*తురగవల్గన రగడ*
అండ నిలుౘు తండ్రివీవు ఆది పురుష! వందనములు
దండి నొసగి మాదు మదిని ధైర్యనిధిని చందనములు
మెండు పూసి పూజ సేయ మేదినీ పతి! మము గాౘు
కొండ నిలయ! బ్రతుకు శోభ గూర్చుమయ్య సవ్యసాచి
ఉత్పలమాలిక
వారధి గట్టి నీదు పరివారము సంద్రము దాటి చేరి యా
తీరము, గాచినారు సుదతీ! రహి రూపిణి! తల్లి సీతనిన్
తారక రామ! నీవును సుతారము నొప్పవ ధర్మ వర్తనల్
గారడి చేయు వారి నయగారము ద్రుంచెడి తండ్రివీవయా
కారణ జన్మ నీది! మమకార వికారము లంటనీయవే
కోరము నిన్ను యే విషపు కోరల వంటి వరమ్ములన్ సదా
ధారగ నీదు నామము సుధారస పానము ౘాచాలు దేవరా
హారతి నిత్తుమయ్య! సుమహారము తోడను! లోకనాయకా
హరిగతి రగడ
వేడుట మానితి శ్రీనరసింహా! ప్రేమను పంచెడి నీకడ నేలన
పీడల గూర్చిన చర్చలు! మానెద! పెన్నిధివై మములందఱ గాచిన
వాడవు భక్త శుభాశ్రిత సజ్జన పాలక! పూర్వపు కర్మల వాసన
వాడును గదనీ యర్చనతో మది ప్రాణము నీవయ బాపుమ వేదన
ౘూడక యుంటివ! ధరపై
కీడును! కన్నులు తెరువుమ! క్లేశము నిండెన్!
వేడుక బదులుగ వేదన
యాడెను రక్షింౘుమయ్య! అయ్యప దేవా
లంకను దాటెను గానీ
పెంకి తనము గల మనుజుల వెఱ్ఱి తనమునే
లంకిణి వలె ద్రుంౘవె మా
వంకకు ౘూడవ కరుణను! పవన కుమారా
శరవణ శరణము వేడుౘు
కరుణను గోరుౘు నిలచిన కనవే మమ్మున్
ధరపై బాధలు వెతలును
పెరిగెను పలుకవ! యిల దిగి వేగమె రమ్మా
విత్తమారబోసి చిత్తమందును లేక
శుద్ధి గాని భక్తి శోభగాని
కొల్చినట్టి భ్రమను కొట్టుకున్నను రాడు
విభుడు మనదు చెంత! వింత గాదు
ముమ్మూర్తుల రూపమ! మా
సమ్మానము గైకొని మము సాకుమ! గురువై!
యిమ్మహి నడచెడి పథమే
యిమ్మా! దత్త స్వరూప! యెంౘక గుణముల్
కన్నులు తడిపే ఘటనలు
పెన్నును పట్టుకు రచించి పెన్నిధి కథలన్
మిన్నగ జనులకు దెలుపుట
వెన్నును నిమురును! నిశి విడి వెలుగును దివ్వెల్
యండమూరి గారి దీప్తి టపాకు
On యండమూరి గారి గోడ. లంకె:
https://www.facebook.com/share/p/15dkqS7JFf/
మధుమేహము రానీయని
మధువీ తెనుఁగని ప్రతీతి మహిలో జనులా
సుధలొలికించెడి నీతులు
దధిలో చక్కెరలు చేదు తగలదు వినినన్.
లెక్కింౘగ తరమా యే
ఒక్కఱికైనను మహిమలు! ఉజ్జ్వల రూపా
చిక్కులు దీసెడి నిన్నే
మక్కువ పూజించెదమయ మారుతి! తండ్రీ.
జననీ వేంచేసితివా
యనలము రూపుమున! మాకు యాశీస్సులతో
ఘనముగ సేమము నొసగన్!
జనకునికి ప్రణతి తెలుపుమ! చండీ! గౌరీ!
తాత్విక అద్వైతం లో
సీసము: శంకర స్తుతి:
కర్మ ఫలమ్మును కాల్చని కంటికి
తప్పులు ౘూౘుట గొప్ప దగునె?
జ్ఞానమెఱుఁగని పానములైనను
నేర్పవె తండ్రిగనోర్పు తోడ?
వామపు భాగము శ్రీమాత యుండగా
తెవియవా భక్తుల తిప్పలన్ని?
ఇంకా నిదుఱనుంటివేల యోడగ
గరళము నీ ముందు! హర! కపర్థి!
తేటగీతి:
లోక పాలక! నాయక లోపములను
ౘూౘుట సరిగాదుగ! యెట్లు చోద్యమగును?
వాని మాన్పకుండ శిశుల పట్ల యేల
రౌద్ర రసము! కరగుమయ్య యద్రి వాస.
సీసము:
కొండను మోయు కాకుత్స సేవక! మాదు
కష్టములను గాచి కరగి పోవు
వెన్న వంటి మనసు! యన్నుల మిన్నగ
గాౘుౘుంటివ మమ్ము! కరుణ రూప!
దశకంఠు మించిన తనువు మా హృదినందు
పట్టు విధమ్ముగ వంగినావె!
నీ కరుణను దెల్ప నాకు వశమ! తండ్రి
కన్నుల బిందువు కార్చెదనయ
తేటగీతి:
స్మృతిన సతము దలౘుకుంటు! కృపను! మేము
మరచినను గాని విడువక మారుతి! యిల
తోడు యుండి దాటించి యా పీడలన్ని
నిలిపి రామ నామ మహిమ నేర్పినావె!
గాహే తవ జయ గాథా
సోహము భారతి ధరణికి శోభవు నీవే
మా హారతి గైకొని మము
మోహము నుండియు నడుపుమ! పుణ్యము దిశగన్.
జయ సూర్య పట్నము గుడి group:
ఆరంభించెద నుతులను
ధారగ వ్రాయుటకునేడు దమశ హరేశా
నీ రమణీయపు కరుణను
సారించుమ నా దిశగ! కుశలత నొసగుమా
దత్తాత్రేయా! ప్రణతులు
నుత్తమ గుణ శీల! ధాత్రి యుజ్వల భవితన్
చిత్తపు శాంతియు గాచెడి
కత్తరమౌ నీకు పద్య కానుక నిదియే.
కత్తర = కవచము
స్వంత శక్తి నమ్మి సాగించి పయనము
గెలువవౘ్చు కాని గేలి ౙరుగు
విధము పరుల చెంత వేడుట యేలన!
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు.
సీసము:
నీవెట్లు గొప్పవో నీరజ లోచన!
అత్యంత పొట్టి నేనల్పురాల
నాగుండె నిండుగ నేగూడు కట్టనే
అయినను యుంటివి యౘట నీవు
యింత కొంచెము జాగ యెట్లు ౘాలును
తండ్రి! గాని తరలి తల్లి చేరె
ఒకఱికిరువురుండ నుర్వియాయెను గద
నాదు మనసు నేడు! వేద వినుత!
తేటగీతి:
యిపుడు ఘనులింకెవఱయా ప్రహేళిక యిది
బదులు నేను యనక నన్ను పట్టి విడక
కరుణ ౘూపిన ౘాలునే శరణు శరణు
హారతులు గైకొనుమయ మా యార్త పోష!
పాలు తెచ్చి గోరి మేలు శిశువునైతి
భాను మూర్తి నాకు బంధువగుౘు
రక్షనీయ వయ్య రయము చెంతన నిల్చి
వేడి యనను తండ్రి! వీడకయ్య.
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
06.01.2025 సోమవారము
అంశము: వర్ణన (చలికాలము)
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్.
బాలలకేమో బడులట
తేలగలేమే యుదయము! తీయుచు రగ్గుల్
పాలన మిఱియము వేసిన
లోలో మేలగును గాని రోత వెలుపలన్.
పూవులు సైతము తరువున
రావే రంగులగులాబిలసలే లేవే
యీ వసుధ కప్పబడెనిట
యో వరుసన మంచు బిందువులతో సతమున్.
దేవీ ప్రసాద్ గారి ఫేస్బుక్ గోడ పై
"నడక" నేర్పినారు నారాయణులు మాకు
స్వస్థతకు పథమ్ము ౘక్కగాను
ౘూపినట్టి ఘనులు తాపీగ నుండుటే
తగదు యనెదరండి! పగలు రేయి
ఆట వెలఁది
నవ్వు గూర్చి వారు పువ్వు వంటి పలుకు
తీపి రుచిన మనకు తెలిపినారు
ఒదిగియుండు నెంత యెదిగి యున్నను తాను
మార్గదర్శి మనకు! మరువమెపుడు.
అహమసలెరుగని మీరే
యిహమును వదిలితిరదేల యీవీవీ మా
గుహవంటి బ్రతుకులకు రవి
గ్రహమై పంచిరి నగవుల కలిమిని! భళిగన్.
Stars shining ✨🌟
Skies lining
Minimal lightning
Good Night Bhogi
సినుకు రవ్వలు లో సంక్రాంతి కి
గాలి పటమ్ములు యువతుల
కాలికి అందెల రవళులు కళకళలాడే
బాలల భోగి వినోదపు
లీలలు యెగసెడి మంటల రీతుల్ భళిలే.
ముగ్గులు గొబ్బెమ్మలతో
మొగ్గలు దండలు విరియగ ముంగిలి నిండున్
సిగ్గులు కురిపింౘుౘు యే
పగ్గములెఱుగక పఱుగిడు వనితలు భళిలే.
అనిల్ రావిపూడి గోడ పై
ఆట వెలఁది
హాస్యమాడుతూనె హాని కారకలను
మట్టు పెట్టు కథను మాకు పంచి
విజయమందినారు విషెస్సు మీకివే
యనిలు గారు గొనుమ! యద్భుతముగ.
తాత్త్విక అద్వైతం సమూహము
నా గారములన్నీ మీ
జాగాలోనే గద హర! సాగును కోటన్
పాగా వేసితి గాౘుమ
జోగెద మీ వడిననే ప్రచోదనమనుౘున్.
వందనములు చాలవనుచు విడువవలదు
మమ్ము తల్లి! తండ్రి! మదియె మీకు
మందిరముగ నుంచి మసలుచుంటిమి గాద!
కమ్ముకొన్న నమ్మకమ్ము తోడ.
రుద్రా నీవే యొసగుమ
భద్రత లోకము నశించె వనరులు జనులే
నిద్రను మునిగిరి ధర్మము
ఛిద్రమయేనయ! దయగొని క్షేమమునిమ్మా.
వాత్సల్యము గావలెనను తలపును పట్టును మనసే నినుగాంచగ నే
సత్సాంగత్యము విడువక నీకథ శ్రవణము మననముయును చేసెదనే
మత్సరగుణమును బూనిన మనుజులు మాలిన్యముతో గొట్టిన నను నీ
ప్రోత్సాహము నడిపించగ నిను పూజించుచు దరి చేరెద నేనే
వాత్సల్యము గావలెనను తలపును పట్టును నృసింహ! నినుగాంచగ నే
సత్సాంగత్యము విడువక నీకథ శ్రవణము మననముయును చేసెదనే
మత్సరగుణమును బూనిన మనుజులు మాలిన్యముతో గొట్టిన నను నీ
ప్రోత్సాహము నడిపించగ నిను పూజించెద పుత్రికనై మదినే.
శరణమన్నవాని హరి యు హరుడు గాచు
వేరు భావనేల పృథివి వాస!
దండమిదిన ౘాలు నండయై నిలుౘునే
దైవమెపుడు మనకు దారి గూర్చు.
తన హృదిన లోకమెయుండగ
మనకెందుకు భయము బెరుకు మంగళమౌనే
ఘనముగ వెన్నయు వేణువు
కనపడగ కరములనందు! కన్నులు మురియున్.
శంకలేల మనకు శంకరుడుండగా
పంకజాక్షి హిమజ భరతభువిని
వంకలేని విధము పరి రక్షణను సేయు
బింక వీడి పిలుమ విభుని హృదిని.
సామవేదమంటు సంగీతము కొరకు
తల్లి వాణి దలచి ౘల్లదనము
గొంతునుట్టిపడగ కొంతైన వౘ్చునా!
కళలు నేర్చుటెపుడు కాదు సులువు!
గరిమెళ్ళ వారికి
వెడలినారదేల వేంకటేశుని చెంత
నిలచు యానమిపుడె! నిశ్చలముగ!
మొదలు పెట్టినార! పుణ్యాత్మ ప్రణతులన్
మావి దెలుపరండి! మాత పితకు.
ఇంత అందమౌ వసంత కోకిల బోలు
పద్యమల్లలేను విద్య రాదు!
మనసు చిన్నబోయె ప్రణతులిడుటయు నా
పదమునందు పలుకు పట్టలేక.
హనుమా:
నిమరవె యీ శిరమును యో
సుమనస్కుడ! హనుమ నీకు ౙోతలునివియే
యమరెద నీ బిడ్డగ నే
నమస్సులర్పింౘుౘు నువు నా తండ్రివయా.
ధర్మము గాౘగ రావే
నిర్మాతవు నీవు రామ! నేర్పవె గుణముల్
కర్మల ఫలమును బాపే
మర్మము మదిలోన నీదు స్మరణమె కాదా!
https://www.facebook.com/share/p/16KifnciAz/
శివుని కరమున నరుడు
నీ హస్తము ౘాలును నా
దాహములన్నియు జలనిధి దయ నందును యే
మోహములుండక యందును
దేహము శుభముల ఫలముల దీవెన! తండ్రీ.
https://www.facebook.com/share/p/1APxLwfESr/
శివునకు శిలమున పైనను
భవని కర్ణమున నీవె! ప్రార్థన వినుమా
నవవిధ భక్తులసైతము
భవమున బడినే నెఱుగను! పథమునొసగుమా.
ఉదయత్త వాట్సప్లో గణపతికి:
మూలాధారము వంగిన
తేలుట వశమా గణేశ! దీవెనలిమ్మా
యీ లఘు పూజలగొని మము
లాలించుమ శైలజసుత! ప్రణతులు తండ్రీ.
వెంటనే వచ్చిన కాణిపాక వినాయక పాటకు అత్త వాట్సప్ లోనే:
పిలువగనే వచ్చితివా
కలికికి తనయుడవు మాకు కపిలాగ్రజువై
నెలకొల్పవె శాంతి సిరులు
తలవాకిటనే గణేశ! దయగొను దేవా.
వైద్యం గురువు గారికి
తాటంకములే గాచును
యాటంకములను తగువిధమారోగ్యమునే
మూటగ నొసగును గద! యీ
పాటను వింటిని శిశువుగ! బామ్మల చెంతన్.
అవగాహన విద్యా వికాస పరిషత్ సమూహంలో మరుమాముల గురువుగారి సందేశానికి ప్రతి స్పందనగా ఈ పద్యం
కలదు మనపై వినాయక కరుణ గాని
గాంౘమేమో మనము గాన కష్టములను
మాత్రమే దలంచుచు నేడ్చి నేత్రములను
కడలి చేసికొందుమ యిది కాల మహిమ.
వైజాగ్ లో డా కొచ్చెర్లకోట వారి యింటి ప్రక్కన
కొండల రాయ! గొల్చి నిను కొంగున సన్నిధి కట్టుకొందుమే
యండవు నీవు! కర్మ ఫలమంటగ నీయని తండ్రి వై సదా
దండిగ రక్ణనీయవె! సుదర్శన ధారి! వధించి వైరులన్
పండుగ గూర్చుమా! యిలకు వైభవమంతయు నీ దయే గదా.
విశ్వావసు యా పై యే
యశ్వాసము యతన మేలు యందును ధరకున్
శాశ్వతముగ ధర్మమునే
యీ శ్వాసను నింపినంత హేలలె పండున్.
ఒక్కరు యున్న ౘాలును సమున్నతమౌ గుణమబ్బి లోకముల్
ౘక్కదనంబు నేర్పడును సంస్కృతి సాగుౘు వృద్ధి గూర్చి యో
మొక్కను పెంచినట్లుగ సమూహమునందున బాలబాలికల్
ప్రక్కకు పోవనీయని సువాసన గూర్చును తోటమాలియై.
శివకేశవుల ఉయల చిత్రము:
రూపములే ద్వైతము యీ
దీపపు తేజము విరుపుకతీతము! కనులన్
పాపలు నిౙమును ౙదువుట
యే పాపము సేయకున్న యెఱికకు తెౘ్చున్.
No comments:
Post a Comment