Tuesday, March 8, 2022

అంతయు నీవే కీర్తనకు అనుకరణ

 అంతయు నీవే హరి పుండరీకాక్ష! నా

స్వంతమంటు లేవే పంచ ప్రాణములైనా ||అంతయు నీవే||


జననము నీదే జగతియు నీదే జలజాక్ష దేవా ||2||

మననము మదిలో వీడనయ్య మాధవా హే మధూ సూధనా ||2|| || అంతయు ||


భువనము లన్నీ నీ యేలికలే పుణ్య స్వరూపా పురుషోత్తమా ||2||

కువలయ నేత్రా వైకుంఠ నాథా కోరేను నీ సాన్నిధ్యమే ||2|| ||అంతయు||

No comments: