తరువులు తరిగెను చెరువులు
కరువాయె బరువయె నదులు కడలులు ధాత్రీ
నరులను క్షమియింౘు మనవి!
వరమీయుమ రక్షణను! నివాసము నీవే
https://www.facebook.com/share/p/yVYLhuds66f3MVZX/?mibextid=oFDknk
తల్లితండ్రి తోడ తనయుడు గూర్చున్న
చిత్రమిటుల గనగ చిత్తమందు
సంతసమ్ము గలిగె సౌభాగ్యమిదిగాద!
ధాత్రి వాసులకు ప్రధానమిదియె
https://www.facebook.com/share/p/Wocdm1xmkiH4ZjY4/?mibextid=oFDknk
అనంత సాహితీ వేదిక
వచన కవితల పోటీ
అంశము: వర్షింౘని మేఘము
శీర్షిక: కలికి చిలుకమ్మ కన్నులు
హామీ పత్రము: స్వీర రచన, మా కార్పొరేట్ యాజమాన్యం నిబంధనలననుసరించి నా వివరాలను ఎక్కడా పెట్టకుండా, ఇలా అజ్ఞతంగా వ్రాస్తున్నాను. అనుమతింౘ మనవి.
కలం పేరు: నాగిని
పుట్టగానే "ఆడపిల్లా" అన్న రోౙున
పసి పాపగ ౙాలువారిన గంగ పొంగే
ఎదుగుతున్న కొద్దీ ఏడుపు ఎగిరి పోయె
తాత్పర్యమేమన, తగ్గలేదు వేదనలు
పెద్దరికము బాల్యమందే ఆపాదింౘ బడెను
నవ్వ వీలు లేదు ఆటలాడవలదు
ౘదువు యొకటే సాధ్యమనుౘు
కళలనైన కలలోనైన కరముకందింౘక పోయే
మాదు కాలమందు మాట లేదు మనువే చేసిరే
మగువ బ్రతుకు మౌనరాజ్యమందె
ఇక్కట్లే ఎదురవనీ ఇడుములే మీద పడనీ
ఇలలో ఇల్లే ఇంతికి ఇచ్ఛగావలెననె
కొలువు కాసులన్ని యున్న కలిమి కాదు తనది
కొరివి వోలె కొరకొర ౘూచే కుటుంబమే తన గని
తోటి వాళ్ళు తొక్కెడి వాళ్ళు తక్కెడ తమ వైపుకు
తిప్పి తప్పు గాౘుకునే వాళ్ళు
తగవు లాడు వారు తరతమాలెఱుఁగక
తల్లడిల్ల చేయు వారు తుదకు తెగించి
తనయలు తనయులనూ దూరము చేయు వారు
తాత్సారం చేయరు తరుణిని తన్ను దూకుడులోన
ఇన్ని ఇన్నిటికిన్నీ ఎగిరెగిరి పడినా ఏవగింౘక
పంటి బిగువు బాధ నుంౘు పడతి పరదాలు తొలగించి
పడనీయదు భావాలు బయటకెపుడు
కడదాక కంటి వెనుక నిలిపి నీరు
గుండె బరువు గుట్టుగానే యుంచినపుడు
హృదయమందలి తేమకు ఏ ఆత్మీయత
వెౘ్చని స్పర్శ తగిలినా వెతలు కక్కదు
నొౘ్చుకున్న విషయమసలు చెప్పదు
నీలి కన్నుల మాటున దాగున్న మబ్బు తెరలు
రాలనీక ఒక ౘుక్క నిలుపునతివను "నిండుగ"
No comments:
Post a Comment