Friday, September 27, 2024

AmmaVaaru

నాగవుల తల్లి పార్వతి! సనాతని! వందనమో ఉమా!

ఖగపతి విష్ణు సోదరి! ప్రకంపనలన్నియు దీయ నీవెగా

జగములనేలు నాయకివి! శౌర్యము ఘూపి కపర్థినీ సదా

గగనము దాటి మా దరిని కాంతిగ నిల్వుమ యద్రి వాసినీ


అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ, దసరాలలో, క్రోధి, 2024, అక్టోబర్ 4


రావమ్మా జననీ మా

భావము గమ్యము సురనుత! భ్రమరీ నీవే

పావని! యూయలనూగు

దీవింఘుమ‌ మము! శుభగుణ! ధీరా! హిమజా






కీర్తన వాళ్ళ గుడి లో, క్రోధి సంవత్సరం దసరాకు మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవికి

వాణీ శర్వాణీ యో

వీణాపాణి గొలుఘును వేదములన్నీ

శ్రేణిన నిలఘు నిన్నే

రాణి ౘదువులనొసగుమ లక్ష్యము కొఱకున్


జ్ఞానము నీవే ధరణికి

రాననబోకుమ! శుభాంగి! బ్రహ్మ కళత్రా!

ధ్యానము నిలిపెడి కరుణను

మానవులకొసంగవలె సుమధుర వచన!


నా మనస్సున వీడకుండను నాద బిందు కళాత్మికా

నీమమన్న విధంబుగా కరుణించి యాడు సమున్నతా

నామమన్నది దల్చినంతనె నాదు నేత్రములందునన్

నోము పట్టిన! కాచుచుండు మనోన్మణీ ! శరణంబిదే.

ఉత్పలమాల 


తెల్లని వస్త్రధారణయు తీయని పల్కుల తల్లి వాణి తా

ఘల్లదనమ్ముతో మనకు జ్ఞానమొసంగు సంస్కరింగా

తల్లిని గొల్చుకుందుమని ధాత్రి నివాసులు పూజ సల్పుఘున్

పల్లవి పాడుకుందురట భారతి నామము తోడ నిత్యమున్




బంగారు రంగున వెలసిన

రంగము నాయకి! సురనుత! లక్షణముగ యే

భంగము నొందని జ్ఞానము 

చెంగున నిమ్మ యని యిట చెప్పెద వినతుల్



వీణయు నక్షమాలను ప్రవీణ! ధరించెడి వాణి దీర్ఘమౌ

బాణిన రాగమాలికలు పాడుఘు వేడెద జ్ఞానమీయుమా

పాణి కలమ్ము కావ్యములు వ్రాసెడి భాగ్యమున్నఘో

శ్రేణి తలంబున జీవులిక చేరును నీ దరి! మాయ దాటుఘున్




దుర్గమ మార్గము నడిపెడి

భర్గుని పత్నీ! ప్రణవపు పంజర వాసీ

అర్గళ దేవీ మనవిది

నిర్గుణ రూపా! బ్రతుకున నింపుమ’ వెలుగుల్



ధాన్యము ధనమది యేలన

దైన్యము సరసన నిలువదు ధైర్యము నీవై

మాన్యత గాచిన చేరదు

శూన్యత బ్రతుకున! మనసున! శుభగుణ! తల్లీ!


ధాన్యము ధనమది యేలన

శూన్యము గాదైనను మది ఘూచిన నిన్నే!

దైన్యము దరిమెడి శక్తివి!

మాన్యత గాచెడి సురనుత! మంగళదాయీ



చంద్రవంక ధారి! మందర స్వరమ్మున

కీర్తనలను పాడి కేళి యాడి

శిశువులమగు మేము! యశమును ముదమును

వొందెదమిల! జనని! ఉమ! సురనుత



నవదుర్గాలుగా వెలసెనె

శివసతి ముఘ్చట గొలుపు చిరునవ్వులతో

భవభయ హారిణికివియే

నవనీతముతో ప్రణతులు! నగజకు భక్తిన్






తెలుగు లోగిలి లో నళినీ ఎఱ్ఱా గారి టపా

దీపపు కాంతుల నడుమన

శ్రీ పద్మావతి! వెలసెను సిరులను చిలికెన్

పాపపు రాశిని చీల్చు

నాపదలెల్లను దరుముఘు నంది యుండున్


కొలువరె కాచెడి తల్లిని

నిలుపరె మనమున సుగుణపు నిధియౌ సిరినే

తలచిన ఘాలును జయములు

కలిగింఘును లక్ష్మి! విష్ణు కళత్ర! పెర్మిన్




ఇంట్లో పెరట్లో రరోలు వద్ద దీపం పెట్టినపుడు కనిపించిన అమ్మ కనులకు ఈ పద్యమూ, పాట

[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: వేంచేసితివా జననీ

కంచీ పురవాసిని మము కరుణింఘుఘు నీ

పంచన చేర్చుట కొఱకని!

కంచెల తెరతీయుమిక వికాసమొసగుమా

[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: నీ కనులే మము గాంఘగ భువికి జేరెలే

శ్రీకరి శుభగుణ సుధాబ్దిజ ధన్యవాదమే ,|| నీ కనులే ||


తిమిరము హరియింఘుటకని దివి వీడిన జ్యోతి

సమరములను బాపు నడిపించే తల్లీ ||తిమిరము||

సతతము నీ స్మరణే నిరతము నీ భజనే ||సతతము||

మా యిల వేలుపు నీవేనే మంగళదాయని సురనుత || నీ కనులే||


అందఱి బంధువు నీవయి ఆడే లోకమాతవే

సుందర వదనా నిగమాగమమే మాకు నీయవే

నవ్వుల పువ్వుల కొమ్మకు పడతుల’ వందనంబులే

సకల కళల రాణి శాశ్వతి పరమేశ్వరి మంగళ దాయిని


|| నీ కనులే||



పురివిప్పిన నెమలిక తో

సరసుకు చెంతన నిలచిన జననీ ప్రణతుల్

సురనుత భారతి పద్యము

సరి యగు విధముగ రచించు జ్ఞానము నిమ్మ



అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రం: 08/11/2024

అమ్మ నీవే దిక్కని

నమ్మిన భక్తుల గృహముకు నడిచెడి కరుణే

మమ్ముల నిలుపును! వేగమె

రమ్మా యనగానె చేరి రక్షింఘు సదా


అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రం: 05/01/2024


భృగువు వారమందు మగువలంత కలిసి

సలుపు పూజ కొఱకు సంధ్య వేళ

యిలకు చేరు తల్లి! యీశ్వరీ ప్రణతులే

మమ్ము కావ మనవి! మంగళముగ




కన్న భుజమ్ము నందు గని గారము చేసెను మాతృమూర్తి యే

యన్నుల మిన్నకై మనసు నాతృత నిండును నిత్యమున్ గదా

వెన్నెల వంటి ఘల్లనగు పేర్మి ప్రతీకయె సృష్టిలో సదా

వెన్నను జిల్కు నామె సమ వేలుపు లెరుగ ఘూడగన్ ధరన్




క్షీరాబ్ధి ద్వాదశి, క్రోధి వత్సరము

క్షీర సాగర కన్యక చేర రావె

మదు గృహములకు హరిని చేదుకొను

తులసి ధాత్రి సహితముగ వెలసి మమ్ము

కనికరింఘవమ్మ! సిరి! యవని నీవు



తులసీ మాటకు ప్రణతులు

తొలితొలి ఝామున సుమముల తోరణ మాలల్

తిలకము పసుపు గంధము

తలమానికమౌ నుతులును తల్లీ గొనుమా


"త" గుణింత కంద పుష్పము




త్రిజగన్నుత! శరణము నీ

నిజ రూపము గాంఘలేని నీరసమున నే

భజనలు సహితము విడచితి

గజ రాజ సుపూజిత! నను కరుణింఘుమికన్


మౌనము ౘలునంటిని రామధవ! భౌతికలోక బాధలో

నీ నను ముంఘనేల హరి! నే కను పాపను కాన! దేవరా

ధ్యానము సేయకున్నని దైన్యత లో పడవైచి నవ్వు

పానము లాగి నావుగ! సబాంధవ! ఘాలయ శిక్షలాపుమా


జలనిధి కన్యకామణి! ప్రజాపతి మాటవు ధాత్రి నిండుగన్

కలిమిని పంఘు నాయకి! సకాలము రైతుకు పంట భాగ్యమున్

ఫలముగ నిమ్మ యచ్యుతుని పత్ని! యష్ట విధమ్ముల మేలగున్

కలి యుగ బాధలేవి యిక కానగ రావుగ శాంతి నిండినన్!



కైలాసము నిండెనుగా

తేలెను వైకుంఠమేమొ తీయందనమున్

స్త్రీలు సలుపు పూజలతో

మేలు కొలుపు గీతముల సమేతముగ భళిగా



నిదుఱన యున్న మాధవుని నెరుగ‌ చేరెను శంభుడే వెసన్

పదునుగ నున్న ప్రశ్నకు ౙవాబు కోసము సేన తోడుగన్

చెదరగ దృష్టి! శాంతము చిత్తమునందున నింపి యాతృతన్

హృదయమునీయ దాటక ప్రహేళిక పొంగును మౌనముద్రతో!


అంబుధి నిండి పోవగ మహామహ’ దేవుని సేనతో గనుల్

యంబిక గానరాక హరి యచ్చెరువొందెగ లక్ష్మి దేవియున్

యంబర వీధి దాటెనని యప్పుడు గాంచెను విష్ణు మూర్తియే

సంబర వేళ ధాత్రినని సత్యమెఱిఁగెను! దివ్య దృష్టితో 


క్షీర సముద్రమేమొ బహు చిత్రము మారెను స్త్రీలు హస్తమున్

ధారగ పూజ సల్పెడి విధానము వైచెడి పస్పు కుంకుమల్

తీరుగ చేరి రంగులను దిద్దగ కెంపులు పఘ్చదనమ్ముతో

శ్రీ రమ నాథుడున్ హరుడు జీవుల భక్తికి మెచ్చె మొదమున్


గాంఘగ శైలమంత యును



షోడశ సేవలన్ని నిను ఘూచెడి భాగ్యము కోసమే కదా

వాడలలోకి పిల్చుకొని భక్తిగ నిత్యము గొల్చినాము నీ

ౙాడను పట్టి మోదమున ఘక్కని సేవలు జేయుచుందుమే

వీడక మమ్ము నీదు మది పేర్మిని పంఘుమ విశ్వమాతగా




అల్లితిమమ్మా కరులను

ౘల్లని తల్లీ! విరులును! జగమంతా నీ

పిల్లలమే కదా! పంఘుమ

యెల్లలనెఱుఁగని మమతను! యిల వాసులకున్.



నీ కబరీబంధము గని

మా కన్నులు మురిసెనేమొ! మంగళ గౌరీ

యా కురులందున కరుణకు

శ్రీ కామాక్షీ! ప్రణతులు చేకొనుమమ్మా.


నీ దరి రాకున్నను మా

వేదన తీర్చెడి జననివి! వేలుపువీవే

మోదమునిమ్మా కరుణను

నాదముగా గలిగినట్టి నటరాజ సఖీ.



నీదయ ఘాలును నాకిల తండ్రీ నృసింహ! నిత్యము రమ్మ దరికే

వేదన లేవియునుండవు నపుడిక ప్రీతిగ నడుఘును బ్రతుకులు యురికే

మా దినచర్యలు మరఘును స్వస్థత మారము చేసేడి వైరులు పలికే

ఖేదపు తలపులు ముంచెను కావు! కీర్తించెద నిను! నిరతము వదలక! 


*హరిగతి ఱగడ, 8 చతుర్మాత్ర గణాలు, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము*



నాగిని లాగిన్

https://www.facebook.com/share/p/1BBRuEVHrn/


వెలసెను బ్రహ్మ తోడను వీణను పట్టి కరమ్ముల యందు తల్లియే

చిలుకుఘు మోమునందు వికసించిన పద్మము వోలె హాసమే

పలికెడి వాక్కులన్ని మము బంగరు బాటల వైపు నిల్పగన్

కలుగును మోక్షమే యిక సకాలము ౙాగును లేక సత్యమే.




https://www.facebook.com/share/p/1BBRuEVHrn/


కలువలనందునుండునట కాంచన వర్ణపు శోభనాంగి నీ

చెలియగదెట్లు నాడునయ చిత్తముపైన వసింఘునందురే

పలుకులదేమి యిత్తఱిని పాడుఘు తెల్పెదరంట మాకు యీ

తలపులదెల ఘాలునయ! తల్లి దయామృతంబు నిత్యమున్.






బ్రహ్మ రసనాగ్రవు జనని వాణి ప్రణతి

విద్య నొసగు జ్ఞానము ప్రీతి మీర

పంఘు హిమజ జలజ సఖి! వసుధ నిలచి




కలికీ నీదర్శనమే

కలిమాకిలపై గిరి సుత! కళ్యాణి యే

కలతలు రానీయకుమని

కలమును పట్టు యడిగెద కాఘుమ జగతిన్.

శాంతి చేకూర్చ మనవి! ప్రసన్న వదన!


శ్యామల! శారద! శాంభవి!

భ్రామరి! అంబిక! సురనుత లావణ్యముతో

మా మనసుల నిలువుమ యీ

సీమను గాచెడి శుభగుణ క్షేమమునిమ్మా.



ప్రతి వారము నీ పూజకు

యతివలమంతా నిలచుచు యనుభూతులతో

నుతియించెదమో జననీ

స్థితి గతి స్థిరముగ నిలుపుమ శ్రేయము తోడన్.



ఆట వెలింది:


నలుపు గాడు హరియు తెలుపు గాడు హరుడు

అసలు రంగదేమో! నాయు లేదె!

పసిడి యెఱుపులున్న పడతులతో గూడు

వాఱు రూపమెవఱు పట్టలేరు.


తేటగీతి:


యింతులందఱు చేయు యీవిధమగు

సేవలన్ని చేరగ నాట దేవనగరి

యిట్లు నిండిపోవగ రంగులీని జగతి

వర్ణభూరితమయె బాగ! వంక లేక.



తాటంకములే రవి శిశి

మాటలు మా కష్టములను మాట వినవా

యోటమి వెతలను తరముమ!

బాటను నీవే నడీపుమ పంజర నిలయా.



శుక్రవారపు ఘడియలో శుభములొసగు

సింధువాసిని పూజకు సిద్ధమవరె!

మేలు గలుగ జేయు తనదు లీలతోడ

తల్లి దరిని చేరిన ఘాలు! దక్కు ఫలము.



ఆట వెలఁది/ ఒడలు పులకరించి కడలిని దాటి / తుదకు దరిని చేర్చు త్రోవ ఘూపు/ సన్నివేశము యిది స్వామి దయను వొంది / సంతసించె మది వసంతమాయె

 - ఈ లింక్ కింద: https://youtube.com/shorts/qyZvquIk388?feature=shared 





ఏమని వ్రాసెదనమ్మా

నా మది నిండిన తలపులు! నాద స్వరూపా

పామర వనితను దయగొని

యీ మనవిని గైకొనుమిదె! యిమ్మా పథమున్.



గజమాలలు గైకొని నీ

నిజ దర్శనమీయవే ప్రణీతములివియే

ఋజువర్తనులమ్ము రమా

యజ గాంచుమ నీ శిశువులమమ్మ! జననీ.


కేశములనుగంటిమిగా

క్లేశములను దొలగజేసి క్షేమమునిమ్మా

యీశుని పత్నీ మమతల 

పాశము వదలని మము గను బాంధవి! ప్ర ణతుల్.




ప్రార్థన విన్నది మన శ్రీ మాతే దయతో

ప్రారంబించెను తన సంరక్షణనే

స్వస్థత స్వచ్ఛత సంపద సఖ్యతలన్నిటినీ

ౘాఘిన కరముల మనకందించెనుగా

రాముని రాజ్యము లక్ష్యముగా సాగే

మారుతి సేనకు మంగళమామేగా

వేదన స్థానము వేడుకదే యికపై

జ్ఞానపు దివ్వెతో భ్రాంతిని ద్రుంచేనే.


[నమ్మిన నా మది... పాట పల్లవి రాగానికి అనుసరణీయం లో]


సీతమ్మ తల్లి తన కళ్యాణానికి గౌరీ పూజ చేస్తున్న వేళ

నిన్నే నీవర్చించగ

దేవేరీ మాకు నందు దీవెనలన్నీ

సేవించెదమే తృప్తిగ

పావని నీపై మనమున భక్తిగ తల్లీ.


ఈ అమ్మవారి దర్శనం కలిగినప్పుడల్లా నాకు అందిన శుభములకు కృతజ్ఞతగా పై పాట, ఇక్కడ పూజ చేస్తే తప్పకుండా అమ్మ ఆ జగన్మాత స్వీకరించి మనలను కాస్తుందనే అర్థం తో..స


సఖియా,


సహనమధికమని వలదు సానుభూతి 

కొరకు ౘూపు సాగు పథము వరకు

బాధ్యతలను భారమనక బంధమన్న

తృప్తిమీర నెరపుమ! నీ దీప్తి వెలుగు.



సింహ వాహిని! కమలముల్ చేతబట్టి

కదళి వనమున గూర్చిన కనక దుర్గ 

కనకమును కురిపించెడి కళల లక్ష్మి

వాక్కు గూడ నొసగుమమ్మ! వాణి! దయను.



జీవన యానపు నౌకవు

నీవే చుక్కాని గూడ! నీరజ నేత్ర

మా వేదన దీర్పవె నీ

దీవెనలే అమ్మా! తృప్తినొసగునే.




ఉదయత్త పెట్టిన చిత్రం:


పాణిన విపంచి నల్లని

వేణియ శిరమున కలిగిన విద్వన్మణి యో

బాణిన రాగము నేర్పుమ

వైణిక కులమునకధిపతి! వాణీ! మాకు.




దండలు గైకొను మాట

దండంబుల నందుమమ్మ దైత్యుల నెల్లన్

దండన చేసేడి శక్తివి

దండిగ పూజల గొని యిల దయతో గనుమా.




చేరలేక యున్న శ్రీ గౌరి! నీ పూజ

సలుపుౘోట! ణనసు స్మరణ చేయు

నిన్నె గాన మ్రొక్క వన్నె తీరినటుల

మమ్ము గాౘ రావె! మాత! దయను.


అంతయు పసిడియె నా పూ

బంతుల చేమంతి చంద్రవంకయు పతితో

నింతి నివాసము రజతము!

వింతగ లేదే కనుటకు! పెద్దింటమ్మా.


Harini intlo Sri Saraswati Maata Photo:

ఉత్పలమాల 

భారతి! నీకు సేవలిడు భాగ్యము దక్కిన ౘాలు; వెన్నెలన్

శారద రాత్రులందు గని ౘల్లని తల్లి! స్మరించి గొల్చెదన్

ధారగ కైతలల్లు మది స్థాపన చేసెడి శక్తినీయవే

వేరగు సంపదల్ మఱిక వేడనుగా నిను! వందనంబిదే.



[25/03, 21:47] Durga Madhuri Devi Nagini: 

ఆట‌‌ వెలఁది

అంచ యాన! వెనుఁక యస్ఖలితమునకు

చిహ్నమైన నెమలి చేరె! భళిగ

నీలవర్ణమందు నీరు యా పద్మంబు

శోభ గూర్చె నిండు! సుందరాక్ష.


మత్తకోకిల 


శ్వేత వర్ణమునాడు వస్త్రము వెల్గు నింపు మనస్సులో

గీత మేటిగ తీర్చి దిద్ది లిఖింౘుమా! రస‌ భారతీ

ఖ్యాతి యప్పుడు నుండు గాద! జగాన వందనమాలలే

ప్రీతి మీరగ నిన్ను గొల్చిన విద్యనీయుమ! పేర్మితో.


[25/03, 22:05] Durga Madhuri Devi Nagini: 

PadmaNabha Vrttamu 8 Ta Ganas 5.1 Yati

రాయంౘ యందంగ నీ వెంట చేరంగ ప్రార్థింౘు మా కాంక్షలన్ దీర్చు శ్రీవాణి!

సాయంబు జ్ఞానంబు మేధావిలోకాన చైతన్యమేనింప! నాకేమొ యాభక్తి

నీయమ్మ వేరైన వర్ణాలు నాతల్లి! నే మోయలేనంటి! నాభారమే చేటు

నీ యాలయంబందు స్తోత్రంబులే వ్రాయు నేర్పున్న ధన్యాత్మనౌ జన్మ నాదేను!


విశ్వావసు ఉగాది నాడు నా అంతరాత్మ మాధురీ ఇంగువ, పంపిన సింహ వాహిని చిత్ర పటానికి:


సాయుజ్యంబును గోరనేల! జననీ! సాన్నిధ్యమందించుమా

గేయంబుల్ పద పల్లవంబులను యో కేళీవిలాసంబుగా

యే యాటంకము లేక వ్రాయ వలనే! హృద్యంబుగా యీశ్వరీ!

యా యానందముకేది సాటి! గద బ్రహ్మాణీ! వరంబీయవే.


[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: మానస నేత్రము గంటిని

నేనీ పూజను! కపర్థినీ యది యే నీ

యానతి యని నమ్మితిగా

చీనాంబరి! వందనమిది చేకొనుమమ్మా.

[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: వత్సరముల గణనము నీ

వత్సలమగుమా మనసుకు స్వస్థత కొఱకే!

సత్సాంగత్యంబీ విధి

నుత్సాహముతో జరుపుట యో రీతి గదా.

[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: కన్నుల పండువ పూజలు

వెన్నుని సోదరి! గొని మము పేర్మిని గనవే

యన్నుల మిన్నగ గాౘవె

చిన్నారులమని! మనవిదె! చేమంతులతో.



మనూ అక్క FB Story image:


పచ్చందనమే మనసుకు

నచ్చగ యల్లితి పదములు నగజా ప్రణతుల్

హెచ్చుగ జూచెద నిటునే

విచ్చేయమ యీ యవనికి! పేర్మిని పంచన్.


Dr. Prakash Sir,

Vascular Surgeon's Clinic


Ammavaari Photo

1.

కలశముఁ జిందగ సిరులను

కలలను తీర్చెడి హరి సతి! కన్నుల నిన్నే

కలవా లేవా యనకనె

కలతను బాపెడి సురనుత! గంటిని సతమున్.

02.

కమలము కరముల నిలువగ

యమర పురాధిపుడు గొల్చు నమృత వల్లీ

సుమమలు సొబగులు తూగున!

మమతల నీ వదనమునకు మంగళ రూపా.

03.

హరి పత్నీ వందనములు

విరిబోణీ నీలవేణి! వీక్షించుమ యీ

ధరపై కష్టములెల్లను

నరులను గాపాడవేల నయముగ తల్లీ.

04.

తగునా రోగము వ్యాధులు

తగవులు బిగువులు దిగులును దాక్షిణ్యముతో

వగచక నీయక మమ్ముల!

నగవులనీవే సరసిజ నామము విడువన్.

05.

కర్మన పాపము చేయని

నిర్మాల్యము లేని మమ్ము నీ కన్నులతో

ధర్మము వైపుగ నడుపవ!

మర్మమమదియేమి తల్లి! మాతవు! ప్రణతుల్.

06.

అన్యమునెరుగక నీయని

పుణ్యమునీవీయకున్న పూరుషులకు యీ

దైన్యత తొలగుటదెట్లో

శూన్యము నిండున గద మరి! ౘూపవ దయనే.

07.

పూర్వపు ఫలముల పాపము

నుర్వినివాసులకొసగుట యుత్తమమేనా

సర్వము నీవని నమ్మిన

శర్వాణీ రక్ష! శరణు శరణము తల్లీ.

08.

భయమున వడలితి వలదే

నయమగుటకు శస్త్రము యని నమ్మిన నిన్నే

ప్రియముగ వేడితి గాదే

క్షయమును జేయవె క్షితుల సుజనులాశ్రితవై.

09.

వంకలదేలన గాచగ!

శంకల! మాపై కినుకయ! సవరింౘవ నీ

బింకము కరుణా రసమును

పంకజా నేత్ర! కురిపించు! ప్రార్థనలివియే.

10.

కడలిన నున్నటి నీ దరి

వడలిన మేమెట్లు చేరి వందనలిడి నీ

యడుగుల పట్టుట తల్లీ

విడబోకుమ మా కరమును! వేదన వలదే.

11.

విత్తమదేదైనను నీ

యుత్తమమౌ ౘూపుయున్న నున్నతమవదే

చిత్తము జీవుల తలపులు

దత్తము చేసిన కలుగును! ధర్మము యొకటే.

12.

బంగరమే యంతను మా

బెంగను దీర్చెడి జననికి వెలుగే కరుణై

పొంగగ బాసెను కలతలు

యంగనులందరికెపుడిక యానందములే.


13.

నీ నామమునే విడువక

మానసమందున మెలిగెడి మంచి వరమునే

ప్రాణాధికముగ‌ జూచుచు

మానవులకొసగుమ లక్ష్మి! మాధవుఁ పత్నీ.


14.


ౘాలును ౘాలును ౘాలును

బేలతనంబు గలిగించు వెతలిక ౘాలున్

లీలలు ౙూపుౘు చిటికెన

కేళియ వలె దీయుమమ్మ! కీడును తల్లీ.


15.

యుగములు కల్పములన్నియు

జగములు గూడను విరించి జనని! నీవే

యగునే పంతములేలన

ఖగ వాహుని పత్ని! రక్ష‌గా నిలుమమ్మా.


16.


నీరసమాయెను మనసున

నీ రస‌ధార కురిపించి నీడనొసగుమా

నీరజ నేత్రా శరణము

నేరములకు క్షమ ౘూపు! నిండు మనసుతో.


17.

ఏమని వేడెదనింకను

నీ మనసే కరుగకున్న నింగియు నేలన్

మేమిట్లు గొలిచినను నీ

స్వామికి చేరున! శశిముఖి! జయములనీవే.


18.





No comments: