గణతంత్ర దినోత్సవ కవితల పోటీకి:
28.01.2024 మంగళవారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
*పద్యములు:*
మేదురదన్త వృత్తము, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము, 8 భ గణములు.
కాలము చెల్లెను రాౙుల పాలన గానగ రాదిల దేశపు భాగ్యము
మేలును దాగెను చిత్తము శుద్ధిగ మింటి సమమ్ముగ నుండెడి చేతిన
వాలు జయంబులు ముంగిట భావి తరంబుకు స్ఫూర్తి విరాజిలి
బేల తనంబసలుండదు ప్రీతిగ రాజ్యపుటమ్మును నేర్చిన
ఏడు దశాబ్దములైనను
వేడుక మానక నడచిన విజయమదగునా
కీడును దరిమిన నేతల
ౙాడన సాగుట మన విధి! స్వస్థత కలుగున్.
మార్చుచు పాత విధంబులు
నేర్చి వినూత్నపు సరళులు నేతలమైనన్
గూర్చును జయమా విధియే
చేర్చుమ యావిష్కరణలు శిశువుల కొఱకున్.
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
19.04.2024 ఆదివారము
సంక్రాంతి పై పద్యముల పోటీకి
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు నా స్వీయ సృజన, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
*వాణీ: ర న భ భ ర వ యతి 13*
ఆకశాన నడయాడెడి దేవతలార! భూమి పై
మీకు మోదమును పంౘుట కోసము మేము చేయు యీ
సోకులన్ని గని దీవెనలీయరె! జ్యోతులైన మీ
రాకకై యిౘట ౘూచెడి లోకుల రక్ష సేయరే.
*అంబా: భ భ ర వ; యతి 7*
ముంగిట ౘక్కటి ముగ్గు లద్దియా
ఛెంగున యాడెడి యాడపిల్లలే
నింగిని దేవత నిండు రూపమై
పొంగలి పండుగ ముందు నిల్పునే.
*నాగర: భ ర వ, యతి లేదు.*
మంటలు భోగి రోౙునే
వంటలు యన్ని వేళలూ
పంటల పుణ్యమా యనే
యింటన సందడే సదా.
*ధరధన్వితాళ: ర న, యతి లేదు.*
గాలిలోన
తేలుచుండు
బాలలాడు
యాలయాలు
*సీసము:*
గాలిపటాలేగ గగనసీమను చేరి
బ్రతుకు విలువ తెలుపగలవు మఱి
నేల పైనను ముగ్గు నింగిన పటములు
ఉదయము మంటలు హృదిన వేడి
బొమ్మలు వంటన పులుసులు తరువాత
భోగి పండ్లు భళిగ మొదటి రోౙు
పొంగలి కూరలు మురిపెములన్నియు
సంక్రాంతి నాడు ప్రసారములుగ
తేటగీతి:
కనుమ నాడు తర్పణములు మినుములంటు
కాకి కూడ కదలదుగ! గంగిరెద్దు
తోటి హరిదాసులు తిరుగు మేటి కళగ
విరిసి వెలుగు పండుగ గద! సిరులు చిలుకు.
*కర్నూలు జిల్లా కవితా సంకలనం కోసం*
అంశము: *సామాజిక అభ్యుదయము*
28.01.2025 మంగళవారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
ఉత్సాహము: 7 సూర్య గణముల పై ఓ గురువు, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము.
1.
కల్లకపటమెఱుఁగనట్టి కలిమి బాలలమది యే
యెల్లలుండనట్టి పేర్మి యింట పంౘుౘుందురే
ౘల్లదనము గాక కుళ్ళు జ్వాల నింప వలదవే
పల్లమునకు నడిపి ముంౘు భావికాలమందునన్.
2. ఉత్సాహము:
స్వార్థగుణము మొదటనుండు బాగుగానె గాని యే
యర్థమొందబోదు భవితనందు ముంచి మ్రింగునే
వ్యర్థమౌ తలపులు కుట్ర వంచనలు మదముయు యీ
స్పర్థలన్ని దీసి మంచి వర్తనమును నడువుమా
3. ఆట వెలఁది
తుదకు నేమి వెంట తోడ్కొని పోముగా
ధాత్రి నున్న వేళ తగవులేల
కలిమదెంత యున్న కలకాలమందదే
స్వార్థగుణము మేల!? వదులమండి.
*జాతీయ తెలుగు పరిరక్షణ సమితి*
*విశ్వవసు ఉగాది కవితల పోటీ కొరకు*
అంశము: *నేటి తెలుగు భాష స్థితి గతులు*
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన అని హామీ ఇస్తున్నాను.
*పద్యములు:*
1. *కందము*
జీవన విధములు తెలిపెడి
నావకు చుక్కాని వంటి నానుడులేవీ
రావయె నేటి తరమునకు
భావము పదమే యెరుగరు భాషయు మరుగే.
*ఆట వెలఁది*:
2.
నాటి సూక్తులన్ని మేటి నడిపి మన
బ్రతుకు బంధములను పట్టు విడుపు
పండుగలన వలయు పద్ధతులన్నియున్
తెలియ జేయు; నేడు పలుకరెవరు.
3.
భుక్తి రుచులు గాని యుక్తికి మూలమౌ
ధాన్యపు సిరి విలువ శూన్యమాయె
భాష నందు గాని బ్రతికెడి రీతిన
గాని తెలుగు వెలుగు కానరాదు.
4.
భావ గర్భితములు పద్యములన్ని యా
నవరసముల నిధులు కవనములును
స్ఫూర్తినొసగు గాని ప్రోత్సహింౘవు యిలన్
దుష్ట బుద్ధి; వలదు ద్రోహమనును.
5.
యుద్ధ కాంక్ష గాక నుర్వి హితము గూర్చు
చర్యలన్ని నేర్పి జైత్ర యాత్ర
వైపు గమన విధము పాఠముగ దెలుపు
శ్లోకశనిధులు గలవు! చూడరండి.
6.
గీత భాగవతము కృష్ణ రాయల వారి
భక్తి గాథలన్ని పద్యములుగ
రక్షనొసగు గాని రారు నేటి యువత
వాని నేర్చుకొనగ! పాతశయనుచు.
7.
పశ్చిమాద్రి గాంచి భానోదయములన్ని
విడచి వ్యథల పడుచు కడకు బ్రతుకు
దుఃఖభరితమవగ దోసిలిన ముఖము
దాచుకొనుచు యేడ్చు తరము నిదియె.
8.
గొప్ప కవుల సేవ గుర్తించు కనులేవి
భరత జాతి దాటి బయటనున్న
వారు నయము సేవ బాగ సేయుచునుండె
తెలిసి తెనుఁగు భాషతీయదనము.
సాహితీ చైతన్య కిరణాలు సమూహము కొఱకు
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రణతులిడుతూ...
30.01.2025 గురువారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్.
9963998955.
1.
తేటగీతి
నీలి మేఘమాలికలేమొ నిండె రంగు
తెల్ల దనము కారణము యాదిత్యుడుండె
తల్లి తాటంకముగ గాన ధగధగలను
గగన సీమ గాంచెను చిరు నగవుతోడ.
2.
సూర్య మండల సంస్థిత శోభనాంగి
లక్ష్మి భాను మండల వాసి భ్రమర పూజ్య
వీరి సఖియ వాణి రథము బృందమవగ
కాంతివంత యాదిత్య నీ కళలు మెండు.
3.
భువిని మేలు చేయు పుణ్య నదుల నీరు
త్రావకుండ వదలి లవణమున్న
యబ్ధి గణన మాకు నంద జేసిన ౘాలు
కృపను ౘూపుమయ్య నృపుల పూజ్య
4.
కర్మసాక్షి వైన కాచి మా దోషముల్
మంచి బుద్ధి నొసగి మలినములను
తొలగ చేసినంత తూర్పున యున్న నీ
దయను యెఱిగి జనులు ధైర్యమందు.
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
#######################################
విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య, విజయనగరము వారి
శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ రాష్ట్ర స్థాయి పద్య రచనల పోటీకి:
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన. దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
1. స్వాగత వృత్తము, ర న భ గ గ గణములు, యతి 3 వ గణాద్యక్షరము
స్ఫూర్తివంతులుగ ముందుకు రారే
కర్తలై నడిపి కార్యములన్నీ
యార్తి చేయుచు ప్రయాస లేకన్
పూర్తిగా సలిపి మోదమునీరే
2. ద్రుత విలంబితము:-- న, భ, భ, ర. యతి 7వ అక్షరము.
మనసు పెట్టుటె మంత్రము బాటనన్
తనువు శక్తికి ధామము నిల్పి భూ
వనము నింపరె పూవులు పండ్లతో
కనుల నిండుగ గర్వము పొంగగా.
3. ద్రుత విలంబితము:-- న, భ, భ, ర. యతి 7వ అక్షరము.
పణము వద్దని ప్రాణము నెప్పుడున్
రణము మాన్పరె రక్షణ సేయరే
తృణముయున్నను తృప్తిగ సాగినన్
మణులు దక్కును మంగళమే ధరన్.
4. అంబురుహ:--భ భ, భ భ, ర స వ .యతి మైత్రి 13
విద్య వివేకము నేర్చుచు నందు ప్రవీణ్యమందిన మేలగున్
సేద్యము వీడక పంటల మెండుగ సృష్టి చేసిన దండి నై
వేద్యము వేరుగ పెట్టగనేల సుభిక్షమవ్వగ నేల యే
వాద్యము చెప్పగ లేదు వసంతపు పాటలన్ తమ నోటితో.
5.
వంశస్థ:-- జ, త, జ, ర . యతి 8వ అక్షరము.
ప్రమాణమున్ చేయరె! బాట నందు యే
ప్రమాదమున్నన్ తగు భద్రతందియే
ప్రమోదమౌ గమ్యము వైపు యానమున్
ప్రమత్తతన్ సాగిన భాగ్యమౌననిన్.
6. ఇంద్ర వంశ:-- త,త, జ, ర యతి 8వ అక్షరము.
మద్యంబు త్రావంగ ప్రమాదమేగదా
యుద్యోగమే యున్న ప్రయోజనంబగున్
విద్యార్థి యైశ్వర్యము విత్తు మూలమే
పద్యాన సందేశము పట్టి మారుమా.
7. పాదప వృత్తము(తోవక):-- భ భ భ గ గ యతి 7వ అక్షరము.
మాదక ద్రవ్యము మత్తు విపత్తే
వాదనలేలన వద్దనరండీ
చేదుగ నున్నను శ్రేయము గూర్చే
వేదము వంటిది విద్యయె చాలున్.
8. సుగంధి వృత్తము 7 హ గణములు పైన గురువు యతి స్థానము 9వ అక్షరము.
మత్సరంబు స్థానమందు మంచి యన్న మాటనే
కుత్సితంబు లేక తీపి గుర్తుగాను ధాత్రితో
వత్సయన్న మేటిదైన బంధమున్న చాలుగా
వత్సరంబు మారినట్లు వార్ధి మారదెన్నడున్.
9. రతోద్ధత:--ర, న, ర, వ. యతి 7వ అక్షరము.
ఆకలన్న యపుడారగించుమా
లేకి యాశ మది రెక్క ద్రుంౘునే
నాకమన్న యది న్యాయ బుద్ధియే
ప్రాకబోకు యతి పైకమందగన్.
10. ఉపేంద్ర వృత్తము - జ, త, జ, గ, గ గణములు యతి 8వ అక్షరము.
ప్రయోగశాలల్ మన వాసమై
ప్రయోజనాలే తగు లక్ష్యమై
ప్రయత్నమే చేసిన పండునే
ప్రయాణమందున్ మరి పంటలే.
11. తరలి వృత్తము:-- భ న న జ న ర యతి11
పెద్దల పలుకులె మనకు పెన్నిధి తగు రీతినన్
హద్దుగ మసలుచు ననునయంబుగ మరి సాగుచూ
యొద్దికగ నడచిన భవితోన్నతమగు నేర్చినన్
విద్దెను యనుభవము గల వీరి సరసనన్ భళా.
12. పంచచామరము: జ ర జ ర జ గ యతి 10వ అక్షరము.
నిరాశవీడి సాగనట్టి నింద యున్న వేదనన్
నిరంతరమ్ము మోయనేల నిత్య మల్లి మీరెగా
నిరీక్షణంటు చేసినంత నిప్పు గూడ యారునే
నిరామయంబగున్ ధరన్ ప్రణీతమౌను యానమే.
##############################££££#####£
మహా కుంభమేళా పోటీలకు:
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
శంభుని దయకై సాగుౘు
కుంభము నందున మునుగుట కొరకై యేగెన్
డంభము నెరుగని జనులే
గంభీరముతో నదులు సగౌరవమందెన్.
నూరేండ్లకు పైబడెనే
యీ రీతిగ కుంభము మన యిల చేరుటకై
ధారగ నీరే పారగ
తారకలే గాంచె దృశ్య ధామము ప్రియమున్.
మూడు నదులలోన మునక యొక్క పరియె
ౙరుగ జలధి కరుణ యుర్వి చేరె
వేరు వరములేల ప్రియమార యంజలి
దెలుపుకున్న ౘాలు! తీరు ఋణము.
వాగ్దేవి సాహితీ వేదిక కొఱకు
నానీల పోటీలకు
06.02.2025 గురువారము
1.
శలవుల కోసం
ౘూడదు పడతి
విరామమెరుగని
భూమే ఆమె కద
2.
తూరుపు
గడియారము
గంట కొట్టె
పడతి మెలకువ చూసి
3.
ధనము నవ్వింది
బిడ్డను కాదని
డబ్బును కొలిచే
మగడిని ౘూసి
4.
అంతరిక్షమే
తిరిగి పంపినా
అతివను
రానీయరేలా
5.
కూడును పెట్టిన
చేయి నరికే
నరులకె రోౙులు
పాపం పండే వరకే.
సాహితీ చైతన్య కిరణాలు సమూహము కొరక
18.02.2025 మంగళవారము
అంశము: తెలుగు భాష
[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా]
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
సీసము:
ఇతర భాషలలోకి యిముడుౘూ మార్పులన్
సుళువుగ నందెడి జ్యోతి తెనుఁగు
యిలను మురిపెముతో యింపుగా తిరుగాడు
మువ్వల సవ్వడి ముగ్ధ పరుగు
విడువ వలదు మాతృగడపను పలుకును
వృద్ధికదియె చెట్టు 🌲 వేరు నరుడ!
అందరు మెచ్చిన సుందరమైనది
వర్ణింౘనలవియ! పదములందు
ఆట వెలది:
పాలరాయి వంటి ప్రసన్నత గలిగి
వసుధ యంత ఖ్యాతి పట్టినట్టి
యందమైన భాష యాంధ్రులకే దక్కె!
అౘ్చు
తోడి ముగియు యద్భుతంబు.
Murthy Garu WhatsApp 9704867867
నమస్కారం అండీ, ద్విపదల సంకలానికి నా సమర్పణము:
28.02.2025 శుక్రవారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
ఈ ద్విపదలు నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
*ద్విపదలు:*
1.
సత్యసంధత గాని స్వచ్ఛత యైన
నిత్యముంచరు మది నిజమే యెరుగరు
2.
ముసుగుతో సులువుగా మోసమే చేసి
యసలు రూపంబు ప్రయాసతో దాచి
3.
మనసను సాక్షిని మరుగున వేసి
మనుగడ సాగించు మనిషియె విషము
4.
పక్షపాతము ద్వంద్వ వైఖరి వంటి
లక్షణములతో విరాజిల్లుచుండు
5.
స్వార్థపరులతోడ సంసారమైన
వ్యర్థమే యైననూ వదలగలేము
6.
నదులను మార్చక నరకముగ పలు
చెదల పూరితమగు చెత్త పేర్చకుమ
7.
తరువులు నిధులు స్వార్థ పరుల వలన
కరుగుచు నుంటివి కాపాడ వలెను
8.
స్వస్థత కోసము స్వచ్ఛమౌ తలపు
దుస్థితి బాపు వ్యవస్థను మార్చు
9.
మంచితనంబును మనుజులలోన
యెంచిన గనమే సహించుటె దారి.
10.
తపములెన్నియు నున్న దాటగ వశమె
అపమృత్యువును విధి యాట యిది గద!
###₹####₹₹_&-+()////////&--+())@₹_&+()////////))/
శ్రీ మాత్రే నమః
అవధాన విద్యా వికాస పరిషత్ వారు నిర్వహించే పద్య ఖండిక పోటీల కొఱకు:
హామీ పత్రము:
ఈ పద్యముల రచన నా స్వంతము, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
1. తేటగీతి
ధరను వత్సరముల సంఖ్య పరుగులిడుచు
యో సహస్రము దాటగ యుత్సవములె
భరత సీమ హద్దుల వద్ద పొరుగు వారు
చిౘ్చు రేపగ యుద్దపు మౘ్చ రగిలె.
2. ఆట వెలఁది
ఱెండు వేల యేండ్ల పండగ ముందరే
దండయాత్ర చేసె దాడికి దిగె
కుట్ర పూరితముగ తమ కూటములను
ఱెచ్చ గొట్టి రణమునకై లేవదీసె.
3. ఉత్పలమాల
కంచెను దాటి శత్రువులు కత్తులు కాల్పుల తోడ వీరులన్
ముంచుటకై చరించగ సమున్నతులైన జవానులంత యా
పంచకమందు చేరి తమ పట్టు బిగించి జయంబునందిరే
పంచిరి సంతసంబు తమ భావి తరంబుకు కీర్తిమంతులై.
పంచకము = యుద్ధభూమి
4. ఉత్పలమాల
వంచన చేయు రక్కసులపై తమ శక్తిని చూపుచు పారద్రోలి యా
మంచును లెక్కసేయక ప్రమాదము పట్లను భీతి లేక గా
వించిరి పోరు సైనికులు వీరులు భారత మాత బిడ్డలే
కంచెగ నిల్చినారు మన గడ్డకు ప్రాణము లెక్క సేయరే.
5. ఆట వెలఁది
అంత వఱకు జనులు స్వంత పనుల వైపె
దృష్టి నిలిపి యుండె సృష్టి రీతి
నదియె గాగ గాని యటు పైన మాత్రము
సైనికులకు తోడు సాగె సతము.
6.
ఉత్సాహము; చతుష్పాదము, సప్రాస, 7 సూర్య గణముల పై ఓ గ గణము, 5వ గణాద్యక్షరము యతి స్థానము.
మదిని లేదు చింత భరత మాత రక్ష కోసమై
పొదలు మాటునుండు శత్రుమూక చీల్చు మీ
చెదరనట్టి శక్తి యుండ! క్షిపణి నైన ద్రుంౘుౘూ
యదను ౘూసి యోర్పు తోడ నాడు యుక్తిమంతులై
7.
ఉత్సాహము; చతుష్పాదము, సప్రాస, 7 సూర్య గణముల పై ఓ గ గణము, 5వ గణాద్యక్షరము యతి స్థానము.
కదనరంగమందు వడిగ కదలు ధీమతులు సదా
పెదవి యంౘు దాటనీక వేదనేది యున్ననూ
కొదవ లేదు శక్తికనుౘు కోట దాటనీక తా
మదుపునందు మసలునటుల యరుల నాపు ధీరులే
8.
ఉత్సాహము; చతుష్పాదము, సప్రాస, 7 సూర్య గణముల పై ఓ గ గణము, 5వ గణాద్యక్షరము యతి స్థానము.
పదిలముండవలయు మీరు వసుధ నిలచు వరకు మా
నిదుర నందు నైన తలపు నిండు మీ కుశలము కై
వదలుకోము మీ కుటుంబ బంధువులను యండయై
తుదకునంట వెన్ను దన్ను తోడు నీడ లౌదుమే.
9. తేటగీతి
అని భరోసాగ పల్కుచు యనుదినమ్ము
సాగు సమయమున నచికేత శత్రు సేన
శిబిరమందు చిక్కగ తన శిశువు కొఱకు
భరత మాత అండగ నుండె! వెరవకుండ.
10. చంపకమాల
పరుగుల తోడ సాగు మన భారత పౌరులు యొక్కసారి యాగెనే
పొరుగున్న నుండు వారు రణ భూమిని వీరుని ఖైదు చేయగా
ఝరి వలె పొంగె నెత్తురు సజావుగ నాతని పంపకున్నౘో
చెర విడిపించి మాతృభువి క్షేమము పంపుటకై తపించిరే
11. కందము:
ద్వైపాక్షిక చర్చ ౙరిగి
యాపద తలపెట్టక వైరులాతని విడచెన్
సోపానమిదియె గెలుపుకు
నోపుగ వైచి యడుగులు సయోధ్య గొనవలెన్.
(ఓపు = ఓర్పు)
12. కందము:
పునరావృతమయె నిటులే
యనిలపు సీమ విహరింౘు నభినందనుకే
వెనుకకు రప్పించెనుగా
మన నేతలు తక్షణమ్ము! మంత్రాంగముతో.
13. కందము:
ఇదియే నిజమగు గెలుపని
మది సంతసమందె గాని మంటలు రేపే
వదలని వైరము గోరదు
యెదురుగ నిలచెడి కలహము నెపుడు యడగదే.
14. తేటగీతి:
ఎట్టి రక్తసంబంధమే యెఱుఁగకున్న
నొకఱికొకఱు నిలచు రీతి యున్నతముర!
యట్టి సద్గుణశీలురే పట్టు విడరు
భారతీయ గుణము బహు బంధు ప్రీతి
15. ఆట వెలఁది:
రైతుకైన ధనము లాభమే పంౘు మా
లక్షణంబు చిలుకు లక్షలన్ని!
శాస్త్రవేత్తలకు నజాతశత్రువులగు
సైనికులకు సతము జయము జయము.
16. ఆట వెలఁది:
జయ జవాను జయ కిసాను నినాదమే
శాస్త్రవంతులకును సాగి యువత
మదిని స్ఫూర్తి నింపి మంగళమొసగెనే
స్వంతవారె యంత! జనులు మాకు.
17. ఆట వెలఁది:
ఇట్లు స్వార్థమసలె యెఱుఁగని జాతిలో
లోన మాత్రమెపుఁడు రోత సృష్టి
ౙరుగుౘుండె సాటి వాఱి గెలుపు
నొప్పి గలుగచేసి ముప్పు తెచ్చె.
18. ఆట వెలఁది
ఇంట అత్త మామ యల్లుడు కోడలు
మంచి వారు యనరు! మాట కరకు
యాడపడుౘు వదిన యాగర్భ శత్రులే
బావ లేక మరిది బద్ధ వైరి.
19. ఆట వెలఁది
ప్రక్క వారి యింట పత్రమైనను లేక
సవ్వడైన ౘాలు జగడమేను
యేమి తత్త్వమిది సహేతుకమా యని
తలపు నందు రాదు! తగవు ప్రీతి.
20. కందము
ఖండాంతరములు దాటుట
మెండుగ కోరు పరివారమే యధికములై
దండిగ పంపిరి బిడ్డల
నిండుగ నిలిపిరి యమెరిక నేలన! ప్రియమున్.
21.
మధురగతి రగడ 8 + 8 మాత్రలు, యతి 3వ గణము మొదటి అక్షరము, అంత్య ప్రాస
బిడ్డలు తరలగ విడిచి బయటకు
గడ్డుగ మారెను కాలము సాగక
యొడ్డుకు చేరుట యోకల యే యిక
గొడ్డలి పెట్టే కుటుంబ యమరిక
22. పద్మ వృత్తము: స స స జ గ యతి 9
బరువాయెను పిల్లలు భారతావనిన్
దొరలైనను తామెగదోయుౘూ
కరవాయెనె యిౘ్చట కాసులంటునే
తరలించిరి దేశము దాటి యత్నమున్
23. పద్మ వృత్తము: స స స జ గ యతి 9
పొరపాటయెనే అని ముప్పు తాకగా
స్వర పేటికనందున బాధ యేలనో
పరువున్ సిరులంటు తపస్సు చేసి యీ
యిరుకిల్లని వీడుట హేల గాదయా
24. సీసము:
అని పాఠములిపుడు యందముగా చెప్పి
తమను ౘూౘుట లేదు తనయులనుౘు
నింద యొకటి వైచి నిప్పు రాజేయు యీ
ఇంటి పెద్దలతీరు కంటకమ్ము
ౘదువులేలన నాడు సాగించి యమెరికా
దీక్ష పూని యిపుడు తిట్టనేల
ఆట పాటలనన్ని యటకలెక్కించి యే
వేడుకలేలేని బింకమొంది.
తేటగీతి
పుస్తకములకు బిడ్డల మస్తకముల
నంకితముగ చేసి ప్రణాళికాంకమందు
మాతృభూమి మఱియు భాష మసలనీక
నెట్టి వైచిరి బయటకు గట్టిగాను.
25. సీసము:
పిదప దిరిగి మీరు కుదురుకోక నౘట
యిటకు వచ్చి పలుకుటేల హితవు
పట్నమొదిలి మాదు బాల్యమందున మీరు
మరలి ౘూడగ లేదు మమత తోడ
నేడు వదిలి యట్టి నీతి మమ్ములనిట్లు
తూలనాడుట దృష్టి దోషమనరె!
మీదు యవసరము మిన్ను చేరునటుల
పరువు ధనము యింక బయటి నేల.
తేటగీతి:
సర్వ కాంక్షలు దీరగా ౘాలుననుౘు
మీదు లెక్కలే గణనకు మీకు గాద!
మాకు యవకాశములిౘట లేక మేము
పాట్లు పడుట తగున! వద్దు తూట్లు నికను.
26. కందము
ఈ వాక్కు పిల్లలలదై
యో వాదన తెచ్చె! పెంచెనుక్రోషమునే
యే వైపు నిలౘునో విధి!
యావేశము శూన్యమయిన హ్లాదమె మిగులున్.
27. కందము:
అల్లుడు చెల్లడు నొకఱికి
మెల్లగ గోతులు యగవులు మెరిపింౘుచు తా
మెల్లరు సుఖముగనుందురు
తల్లులు చెప్పరు సుగుణము తనయలకెపుడున్.
28: కందము
కోడలు శత్రువు కావలె
మేడలు వంటలు పనులును మేటిగ నెపుడున్
నాడరు మెట్టిన గృహమున
కీడును తలపెట్టెదరట! క్రీడగ హయ్యో.
29. కందము
గగనపు సీమల చేరిన
తగవులు మానని మనుజులె! ధరణిన నెపుడున్.
బిగువులు పంతములు విడక
నగుమోములు విడచెదరట! నాశమె తుదకున్.
30. కందము:
నీతికి బదులుగ స్వార్థము
గోతులు ద్రవ్వెడి కపటము కుట్రలు మదిలో
జ్యోతుల వెలుగులు కరవై
నూతిన పడదోయటమె వినూత్నము ధరపై.
31.
అతివినయ చతుష్పాదము, ప్రాస నియమము కలదు, 17 లఘువులు, ఒక గురువు, యతి స్థానము 11వ అక్షరము
ఇరుగుపొరుగు కలియుటనెఱుగరు కలహమే
యరమరికలుగనగసహజమయెగృహమునన్
కొరతలె మమతలకు చిగురులు తొడగదు గా
చెరువున కలువలు తగు సిరులును తరుగగా.
32. అపరాజితము
న న ర స ల గ చతుష్పాదము ప్రాసనియమము కలదు యతి స్థానము 9వ అక్షరము
శ్రమపడి సిరులెవ్వఱైనను పొందినన్
తమ పలుకులనందు తంపుల చెప్పునే
క్షమయను గుణమే ప్రశాంతతనొసగినా
భ్రమల విడచి యేమి మారరు జనులిలన్.
33. ఆట వెలఁది
ఇట్టి మనుజులున్న యిలను బంధములన్ని
స్థిర తత్త్వము గలిగి యమరవు ౘూడ
మానవత్వము మెండుయె గాని మనసు
స్వార్థమెఱుఁగక యుండదు పచ్చి నిజము.
34. తేటగీతి
గగన సీమకు చేరిన గాని యట్టి
ఘనత మెౘ్చుటకు ౙతగ మనిషి చెంత
సాటి వాఱె
వఱును లేక జయముఁ గాదు
బంధము విలువ తెలిసిన బ్రతుకె బ్రతుకు.
35. ఆట వెలఁది
ఉన్నదొక్క జగతి! ఉడుకుతనమదేల
నరుల జాతి గూడ కొఱత పడిన
మిగులు సిరులవేవి!? తగవుల మానిన
పండు తరతరములు వసుధనందు.
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి
కలము పేరు: నాగిని,
హైదరాబాద్,
చరవాణి: 9963998955
ధన్యవాదాలు తల్లీ
Show quoted text
%©°}{^€|{[$€{§∆∆\]®€£${∆∆}]✓€€°}\\]]}\∆∆∆\\\
పద్య సారస్వత పీఠము వారి "పద్య వైభవము" సంకలనము కోసము
1. చంపకమాల : పద్యము గొప్ప తనము:
బ్రతుకున మంచి చెడ్డలను పాదములందున దెల్పు విద్యయై
హితవచనంబులన్ని మనకింపుగ నేర్పెడి పెన్నిధే కదా
వెతకగ లేదు యింత ఘన విత్తము వేరగు భాష లోన యీ
రతనము వంటి సంపదల రాశి తెనుంగుకె స్వంతమాయెనే.
2. ఉత్పలమాల: ఛందస్సు ఘనత
వేదమునున్న సూక్తులను విద్యను పొందు విధంబు ఛందమే
యాదిగ యీ జగంబుకు సహాయము చేయుచు నేర్పుచుండగా
నీదుట తేలికౌను ప్రజకీ యిల యానము మార్గమంతయున్
పాదము దీర్ఘ హ్రస్వములు ప్రాసల తోడన నిండి యుండునే.
3. అంబా: భ భ ర వ యతి 7 *పద్యము శక్తి*
భావి తరంబుకు భవ్యమౌ సిరుల్
కావవి యాస్తులు కాసులెన్నడున్
జీవన యానము చెప్పు సూక్తులున్
భావము నిండిన పద్య పాదముల్.
4. నాగర: భ, ర, వ, యతిలేదు *సాహిత్యము లో పద్యము స్థానము*
వీడకు పద్యమెన్నడున్
పాడుౘు సాగు వానికిన్
నీడనొసంగునే సదా
వేడుక నేర్చినంతనే
5. కందము: *పద్య శాశ్వతత్త్వము*
తరతరముల నిధి దాటెను
పర పాలనలను సహితము! పట్టుగ నిలచెన్
నరులకు మేలొనగూర్చెడి
సిరియై నిలచెను మహిమను చెప్పగ వశమా.
పద్య సారస్వత పీఠము వారి "పద్య వైభవము" సంకలనము కోసము
1. నాగర: భ, ర, వ, యతిలేదు
సాహిత్యము లో పద్యము స్థానము / పద్యము ఘనత
ఆయుధమౌను పట్టినన్
ధ్యేయము పద్యమైనచో
మాయను దాటవచ్చునే
యే యమ యాతనుండదే
2. నాగర: భ, ర, వ, యతి లేదు *ఛందస్సు ఘనత*
వేదము సాగు రీతినే
పాదమునందు ౘూపునే
వాదన వేరదేలనో
మోదము నిందుయున్నదే.
3. నాగర: భ, ర, వ, యతిలేదు *పద్యము శాశ్వతత్వము*
భావి తరంబుకీయరే
దీవెన పద్య రూపమున్!
కావుగ యాస్తులే సిరుల్
జీవము యిట్టి విద్యయే.
4. నాగర: భ, ర, వ, యతిలేదు *సాహిత్యము లో పద్యము స్థానము*
వీడకు పద్యమెన్నడున్
పాడుౘు సాగు వానికిన్
నీడనొసంగునే సదా
వేడుక నేర్చినంతనే
5. నాగర: భ, ర, వ, యతిలేదు: పద్యము శక్తి
యల్పమనెంచబోకుమా
తెల్పును నీతి సూక్తులన్
వేల్పుగ కొల్చి నేర్చినన్
స్వల్పము గాదు శక్తియే
వాగ్దేవి సాహితీ వేదిక 2
వారు నిర్వహిస్తున్న పోటీలకు:
అంశము: *కార్పొరేట్ విద్య - మిథ్య*
31.03.2025
నా వివరములు:
పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [కలము పేరు: నాగిని]
ఊరు: హైదరాబాద్
హామీ పత్రము: ఈ కవనము నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
శీర్షిక: వృద్ధి.
ప్రక్రియ: పద్యములు.
సీసము:
విత్తనమునకైన వృద్ధికై జలము
సూర్య కిరణములు చూపినంత
వృక్షమగును యట్లే పిల్లల భవితకై
విద్య ముఖ్యము గాన పెంచవలయు
గురువుల వద్ద వనరులు యవసరమే
గాని హద్దును మీరి కాల మహిమ
యనుచు సౌకర్యములార్తినేల నొసగి
సంచి బరువు గూడ పెంచనేల.
తేటగీతి:
ౘల్లదనము శీతల యంత్రసాయమంది
గదిన సాగుటదేల! సెగలు వెలుపల
కలుషితము జేయునని పుస్తకమున లేద!
వ్యర్థమైన యాహారము స్వస్థతలను
మ్రింగి వేయు గాద! బడిన మేటి గాని
భోజనపు శాల విక్రయములను జేయు
విష పదార్థములను గొన్న పిల్లలకది
కీడొనర్చునైనను మార్పు ౙాడ లేద?
మహతీ వేదికకు:
శీర్షిక: తల్లిదండ్రులు
కవి పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని]
ఊరి పేరు: హైదరాబాద్
కవిత:
1. సీసము:
కైలాసము దిగి మాకై యిలకు వచ్చిన
తల్లిదండ్రులు మీరు! ధన్యులమ్ము
మేమంతయును! గని మిము నర రూపమున్
మీదు దయకు గారె మాదు కనుల
యానంద బాష్పముల్! హర్షమునకు
సీతమ్మ! రామయ్య! శిష్టులకును
హద్దులు! లేవుగ! యవనిని వీడక
నిౘటనే యుండుమా యిచ్ఛ మీర!
తేటగీతి:
అలిగి చెరగి మేము పలుకునందు మిమ్ము
దయను ౘూపవలదు యన్న! దరిని జేరో
మమ్ము గాౘు కరుణ మీది మాత పితలు
మీరు గాక దిక్కును మాకు వేరు యెవరు!
తేటగీతి:
శ్రమను మిమ్ము చేరగనీక లక్ష్మణుండు
భరత శత్రుఘ్న మారుతి త్వరితగతిన
మాకు కలుగు యన్యాయము మాపుదురని
యనుభవమ్ములు గలవు! ప్రయొస రాదు
తేటగీతి:
మీదు పరివారమును నమ్మి మేలు వొంది
మీకు దండము లిడెదము చీకు చింత
చేరనట్టి యదృష్టమంది! చిగురు తొడుగు
నామని ఋతువు విడదింక యవనినెపుడు.
మత్తకోకిల:
విన్నపంబిదె తల్లిదండ్రులు వేగమే యిల చేరరే
చిన్నబోవగనీక రక్షను చేర్చి చేకొనరే సదా
కన్న బిడ్డలమేగ! పేర్మిని గాంచి కౌశలమీయరే
వెన్నపూసను మించి మెత్తగ ప్రేమ వెల్లడి చేయరే.
హామీ పత్రము: ఈ కవనము నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
వారం వారం కవిత:
01.04.2025 మంగళవారము
అంశము: సీతారాములు
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
బిడ్డల మైన మేము కాదన్న విడువకుండ
మాది యలుక యని యెఱింగి కాచరే
తల్లిదండ్రులార! సీతా రాములార!
పేర్మి యంటే మీరే! పెద్దలార!
కైలాసంబును వీడి మానవ రూపులై
మాతో కలిసి నడయాడి మము మీ దయతో
మురిపించ బూనిరే యుత్సాహమును మది నింపిరే
ఎంతటి సహృ'దయ'త గనుకనే యిలవేల్పులైరి.
ధర్మము గాడిని తప్పెను ధైర్యము సన్నగిల్లెను
కంటన నీరే యాగదే కాపాడగ రారే యిపుడే
మీ పాలనలో యుండవే వెతలని నమ్మిన
శిశువులమౌ మము చేకొనరే సతతము
పెద్దల ముందర పిన్నలు దివికేగరుగా
వైభవమేతప్ప వైధవ్యములుండవు యే
అవమానములూ యతి సారములూ యంటవు
ప్రార్థన యభ్యర్థన గైకొనరే వినరే మొరలను
కలియుగమైనను యేమిటి యడ్డంకి
కరుగక యున్నను యేమిటి! మీ ఘనత
కలలను తీర్చగ కళలను బెంౘగ కదలాడరే
కలిమికి నెలవై కాపాడరే కరుణతో
ఆరోగ్యంబులు కరగనె ఆవేశములే అంతటా
యుద్ధము కుట్రలు స్వార్థమనర్థంబులు నిండెనే
రాకున్నను మీరు యీ అవనికి మీ కరుణకు
యిక విలువ యేది మాకు రక్షణ యేది