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


07.11.2024 గురువారము


అంశము: చిత్ర కవిత


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)

హైదరాబాద్ 


అమ్మ వారి ముందఱాడు వారు మదిని

భక్తి నిండి యుండు! వత్సరముల

పాటు వీడరసలు పోటు! కళను పట్టు

పోతురాౙు లండి! పుణ్యధనులు




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


08.11.2024 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి కార్తికము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(కా)మిత ఫలముల నొసగే

భామిని కామాక్షి యా(ర్తి) బాపుౘు పథమున్

స్వామిని చేర్చుచు మన (క)ల

ప్రేమగ దీర్చుచు (ము)దమును పెంౘును ధర పై



[12/11, 19:29] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


11.11.2024 సోమవారము 


అంశము: వర్ణన 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి నాగిని హైదరాబాద్ 


కార్తిక మాసము దీపము

మూర్తిగ నిలువని శివునకు మోదము గాదే

కీర్తియు కామ్యములన్నియు

పూర్తిగ దీరిన పిదపన మోక్షము గలుగున్

[12/11, 19:44] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


12.11.2024 మంగళవారము: దత్తపది


అదుపు కదుపు పదుపు మదుపు



ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(అదుపు) లేని పలుకు హాని కలుగ చేయు

(కదుపు) లేని బ్రతుకు కలదె? ధరణి?

(పదుపు) ముందు యింటి పరువు దీయ వలదు

(మదుపు) మేలు గూర్చు! మనకు భువిని



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


బుధవారము 13.11.2024


సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్


లోక వాక్కు యిది సతిని రొష్టు పెట్టి

కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకు మేలు

యత్త‌మామల నారళ్ళు నతిగ పెట్టి

దెయ్యమై యాడు కోడలు తీపి నేడు!



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


14.11.2024 గురువారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్


పూతరేకు రూపు పోలు పలు విధముల

వంట లెన్నొ నేడు పండుౘుండె

జనుల నోళ్ళనందు గనగ దాని రుచియు

మాత్రమందలేవు సూత్రమైన!


పిన్నపెద్దలంట వేనోళ్ళ మెౘ్చు యీ

ధవళ వర్ణమునకు తగిన రీతి

నిరుపమానమగు గనిగ వెల్గు రేకుకు

సమము లేదు సుమ్మి! శైలి వేరు


ధాత్రి ఫలము గూర్చి:

నేటి తరము యువత నేర్చెనా పూజలే

ధాత్రి విలువ వినిన తలవగలర!

చెప్ప లేను యుసిరి చేయు మేలును నేను!

ధన్యవాదమొకటె! తలపునందు



అద్దము దద్దము నద్దము బద్దము


అద్దము ౘూపెడి ముఖముకు

బద్దులుగా మగువలున్న పనులే యగునా

నద్దము నకారమవ్వగ

దద్దము నెక్కుట సుళువిక! ధ్యాస కుదిరితే 


🟣🟧🟪🟦🟥🟩🟣

*కవి మిత్రులకు కవితావందనములు 🙏*


రేపు బుధవారము - *సమస్యాపూరణము*

--------------

నా పూరణ

పురమలనేలెడి ఘనుడౌ

*తిరుమల రాయనికి లేవు తిండియు, సుఖముల్ !*

కరి వరదుడగు హరి పిలుపు

దరి చేరక యున్న! యమృత ధారయు విషమే

--------------

*- అడ్మిన్*

🟣🟧🟪🟦🟥🟩🟣

తల్లి తండ్రి గురువు తరువు సమాజము

మెట్లు గాగ నెదుగునిట్లు నరుడు

నొంటరైన వేళ కంట రాలును నీరు!

గనుక త్యాగములను గనవలయును





అనంత సాహితీ వేదిక


పద / వాక్య నిర్మాణం 


04.12.2024


అంశము: పరాజిత


ఇరువంటి నాగ దుర్గాంజనా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ కవిత నా స్వీయ సృజన 


ఆట వెలఁది


1.

అవుఁను విధి విలాసమామె పరాజిత

కలి యుగమ్ము కదియె గెలుపు గాద!

వేల యేండ్ల చరిత వెలవెల బోయేట్లు

భరత మాత నేడు పాట్ల‌ మునిగె


2.

సాంస్కృతికము మ్రింగి సామ్రాజ్యములు పన్ని

కుట్ర మనల చెరిచె! గుణములందు

పౌరుషమును లేక ప్రజ్ఞయు గోల్పోయి

దేశవాళి జనులు నాశమయ్యె


3.


నపుడు భరత మాత యన్యాయమైపోయె

జయము లేక పరుల భయము చేత

చెరను మునిగి కార్చె శరధి సమము నీరు

బాధ్యతంటు లేని ప్రజల వల్ల


4.


తల్లి విలువనెఱుఁగు తర్ఫీదుయే‌ లేక

కాౘవలయు నన్న కలయు రాదు

గనుఁక మఱి పరాజితను యని మన తల్లి

కలత పడెను కలలు కరిగి పోయె


5.


సంస్కృతి విడి భాష‌ సహితము వదలి యే

పూర్వ గాథ గనక పుష్టి లేక

ధాన్యమందు విద్య ధైర్యము వైద్యము

వంటి సిరులు పోయి పడెను జాతి


6.

గెలుపు సులువు యగును తలౘుకున్న మనము

ఒకఱికొకఱు నిలచి యోర్మి తోడ

తెరలు తీసి

 నడచి తిమిరమ్ము దరిమిన

భరత మాత వెలుగు పసిడి వలెను






వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


09.12.2024 సోమవారము 


అంశము: వర్ణన (బృందావనము)


ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


బృందమన్న యెవఱు? వేణువూదెడి వాని

చెంత నుండు బుధులు! చేరి దరిని

పాట యాట ౘూపు వనము! కృష్ణయ్యకు

యేమి చెప్ప గలను! యిట్టి కథను.


రాధ తులసి గంగ లక్ష్మి వాణియు గోవు

కలసి యుండు స్థలము కలిమి తప్ప

కలతలెఱుంగనట్టి ఫలవంతము తోడు

కృష్ణుడౘట నిలచి కీర్తి పెంౘు





తెలుగు దళము సమూహము 


08.12.2024 సోమవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


హరుని మోయు నంది హస్తమందున చేరె

ౘూడ వింత గాని శోభ గాదె!

తాపసి మది పంచె తరగని పేర్మినే

జగతి తండ్రి యతడు! శంకరుండు




PIOUS POETRY WRITING 


Challenge 144: 12/09/2024


Topic: Childhood Memories 


Telugu


ఒక్క మాటలోన ౘక్కగ‌ చెప్పుట

సాధ్యమవదు గాక శైశవమ్ము

దూరదర్శినందు దూరక వింటిమి

వాణినందు యన్ని పలుకులెపుడు


వాహనములు మాదు దేహములే ఎంత

దూరమైన తరలి తీరమంది

పనులు చేయు నేర్పు పట్టెనే తీరుగన్

ౘదువు యాట పాట యెదను నింపె


చిన్నవైన యిండ్లు చెరగవే మమతలే

ౘుట్టు జనము చేయు బెట్టు లేని

సాయమెపుడు లక్ష సమము గాదుగ! మింౘు

వెలుగు మనకు పంౘు కలిమి చెలిమి




పద వాక్య నిర్మాణం 


15.12.2024 సోమవారము 


అంశము: మనసుకు ఱెక్కలు వస్తే


ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఱెక్కలున్న మనసు రివ్వున ఎగురదే

నిలచి యున్న ౘోట! యలసటంత

సేద తీర్చుకొనుౘు చేవ పెంౘుకొనును!

నపుడు తలచి భవిత యడుగు వేయు!

బాల్యమునకు వెళ్ళి బంగారు రోౙులన్

మఱల ౘూచి మురిసి కరగి పోవు

భావి బ్రతుకు గూర్చి పట్టకుండ తనదు

జన్మ బాధ్యతనుౘు జనుల సాకి

నగలు సిరుల వైపు నడువక నవ్వుౘు

రోత జీవితమున రోదనలన

మునిగి యేడ్చు వారి పుట్టి తేలు విధము

తోడు అండనగుౘు యాడుకొనెద

అంతరిక్షమందు యాగిన యాతల్లి

భుజము పట్టి దెచ్చి పుడమి పైకి

విజయమంది మనదు వీరత్వమును వాని

ముందు ౘూపెదను సుమోదముగను




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


10.12.2024 మంగళవారము 


అంశము: దత్తపది (పాలు పెరుగు వెన్న నెయ్యి)


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(పాలు) కాగబెట్టి బాబుకు పట్టంగ

(పెరుగు) వైచి దాచిపెట్టి నేను

(వెన్న) చేసినాను విష్ణు పత్నిని దల్చి

(నెయ్యి) రుచిగ వచ్చి నిలిచె సిరులు




తెలుగు దళము సమూహము కొఱకు


11.12.2024 బుధవారము 


అంశము: దత్తపది: అన్యాయము అధర్మము అక్రమము అనాగరికము


గళమెత్తను యధర్మమమును గుర్తించిన

యెదిరింౘగలేను నేను అన్యాయమునైన

అక్రమంబు ౙరిగిన గగళమెత్తి అరువను

అనాగరికమంటు ఆపబోను

అచ్యుత! మలినము సంతసంబు

యేదైనను అంటని వాడా నీవే ఆదర్శమని

తండ్రివి తల్లివి దైవము గురువువు

నీవే నీవే అంటూ నిలచెద

ఏమైనను కానీ రక్షవు నీవే లక్ష్యము నీవే

అని అన్ని విన్నపంబులు మనవి చేసెద

ఆపై నిశ్చింతగ నిదుఱించెద అబ్జ నేత్ర!

యోగక్షేమమలున్నీ యొసగెడి వాడా!

యాగము నీ స్మరణే యాదవ భూషణ!





వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


11.12.2024 బుధవారము 


అంశము: సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 



ఎంచినట్టి ఛందమునకు యెక్కువగుౘు

లెక్క తప్పింౘు విధముగ ౘక్కదనము

పాడు చేసెడి యధికమౌ పలుకు గల్గు

*గణము లేకుండ పద్యము ఘనత గాంచె*



తల్లి చెప్పక నీతులు తనయకిపుఁడు

*బొట్టు లేనట్టిదే యిల ముత్తయిదువ*

యనుౘు యూరడింౘును గోరదల్లుడి సిరి

యేమి చెప్పవలయు నేటి హీన గతిని




అనంత సాహితీ వేదిక 


11.12.2024


అంశము: అంతా కల్తీమయం


పుట్టే మనిషికి మూలం మట్టే

ఆ మట్టే కల్తీమయమై పోయే

ఇక వోట్లను అమ్ముకునే ఓటరునో

మాటకు నిలబడని నాయకుడినో

ఏమడగాలీ ఎందుకనాలీ 

మౌనము కాదూ నేర్వటం మన దారీ

ఖనిజాలన్నీ కలుపుకు పోతూ

పారే దారిని పావనమొనర్చు నదీమతల్లి 

నీరును పోసిన వాడైనా నిప్పులు పెట్టే వాడైనా

అందఱినీ సమము ౘూసే‌ వృక్షరాజమూ

సుబుద్ధులు దుష్టులు ఎవ్వఱికైనా

జీవము నిలిపే వాయువు అయినా

"మనసులు పవిత్రం కనుకనే మనకు లభ్యం"

అవి ౘూసి తెలుసుకుందాం కల్తీ లేనీ సృష్టి ఉన్నదని



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


12.12.24 గురువారము


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


పరికరమును ౘూచుచు తల్లి వదలబోదు

శిశువు బాగు యిది గనగ చిత్రమేను!

నిౙమునందు లేము యిటుల నెలతలమును

ఇల్లు ఆఫీసుతో‌ శక్తి యిగిరి పోవు.


సెల్లు లేకున్ననూ యుండె సొల్లు నాడు

దాని కన్న బిల్లులు గట్ర తరుణిలిట్లు

చేయుౘుందురు ఫలితము చిల్లరంత

మిగిలె యాటోకు పోనీక! మేలు గాద!


ౘంటి వారిని భుజమున పంటి బిగువు

బరువు యనక వరుస నందు పట్టి నిల్చి

చేయు శ్రమయు పనులకు చింత వదిలె

కరము నందు‌ మేలే పరికరము! నిౙము.


ఉబుసు పోని కబుర్లు కన్న గుబులు దీయు

జ్ఞాన నిధియె మిన్న! యటులె సాయమగును

ఫోను! మ్రోగిన విడుౘును పోని ప్రక్క

యిండ్ల నుండి వచ్చినవారు! యింతులెల్ల.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


13.12.2024 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి: కా-పు-ర-ము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(కా)ల మహిమ నెఱుఁగ కలికి యైనను గాదు

పుణ్యఫల(ము)లున్న మోక్షపథము

(ర)యమునందబోదు! లక్ష్యంబు మౌనంబెౠ

తల(పు)నందు యున్న దక్కు సిరులు.




తెలుగు దళము సమూహము కొఱకు 


16.01.2024 సోమవారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


సాటి నరుని నమ్మి సాయమ్ము గొనలేక

రైతు తనువు వదిలె! శ్రమను చేసి!

మాదు జాతి కాని మనుజుల నమ్మి యీ

జంతుజాలమిపుఁడు చింత పడెనె!


పశువు పక్షి చెట్టు పట్ల నిర్లక్ష్యమే

యుసురు తీసె నేడు! నుర్వినందు

నరుల జాతి యంత నాశమౌ రీతినన్!

కనులు దెరువకున్న! కరుగు కాంతి.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


16.11.2024 సోమవారము 


అంశము: వర్ణన - చింతకాయ


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


చింతలన్ని రాలు చెంత మాధవుడున్న!

కాయమందు ప్రీతి కరగి పోవు!

పుడమి నందు రుౘుల పులుపు కమ్మగ నుండు!

పథ్యమందు నుండు పౘ్చడి యిది.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


17.11.2024 మంగళవారము 


అంశము: దత్తపది 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


శంఖము ధ్వని సుందరమే

పుంఖములెగురు బహు వేగముగ గగనమ్మున్

వింఖపు సవ్వడి చిత్రము

కంఖము నశియింౘును హరి కరుణను గొనినన్.





అనంత సాహితీ వేదిక 


18.12.2024 బుధవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్


అంశము: ఱేపటి కోసము


చెట్లు నీరు భూమి సేవ చేసిన ౘాలు

ముందుతరములన్ని మునగకుండ

సాగునట్లు గాక క్షామము పేర్చిన

యేమి చేయగలము! లేమి మిగులు.


నేడు విలసమంటు పాడు చేసిన ఱేపు

తరగి పోవు నిధులు ధరణి పైన!

వ్యక్తికైన గాని యవని నంతయునైన

సూత్రమిదియె వేరు మాత్ర లేదు.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


19.12.2024 గురువారము


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


అస్ఖలితము మనసు యంటవు హరికి యే

భావ మాలికలు! సువాసనలును!

నీటనున్న గాని నెలతల నెల్ల తా

ౘూడనట్లె! మనసు యాడనట్లె!



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


20.12.2024 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇరువంటి నాగ దుర్గాంజనా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(తి)రుమల రాయడు జనులా

నిరతము వి(ప్పా)రిన మన నేత్రపు ద్వయమున్

మురియుౘు నింపిన ౘాలును

ధర (వై)కుంఠమె యగనిక! తరుగవు సిరులున్




అనంత సాహితీ వేదిక 


20.12.2024 శుక్రవారము 


అంశము: నిశ్శబ్దము


మాట లోన కాదు మౌనము మనసున

యున్న మేలు గలుగునున్నతముగ

నిశియు నందు వెల్గు నిశ్శబ్బమేనయా

ప్రగతి మేలు వంటి ఫలితమందు




తెలుగు దళము సమూహము కొఱకు 


21.12.2024 శనివారము


అంశము: స్వీయరచనము


గుణమున నిజాయితీనే

గణమును సేయని నరులిల కపటులు గాదే

కణకణ మండే నిప్పుయు

వణికింౘదిట్లు! విపత్తు పడినట్లేగా.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


కవితల పోటీకు:


అంశము: గీతామృతము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ (హామీ: స్వీయ సృజన)


మృతమెఱుఁగనిదండి! మేదిని పైనన్

జీవులందఱకును చేయు మేలు!

కళ్ళెము పడనిదగు కళ్యాణియౌ మది

స్థిరముగ నిలిపి తను తృష్ణను దీర్చు.


ముఖ్యమైన పాఠములు మూడు చెప్పెద

కర్త మనము కాదు కార్యములకు

ధర్మమునకు కీడు ద్రప్పింౘ వలయు

గాని వంటరియయి కాదు! నెపుడు!


కరములెల్ల కలిపి కైమోడ్చి దేవుని 

చెంత విడువవలయు! చింతలన్ని!

యపుడె చక్రమందు యలుపెఱుగక చేయు

పయనమాగి ముక్తి పథము దొఱకు.


అస్ఖలితుడతండు! అంటబోవు వెతలు

సుఖములైన! ప్రతిది చోద్యమనక

కర్మ ఫలము బట్టి కార్యముల్ ౙరిపింౘు

మౌన యోగి! యుండు ధ్యానమందె.


సకల జీవులందు సాక్షిగా నిలచినన్

చేతికంటబోవు! చిక్కులేవి!

మనకు నుండవలయు మరువని యా స్పృహ

దైవముండుననుౘు తనువు నందు.


విశ్వమైన యతడె! నిశ్వాసమందైన

వెన్నుడే కలడుగ! మిన్ను దాటి

నిండు వాడు గూడ నీరజాక్షుడు గాన

నీదు కర్మ ఫలము నిర్ణయింౘు.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


23.12.2024 సోమవారము 


అంశము: పంచభూతముల వర్ణన


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


నీరు తనవులోని నెత్తురై పాఱునే

నిప్పు యుదరమందు ముప్పు దీయు

నింగి నిండి యుండె నిశ్చల దేహమున్

గాలి నిలుపునుసురు! మేలు చేకూర్చునే.

పుడమి యెముకలవగ నడచి యాడు తనువు

యిన్ని విధములండ దన్ను నిలచి

జీవనమును నడిపి సేవ చేయుౘు సర్వ

ప్రాణి గాౘు శక్తి! రక్షమనకు.



అనంత సాహితీ వేదిక కొఱకు


23.12.2024 చిత్ర కవిత


వసుధను ధరియింౘు వాసుకి యందును

దైవమగు హరి చేత తగు విధంబు

నూరట గన! రైతు యునికియె నెఱుఁగని

నరులు మసలు జగతి నరకమండి!


కావడినియు పట్టి కరమున! దిరుగును

చెరవు నీరు నింపి కరవు దీర్చ

మోము చెరగదండి మురిపింౘు చిరునవ్వు 

మెౘ్చుకొనరె జనుల! హెౘ్చుగాను.



అనంత సాహితీ వేదిక కొఱకు 


23.12.2024 సోమవారము 


అంశము: నవ్వితే ఏం పోయింది!


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)


నవ్విన జనుల పైననే రువ్వి రాళ్ళు 

వేడుకగ ౘూౘుౘుండును విశ్వమంత!

చిత్తమున శుద్ధి గలిగిన చింత లేక

పెదవులను విడి వడిచిన ముదమునదియె!

కష్టములు రాని! కడగండ్లు కలతలెన్ని

కాటు వైచిన రానీక కలవరంబు!

హృదిన తృప్తిని నింపి సహేతుకముగ

పాటు పడిన విజయములు వరుస‌కట్టు

యైనను మిడిసి పడక! సహాయము సాటి

వారికొసగిన నందును స్వస్థత గద!

కుశలతకును మఱియొక కోశము యిది

ముఖపు కండరములను మూయకుండ

విచ్చి యుంచిన తోటలో విరుల వోలె

మదికి తనువుకు దొఱకును మంచి ఫలము



శంకరాభరణము


23.12.2024 సోమవారము


సమస్య - 4981


శివుఁడు శక్తి తనకు చెంతనున్నట్లుగా

భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు

జ్ఞాన కాంతి నీడ ధ్యానము చేయుౘు

తుదకు ముక్తినొందు గనుక! వెదుకకుండ.


గురువులు, పెద్దలు ఇందు దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన.



తెలుగు దళము సమూహము కొఱకు 


23.12.2024 సోమవారము 


అంశము: చిత్ర కవిత 


కలలు ప్రతిఫలించె కన్నుల ముందఱ

దర్పణముయె ౘూపె దారి మదికి

ఎదుగుటకు వలసిన ౘదువు గణములన్ని

నేర్వవలయుననుౘు నింపు తలపు.



పద్య లహరి, 23.12.2024


వ్రాయలేని దాన! వాగ్దేవి! నా వెంట

నుండి పలుకులందు నున్నతముగ

యల్లునట్లు కృపను యనునిత్యమూ యిమ్మ!

ప్రణతి తోడ మనవి! వాణి! అంబ!



పద్య కౌముది, 23.12.2024


దయగల వాఁడు మారుతి ప్రతాపమునందున గణ్యుడాతడే

రయమున చెంత చేరి మన రక్షణ చేయును! శక్తిమంతుడై

స్వయముగ యండనుండి తను పంౘును పేర్మిని ప్రీతి మీరగన్

భయమను జాడ్యముండదుగ భక్తిగ తండ్రిని గొల్చి నిల్చినన్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


24.12.24 మంగళవారము 


అంశము: దత్తపది - నరులు కురులు విరులు మరులు


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


విశ్వమాత (కురులు) ప్రియమార గాంచినన్

(మరుల) పైన వీడి మమత! మాయ

పొరలు కరగి (నరులు) మరలు నిర్వృతి వైపు!

జడన (విరులు) యన్న జనుల భక్తి!




పద్య తరంగిణి సమూహము కొఱకు 




24.12.2024 మంగళవారము 




అంశము: చిత్ర కవిత 




ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 




గెలుపుకు నవకాశమ్ములు


సులువుగ దొఱకున! వెనుకన ౘూడుము నరుడా


పలు విధముల యుండును గద


మలుపులు! కనుకను స్వశక్తి మంచిది యెపుడున్.








శంకరాభరణము




సమస్య - 4982




25/12/2024 బుధవారము




పట్టుదలతో నిలువవలె


గట్టిగ బ్రతుకున సమస్య గల్గెననుౘు యే


ఘట్టము నందైన నేడ్చుచు


*చుట్టఱికంబున్న యెడకుఁ జొరరాదు సుమీ*.




వట్టిది! శ్రేయమందుటయు బంధువులున్న గృహంబు నందు యే


గిట్టని మాటలన్ని మన కీర్తి కిరీటము దూరి మ్రింగునో


*చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ*


పుట్టన యున్న జీవముల సమమ్ము ప్రమాదమే సదా.






అనంత సాహితీ వేదిక కొఱకు 




పద వాక్య కవిత్వ పోటీకి:




25.12.2024 బుధవారము 




అంశము: సమాజంపై సినిమా పిచ్చి




ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ (స్వీయ సృజన)




ఇతర కళలు మనకు నెగిరి మిగిలె నేడు


వారి దాహములను ప్రజలు దీర్చు


విధము నాడు వారు వేరు దేశములందు


తిరిగి చేయు సినిమ! సిరుల నిధిగ.




నటుల కల్పతరువు! నరులకు మాత్రము


మృత్యు సమము హద్దు మీరు


తప్పు ప్రేక్షకులకు దారి కాదు! నిజము


మనము మారవలయు ఘనము నదియె.




పుస్తకములు వదిలి మస్తకమందున


వీని నింపుటెపుఁడు హాని చేయు


వారి మించి కళను పండింౘు కారులే


పెక్కు గలరు మనకు పెన్నిధిగను.




అట్లు కాదు యనుౘు యప్పనముగ వెళ్ళి


హాలునందునున్న హాని తుదకు


మంచి మాట వినుమ! మనుజులారా సదా


కళలు వదలవలదు కలత వద్దు.








వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 




25.12.2024 బుధవారము 




అంశము: సమస్యా పూరణము




ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 




జనమే గింౙలు మెంతులు


ధనియాలను ౙల్ల మొలిచె దానిమ్మలిలన్


ఘనముగ ఫలములనిచ్చెను


మనసున నాటరె తలపులు! మంచిని పెంౘన్.




తెలుగు దళము సమూహము కొఱకు 




25.12.2024 బుధవారము




అంశము: మార్ఖదర్శి, అజాతశత్రువు, మృదుభాషి, భాషా ప్రవీణ, భారతనేత గా మనందఱి హృదయాంతరాళల్లో చిరంజీవి అయిన శ్రీ శ్రీ శ్రీ వాజపేయి గారు






వాసమైన ఖలద! స్వంతమై మీకయా


దేశ ప్రజల హృదిన తిరుగు లేని


నేతగా నిరతము నిలచిన ఘనులుగా


చరితకెక్కినారు భరత వీర!




అణుపరీక్షలైన అలుపులేక నడిపి


శాంతి దూత యగుౘు జగతి కాచి


శాస్త్ర వృద్ధి కొఱకు సాగు నడక తోడ


దేశ ప్రగతి నిలిపి ధీరులయిరి.




సైనికుల చెలిమి సతతంబు మీ వంతు


దేశ భద్రతకు ప్రదీప్తి

 మీరు!


యువత భవిత ఘనము యుత్సాహమందెనే


మీ సుపాలనందు! మిక్కిలిగను.




విశ్వవేదికనను ప్రియముగ మనభాష


నందు పలికినారు నద్భుతముగ


మీదు కవితలన్ని మృదు మధురము కవీ!


ప్రణతులివియె మీకు! భక్తి మీర.



 వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


26.12.2024 బుధవారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ద్వైదీ భావము భళిభళి

లేదనుకున్నది కనపడు లెక్కలు యివిలే

వాదన చేసెడి జనులకు

మోదము కూరు విధము మనము మురిపించితిమే.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


27.12.2024 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్.


(గా)రె బూరె వండి కనుమ రోౙున తిన్న

మేలు ౙరుగున(ను)ౘు మెలగవలయు

నపుడె కలు(గు) సిరులు ఆంధ్రులా! సంక్రాంతి

యెగుర వేయవ(ల)యు నిలను పటము.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


28.12.2024 శనివారము 


అంశము: ఐచ్ఛికము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ప్రతికూలతలే గాంౘక

నతిగా ఆలోచన మది యందఱి కొఱకై

హితమును కోఱు విధమ్ముగ

స్థితప్రజ్ఞులై యున్న మేలు చేకూరునిలన్.



విమల సాహితీ వేదిక కొఱకు 


29వ చిత్ర కవిత 


30.12.2024 సోమవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఏమని వ్రాసెద కలమా!

నా మది భావములు సులువ! నయనపు నగవుల్

యీ మహి సేమము యొకటే

నీమము యని దెలుపుౘుంటి నిర్ణీతముగన్.


అనంత సాహితీ వేదిక కొఱకు 


30.12.2024 సోమవారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


నేనే నాకగుపించెద

నా నింగీ నేలనందు నాంతర్యములే

వానా వర్ణములన్నీ

మైనపు ముద్దలగు మావి! మహిలో నెపుఁడున్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


30.12.2024 సోమవారము 


అంశము: వర్ణన (గడియారము)


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


భూమికి సమముగ దిరుగుౘు

నీ మనుజుల కొఱకు దెల్పునే‌‌ సమయమునే

యేమరపాటే యుండదు

యేమా శ్రమ‌! భళి! యని హృదయముననరే.



శంకరాభరణము


సమస్య - 4988


31.12.2024 మంగళవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)


దమనము లేకుండెనుగి

యమలోకము శాంతి సుఖములంది రహించెన్

సుమమాలలె గట్టి సదా

నమములు పలుకుౘు మసలిన నరకము సుఖమే.



సమస్య - 4986


భ్రాంతిని దాటిన వాడును

చింతయు సంతసములేవి చేయక మదిలో

శాంతము గైకొని, "మోక్షపు

కాంతా రమ్మనెను", యోగి కైవల్య ర,తిన్.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


31.12.2024 మంగళవారము 


అంశము: దత్తపది 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)


(కరము)న కదిలిన కలమే

(వరము)గ పలుకునట వాణి భక్తుల కొఱకై

(స్థిరము)గ తలపులు యున్నా

(భరణము)లవియే యగునట! భ్రాంతులు కరుగున్.





వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


02.01.2025 గురువారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


అర్పణమవ్వగ నీకే

దర్పణమందున సహితము దర్శనమాయెన్

తీర్పవె లీనమగు దలపు

నేర్పుగ గోవింద! వరము నీ సన్నిధియే.


బింబమునందున నీవే

యంబ సహోదర! మురారి యందగ దరి యే

యంబుజ నాభా! గలిగెడి

డంబము ద్రుంచవె హరి! గరుడా రూడ! దయన్.


గురువులు, పెద్దలు - ఇందు దోషమున్న మన్నించి తెలుప మనవి.



శంకరాభరణము 

పశ్చిమాద్రి వనిత తన వదనమందు

కుంకుమను ప్రీతి మీరగ కూర్చగానె

*సూర్య బింబమ్ము శోభించె సుదతి నుదుట*

నదియు గాంచి మారె నిౘటి యతివ! భళిగ.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


03.01.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇ. నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)


హైదరాబాద్ 


*వం* క లేని మనిషి వసుధనందు గలడె?

*శం* క కలుగనట్టి ౘదువె దెలుపు

పంకజాక్షి కథలు భక్తి *రా* జేయుౘున్

*ఖా* ను వాడలేను కవనమందు.



శంకరాభరణము 


03.05.2024 శుక్రవారము 


సమస్య - 4991


పామర జనుల పలుకులివి

*రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్*

చీమలు దూరవు యడవిన

సోముడమాసన గగనము ౘూడగలమనిన్


గురువులు పెద్దలు ఇందు దోషములున్న మన్నించి తెలుప మనవి


తెలుగు దళము సమూహము కొఱకు 


04.01.2024 శనివారము 


అంశము: ఐచ్ఛికము


నల్లని కబరీ బంధము

యల్లుటకై ౘూచి కరము లందక జననీ

మెల్లగ నటులే నిలౘుౘు

మల్లెల మాలలు దురిమితి! మక్కువ మీరన్.


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


04.01.2025 శనివారము 


అంశము: ఐచ్ఛికము


కాంచన వర్ణపు శోభను

మించిన నగవుల వదనము మీదే హనుఁమా!

ముంచెడి నౌకను విడి నీ

పంచన చేరిన మము గను బంధువు నీవే.


వాగ్దేవి కడాపీఠము విజయవాడ కేంద్రము


07.01.2025 మంగళవారము 


అంశము: దత్తపది


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఆ(శ నగల) పైన అతివకు సబబులే

(మినప) వడలు బలము! మేలు గూర్చు

హ్రస్వమతడు పాపమా(కంది)న తినును

పెసలు పుండుయున్న పెట్టవలదు.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


08.01.2025 గురువారము


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఆర్టిఫిషియలీ చిత్రము

హార్టు ఫులుగ గీచినారు యంబుధి రవినే

హార్టువలెనలల తోడను

స్మార్టుగ ౘుట్టిన విధంబు! ౘప్పట్లివియే.


గుప్పెడు గుండెకు సమమే

యుప్పెన నందున నిలచెడి యో అలనైనన్

నిప్పుల కణికౌ భానుని

ౘప్పున ౘుట్టెను కిరణము సాగెను యైనన్.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


10.01.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్.


లీల(లు) తెర్పగ తరమే

శ్రీ లలి(త)! జనులకు నీవు చేసెడి మాయల్

తేలవు (రా)జ్ఞీ! దయతో

పాలింపుమ! నీదు (అం)డ వరమే మాకున్.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


10.01.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్.


(అం)తు లేదు నరుల యాశలకు ధరపై

(త)ప్పు లెన్ను జనులు తమవెఱుఁగరు

(రా)లు పూలూ గూడ రాబడి దారులే

వే(లు) లక్షలగును! వినుము నరుడ.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


13.01.2025 సోమవారము 


అంశము: వర్ణన (భోగి పండుగ)


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్


సంక్రమణకు ముందు జగతి చేరు వరుస

నిప్పు రవ్వ చలిని కప్పి గాచు

పండ్లు పూలు పోసి పసి బాలలకు నింట

కొలువ దీరు బొమ్మ కొలువవలెను.





వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


14.01.2025 మంగళవారము 


అంశము: దత్తపది 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి‌ (నాగిని) హైదరాబాద్ 


తరుణులెల్ల కొలుౘు (తల్లి) దుర్గమ్మ యామె

నాథుడతడు (తండ్రి) నడుపు జగతి

గొడుగు వలెను కాౘు (కొడుకు)లనటులెను

(కూతురు)కును మేలు కూర్చునండి.


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


15.01.2024 బుధవారము 


అంశము: సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


తెగి పడంగ నింగి దిగి దారము లేని

*గాలి పటముఁౙూడ ౙాలి గొలుపు*

మనిషికైన నటులె మనుగడ తిమిరమే

చెంత స్వంత వారు చేరకున్న



అనంత సాహితీ వేదిక కొఱకు 


15.01.2025 బుధవారము 


అంశము: జీవితం ఓ ప్రయాణం


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ప్రతి దినమును యొక యాత్రే

యితిహాసమ్మే ప్రయాణమే ధాత్రిన యే

స్థితి యైనను విధి వ్రాతే

గతి సుఖముండదు యణకువె గాౘును సతమున్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


16.01.2024 గురువారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


లోకములేలెడి వారగు

యా కామాక్షీ కపర్థిననునిత్యము యే

మైకము లేక స్మరించెడి

నాకమునకు దారియేగ నామ కరణమే.



పద్య కౌముది చిత్ర కవిత 17.01.2025


తీయటి రుచి హిమక్రిమమే యనముగ

బాల్యమే‌ బహు మధురము! పరుగు దీసి

మరలి రాని యందఱు కోరు వరము యిౘట

చిత్రమందు ౘూసి మురిసె చిత్తమిటుల.




అనంత సాహితీ వేదిక కొఱకు 


17.01.2024 శుక్రవారము 


అంశము: నవ్వు


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


తేటగీతి 


స్వస్థతను గూర్చును మనకు వరము నవ్వు

నీరు చిలుకు కనులను తా దారి ద్రిప్పి

నిండు దనము నొసగుౘు యా గుండె పైన

భారములను దీయుౘు తేట పరౘు నెపుఁడు.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


17.01.2024 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి: ప ర మే శ


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(ప)రమేశా! మము గనుమా

ప(ర)మేశా! లోకనాథ! వరములదేలా

పర(మే)శా! నీ దయయే

పరమే(శ!) వరమయ మాకు! జ్వాలా నయనా.





వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


19.04.2024 ఆదివారము 


సంక్రాంతి పై పద్యముల పోటీకి


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ పద్యములు నా స్వీయ సృజన, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


*వాణీ: ర న భ భ ర వ యతి 13*


ఆకశాన నడయాడెడి దేవతలార! భూమి పై

మీకు మోదమును పంౘుట కోసము మేము చేయు యీ

సోకులన్ని గని దీవెనలీయరె! జ్యోతులైన మీ

రాకకై యిౘట ౘూచెడి లోకుల రక్ష‌ సేయరే.


*అంబా: భ భ ర వ; యతి 7*


ముంగిట ౘక్కటి ముగ్గు లద్దియా

ఛెంగున యాడెడి యాడపిల్లలే

నింగిని దేవత నిండు రూపమై

పొంగలి పండుగ ముందు నిల్పునే.


*నాగర: భ‌ ర వ, యతి లేదు.*


మంటలు భోగి రోౙునే

వంటలు యన్ని వేళలూ

పంటల పుణ్యమా యనే

యింటన సందడే సదా.


*ధరధన్వితాళ: ర న, యతి లేదు.*


గాలిలోన

తేలుచుండు

బాలలాడు

యాలయాలు


*సీసము:*


గాలిపటాలేగ గగనసీమను చేరి

బ్రతుకు విలువ తెలుపగలవు మఱి

నేల పైనను ముగ్గు నింగిన పటములు

ఉదయము మంటలు హృదిన వేడి

బొమ్మలు వంటన పులుసులు తరువాత

భోగి పండ్లు భళిగ మొదటి రోౙు

పొంగలి కూరలు మురిపెములన్నియు

సంక్రాంతి నాడు ప్రసారములుగ


తేటగీతి:


కనుమ నాడు తర్పణములు మినుములంటు

కాకి కూడ కదలదుగ! గంగిరెద్దు

తోటి హరిదాసులు తిరుగు మేటి కళగ

విరిసి వెలుగు పండుగ గద! సిరులు చిలుకు.


పద్య కౌముది 

నలుపేమో కృష్ణయగా

తెలుపున ఘనముగ కపర్థి తిరుగాడు గదా

చిలుకకు నన్నగ పతిగా

తులతూగెడి వీరు తోడే మనకున్.



పద్య కౌముది కొరకు:


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


కైలాసమ్మున హరునిగ

పాల సముద్రమున హరిగ ప్రభవించెడి యా

లీలను గని బేధము యని

యేలా తలౘుట! నిౙమునకిరువురు నొకటే.


నీరము శేషుడు తపముయు

కారుణ్యము నిరువురికడ కనపడుగద యే

తీరుగ భేదము చెప్పెద

వీరిరువురికి! గనగను బింబమె యంతే.



వాగ్దేవి కళా పీఠం విజయవాడ కేంద్రము


20.01.2025 సోమవారము 


అంశము: వర్ణన [కుంభమేళ]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


ఆట వెలఁది 


జలము నందు మునిగి జనులు పునీతులై

భావిజీవితమున వర్థిలవలె

మేలు తలపులన్ని మెదడున నింపుౘు

యన్న సూక్తి గలదు నౘట మనకు.


తేటగీతి 


పతిత పావనులై యిక వర్తనమున

తెలివి మంచిదనములను కలిపి సాగి

విశ్వశాంతికై సతతము విధిగ నడువవలె

నదియె లక్ష్యము గాద యా నదులకైన.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


21.01.2025 మంగళవారము 


అంశము: దత్తపది 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


(కాంతి) లేని ౘోట కారు చీకట్లుండు

(క్రాంతి) నొంది యపుడు రక్ష కొరకు

(భ్రాంతి) వీడి మదిని రాముని దలచిన

(శాంతి) కలిగి బ్రతుకు సాగు ధరను.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


22.01.2024 బుధవారము 


అంశము: సమస్యా పూరణము


ఇటువంటి నాగ దుర్గా మాధురి దేవి (నాగిని) హైదరాబాద్


ముంజేతిని ౘాచిన పులి

పంజా చిక్కగ గుబురగు పత్రములందున్

నంజెను కరమును పురుగులు

*కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్*




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


23.01.2024 గురువారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


లెక్కకు మిక్కిలి జనమే

మక్కువగా చేరి మునిగి మనసారగ యా

దక్కిన ఫలమును గైకొని

ౘక్కగ సాగెడి తరుణము జలనిధి నందున్.





వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


24.01.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


కైలాసము యీ (కుం)భము

వాలిన జనముకు శు(భ)ములు భళిగా కలుగున్

(మే)లొనగూర్చును స్నానము

కాలుని క(ళ)లకు నెలవది! కనుమో నరుడా.




అనంత సాహితీ వేదిక కొఱకు 


24.01.2025 శుక్రవారము 


అంశము: ఋణానుబంధం


మదిని యాడు తలపు మహిని నిలచి గూర్చు

బంధమొకటి పేర్మి పగలు నట్లె

నవరసాలు గనుక నడయాడు మనతోటి

ఫలితములును గూడ బ్రతుకు నిండ




TMN Lion and Child picture 



ఆట వెలఁది 


ౙూలు విడువకమ్మ తేలిక భావంబు

మదిని గలుగనీకు! మహిని యంత

సమము యితరులకును సాయము చేయుమా

ధర్మ నిరతి రక్ష! దార్ఢ్యమున్న!



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


25.01.2025 శనివారము 


అంశము: ఐచ్ఛికము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


అలసిన సొలసిన యతివకు

యలవోకగనే‌ దొరకదు యాలంబనయే

యలకల కులుకుల కలికిని

యలరించేదెవరు నేడు యతివను! త్యాగములేగా.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


అంశము: మానవ సంబంధాలు (వర్ణన)


పూర్తిగ నశింౘలేదుగ

నార్తియు సాటి ప్రజ పట్ల నవనిన గనగన్

స్ఫూరి జవానులు రైతులు

మూర్తీభవులట మనకిట పుణ్య స్వరూపుల్


ఆలు‌మగల నడుమ నన్న దమ్ముల మధ్య

తల్లిదండ్రి పట్ల తగవులుండె

ధనము యొకటె గాదు తరచి ౘూడ సుఖము

ౘూడలేరు గోరు కీడు! నెపుడు.


ఱెండు రకములిట్లు పండె గుణము ధాత్రి 

నందు యొక్క రీతి యనగ లేము

దిగవలయును ధరకు దివి నుంచి దేవుఁడే

సమతులంబు చేసి శాంతినీయ.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


28.01.2024 మంగళవారము 


అంశము: దత్తపది: అణిమ గరిమ మహిమ లణిమ


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(అణిమ) సిద్ధులందు నాదిగా నుండినే

హనుమ కరుణ (గరిమ) గనుట సులువ?

మౌన మంత్ర (మహిమ) మనుజులెఱుఁగవలె

లఘువు ప్రాస‌ యతికి (లఘిమ) చెల్లు.




అనంత సాహితీ వేదిక 


29.01.2025 బుధవారము 


అంశము: ఒంటరి గది


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 




ఆట వెలఁది 


జన్మ పొందు ఘడియ సాగి తుది‌వఱకు

పయనమెపుడు గాద! వంటరి బరి

మేలు తలపులకు సవాలు లేని గదియె

ఒక్కరుండు విధము నిక్కమిదియె.



పుట్టుక వంటరి గిట్టటముయునంతె

నడుమనదేలన నలుగగొట్టు

చింతలు యేకాంత సేవనములె బాగు

కళలను కలలను కలువవవౘ్చు

గాలి మాటలు సాగి కలహములను దెౘ్చు

తుచ్ఛమైనవి లేక స్వచ్ఛముగను

నుండు విధము మేలు నుర్విన వృద్ధియే

త్వరితముగను దక్కి భవిత పండు.


తేటగీతి 


గాలి వెలుతురులిల ౘాలు కదలకుండ

లోకములకు గెలుపు వేకువద్ది

ప్రగతి స్థిరము నిలిపుౘు సవాళ్ళు దాటి

తృప్తి మీర బ్రతుకవచ్చు! తిరుగు లేదు.



గుంపునుండుక కంటేను గుట్టు మూసి

యున్న వ్యాప్తి గాదు వదంతి యునికి లేక

చివఱకది ౙారి గుంతల చేరి యాగి

మనల గాౘు మహిని యనలమార్పి.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


30.01.2024 గురువారము 


అంశము: చిత్ర‌ కవిత


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఉత్సాహము: 7 సూర్య గణముల పై ఓ గురువు, యతి స్థానము 5వ గణాద్యక్షరము.


బండి నడుపు వాని కొరకు పట్టి నీడ కాచుకొందునే

యండ యొకరికొకరమవగ యాత్ర సాగు చక్కగన్

రెండు చేతులిట్లు కలువ ప్రియము కలువ పూచునే

పండు బ్రతుకు సుఖముగా విభవములంది నిత్యమున్.


ఆట వెలఁది 


ఒకరికొకరు యొదిగు యుండగ నుర్వి

మురిసి కురియు వాన ముసురుకొనుచు

కలిసి మెలసి యున్న కలిమి సిరులు పొంగి

బెంగ‌ రాదు దరికి! నింగి సాక్షి.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


31.01.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి - మాఘమాసం 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(మా)యను దాటుట సులభము

ధ్యేయము రా(ఘ)వ స్మరణము దీవెనలిడగన్

కాయము (మా)లిమి సేయక

గాయత్రి (సం)ధ్యను గొలిచిన కలుగును సిరులే.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


03.02.2025 సోమవారము


అంశము: వర్ణన [శ్రీ పంచమి]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


జ్ఞానము పంచు దేవతను శారద మాతను గొల్చు పర్వమై

మానవ జాతి ధన్యతను మంగళమూర్తికి దెల్పుకొందుకై

మానిని వాణి మాఘమున మార్దవమున్ మనకంద చేసెనే

ధ్యానము నందు గాంచి తన ధర్మ స్వరూపము మోదమందరే.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


05.02.2024 గురువారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


మంచము కాగా పొలమున

మంచెయె! సులువయె నిదురయె మనసుకు ౘలువై

పంచెను సుఖమును నిదురను

పంచెన రైతుకు; యిది మన పద్ధతి పొలమున్.


బంగరు పరుపులదేలన

పొంగెడి సిరులకు నిలయము పొలమున యున్నన్

నింగిని చూపెడి మంచెయె

రంగుల కలలొసగి నిద్ర రక్షణ గూర్చున్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


07.02.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి [బా ట సా రి]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(బా)సర వాసినిని దలచి

యూసులు మా(ట)లు పలుకుల యూయల నటులే

ప్రా(సా)క్షరములు నేర్చితి

ధ్యాసగ ౘదివెడి సి(రి) వరమడిగితి జననిన్.





అనంత సాహితీ వేదిక కొఱకు 


అంశము: ౘందమామ


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


అంబిక చెవి తాటంకము

సంబరమే గగన సీమ చందురుడున్నన్

సాంబుని సతి దయ దొరకును

వెంబడి బ్రతుకులు కళకళ వెలుగును సతమున్.


మల్లెలతో గూడిన యా

తెల్లని వెలుగుల ఱేడు దీవింౘునటా

ౘల్లదనముతో మమతల

పల్లవి పాడుౘు నడుపును బ్రతుకును సతమున్.



శంకరాభరణము సమస్య - 502


08.02.2015 శనివారము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


మేనయత్త యింట మిక్కిలి ప్రేమతో

వెంట తిరుగుౘుండి పేర్మి పంచి

వదిన! యని పిలచు మరిదియు మరదలికి

యన్నను మనువాడి యతివ మురిసె.


నాన్నకు చెల్లెలై తనకు నిండుగ పేర్మిని పంౘు యత్త తో

చిన్నది యామె బిడ్డయును చేరెను యామెకు ముందు వాడు యో

యన్నను భర్తగాఁ గొనిన యన్నుల మిన్న యదృష్ట రాశియౌ

పున్నము చేసికొన్నది సమున్నతమైన ప్రయాణమౌనికన్.


గురువులు, పెద్దలు ఇందు దోషములున్న మన్నించి

తెలుప ప్రార్థన.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


08.02.2025 శనివారము 


అంశము: ఐచ్ఛికము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


స్వచ్ఛమైన మనసు ౘల్లనైన నగవు

వెన్న వలెను తలపు మృదువు యెపుడు

పిల్లలున్న ౘోట మల్లెలే నిత్యమున్

కాలమౘట నుండు కరుణ లేదె!






అనంత సాహితీ వేదిక కొఱకు 


అంశము: ౘందమామ


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


అంబిక చెవి తాటంకము

సంబరమే గగన సీమ చందురుడున్నన్

సాంబుని సతి దయ దొరకును

వెంబడి బ్రతుకులు కళకళ వెలుగును సతమున్.


మల్లెలతో గూడిన యా

తెల్లని వెలుగుల ఱేడు దీవింౘునటా

ౘల్లదనముతో మమతల

పల్లవి పాడుౘు నడుపును బ్రతుకును సతమున్.


బుద్ధినొసగువాడు పూర్ణరూపండుగా

గగన సీమ వెలుగు కలువ ఱేడు

యౌషధముల మూలమతడు యారోగ్యమున్

కలుగ చేయు వాడు కలిమి ధరుడు.


గ్రహములందు యొకడు గ్రాహ్యంపు మూలమున్

ౙాలి గుణము మెండు! మేలు నొసగు

హరి హరులకు బంధువై యాడు భాగ్యమున్

పొం

దినట్టి ఘనుడు! ౘందమామ.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


10.02.2025 సోమవారము 


అంశము: వర్ణన - అరుణాచలము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


వర్ణమరుణమౘట వహ్ని యాడును గాని

ౘల్లనైన మనసు సాగు వాడు

శంకరుండు యుండు ౙతపీత కుచమాంబ

మనల గాౘుౘుండు! మంగళముగ.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


10.02.2025 సోమవారము 


అంశము: వర్ణన [దీపము]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


కంటికి గానుపింౘని జగంబుకు దారిని ౘూపు రేఖయై

పంటను గల్గజేయు గద ప్రార్థన చేసి కృతజ్ఞతావిధిన్

యింటన నిల్పినంత బ్రతుకే యిక పూవుల బాటయౌనుగా

కంటకమేది చేరదిక కాంచన వర్ణము యానమంతయున్.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


12.02.2024 బుధవారము


అంశము: సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


చిత్రమైనదిౘట చెప్పినట్టి పదము

*సెంటిమెంటు చేసె సెటిలుమెంటు*

పూరణలను చేయు వారంత విప్పరే

దీని గుట్టు భళిగ! తెనుఁగు నందు.


బంధములను నిలుపు వాత్సల్యమనబడే

*సెంటిమెంటు చేసె సెటిలుమెంటు*

కట్నమేలననుచు కన్యనే గొంపోయె

వరుని తరఫు వారు పద్ధతిగను.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


13.02.2025 గురువారము 


అంశము: చిత్ర‌ కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


తెలివి యున్న ౘాలు కలుగు కూడుయు గూడు

వ్యర్థమైనదంటు వసుధనందు

లేదు గాక లేదు ఱెక్కల పక్షియే

తెలిపినట్టి విషయములివి నరుడ.




సాయి వనములో సాహిత్యము


15.02.2024 శనివారము 


అంశము: ఐచ్ఛికము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


వైరాగ్యంబే మేలగు

దారిగ నెంచిన గలుగదు దైన్యత నరుడా

పోరాటములే తగులును

యారాధన వలన గాన యాశలు వలదే.



వాగ్దేవి కళా పీఠము, విజయవాడ కేంద్రము


మహా శివరాత్రి సందర్భముగా, నిర్వహింౘబడుతున్న పోటీకి,


*చంద్రశేఖరాష్టకము* పైన కవనము


16.02.2025 ఆదివారము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని]


ఈ పద్యమాల నా స్వీయ సృజన, దేనికీ అనుసరణా, అనుకరణా కాదు, ఎవఱినీ ఉద్దేశించినది కాదు, వేఱెక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


1.


*పరమేశ, స, న, జ, భ, గ, గ - గణములు, యతి స్థానము 10వ అక్షరము*


పరదేశమున వసించు వారు తపంబున్

హర! చందురుని కరంబు హందుకొనే యో

చిరు కాంక్షను యెద పూని చేరితిరే నీ

కరుణామృతమును వొంది! కాదనలేమే.



2. ఉత్పలమాల 


తామరలన్ని పూయుగద తండ్రి! కపర్థి శిరస్సునందునన్

మామగు చంద్రు గాంచి మఱి మానుష జాతికి గూర్చి 

స్వస్థతన్

ధామము నీయడా యతడు ధాత్రికి యట్టి వాడు నీ

సీమను నిల్చినాడు శశి శేఖర! బాధ్యత యంత నీదెగా


3.


అంబురుహము [భ, భ, భ, భ, ర, స, ల, గ, యతి 13]


శీతల వాయువు నిమ్మును దగ్గును చేర్చెనే హర రక్ష కై

కోతలు పొందినవే నవ నాడులు క్రుంగె గొంతుక లోన! నీ

చేతుల వెచ్చదనంబును దీర్ఘము శ్రేయమీయగ వీడకన్ 

మా తల పైనను నుంచుమ శంభు! సుమాంజలీ యిదె! యందుమా


4. భ, ల, గ, యతి లేదు.


వన్నెలొసగే

పున్నమి సదా

నిన్ను విడదే

నన్ను గనుమా.


5. కందము



ప్రతి రోజు పఠించెదనే

గతి నీవె హరా! వినుమయ కన్నీటి కథల్

మతియును మాటయు పగిలెను

శ్రిత పోషక గాచుమయ్య! చిరునగవులతో.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


17.02.2025 సోమవారము 


అంశము: వర్ణన [దేవాలయము]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


దేదీప్యంబుగ వెలుగుౘు

వేదపు (వా)సంబుగ యిల బిందువు తానై

మోదము గూర్చెడి క(ల)శము

యా దేవుని చేర్చును గద (యం)తిమ దినమున్.



సాయి వనములో సాహిత్యము 


అంశము: తాజ్ మహల్ 


17.02.2025 సోమవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


చంద్రుని రంగే అందినదా యను

తెలుపే వలపుకు ముడి యై

సూర్యుని తనయకు యమునకు

చెంతన నిలువగ పెరిగెను

పాలరాతి విలువ భారతావనిన

ఫాలలోచనుండు లీలా వినోది

యిరువురి కృపయే దక్కును గద యీ

ధరపై నరులకు నపారముగ నిత్యము.



సాయి వనములో సాహిత్యము 

అంశము: తాజ్ మహల్ 

18.02.2025 మంగళవారము 

ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


తల్లి మమత తండ్రి మేధల

కలబోతయే గద కనుపాపలగున్

వాగర్థావివ యన్నట్లుగ యిల పై

శివముయు చైతన్యము యా తల్లిదండ్రులే

బిడ్డకు పేర్మితో పాటుగా

ఆలోచనలను మంచితనంబును

లోకహితంబును గూర్చు విధంబును

భావి తరంబుకు పంచెడి వారే

నడిచే దైవములు నడిపించే జీవంబులు

గడప దాటకుండనే దొఱకును 

పూజించరె వారిని యాడింౘరె

త్యాగంబుల కీర్తింౘరె తరుణమున సేవింౘరె.





TMNtelugu 


ఆట వెలఁది



ఆంగ్లమందినంత అదృశ్యమవదయా

తెనుఁగు భాష ధరను! తెలిసికొనుమ

నేర్చినంత వరకు నిండుగా ౘదువుమా

నపుడు నెలుచు మదిన యాది నుంచి.



చంపకమాల 


కపటపు లోకమైనను వికారముగాను దలంౘక సాగుమా

రిపువులు నుండు సత్యముకు రెక్కల గూర్చు వాని పై గురై

నెపములు దోసి తేలికగ నిందలు వైచి యాడుచుందురే

తపముగ మౌనముద్రలను దాల్చిన దోషులు పారిపోదురే.



నమస్కారం అండీ 


ఆకాశవాణి విజయవాడ కేంద్రము 


సరసవినోదిని 01.03.2025


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


జాగరూకత యున్నచో జరుగదెట్టి

నష్టమును నపాయము భువి నరులకెపుడు

నాస్తి జాగ్రతో భయము గాన నిజము విను

భయము భయమును బాపియు బవిసినిడును.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


24.02.2024 సోమవారము


అంశము: వర్ణన (సూర్యోదయం) 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


కార్యోన్ముఖులను చేసెడి

సూర్యోదయమే వసుధకు సుధ సమమౌనే

స్థైర్యము నింపెడి శక్తియు

శౌర్యుండగు రవియె చేసి జనులను కాచున్‌.




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


25.02.2025 మంగళవారము 


అంశము: దత్తపది: దుర్గ గిరిజ గౌరి చండి


ఇ. నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)


అన్ని దిశలనాడు అంబ చండి! మనకు

మార్గములను చూపు దుర్గమాంబ

కరుణ మెరయు తల్లి గిరిజ కపర్థిని

కరములాడు తల్లి గౌరి యెపుడు



సాటి వారి పైన చాడీలు చెప్పుౘూ

తనను పొగుడుకొనెడి ఘనుని చెంత

మనసు విరిగినట్టి మంచివాడగు ఘన

*శిష్టుఁడెట్లు పల్కు శివ శివ యని?*




వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


27.02.2025 గురువారము


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఆదియు నీవే శంభో

వేదము గిరియును దరియును ప్రియముగ నీవే

వేదన దీర్చెడి వాడవు

మా దైవము నీవె గాద! మమ్మేలుమయా.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రంము


28.02.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి [చంద్రముఖి]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


(చం)దనమర్పించెదమే

సుందర వదనా! శశిముఖి! శుభము(ద్ర)లతో

మందిరమందున (ము)నిజన

వందిత! నిలుమా హరి స(ఖి)! పద్మజ! వినతుల్.



[04/03, 08:31] Durga Madhuri Devi Nagini: ఆట వెలది 


యోగ చేసినంత భోగమ్ము కోరకన్

తనువుకు దొరకునుగ తగిన ఫలము

భరత భువిని పుట్టి వసుధయంతయు చేరి

స్వస్థతొసగుౘుండె జనులకెల్ల.

[04/03, 09:47] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


04.03.2024 మంగళవారము 


అంశము: దత్తపది: రంగ రంగ రంగ రంగ


ఇ. నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


కా *రం గ* రిటెను ద్రిప్పగ

సా *రంగ* ధరుని ప్రియ సతి సాంబారున తా

గా *రం గ* దెలిపె దిననని

యీ *రం గ* ద్దిన పులుసును! యిబ్బందనుౘున్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


05.03.2025 బుధవారము


అంశము: సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


నేరము లేవి చేయరని నిర్మలమైన మనస్సుగల్గి యీ

ధారుణినేలు శక్తిగల ధర్మపరాయణు పాండు పుత్రులన్

వైరుల వోలె పల్కెడి యపార్థపు వ్రాతగ‌మార్చినట్టి యీ

భారతమంత చెత్త కథ పాఠము చెప్పుట వ్యర్థమే కదా!



[06/03, 22:17] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


07.03.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి , (రా హు కే తు)


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


07.03.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి , (రా హు కే తు)


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


(రా)మ నామ స్మరణ రక్ష‌ లక్షణమయ

దీర్ఘ బా(హు)వులకు దీప్తి మెండు

స్వామి రాక సం(కే)తము జయములకును

జ్యో(తు)లిడెదమిపుడె! శోభ కొరకు.

[06/03, 22:20] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


గురువారము అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


వేరు సాక్ష్యమేల విత్తనమునకు యీ

సర్పరూపమేగ జననమొందు

మనుజులకును మూలమను నిజము ఋజువు

భారతీయమనిన! వసుధ కథయె.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


10.03.2025 సోమవారము 


అంశము: వర్ణన [రాముని వనవాసము]


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


వర్ణన:


సీ.


అంతఃపురమున విహారము నేర్పదు

లోకపు తీరును! రోత జేయు

నసుర గణముల సంహారము గావున

యేగవలెను గద యిలను యున్న

ప్రాంతములన్నియు! ప్రజలకు రక్షణ

పాలన నీయగ! యేల వంక

యనెదరు ప్రాజ్ఞులు! మననిమ్ము వాదనల్

నష్టమేమి! మునులు శిష్టులంత


తే.గీ.


ప్రియము సలిపిరి సేవలు విరిసె వనము

నడువగ తనలో నాదర్శ నడవడికను

గలిగిన పురుషోత్తముఁ పాదములను వొంది!

భావి తరములకవి గొప్ప పాఠమయెను.


ఆకాంక్ష:


సీసము:


కలియుగంబును గూడ కాననముగ నెంచి

కాలిడుమా మము గాౘ రావ!

ధర్మము నశియించి దైత్యులా గడములు

పెౘ్చు మీరె! జనులు విజ్ఞతయను

విషయము మరచెను విషమే చరించెనీ

మనసులలో! నది తనువు ద్రుంచి

వ్యథ మిగిల్చె గృహము వధ్యశిలలవంగ

మంచివారికి లేదు మనుగడ యిట!


తేటగీతి:


గావున దయసేసి యిౘట మావిచిగురు

పూయు వేళ యా చైత్రమే భువిని సతము

నిలుౘునట్లు సంధింౘుమ‌ నీలదేహ!

నీదు వాత్సల్యపు శరము! నాదు మనవి.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


11.03.2025, మంగళవారము 


 అంశము: దత్తపది (తాడి దాడి పాడి నాడి)


తాత తానాడి మనవలతో తగవులు

సరసముగ పాడి యిల్లంత పారబోసె

సుద్దముక్కలు "దాడి"ని శోభితముగ

గీచి తాడి వనంబునకేగె పిదప.


అవధాన భారతి, 12.03.2025

ఏతావాతా తేలెను

*టీ తాగని వాడు తేనెటీగై పుట్టున్*

ప్రీతిగ నటుపై మధువును

వేతనముగ వొంది కుట్టి పీడింౘు మనన్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


12.03.2025 బుధవారము 


అంశము: సమస్యాపూరణము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


ఎల్లలు లేనిది విద్యని

కల్లలనెఱుఁగని పలుకులు కానల రేగన్

మెల్లగ నడౘుౘు వాటిన

*భల్లూకము ౘదువుకొనగ బడిలోఁ జేరెన్*


కృష్ణా! నిను నమ్మిన యే

తృష్ణయునుండదె! విరాగి దృష్టియె తోడై

యుష్ణత తీర్చును బ్రతుకిక

వైష్ణవమాయననుభూతి *వర్ణపు* మయమే.


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


14.03.2025 శుక్రవారము 


అంశము: న్యస్తాక్షరి 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


చేరి స *హో* ద్యోగులు యో

వారాంతమునాడి కే *ళి* పాడెను భక్తిన్

ధారగ *హే* లగ నవ్వుౘు

కేరింతలతో గ *ళ* మున కీర్తనలెన్నో.































శ్రీ మాత్రే నమః


🪷🌹💐🌼🌻🌼🌺🌸🌷🪻🪷


నిర్వికారుడవుగ నిలచెడి శుభగుణ

పదములరువు రావె! పలుక వినతి

నీవె శరణు యనెడి నిశ్చలానందమే

మమ్ము నడుపు గాన! వమ్ము వలదె!


ఏమని వ్రాయాలో మా వినతుల వటపత్రములో తెలియుట లేదయ్య శాయి!

కాంక్షలు లేక కాదు! భీతియె మెండయి పోయే గద మనసులలో,‌ బ్రతుకులలో!


ఏదో షష్టమనీ గ్రహ కూటమి యనీ అంటున్నారు! అయినా అంతరిక్షం లోని విషయాల పట్ల మా జ్ఞనం తక్కువనో, శూన్యమనో కాదు! అసలు

అవని మీదనే మనుష్యులు పురుగులను సృష్టిస్తున్నారు. అందుకని ఈ భయం ఎక్కువ అయి పోతోంది. 

ఇంటి తలుపులు తీసి నీ గుడులకు రాలేమని బెంగ లేదు! ముందు ఇంట్లో ఉన్న ప్రాణాల గురించే మా ఆర్తి! ఎందుకంటే, మేము మానవ మాత్రులము కదా మరీ! మాయా మోహితులం. ఇదీ నీ లీలే అయితే నీవే కాౘుకుంటావు. కాన భయం మేమీ స్పృహలో ఉన్నప్పుడు దిగి పోతుంది.


కానీ, గ్రహాల చర్యలు, కర్మల ఫలితాలూ అంటావా! నీ స్మరణ అవి ఇచ్చే ఇబ్బందులను తీయక పోతే, "నీవేమి తండ్రివీ!" అంటాము, ఎందుకంటే, మళ్ళీ మేము మానవ మాత్రులమే కనక, మాత్రలనే భుజిస్తున్నాము కనక.


అందుచేత, పైన పేర్కొన్నట్లు, "కర్మ ఫలమనో, కలి యుగమనో" దాట వేయక, మాకు రక్షా, ధైర్యముతో పాటూ, నీవు మాతో ఉన్నావన్న నీ పైరత్యక్ష కదలికలనూ ఇమ్మని, భక్తితో వేడుకొంటున్నాము "భక్త సులభా!"


తులసీ దళానికి తూగిన నిన్ను, మా అమాయకత్వంతో తూచటం కష్టం కాదని నమ్ముతూ, నిన్నే ఆశ్రయిస్తూ, నీ "కృష్ణాశ్రయ స్తోత్రాన్ని" అజ్ఞానులమైనా పఠిస్తూనే ఉన్నాము.


వందనములు తండ్రీ!


🥭🍍🍏🍎🍊🍋🥥🍌🍉🍈



శంకరాభరణము 1789


30.03.2025 ఆదివారము 


ఇ. నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


సొమ్ముల కొరకై పరుగిడు

కొమ్మలె యగుపించు నేడు! కోరిన గానీ

నెమ్మదిగా యింటననే

*కమ్మని వండెడి వనితలు గలరే భువిపై*


గమ్మున యారగింౘక వికారము గల్గు విధంబు వంకలన్

కొమ్మల చెంత నాడి మది కోతలు పెట్టిన యేడ్చు కండ్లతో

*కమ్మగ వండి పెట్టగల కాంతలు గానఁగ రారు మేదినిన*

నెమ్మదిగా మనంబు నవనీతము పూసిన కొంత మేలగున్.


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


31.03.2025 సోమవారము 


అంశము: వర్ణన - పంచాంగ శ్రవణము.


ఇ. నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్.


భువిపై నిల్చిననూ జన

భవితవ్యము దెలుపు విధము పంచాంగమెగా

శ్రవణము వినకున్నను యా

నవ పండితులకును లేదు నష్టము మనకే.



సులువుగ ఛందము నేర్చెడి

తలపున మునిగిన యువతయె తగు జ్ఞానమునే

తెలియక నల్లెడి పలుకులు

పలుకులు పలుకులుగనుండ పద్యంబగునే.


వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


01.04.2025 మంగళవారము 


అంశము: దత్తపది


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్


గలగలలాడెడి పుత్రిక

జలజల రాల్చెను నయనము జల బిందువులన్

మిలమిల మెరిసెడి చెక్కిలి

బిలబిలలశ్రువుల వలన బెంగను వొందెన్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


03.04.2025 గురువారము 


అంశము: చిత్ర కవిత 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్


ఇంతకు మించిన భాగ్యము

యింతికి గలదే వెదకిన యిలపై! శిశువే

స్వంతంబను తలపే పుల

కింతై మురిపించును శిశు కేరింతలతో.


ఎన్నని పద్యములల్లిన!

మన్నన సేయంగ లేవు! మాతకు మదిలో

చిన్నడిపై గల మమతను!

వెన్నను మించిన గుణమది! బిడ్డడి పైనన్.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము


08.04.2026 మంగళవారము 


అంశము: దత్తపది: నీవు లేక నేను లేను 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


సుఖము పలికె కష్టము తోడ "ౘూడు! *నీవు*

యున్ననాడేగ *నేను* ను మన్ననంది

నిలువ గలను! *లే! క* లలకై నిదుర పోవు

జనులలో *లేను*గా నేను! వినుమ సఖియ!


"సుఖ" తో మొదలు పెట్టి, "సఖి" తో ముగించాను‌‌.