Thursday, October 24, 2019

శ్రీ గురు పూర్ణిమ - శ్రీ వ్యాస భగవానుడు

వ్యాస రూపముననొచ్చి మనకి వేదంబులనిచ్చే
పుణ్యపురుషునిగ నిలిచి పురాణాలను పంచే
ఉత్తమగతులనిచ్చుటకు ఉపనిషత్తులనూ సృజియించే
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

శుకుని వంటి పుత్రుని బడసి మోక్షగామి జీవితమును జూపే
కురువంశమును ముందుకు నడిపీ మహిని కోర్కెలకంతు జూపె
సూతుని వంటి శిష్యుని పొందీ ముక్తికెల్ల మార్గముజూపె
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

సత్యవతియనగా సంసారనావ దాటించెడి చుక్కాని
పరాశరుడెవరయా అంటే సృష్టి రహస్యాన్ని చేధించినవాడు
ఇట్టి వారి సుతుడింకెంతవాడయా ఇలలోన దైవమే
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

యుగములెన్ని గడువనీ అవతరణలు ఎన్ని జరుగనీ
పరమార్ధమ్మొక్కటే పరాత్పరుని చేర్చుటే
ప్రతీ జీవినీ మరీ ప్రతీ కల్పమందూ
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

ఆదిగురువ తొలుత మొదలిడే
అత్రి పుత్రునిగానూ అవతారమందే
గురువుయన్న జ్ఞానదీపికే కదా
గారవించి వారిని కొలుచుకుందమన్న

సప్తర్షులకునూ దక్షిణామూర్తిగనుండే
కుమారస్వామి తానె రమణ మహర్షి ఆయె
గురువుయన్న జ్ఞానదీపికే కదా
గారవించి వారిని కొలుచుకుందమన్న



శ్రీ దత్తుడు
_______&&


త్రిమూర్తుల రూపుడూ
త్రిగుణాతీతుడూ
త్రిపథగామిని వందితుడు
త్రినేత్రాలంకారుడూ
త్రికాలవేదీ త్రైలోక్య పతి
త్రిసంధ్యలయందు పూజనీయుడూ
త్రివేణీ సంగమందుయూ యుండునూ
తనను తలచినంతనే మనను రక్షించునూ

No comments: