Sunday, March 13, 2022

మయూఖ పోటీలకు

 పిల్లల కొఱకే బ్రతుకులు సంసారమ్మున

మాయలు మోసము కోపము వలదెపుడు

పరులకు చేయు మేలు కాచు స్వంత బిడ్డలను!

ధరణి క్షేమమే రక్ష తరతరములకు!



అమాయకులను వంచింౘవలదు

అల్పులపై అధికారము కూడదు

స్వార్థ గుణము స్థానే సాయమందింౘవలెను

సానుభూతి పలుకులేమిటికిని కొఱగావు


తరువులేడవవు గద తరగని దయను జూపున్

పారు నీరు కాదు అవని మాత కంటి నీరు

మరి మానవులకేల రాదు మంచితనము

తల్లి గుణము లేని తనయుడుండునా



కళల విడువవలదు గళము పండవలయు

మనిషి మనుగడకు మూలము పూర్వులు

బ్రతుకు సరళి గనుక వారధులై మనము

నిల్ప వలయు వానిఁ; నిఖిల జగతి


మాతృభాష వీడి మనిషి మనలేడు కల్లయా

చిన్నతనము గాదు, చికాకు పడబోకు

స్వంత వాని వీడి సాగిన మనలేము

జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


[

ఆత్మ నింద వలదు ఆత్మ స్తుతియు వలదు

తప్పు ౙరిగెననుచు తడబాటు వలదు

మెప్పు కొఱకు నెపుడు దిగజార వలదు

ఆశ వలదు అణకువ మేలొనర్చున్



శాస్త్ర విద్యకెపుడు విలువయుండు

ౘదివినంత కలుగు జయము

జయము కలిగినంత వీడ వలదు వినయము

ఆలకించవలయు నాణిముత్యమీ మాట



పరాభవమ్ములైన పగను పట్ట వలదు

మార్పు సహజమనచు సహనముండవలయు

ఓర్పు, మౌనములను ఆభరణమ్ములు

అండ, రక్షణనొసఁగు! సత్యమీ వాక్కు


ఎట్టివారైననూ ఏదో ఒక తరుణమున

మేలు చేరగలరు! కాలమహిమ

గాన నెవఱినైన దూఱ(నిందింౘ) వలదు, 

దూరము చేయ వలదు! తెలిసి మసలు కొనుమ


విజయమైన మరి వినాశనమ్ములైన

శాశ్వతమ్ము గాదు ధరణినందు గాన

నిశ్చల స్థితి మేలు! వీడ వలదు

చింత చేయబోకు దేనికైనన్

No comments: