Tuesday, June 22, 2021

ఇతర ఛందములు

స్రగ్విణీ

తల్లి!నే నెప్పుడున్ దల్తునిన్ భక్తిగన్
మల్లెలే యల్లెదన్ మాలగా బేర్మితోన్
బల్లవించున్ సదా భక్తి పాటల్ మదిన్
జల్లగా జూడుమా శాంభవీ! మమ్మిటన్


[04/06, 22:58] Durga Madhuri: ఆదిదేవుండవే యంతరాత్ముండవే
వేదముల్ గాచగా వీరయోధుండవే
వేదనల్ బాపరా వేంకటేశా! సదా
నీదు రూపంబునే నిల్పెదన్ నామదిన్

రెండవ స్రగ్విణీ పద్యము
[04/06, 22:59] Durga Madhuri: 3

బాధలన్ బాపుమో పాండురంగా సదా
సాధనల్ సేసి నీ సన్నిధే గోరెదన్
వేధకే తండ్రివౌ విఠ్ఠలా నీ కథా
బోధనల్ తోడనే పుణ్యమున్ బొందెదన్


హరిగతి రగడ
బాలుని బ్రోచిన దేవుని గారము ట్టెడి భాగ్యము నిమ్మని వేడె
మేలుని గూర్చెడి ధర్మపురాధిపు మిన్నగు భాగ్యము నిమ్మని వేడె
తాని బాధను దీర్పెడి సింగము తండ్రగు భాగ్యము నిమ్మని వేడె

వేలిని పట్టుకు ముందుకు రమ్మని బిల్చెడి భాగ్యము నిమ్మని వేడె 

మానిని
భాన సేసెద పావన మూర్తిని భార్గవి నాథుని క్తిగ నే
సేలు జేసెద చిన్మయ రూపుకు సేమము నిచ్చెడి శ్రీహరి యే
దీవెన లందలి తేజము నందెద దీక్షగ గొల్చెద దేవుడినే
గోవుల పాలుని! గోటిన! ధాటిగ కొండను నిల్పిన కుబ్జ పతిన్


మానిని
మాస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రముతో
దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత బాధను దీర్చుననీ
మేక పుత్రిని మీనుని యన్నల మిన్నగు తల్లిని మేదిని నే
గాము జేసెద కామిత దాయిని ష్టము బాపెడి గౌరిని నే

పంచ చామరమూ. యతి 10వ అక్షరము. గణములు. జ,ర,జ,ర,జ,గ
శివా! హరా! గిరీశ! చంద్ర శేఖరా నమస్కృతుల్
భవాంతకా హలాహలమ్ము బాధనే భరింతువే
దవాక్షుడా దయా స్వభావ! దైవమీవె గావుమా
స్తవమ్ము జేసెదన్ చిదాత్మ! సాధు పోషకా ప్రభూ
మేదురదన్తమ్
తాంవ మాడెడి పార్వతి నాథునితామస నాశుని ప్రార్థన జేసిన
గంము లేవియు నీదరి జేరవుగావున శంభుని గొల్వరె నిత్యము
పాంవ మధ్యముడెన్నియొ పొందెనుపాశుపతాస్త్రము గూడను; మేదిని
భాంము నంతయు గాచెడి శంభునిపాడుచు స్తోత్రము జేయరె! నిత్యము

మేదురదన్తమ్
రాజ్యము వీడుచు కానల కేగిన రాఘవ! మంధర మాటలు నగ్నికి
యాజ్యము పోయగ కైకకు నీవుగ ర్షము పంచుట కోసము రాజగు
భోజ్యము త్యాగము జేసిన వాడిగ పూజ్యుడ వైతివి లోకుల దేవర!
యాజ్యము కోసము బంగరు బొమ్మను యాలిగ నిల్పిన నీకిదె మ్రొక్కెద
అల్పాక్కర

సుతులు సలుపు సేవ శుభమొసంగు
సతము వదలకున్న జయమునందు
పతనమెన్నడు గారు బంగరమ్ము

హితము గలుగును మహిని! నిజము

మేదురదన్తమ్

పుట్టుట గిట్టున మధ్యన యున్నది మోయగ లేనిదె భారము యందురు
ట్టిన పట్టును వీడక యాత్మలు బంధము మధ్యన వేగుచు యుండును
ట్టిది లోకము మాయయు భ్రాంతియు ద్దని వేడెద నిన్నని నేనిట
ట్టపలీశుడ బ్రోవుమ నిత్యము మ్మిట నిర్వృతి నీయుమ దేవర

9.

భుజంగ ప్రయాత్తము

హరీ నిన్ను నిత్యంబు నర్పించు  భాగ్యంపు

వరంబీయవా మాకు పద్మాక్షవైకుంఠ

పురాధీశమాకిమ్మమోక్షంబుమాదేవ!

ధరానాథకారుణ్య ధామాసతీ భ్రాత!

10.

కంద వృత్తము గురువర్యా

హరీ నిన్ను నిత్యంబు యర్చించ భాగ్యంబు

వరంబీయవా మాకు పద్మాక్షవైకుంఠ

పురాధీశమాకిమ్మమోక్షంబుమాదేవ!

ధరానాథకారుణ్య ధామాసతీ భ్రాత!

కంద గర్భిత భుజంగ ప్రయాత్తము

ఉత్సాహము

న్ను తింటి వేల నోయి మాయఁ జేయు బాలకా
వెన్న ముద్ద తిందువోయి వేగ చెంత రమ్మయా
న్నిధీయవేల మాకు శాజ్ఞ్గధారి! శ్రీహరీ
న్నుతింతునోయు రంగశాయి! దేవ మాధవా

తోటకము (ఛిత్తక , భ్రమరావళి , నందినీ) - నాలుగు స గణములు, 3వ గణము 3వ అక్షరము యతి స్థనము, ప్రాస గలదు


రిపత్నిగదా సదయాంబుధియే
సువందితగా తనచూపులతో
మిచ్చెడియా మధుబాలకుడే
మోడ్తుసదా గజగామినికే

No comments: