Saturday, March 12, 2022

10,000 భారతము

 1.  Line 73, 80, నిశ ఛందము, ప్రాస కలదు, న, న, ర, ర, ర, ర గణములు, యతి 9

నిశ/ న  న, ర, ర, ర, ర , యతి - 9

నలుడు నిషధ రాజ్య నాథుండు రాయంచ పల్కంగనే

లలిత సుగుణ శీలి లావణ్య సౌందర్య రత్నంబు యై

వెలుగు వనిత యైన భీష్ముం సుపుత్రిన్ కళత్రంబుగన్

వలచుచు దమయంతి పై చింతతో నుండ సాగెన్ సదా


2. సింహరేఖ, ప్రాస  కలదు, యతి లేదు, ర, జ, గ గ గణములు, యతి లేదు, 4 పాదములు, సప్రాస 

167 line 187 Poem#

సింహరేఖ / ర, జ, గ, గ, యతి లేదు

రాజహంస జాగు లేకన్

రాజకన్య చెంత కేగెన్

రాజపుత్ర వీర గాథల్

రోజు తాను దెల్ప సాగెన్

3.

ఫైల్ లో తోదకము లేదా పాదపము, భ, భ, భ, గ, గ ప్రాస కలదు, యతి 7, 71 in order, 114 in File

(ఛందంలో)

దోదకము (తోధక , తోదక , తోటక , దోధక , తరంగక , బందు , భిత్తక)

తోదకము / భ, భ, భ, గ, గ , యతి - 7

కంతువ = హృదయము, ప్రాసాక్షర పద కోశము

కంతము = సుఖయుక్తము, ప్రాసాక్షర పద కోశము

అంతట నా దమయంతి దలంచెన్

పొంతుము నా గుణ భూషణుతోడన్

కంతువ నందున కాంచుచునుండెన్

కంతము నాతడె గమ్యము నెంచెన్

4. మంగళగీతి, 4 ఇంద్ర గణములు, 3వ గణాద్యక్షరము యతి

సురులను వలదని సుదతియె వలచెను

నరుఁడగు నరపతి నలునకు వేసెను

వరమాలను స్వయంవరమున ముదమున

కరముల పట్టెను ఘనముగ దమయంతి

న న న భ న ల గ 10 గగనమణి


5. గగనమణి/ న, న, న, భ, న, లగ, యతి - 10, 40th row 44# in order

అలిగిన కలి పురుషుడంతట కసిగ మదిన్

బలిగ నలుని చెఱను పట్టు దలపును గనెన్

విలువలనెపుడు విడడు! వీరుడు నిషధ ధరన్

వెలుగు సుచరితుడట వేసెనొక పరి కడున్


6. పృథ్వి (అప్పకవి)/ జ, స, జ, స, య, వ యతి - 12

20 Line, 89 order

ప్రమాదకరమౌ యశౌచమును పట్టె! పాదమ్మునన్!

తమో గుణము నిండె జూదమున దమ్ముతో నోడగన్

సమస్తమగు రాజ్యభోగములు శాంతి యంతంబయెన్

శమించుట యసాధ్యమౌ సరళిఁ సర్వనాశంబయెన్


7. నాగర / భ, ర, వ - యతి లేదు 102 row 78 order

హానెను = విడచెను

కానలకేగె పత్నితో

దీనత నిండగా మదిన్

మేనును గాచు వస్త్రమున్

హానెను భుక్తికై యిటన్


8. మధురాక్కర / 1 సూ + 2 ఇం + 1 చం, యతి - 4వ గణాద్యక్షరము 

కలిపురుషుని ప్రభావమ్ము కలుగంగ తలపునందున్

లలిత సుకుమారియు హృదయ రాణియు యని జూడక

నలుడు దమయంతిని వనమున విడచి యొంటరిగా

వెలుగు రేఖ విరియకనే వెడలెను నిస్పృహతో


9. అంతరాక్కఱ / 1 సూ + 2 ఇం + 1 చం, యతి 3వ గణాంత్యక్షరము

అంత నిదుఱ మేల్కొన్న యా దమయంతియె

చింత పడుచు లేచి నడచి సాగుచుండ

వింత సర్పము యొకటి విషాదముగ

అంతమొందింౘచబోయె నపుడు వచ్చిన


10. స్వాగతము / ర, న, భ, గగ - యతి 7, 171 row, 196 order

వేటగాడు తన వేటును వేసెన్

కాటు వేయదగు కర్కటి పైనన్

మాటునుండియె మానిని గాచెన్

చేటు చేసెడి చెడ్డ తలంపున్


11. అల్పాక్కర / 2ఇం + 1 చం - 3వ గణాద్యక్షరం యతి


వలచి పొందెడి ఆశ పడి ఆతను

నలుని పత్నిని చేర నడచి వచ్చెన్

ఫలితమాతనికి శాపమునిచ్చిన

కలికి! ముందుకు సాగె కాన నుండి


12. మధ్యాక్కఱ / 2ఇం + 1 సూ + 2 ఇం + 1 సూ 4వ గణాద్యక్షరం యతి

అనల కీలలచిక్కి నట్టి యగమగు కర్కోటకమును

వనము కావలకు గొంపోవఁ వరముగ కాటును వేసె

తన సాయమునకు బదులు యిదాయన్న నలునితో పలికె

మనుగడ కొఱకు నయోధ్య మహరాజు ఋతుపర్ణుఁ గలిసి


13.

మహాక్కఱ / 1 సూ + 5 ఇం + 1 చం యతి 5వ గణాద్యక్షరం

యతని కొలువు నందున జేరి నేర్పుమయశ్వ హృదయమును! శుభ వేళన

క్షితిని దరిమి రక్షణనొసగి సతముక్షేమము నిచ్చు నక్ష హృదయము

బ్రతుకు నందు పట్టిన శని వదులును భావి రోజులనంత మేలు కల్గు

సుతులు సతితోడ జేర్చును శీఘ్రము శోభనిండును రాజ్యముయు దక్కును


14. మనోరమ / న ర జ గ 7 యతి స్థానము 86th line  135 order

యని యొసంగె మాయ వస్త్రమున్

మనవి జేసె నీమ దీక్షతో

తనను దల్చినంత సత్యమౌ

తనువు రూపమంద వచ్చునన్


15. చంద్రవర్త్మ / ర న భ స యతి 7 174 row 51 order

యంత = రథ సారథి, కంత = గడుపు

అంత నా నలుడు ఆ పలుకులతో

చింత వీడి నృపు చెంతకు వెడలెన్

యంతగా నట నియంబితుడవగా

కంత సాగెనిక కాలము నచటన్


16. మంజు భాషిణి / స జ స జ గ యతి 9

186 in row 114 order in excel

సుమబాల వంటిదగు శోభనాంగి యౌ

దమయంతి కానలను దాటి సాగుచున్

అమ రీతి నింట తన నాదరించు యో

కమలాక్షి జీవితము కాచుచుండగన్

17. హరిహర / భ జ న త యతీ 7 File 200 row96

తారి = సూత్రధారి

చేరెను విదర్భ చెదరె కష్టమ్ము

చారులను పంపె సఖుని కోసమ్ము

తారిగ సమస్త ధరను గాంచెను

పారె పథకమ్ము పతియె దక్కంగ


18. 68 101 యతి 16 బంధురము న న న న స భ భ భ గ

ఖలత = దుష్టత్వం ప్రాసాక్షర పద కోశము

నలుడు రథము నడుపు విధము గని యానందముగా ఋతుపర్ణుడనెన్

తెలిపెదనిపుడొక ఫలములనొసగే తీరగు విద్యను యక్ష హృదినే

నలత కలత యలత ఖలత లను యేనాటికి నింక నగుపించవికన్

మలచుకొనుమ మనుగడనిక యనగ నామానవుడశ్వ హృది నేర్పి ౘనెన్


19. కమల విలసితము / న న న న గ గ యతి 9 59/26


కలిసెను ఇరువురు కరగెను బాధల్

గెలిచెను రణమున కిలకిల మ్రోగెన్

పలుకుల నగవులు పగలును రేయిన్

ఫలశృతి దలచిన ఫలితము దక్కున్


20. 66 100 10 ఫలసదనము న న న న స గ

నలుని చిలుని దలచిన కలి పురుషుండున్

తొలగి తరలి వెడలు! దొఱకును ఫలమ్ముల్

కలిమి కలుగు త్వరిత గతిన యను వాక్కున్

పలికె సురులు నరుల ప్రగతి సులువంచున్


No comments: