Thursday, December 12, 2024

To Write ✍️

 1)ఆంధ్రభూమి- -sahiti@andhrabhoomi.net (సాహితి)


2)ఆంధ్రప్రభ- -sahithigavaksham@gmail.com (సాహితిగవాక్షం)


3)ఆంధ్రజ్యోతి- -vividha@andhrajyothy.com (వివిధ)


4)ప్రజాశక్తి- -prajasavvadi@gmail.com (సవ్వడి)


5)విశాలాంధ్ర- -editorvisalaandhra@gmail.com (సంస్కృతి)


6)వార్త - - features@ vaartha.com (సాహితి)


7)సూర్య - -editpage@suryaa.com (అక్షరం)


8)సాక్షి - -sakshisahityam@gmail.com (సాహిత్యం)


9)నమస్తేతెలంగాణ- -editpage@namasthetelangaana.com (చెలిమె)


10)నవతెలంగాణ- -darwajapage@gmail.com (దర్వాజ)


11)మనతెలంగాణ- -editor@manatelangana.org (కలం)


12)మనం - -manamsahiti@gmail.com


(మనసాహితి)


ఆదాబ్ హైదరాబాద్


aadabhydeditor@gmail.com


@ @ @ @ @ @ సాహితిమాసపత్రికలు


1)అమ్మనుడి - ammanudi@gmail.com


2)మూసి - editormusi@gmail.com


3)చినుకు - editor.chinuku@gmail.com


4)మిసిమి - misimi90monthly@ gmail.com


5)పాలపిట్ట - palapittabooks@gmail.com


6)బెంగుళూరుతెలుగుతేజం - bangaloretelugutejam@gmail.com


7)బిలాయివాణి - abey sis@yahoo.com


8)భావతరంగిణి - bhavamtm@gmail.com


9)విజ్ఞానసుధ - vignanasudhamtm193@gmail.com


10)తెలుగువెలుగు - teluguvelugu@ramojifoundation.com


🎀🎁🎁🎁🎁🎀


SUnday papers


ప్రజా శక్తి


snehaweekly.praja@gmail.com


ప్రస్థానం ప్రజాశక్తి


ssprasthanam@gmail.com


ప్రజా చిన్నారి


chinnaarips@gmail.com


ఆంధ్రజ్యోతి

sunday.aj@gmail.com


navyaweekly@andhrajyothy.com


సాక్షి ఫండ


funday.kathalu@gmail.com


వార్త


sunmagvaartha@gmail.com


మొగ్గ


Mogga.vaartha@gmail.com


నేటి నిజం


Netinijam93@gmail.com


నవ తెలంగాణ


darwaja@v6velugu.com


మ దునియా


features@manatelangana.org


ఆంధ్రభూమి


sundaymag@andhrabhoomi.net


ఆంధ్ర ప్రభ


Sundayprabha@gmail.com


స్వాతి :- advtswati@gmail.com

సహరి:-

sahari.telugu@gmail.com


Saranga :- editor@sarangabooks.com

బతుకమ్మ :- sunmag@ntnews.com

పాలపిట్ట :- palapittabooks@gmail.com

నెచ్చెలి :- editor.neccheli@gmail.com

ఐక్య ఉపాధ్యాయ :- ikyopadhyaya1975@gmail.com


లోగిలి :- logilisahithyam@gmail.com

విశాలాక్షి :- ethakotas@yahoo.com

visakhasamskruthi2012@gmail.com


కౌముది :- editor@koumudi.net








విదేశాల్లోనో వేరే రాష్ట్రాల లోనో పిల్లలు ఉంటే‌ దగ్గఱ లేరని బాధ, బయటకు ఈ మాటే చెప్తూ, లోలోపల మాత్రం "తమ స్వయంకృతం" అనుకోకుండా, "తమ కష్టం, అదే తమ పిల్లల విజయం" అనే "ముసుగులో" బ్రతికేస్తారు.


ఖర్మ కాలి కూతుళ్ళు భారత దేశం లో ఉంటే, "అల్లుడు అప్రయోజకుడు", అదే కోడలు విదేశమైతే "రాక్షసి".


పోనీ భారత దేశం లోనే, అత్త, మామల తోటే కలిసుంటే కులాసానేనా?


సాయంత్రం దీపం పెట్టలేదు, స్నానం చేసి దణ్ణం పెట్టలేదు అంటూ మొదలు పెడతారు.‌ ఉద్యోగిని అయితే ఇంకో ఎత్తు, ఇంట్లో మొత్తం పనులు చేయదనో, జీతం ఆమె పుట్టింటికి పోస్తోందనో, అంతటితో ఆగరు! ఆ "కోడలు పిల్లల్ని" తాము సాకాల్సొస్తోందని ఫిర్యాదులే కానీ, వాళ్ళు "తమ కొడుకు పిల్లలు కూడా", "తాము పెంౘుతోంది తమ కొడుకు సంతునే", అని ఓర్పు వహింౘరు.


అలాగని అందఱూ చెడ్డ అత్తలూ, మంచి కోడళ్ళే ఉంటారని కాదు, సమతుల్యం లేదనేదే అసలు బాధ.







[28/01, 22:40] Gayatri Pavani Amma Gaaruu: https://www.gotelugu.com/telugustories/view/11706/chidramaina-jeevitham

[28/01, 22:40] Gayatri Pavani Amma Gaaruu: ఇందులోకి వెళ్ళు!అప్ లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. కథ అక్కడ పెట్టటమే


అచ్చంగా తెలుగుకు పద్మినీ భావరాౙు గారితో మాట్లాడాలి



మనతెలుగుకథలు. కాం

మైల్ ఎడ్రస్

story@manatelugukathalu.com

 రెగ్యులర్ గా కథలు, కవితలు జోకులు ప్రచురిస్తారు.

మొదటి రచన పంపేటప్పుడు

రచనతో పాటు ఫోటో, సంక్షిప్త

జీవిత చరిత్ర పంపండి.అదే

ప్రతి రచనతో ప్రచురణ జరుగుతుంది.


రతన్ టాటా జీ

 టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా.

జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా.

రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తి ని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు.

నావల్ టాటా కొడుకు రతన్ టాటా.


టెక్నికల్ గా టాటా ల వారసుడు రతన్ టాటా నే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు. రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంభం, 4 యేండ్ల వయస్సు లోనే అతని తండ్రి చనిపోతే తల్లి కుట్టు మిషిన్ తో వచ్చేదానితో పోషించలేక ఒక అనాధాశ్రమం లో చేర్పించారు నావల్ ని. పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్ ని దత్తత తీసుకోవటం వలన నావల్ టాటా అయ్యాడు.


నావల్ టాటా సోను అనే అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు.


రతన్ టాటా జీవితం లో మెలోడ్రామా లేదు గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు అనుకుంటాం. స్పేస్ క్రియేట్ చేసి మెలోడ్రామా స్రుష్టించటం కరక్ట్ కాదు. కానీ చిన్నతనం లోనే తల్లిని కోల్పోయాడు, తను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు, తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమనేవాడు. చివరికి రతన్ జంషెట్ టాటా (టెక్నికల్ గా తాత) ని ఒప్పించి అమెరికాలోని కార్నెగీ యూనివర్శిటీ లో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చాడు. ఆ సమయం లో ఇండియా చైనా యుద్ధం జరుగుతుండటం తో రతన్ టాటా ని చేసుకోటానికి ఆ అమ్మాయి ఇండియా రాలేకపోయింది, కొన్ని సంవత్సరాలకి వేరే వాళ్ళని చేసుకుంది. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా పెండ్లి చేసుకోలేదు (బ్రహ్మచారి).


టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా కజిన్ బ్రదర్ కొడుకు JRD టాటా (JRD టాటా కి భారత రత్న కూడా వచ్చింది). రతన్ టాటా ఇండియా వచ్చిన సమయం లో JRD టాటా నే టాటా గ్రూపు వ్యాపారాలని చూసుకునేవాడు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగి లాగే టాటా గ్రూపు లో జాయిన్ అయ్యాడు. JRD టాటా ఆరోగ్యం బాగాలేని స్థితి లో రతన్ టాటా కి టాటా గ్రూపు పగ్గాలు అప్పగించాడు. అప్పటిదాకా కుటుంభ వ్యాపారం లాగా ఉన్న టాటా సంస్థ ని అంతర్జాతీయ సంస్థ గా తీర్చిదిద్దాడు రతన్ టాటా. ఇండియా లో ఉన్న కార్లు, విమానాలు అన్నిటినీ కొనగలడు కానీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడు రతన్ టాటా. తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారు ని చెక్ చేపించుకునేవాడు.


రిలయన్స్, బిర్లా, బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూపు సంపద ఎక్కువ. కానీ అంభానీ లు లాగా ఇండియా లో కానీ, ప్రపంచం లో కానీ టాప్ లో లేడు రతన్ టాటా కారణం ఆయన సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకి వినియోగిస్తుంటాడు రతన్ టాటా.


ఆసియా లో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ (ఆ తర్వాత ఎయిర్ ఇండియా అయ్యింది) వరకు టాటా లే ప్రారంభించారు. టీ పొడి, ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు టాటా లు లేని వ్యాపారం లేదు; సిగరెట్స్ & ఆల్కహాల్ వ్యాపారం తప్ప. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ వరకు టాటా లే నంబర్ వన్.


టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళి గా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరం గా ఆహ్వానించి ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన "జాగ్వార్", "లాండ్ రోవర్" ని కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా.


గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో ఇండియా లో మొట్టమొదట 5/5 రేటింగ్ సాధించిన కార్ టాటా వాళ్ళదే (టాటా నెక్సాన్). ఈ కార్ స్రుష్టికర్త రతన్ టాటా గారే. ఇండియా లో రిలయన్స్ తర్వాత 100 బిలియన్స్ రూపాయలు సాధించిన సంస్థ కూడా టాటా వాళ్ళ TCS నే (మార్కెట్ క్యాపిటలైజేషన్- mcap ప్రకారం). ఇలాంటివెన్నో ఉన్నాయి రతన్ టాటా గారి ఖాతాలో.


ఇండియా కి ఏ కష్టం వచ్చినా సంపదని అంతా ఇచ్చేవాళ్ళలో రతన్ టాటా ముందు ఉండేవాడు. అంభానీలు ధనవంతులు కానీ రతన్ టాటా ఐశ్వర్యవంతుడు. కష్ట పడితే అందరూ అంభానీలు అవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ రతన్ టాటా లాగా ఐశ్వర్యవంతుడు అవ్వొచ్చు. 


రతన్ టాటా అంటే ఒక నమ్మకం.

రతన్ టాటా అంటే ఒక నిజాయతీ.

రతన్ టాటా అంటే ఒక నిలువెత్తు భారతం.  

రతన్ టాటా అంటే భారతీయ జాతీయ సంపద.

రతన్ టాటా అంటే మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం. 


మిమ్మల్ని మిస్ అయ్యే ఛాన్స్ లేదు సార్, మేము ఉన్నంత కాలం మీరు మాతో ఉంటారు🙏

కథకు పద్యం Swami Vivekananda Railway Station Bhojanam

 ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది.

వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.

భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు. వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు.

అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా , సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ , ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి స్వామీజీతో అతడిలా అన్నాడు.

ఓ స్వామీ ... చూడు ... చూడు ... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా ... ఏ సంపాదనా లేకుండా దేవుడు ... దేవుడూ... అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.

స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.

అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...


ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు.

అతను స్వామితో ఇలా అన్నాడు," మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం.దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.

స్వామీజీ ఎవరు నాయనా నీవు.. నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే.

శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.

నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.


స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.

ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది.

ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపై పడి,కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు.

సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది.

నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.

తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.

ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే ,

ఇంతకు మించినవి , ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి , భగవంతుని పట్ల , యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో ..!



సన్యసించినట్టి స్వామి వివేకుడు

ధూమశకటములు విరామమొందు

స్థలిని నిలిచిళయుండె! సంపద గలిగిన

ధనికుడౘట చేరె! తనదు పనికి.


ఆకలైన వేళ అన్నము వౘ్చునా

కష్టపడక యనుౘు కఠిన వాక్కు

నతడు పల్కె స్వామి యవతారమును గాంచి!

సోమరిగ దలంచి! చులకనగను.


నిశ్చలముగ నుండె నిండు కుండ వలెను

స్మరణ చేసినంత ౙరిగె వింత

ప్రక్క యూరినుండి పరుగున యిటు చేరి

స్వామి పాదములన పడుౘు వేడె.


భోజనమ్ము గొనుమ! నా జన్మ ధన్యంబు

మీకు పెట్టినంత నాకు తృప్తి

యనగ వినిన స్వామి యారగింౘననెను

యపుడు నాతడేడ్చె నార్తి తోడ.


తండ్రి రాముడాజ్ఞ! దర్శనమాయె నా

స్వప్నమందు నేడు! పలికెనిటుల

"నాదు భక్తుడౘట యాకలి తోనుండ

నిదుఱ వచ్చెనెట్లు నీకు?", యనెను.


గనుఁక దెచ్చినాను కలవరపాటును

దాటి వెదకుౘు మిము! ధన్యునైతి!

మీదు రక్ష నెపము! నా దైవముయె నాకు

దర్శనంబునొసగె! దయను ౘూపె!


వేళ మింౘనీక వేడి ౘల్లగ నీక

గైకొనండి దయను! కమ్మనైన

భోజనంబు యంటు రాజ ఠీవిని నింపి

వెండి పీట పైన దండి గాను.


స్వర్ణమయమగు పళ్ళెము పైన వడ్డన చేసె

యధరువులను భక్తిసుధను నింపి!

నిదియు గాంచి మనసు యదిరి పడగ లేచి

కంట నీరు గార్చె! కాళ్ళు పట్టె


భక్తి విలువ తెలిసి బాగుగా మసలిన

దైవమాదరించి తగిన రీతి

బ్రతుకు నడుపుననెడి పాఠము సత్యము

నేర్వవలయుననెను! నీతి గాను.



Tuesday, December 10, 2024

Learning Sources

 https://www.eenadu.net/telugu-news/antaryami/general/1100/124215489




భాషా క్రీడ: అసమాపకక్రియ

శ్రీ రామ రాజ్యము శ్రీరస్తు పలికించ, రాముడు కౌసల్యాదేవి గర్భంబున జన్మించి,దశరథనందుడిగా వెలుగొంది,సకలవిద్యలను ఆపోశన పట్టి, సోదర భావంతో ఉండి,విశ్వామిత్ర మహర్షి యాజ్ఞ తో యజ్ఞ రక్షణ చేసి,శివ ధనుస్సు విరిచి, సీతనుపరిణయమాడి, తండ్రి మాటకై అడవులకేగి,రావణుని చంపి, రాజధర్మమెరిగి,విధి యాడినట్టి, వింత నాటకమున భగవత్సకల్పoగ పత్ని నిడిచి,ఎన్నియో కష్టము లెదురించి, తానును కర్మ ఫలిత మొంది, పత్నిని హృదిలోన పదిలపరుచుకుంటు, మంచి ప్రభువుగా ప్రజలనుపాలించి,సద్గుణములనెన్నో తీర్చిదిద్దుకొని,సత్ససంపదనంత

ముందుతరములకునుయoదియిచ్చి,మానవాళికి మార్గ దర్శకుడయ్యి,మహిలోన మంచి కీర్తి గడించి, కలియుగంలో బాల రాముని గా ఏ తెంచి......





తెలుగుభాషలో అరసున్న ఉన్నది. కానీ, దానికి ఉచ్చారణ లేదు. 


 *"అట్టి పదములను కేవలము లిపిలో చూపించి, భేదము తెలిపినచో ప్రయోజనము లేనిదని నా భావన."*


మీయొక్క ఈ అభిప్రాయం తప్పు. విద్యాభ్యాసంలో తెలుగుభాష, తెలుగు వ్యాకరణాలు అంశాలుగా చదువుకోని వారికి అరసున్న గురించి పెద్దగా తెలియదు. 


అరసున్న రెండు రకాలుగా ఉంటుంది. 

1. పదగతమైనది. అనగా వ్యాకరణసూత్రాల వలన ఏర్పడకుండా సహజంగా పదంలోనే ఉంటుంది. ఉదా:- అఁట, ఇఁక, రాముఁడు ఈవిధంగా. 

2. వ్యాకరణసూత్రాలవలన (వ్యాకరణసాధ్యమైనది) ఏర్పడినది. 

వ్యాకరణభాషలో "ద్రుతము" అనేది ఒకటి ఉన్నది. "ద్రుతాఖ్యో నః" అని నిర్వచనము. అంటే "నకారము ద్రుతము అనబడుతుంది" అని అర్థము. "ని,ను,న్" ఈ మూడు నకారాలూ ద్రుతముగా పరిగణించబడతాయి. 


ద్రుతము అనగా కరగిపోవునది. అని అర్థము. ఈ ద్రుతముగా చెప్పబడిన నకారములు తరువాత పరుషము(కచటతప)లు వస్తే ఆ పరుషములు సరళములు(గజడదబ)లుగా మారతాయి. ముందున్న ద్రుతము అరసున్నగా మారుతుంది. ఉదా: వానిన్+చూచి=వానిఁజూచి. ఈ విధంగా అనేక పదాలు మనకు కనబడతాయి. 


ద్రుతం తరువాత సరళాలు ఉన్నట్లైతే ఆ సరళాలు అలాగే ఉండి ద్రుతము అరసున్నగా మారుతుంది. 


ద్రుతము తరువాత స్థిరాక్షరాలు ఉన్నట్లైతే స్థిరములు ఏవిధంగానూ మారవు. ద్రుతం లోపించిపోవటమో లేదా సంయుక్తంగా మారటమో జరుగుతుంది. ఇక్కడ అరసున్నగా మారదు. 


ఆ విధంగామారిన అరసున్న వలన ముందటి పదము ద్రుతాంతమని మనకు తెలుస్తుంది. మీరన్నట్లు అరసున్న అనవసరము అన్నట్లైతే....

కనియెన్+జాబిల్లి=కనియెఁజాబిల్లి 

ఇందులో 

అరసున్నను తొలగిస్తే (మీమాట ప్రకారం)

కనియెజాబిల్లి అని ఉంటుంది. 

ఇందులో జాబిల్లిలో "జా" పదగతసరళమా? వ్యాకరణసాధ్యమైన సరళమా? తెలుసుకోవటం కుదరదు. 


భాషలో అరసున్నకు ఉచ్చారణ లేకపోయినా దానియొక్క ప్రయోజనము చాలా ఉన్నది. 


ప్రస్తుతభాషాపండితులకన్నా మనకు వ్యాకరణాలను రచించి భాషకు ఒక మార్గాన్ని చూపిన మన పూర్వ లాక్షణికులు (వ్యాకరణవేత్తలు) ఎన్నో విధాలుగా ఆలోచించి, భాషను పరిశోధించి వ్యాకరణ సూత్రాలను, భాషకు నిబంధనలను ఏర్పరచటం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తించాలి.




🌹🌹అరసున్నా..గురించి


విద్యాభ్యాసంలో తెలుగుభాష, తెలుగు వ్యాకరణాలు అంశాలుగా చదువుకోని వారికి అరసున్న గురించి పెద్దగా తెలియదు. 


అరసున్న రెండు రకాలుగా ఉంటుంది. 

1. పదగతమైనది. అనగా వ్యాకరణసూత్రాల వలన ఏర్పడకుండా సహజంగా పదంలోనే ఉంటుంది. ఉదా:- అఁట, ఇఁక, రాముఁడు ఈవిధంగా. 

2. వ్యాకరణసూత్రాలవలన (వ్యాకరణసాధ్యమైనది) ఏర్పడినది. 

వ్యాకరణభాషలో "ద్రుతము" అనేది ఒకటి ఉన్నది. "ద్రుతాఖ్యో నః" అని నిర్వచనము. అంటే "నకారము ద్రుతము అనబడుతుంది" అని అర్థము. "ని,ను,న్" ఈ మూడు నకారాలూ ద్రుతముగా పరిగణించబడతాయి. 


ద్రుతము అనగా కరగిపోవునది. అని అర్థము. ఈ ద్రుతముగా చెప్పబడిన నకారములు తరువాత పరుషము(కచటతప)లు వస్తే ఆ పరుషములు సరళములు(గజడదబ)లుగా మారతాయి. ముందున్న ద్రుతము అరసున్నగా మారుతుంది. ఉదా: వానిన్+చూచి=వానిఁజూచి. ఈ విధంగా అనేక పదాలు మనకు కనబడతాయి. 


ద్రుతం తరువాత సరళాలు ఉన్నట్లైతే ఆ సరళాలు అలాగే ఉండి ద్రుతము అరసున్నగా మారుతుంది. 


ద్రుతము తరువాత స్థిరాక్షరాలు ఉన్నట్లైతే స్థిరములు ఏవిధంగానూ మారవు. ద్రుతం లోపించిపోవటమో లేదా సంయుక్తంగా మారటమో జరుగుతుంది. ఇక్కడ అరసున్నగా మారదు. 


ఆ విధంగామారిన అరసున్న వలన ముందటి పదము ద్రుతాంతమని మనకు తెలుస్తుంది. మీరన్నట్లు అరసున్న అనవసరము అన్నట్లైతే....

కనియెన్+జాబిల్లి=కనియెఁజాబిల్లి 

ఇందులో 

అరసున్నను తొలగిస్తే (మీమాట ప్రకారం)

కనియెజాబిల్లి అని ఉంటుంది. 

ఇందులో జాబిల్లిలో "జా" పదగతసరళమా? వ్యాకరణసాధ్యమైన సరళమా? తెలుసుకోవటం కుదరదు. 


భాషలో అరసున్నకు ఉచ్చారణ లేకపోయినా దానియొక్క ప్రయోజనము చాలా ఉన్నది. 


ప్రస్తుతభాషాపండితులకన్నా మనకు వ్యాకరణాలను రచించి భాషకు ఒక మార్గాన్ని చూపిన మన పూర్వ లాక్షణికులు (వ్యాకరణవేత్తలు) ఎన్నో విధాలుగా ఆలోచించి, భాషను పరిశోధించి వ్యాకరణ సూత్రాలను, భాషకు నిబంధనలను ఏర్పరచటం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తించాలి.













*ఒక తమిళ వ్యక్తి రాసిన✒️ వ్యాసాన్ని యధాతధంగా.....*


నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషలను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.


*తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారో ! తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.*


*1.తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి వుంది.*


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపి గా కొరియన్ భాష.


3. *తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది.* మిగిలన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాష లో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి చెందిన *నికోలో డీ* అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను "*ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్*” అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానాన్ని పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. పురాణాల ప్రకారం త్రిలింగక్షేత్రాలు నైజాం ప్రాంతంలోన రాయలసీమలోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరం ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. *ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.*


*10. తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, నుడికారాలు ఇంక ఏ భాషలోనూ లేవు.*


11. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం.ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు *మారిషస్* వెళ్ళారు. ప్రస్తుత *మారిషస్ ప్రధాని* వారి సంతతే.


14. *కచిక పదాలతో* కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలో కూడా లేదు.

*కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.*


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి, "*దేశభాషలందు తెలుగు లెస్స*” అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో *అధికార భాష* గా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాషా ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది ఆనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలు అన్నీ ఒక తమిళ వ్యక్తి ఆంగ్లంలో తెలియజేసిన విషయాలను అనువదించారంటే నమ్మశక్యంగా లేదు. *కానీ ఇది నిజం.* ఇంత గొప్ప మన భాషను మన భావి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం వుండకూడదని నా భావన. 

*ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు.* *కానీ అది ఏమి దౌర్భాగ్యమో !ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో !గానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యతిస్తాం* *అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం.* ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగులో మాట్లాడుదాం. 

*ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి.* అందుకోసం మన తెలుగు భాషను బలి చేయ నవసరం లేదు. 


*తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం.*


మీకు తెలుగు భాష పై మమకారం ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేయండి.





తెలుగుభాషలో అరసున్న ఉన్నది. కానీ, దానికి ఉచ్చారణ లేదు. 


 *"అట్టి పదములను కేవలము లిపిలో చూపించి, భేదము తెలిపినచో ప్రయోజనము లేనిదని నా భావన."*


మీయొక్క ఈ అభిప్రాయం తప్పు. విద్యాభ్యాసంలో తెలుగుభాష, తెలుగు వ్యాకరణాలు అంశాలుగా చదువుకోని వారికి అరసున్న గురించి పెద్దగా తెలియదు. 


అరసున్న రెండు రకాలుగా ఉంటుంది. 

1. పదగతమైనది. అనగా వ్యాకరణసూత్రాల వలన ఏర్పడకుండా సహజంగా పదంలోనే ఉంటుంది. ఉదా:- అఁట, ఇఁక, రాముఁడు ఈవిధంగా. 

2. వ్యాకరణసూత్రాలవలన (వ్యాకరణసాధ్యమైనది) ఏర్పడినది. 

వ్యాకరణభాషలో "ద్రుతము" అనేది ఒకటి ఉన్నది. "ద్రుతాఖ్యో నః" అని నిర్వచనము. అంటే "నకారము ద్రుతము అనబడుతుంది" అని అర్థము. "ని,ను,న్" ఈ మూడు నకారాలూ ద్రుతముగా పరిగణించబడతాయి. 


ద్రుతము అనగా కరగిపోవునది. అని అర్థము. ఈ ద్రుతముగా చెప్పబడిన నకారములు తరువాత పరుషము(కచటతప)లు వస్తే ఆ పరుషములు సరళములు(గజడదబ)లుగా మారతాయి. ముందున్న ద్రుతము అరసున్నగా మారుతుంది. ఉదా: వానిన్+చూచి=వానిఁజూచి. ఈ విధంగా అనేక పదాలు మనకు కనబడతాయి. 


ద్రుతం తరువాత సరళాలు ఉన్నట్లైతే ఆ సరళాలు అలాగే ఉండి ద్రుతము అరసున్నగా మారుతుంది. 


ద్రుతము తరువాత స్థిరాక్షరాలు ఉన్నట్లైతే స్థిరములు ఏవిధంగానూ మారవు. ద్రుతం లోపించిపోవటమో లేదా సంయుక్తంగా మారటమో జరుగుతుంది. ఇక్కడ అరసున్నగా మారదు. 


ఆ విధంగామారిన అరసున్న వలన ముందటి పదము ద్రుతాంతమని మనకు తెలుస్తుంది. మీరన్నట్లు అరసున్న అనవసరము అన్నట్లైతే....

కనియెన్+జాబిల్లి=కనియెఁజాబిల్లి 

ఇందులో 

అరసున్నను తొలగిస్తే (మీమాట ప్రకారం)

కనియెజాబిల్లి అని ఉంటుంది. 

ఇందులో జాబిల్లిలో "జా" పదగతసరళమా? వ్యాకరణసాధ్యమైన సరళమా? తెలుసుకోవటం కుదరదు. 


భాషలో అరసున్నకు ఉచ్చారణ లేకపోయినా దానియొక్క ప్రయోజనము చాలా ఉన్నది. 


ప్రస్తుతభాషాపండితులకన్నా మనకు వ్యాకరణాలను రచించి భాషకు ఒక మార్గాన్ని చూపిన మన పూర్వ లాక్షణికులు (వ్యాకరణవేత్తలు) ఎన్నో విధాలుగా ఆలోచించి, భాషను పరిశోధించి వ్యాకరణ సూత్రాలను, భాషకు నిబంధనలను ఏర్పరచటం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తించాలి.








మీరు చెప్పిన దానిని బట్టి.,

గద్యం/వచనంలో దండకానికి ఛందస్సు(తగణ ప్రయుక్తము) ఉన్నది. ఆ సందర్భాలలో ఁ తో గురువు/లఘువు గా చేసుకునే సౌలభ్యం కోసమే ఁ ఉన్నది.


ఌౡ ల వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.

ౡత, కౢప్తము, భౡౢకము మొ॥


అలాగే ఱర లకు వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.


ఇప్పటికీ ళ ల, శ ష స - ల భేదము/వినియోగము/ఉచ్చారణ ఉన్నవి.


నేను ఇప్పటికీ అనేది ఒక్కటే . ఁ కు ఒకానొక కాలంలో ఉచ్చారణ ఉండి ఉంటుంది. దరిమిలాను, ఆ ఉచ్చారణను వదలిపెట్టి కేవలం వ్యాకరణ సూత్రములకే ఁ ను పరిమితం చేశారని నా మాట.

అందుకనే ఉచ్చారణ చూపకుండా ఁ తో పదములను చూపించడం మ్యూజియం ప్రదర్శన మాత్రమే అని నాఅభిప్రాయం.



మీరు ఉటంకించిన వాటిలో నేను చెప్పిన అంశములు వున్నవి.

దండకమును వచనముగా నేను పేర్కొనేదు. గద్యము వేరు వచనము వేరు. పద్యగద్యాలకు మధ్యస్థముగా దండకము ఉన్నది.

మొదటి నుండి నేను చెపుతున్నది ఒకటే, ఁ కు ఉచ్చారణ ఉండాలి అని. అలా ఉచ్చారణ లేనపుడు ఁ ఉన్న/లేని పదముల నడుమ వ్యత్యాసమును కేవలం లిపిలోనే చూడడం మ్యూజియం మాత్రమే.

స్వస్తి.







ఓం శ్రీమత్రే నమః.🙏🏼


నారుమంచి వేంకట అనంత కృష్ణ చిత్రముపై

నా పద్యము.

👇🏼

అనేక కంద గీత గర్భ చంపకమాల.

👇🏼

చం. వరగుణుఁడే గనన్ నయ సువర్తన రూపమె నారుమంచిరా,

నెర గనియేగనన్ నటన నేరని మూర్త్యన నారుమంచిరా,

స్థిర మణియౌమహోన్ నత సుధీర నరుండన నారుమంచిరా,

ధర ఘృణియే లసన్ నవ సుధాప్రణవాంబుధి నారుమంచిరా.


చంపక గర్భస్థ కందము 1

👇🏼

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,

మణియౌమహోన్ నత సుధీ

ర నరుండన నారుమంచిరా, ధర ఘృణియే.


చంపక గర్భస్థ కందము 2

👇🏼

మణియౌమహోన్ నత సుధీ

ర నరుండన నారుమంచిరా, ధర ఘృణియే.

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,


చంపక గర్భస్థ కందము 3

👇🏼

గనియేగనన్ నటన నే

రని మూర్త్యన నారుమంచిరా, స్థిర మణియౌ

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.


చంపక గర్భస్థ కందము 4

👇🏼

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.

గనియేగనన్ నటన నే

రని మూర్త్యన నారుమంచిరా, స్థిర మణియౌ


చంపక గర్భస్థ కందము 5

👇🏼

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.


చంపక గర్భస్థ కందము 6

👇🏼

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,


చంపక గర్భస్థ తేటగీతి.

👇🏼

నయ సువర్తన రూపమె నారుమంచి

నటన నేరని మూర్త్యన నారుమంచి

నత సుధీర నరుండన నారుమంచి

నవ సుధాప్రణవాంబుధి నారుమంచి.


అమ్మ దయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.





[30/12, 20:07] +91 99635 50478: *చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు..*


తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన


స్వర రచన,గానం. డా|| శోభారాజ్ 

రాగం. హంసధ్వని


రేకు: 8-4

సంపుటము: 1-52

రేకు రాగము: శ్రీరాగం


చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు

చాలదా హితవైన చవులెల్ల నొసఁగ


ఇదియొకటి హరినామ మింతైనఁ చాలదా

చెదరకీ జన్మముల చెఱలు విడిపించ

మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా

పదివేలు నరకకూపముల వెడిలించ


కలదొకటి హరినామ కనకాద్రి చాలదా

తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ

తెలివొకటి హరినామ దీపమది చాలదా

కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల


తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా

జగములో కల్పభూజంబు వలెనుండ

సొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదా

నగవుఁచూపులను ఉన్నతమెపుడుఁ చూప

[30/12, 20:07] +91 99635 50478: *చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు..*


విశ్లేషణ:


- శ్రీ తాడేపల్లి పతంజలి గారు


ముఖ్య పదార్థము:



*సౌఖ్యామృతము దమకు* = సౌఖ్యామృతము + తమకు


*సౌఖ్యామృతము* = సుఖమనెడి అమృతము


*చవులెల్లనొసఁగ* = చవులు + ఎల్లన్ ఒసగ


*చవులు* = 1.రుచి, 2.ప్రేమ, 3.ఆశ, 4. అనుభవము, 5.సౌఖ్యము, 6.ప్రియము


*హరినామ మింతైన జాలదా* = హరినామము + ఇంతైనన్ + చాలదా


*చెదరకీ జన్మముల* = చెదరకు + ఈ జన్మముల


*చెఱలు* = 1. కారాగారము 2. బాధ 3. నిర్బంధము


*మది నొకటి* = మదిన్ ఒకటి


*హరినామమంత్ర మది* = హరినామమంత్రము + అది


*కనకాద్రి* = కనక+అద్రి = బంగారుకొండ, మేరువు


*చెఱుచ* = నశింపజేయుటకు, పోగొట్టుటకు


*కలుషపు* = మాలిన్యపు, పాపపు


*కఠిన* = క్రూరమైన, దయలేని, పరుషమైన


*పార ద్రోల* = పారన్+త్రోల


*కీర్తన మొకటి* = కీర్తనము + ఒకటి


*సొగిసి* = సుఖించి


*కరుణ చాలదా* = దీనము, దైన్యము చాలదా!


*నగవు జూపులను* = నగవున్ + చూపులను


*ఉన్నత మెపుడుఁ జూప* = ఉన్నతమెపుడున్ + చూప


*భావము:*


     ఈ ప్రపంచంలో ఏవేవో చాలలేదనుకొంటాము. కొన్నింటిని రాజీపడుతూ సరి పెట్టుకొంటాం. హరినామ సౌఖ్యామృతము మనకు సరిపోతుందని అన్నమయ్య ఒక గురువుగా ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నారు.


     శ్రీ హరి నామ సుఖమనెడి అమృతము మీకు చాలదా? అంతకంటే రుచిని (ప్రేమ, ఆశ, అనుభవము, సౌఖ్యము, ప్రియము) ఇచ్చేది వేరే ఉందా?(హరినామమే గొప్పదని భావము).


1. ఈ జన్మముల కారాగారము విడిపించుటకు హరినామము ఇంతైనా (కొద్దిగానయినా అనగా మనస్సు పెట్టి కొద్దిసేపు భజించినా చాలని భావము) చాలదా!? పదివేల నరక కూపములను పోగొట్టుటకు హరినామ మంత్రము మదిలో తలచిన చాలదా!? గర్భావాసము నరక కూపము. ప్రతి జన్మ గర్భ శోకాన్ని జీవునకు కలిగిస్తుంది. ఆ నరక సదృశమైన గర్భావాసమును తొలగించుకొనుటకు హరి నామము జపించుమని అన్నమయ్య సందేశము. 


2. దరిద్ర దోషమును తొలగించుటకు బంగారుకొండవంటి హరినామము ఒకటి చాలదా!? పాపాల కఠిన కటిని పారద్రోలుటకు హరినామ దీపము సరిపోదా!?


3. భూమిలో కోరినది ప్రసాదించే కల్ప వృక్షమువలె నుండుటకు వేంకటేశుకీర్తన మొక్కటి చాలదా! ( వేంకటేశు కీర్తనము కల్ప వృక్షమువంటిదని భావము. ) నగవు చూపులతో ఉన్నతత్వమును ఎపుడూ చూపుటకు ఈ వేంకటేశవిభుని దాసులైన భక్తుల కరుణ చాలదా?! ( వారి కరుణ నగవు చూపులతో ఉన్నతత్వము కలదని భావము.)


*ఆంతర్యము:*


“నన్నుఁ బొందెదరు నిత్య ధ్యాన పారీణలై." (శ్రీ మహా భాగవతము - దశమ స్కంధము -1471 పద్యము) అని ఉద్ధవుని ద్వారా శ్రీ కృష్ణుడు గోపికలకు పంపిన సందేశము మనకు ఆచరణీయము. ఆ నిత్య ధ్యాన భావనలలో ఉద్భవించినది పై సంకీర్తన.


*సొగసి యీ విభుని దాసుల కరుణ చాలదా*


వైష్ణవ సంప్రదాయములో భగవంతుని దాసునికి చాలా ప్రాముఖ్యత ఉంది. "దాసోఽహమ్” అని భావించి, భావించి క్రమక్రమముగా తమ ముందున్న దా(మ) బంధనాన్ని తొలగించుకొని “సోఽహమ్” గామారతారని వాళ్ళ నమ్మిక. ముకుందమాలలో "దాసదాస దాస..." అంటూ పరంపరగా చెప్పిన విషయం జగత్ప్రసిద్ధం. పూజారి కరుణిస్తే దేవుడు వరమిస్తాడు. ఎదుటి వారి చర్య భగవత్రీతికరమయితే దాసుని మోమున నవ్వు విరాజిల్లుతుంది. ఆ దాసులచూపు నగవుతో పరిఢవిల్లుతుంది. ఆ నవ్వు దయాకరమై, భక్తుల ఉన్నతికి కారకమవుతుంది. "అది చాలదా!" అని అన్నమయ్య అంతర్యము.


కార్తీక పౌర్ణమివంటి పవిత్రమైన దినములలో విష్ణువుకు ఎదురుగా ఒక కర్ర లేదా రాతి స్తంభాన్ని పాతి దానిపై దీపం వెలిగిస్తారు. ఇదే స్తంభ దీపం. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు బద్దలవుతాయని, విష్ణుమూర్తికి ఇష్టులవుతారని ఒక విశ్వాసం. విష్ణువు పాదాల ముంగిట అన్నమయ్య వెలిగించిన ఈ సంకీర్తనల దీపాలను చూసి మన జన్మ నిజంగానే ధన్యమవుతుంది. 🙏🏻





మీరు చెప్పిన దానిని బట్టి.,

గద్యం/వచనంలో దండకానికి ఛందస్సు(తగణ ప్రయుక్తము) ఉన్నది. ఆ సందర్భాలలో ఁ తో గురువు/లఘువు గా చేసుకునే సౌలభ్యం కోసమే ఁ ఉన్నది.


ఌౡ ల వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.

ౡత, కౢప్తము, భౡౢకము మొ॥


అలాగే ఱర లకు వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.


ఇప్పటికీ ళ ల, శ ష స - ల భేదము/వినియోగము/ఉచ్చారణ ఉన్నవి.


నేను ఇప్పటికీ అనేది ఒక్కటే . ఁ కు ఒకానొక కాలంలో ఉచ్చారణ ఉండి ఉంటుంది. దరిమిలాను, ఆ ఉచ్చారణను వదలిపెట్టి కేవలం వ్యాకరణ సూత్రములకే ఁ ను పరిమితం చేశారని నా మాట.

అందుకనే ఉచ్చారణ చూపకుండా ఁ తో పదములను చూపించడం మ్యూజియం ప్రదర్శన మాత్రమే అని నా అభిప్రాయం.




🙏మీరు అగ్నిని మరచినారు.


 *జామాతా జఠరం జాయా జాతవేదా జలాశయః

పూరితేనైవ పూర్యన్తే జకారాః పంచ దుర్లభాః* 


నాకు ఇప్పుడే తెలిసింది అండి. గూగుల్ ని అడిగితే.






శర్మాజీ!మీఅభిప్రాయంతోజోడుకలుపుతూ........

సం.వ్యా.శాస్త్రంలో

ద్వంద్వ సమాసపదాలలోఏదిముందు,ఏది వెనుక?

అనేమీమాంసవచ్చినపుడు:-

1)అల్పాక్షరంపూర్వం 

ఉదా:-రామలక్ష్మణులు.

2)అభ్యర్హితంచ(పూజ్యత)

ఉదా:-రాజ,సేవకులు

3)స్త్రీపుంవచ్చ.

ఉదా:-సీతారాములు

4)అజాద్యదన్తమ్ 

అచ్చులలోవర్ణక్రమాన్నిబట్టి(ద్వంద్వంలో)

ఉదా:-ఈశకృష్ణులు

ఈ,కృ.కృష్ణేశులనికాదు,[బహువచనం లో

ఈనియమంలేదు]

ఉదా:-అశ్వరథేంద్రులు.

5)ద్వంద్వే ఘి(ఇ,ఉ)

ఉదా:-హరిహరులు

కాన "అ"కంటే "ఇ"

ముందు వచ్చింది.

6)ఋతు,నక్షత్రాలలో 

వరుసను బట్టి,(సమానాక్షరాలలో)

ఉదా:-హేమంతశిశిరవసంతములు.కావున

గ్రీష్మవసంతములలో

అల్పాక్షరముగలదిముందువచ్చింది.

కృత్తికారోహిణులు.

7)వర్ణ(కుల)క్రమమున. ఉదా:-బ్రాహ్మణక్షత్రియులు

8)అన్నదమ్ములవరుసలో:-

ఉదా:-యుధిష్ఠిరార్జునులు,బలరామకృష్ణులు(కృష్ణబలరాములు

కాదు.

9)ఇలాగే చతురంగ బలాలు:-

ఉదా:-రథికాశ్వారోహ

కులు.

ఇలాంటివి ఇంకా తరచుగాఉపయోగింపనివికొన్నిఉన్నవి

వి.వి‌.హనుమంతాచార్యులు,ఖమ్మం.

9666846725.









*మనవారి మేధ*


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం (రెప్ప పాటుకాలం)

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము, ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ...లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతా యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం


పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం (చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

             (--భాగవతాదారితం )


ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు. విదేశీయులు మాత్రమే కనుగొన్న ట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి.





[12/01, 23:24] +91 94417 67340: *వాగ్దేవతలు*


*తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :


*"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.*


*"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.*


*ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.*


*"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.*


*"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.*


*"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.*


*ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.*


*అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.*


*ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"*


*ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.*


*అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.*


*ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.*

*అంటే బ్రహ్మమే శబ్దము.*

*ఆ బ్రహ్మమే నాదము.*


*మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.*


*అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.*


*భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.*


*కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.*


*మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.*


*మనం చేసే శబ్దమే...ఆ దేవత..!*


*మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.*


*ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.*

*ఇది సనాతన ధర్మం.*

*ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.*


*శ్రీ మాత్రేనమః*

[13/01, 10:24] +91 79814 07839: అల్లసాని పెద్దన గారికి గండపెండేరం తొడిగించిన పద్యం-----పాడిన వారు సమ్మెట గాంధీ గారు

రాజన్న సినిమాలో తాత పాత్రధారి, నంది పురస్కార గ్రహీత

*****************************************

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా

కైతలు జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని

ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్

బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ

కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్

జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే

ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్

గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు

న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం

బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా

సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ 

సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ

టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ

భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా

శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా

పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం

గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ

నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం

ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా

యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై

చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।






*భావగీతమ్*

*जयगुरुदत्त श्रीगुरुदत्त !:*

 నానా-ననననానా-ననననా


*శ్రుత్వా కవనధారా గుణనిభమ్*

*ధ్యాత్వా వదనమంబా సుతమహం*

*నత్వాచరణపంకేరుహమతిమ్*

*కాలీ జయతు నిత్యం శ్రితహితా*



 *చిన్తాహరతు గౌరీ హృది శివా।*

*పద్యం దిశతు హృద్యం సరసిజా।*

*జాఢ్యం తుదతు త్యాజ్యం హ్యఘహరా।*

*నిత్యం వసతు వాణీ మయి సదా।*


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️ విమల శ్రీ













*శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.*


*యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్ |*

స్వజనః శ్వజనో మా భూత్ సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా (మన వాళ్ళు) 

అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా, 

సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 


సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 


తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం -

            కళ్ళని -కల్లు 

            శిరీష-షిరీష 

            వేళ-వేల 

            కళ-కల 

            పళ్ళు-పల్లు 

            కాళ్ళు-కాల్లు 

ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు.....వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ శుద్ధి

వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది.

వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,

శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు 

నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై ,భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి🙏


తెలుగు వారికి పురాణ గ్రంధమైన పెద్ద బాల శిక్ష 

దొరకటం మహా పుణ్య ఫలం..

ఆ మహాగ్రంధం చదివిన పెద్దలు,పిల్లలూ మహా

జ్ఞానులవుతారు..

అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది..

తప్పక చదవండి.

🙏





*ఈ క్రింది పద్యం చదవండి*..!"


  "మనమే మనమని మనమన మనుమని 


మనుమని మనుమనిమన నమ్మేనా?"


"మన మేనమామ మామను మునునేమిన


 మౌనిమౌని మనమున మౌనమే!"


*భావం*


"మనమే = మనం అందరమూ....,"


 "మనమని = శాశ్వతం కాదని"


 "మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"


" *మనుమని మనుమని మనుమని*" = 


"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"


"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"


"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"


"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"


"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"


" *మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని*"


"మౌనమే = మౌనంగా"


 "మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"


"*అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!*"


"ఎంతో లోతైన జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా మోక్ష పదమైన మకారంతో మలిచారు."


 " *తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం మినహా..!!*"


🕉️👏🙏🙏🙏🏻🕉️🙏🏻🙏🏻🙏👏🕉️

🙏🏻 * శుభాకాంక్షలతో*🙏🏻🇮🇳👏 ---------





*దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !*

.

ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.

పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా! 

'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు. 

దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది. 

సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు. 

జలచర ఢులి కిరి నరహరి

కలిత వటు త్రివిధ రామ.. 

మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,


క. *జలచర ఢులి కిరి నరహరి*

*కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం*

*డిల తిరుపతి వేంకటశా*

*స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.*


అదీ వారి పాండిత్యం!




*కవిత్వం పై అభిరుచి ఉంటే చూడండి* 🌹🙏🌹


*ఇది మూలఘటిక కేతన 'ఆంధ్రభాషాభూషణము'లోని పద్యమని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ 'ప్రబంధరత్నావళి'లో కాకినాడ ఆంధ్రసారస్వతపరిషత్తులోని 'ఉదాహరణ పద్యములు' అనే ఒక వ్రాతప్రతి నుంచి దీనిని ఉదాహరించారు. అయితే ఈనాటి 'ఆంధ్రభాషాభూషణము' ముద్రిత ప్రతులలో ఇది లేదు.* ఏనాటి విమర్శకులకైనా ప్రబోధప్రాయమైన అందమైన పద్యం ఇది:


*మెచ్చుఁడు మెచ్చవచ్చు నెడ;*

     *మెచ్చకుఁ డిచ్చకు మెచ్చురానిచో;*

*మెచ్చియు మెచ్చు మ్రింగకుఁడు;*

     *మెచ్చక మెచ్చితిమంచుఁ గ్రుచ్చలై* 

*మెచ్చకుఁ; డిచ్చ మెచ్చుఁ గని*

     *మెచ్చుఁడు; మె చ్చొక మానమైనచో*

*మెచ్చియు మెచ్చకుండకయు* 

     *మెచ్చుఁడు సత్కవులార! మ్రొక్కెదన్.*


(మెచ్చుకోవలసిన చోట మెచ్చుకోండి. మనస్సులో మెచ్చుకోవాలని లేకపోతే మెచ్చుకోకండి. మెచ్చుకోవాలని ఉన్నా మెచ్చుకోకుండా మాటలు మింగకండి. మెచ్చుకోకుండానే మెచ్చుకొంటున్నామని కుచ్చితపుటిచ్చతో మెచ్చుకోకండి. మనస్సులో మెచ్చుకోవాలని అనిపించినప్పుడు అలాగే మెచ్చుకోండి. మెచ్చుకోవటం వల్ల తమ పెద్దరికానికేదో ముప్పువాటిల్లుతుందని అనుమానమైతే మెచ్చీ మెచ్చుకోనట్లుగా మెచ్చుకోండి. ఓ సత్కవులారా! మీకు నమస్కారం! - అని.)


         *-- ఏల్చూరి మురళీధరరావు*


🕉️🙏






కోధాకారాంకుశోజ్ఞ్వలా


క్రోధము అంటే ద్వేషము అనే పేరుకల మనోవ్యాపారము. మనకు ఇచ్చగనక బాగా కలిగినట్లైతే, అంటే ఒక మనిషియందు మనకు అత్యంతమైన ప్రేమ, అనురాగము

ఉన్నాయి. ప్రతి విషయంలోనూ వారే ఉన్నతులుగా ఉండాలి అనుకుంటాం. అలాంటప్పుడు

ఒకవేళ మనం అనుకున్నట్లుగా గనకవారు రాలేకపోయినప్పటికీ దాన్ని మనం భరించలేం.

ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోలేం. వారిమీద ఏదో కారణంగా కోపం పెంచుకుని

వారిని అసహ్యించుకుంటాం. దీనికి కారణము మనవారి పట్ల మనకున్న రాగము. దీనివల్లనే మన వారు చేసిన తప్పులు కూడా ఒప్పులుగాను, ఎదుటి వారు చేసిన

ఒప్పులు కూడా తప్పులుగాను కనిపిస్తాయి. అంటే మితిమీరిన అనురాగమే క్రోధము

క్రింద మారుతుంది. మనమీద మనకు నమ్మకముంటుంది. ఆత్మాభిమానం ఉంటుంది.

అంతవరకు మంచిదే. కాని అది బాగా పెరిగిపోతే దురభిమానమవుతుంది. అదే

ఆవేశకావేశాలకు కారణం. అదే క్రోధం అందుకే


క్రోధో ద్వేషాఖ్యా చిత్త వృత్తిః


క్రోధము అనేది ద్వేషము అనే పేరుగల చిత్తవృత్తి. పరమేశ్వరికి కుడివైపున్నటువంటి పై చేతిలో అంకుశమున్నది. అంకుశము బాధించేది. క్రోధము వల్ల ఇతరులకు

బాధకలుగుతుంది. ఇతరులను బాధించటమే క్రోధము యొక్క ముఖ్యలక్షణము. అంకుశము

అంటే ఏనుగును పొడిచి నడిపించే ఆయుధము. అనగా బాధించేది. కాబట్టే క్రోధానికి గుర్తుగా దేవి కుడి చేతిలో అంకుశమున్నది.


ఇది భక్తులకు జ్ఞానరూపము. దుష్టుల ఎడ అంకుశము. క్రోధమనేది రజోగుణము.

అట్టి క్రోధాకారమైన అంకుశము చేతియందు గలది ఆ పరమేశ్వరి. చతుశ్శతిలో చెప్పినట్లుగా


పాశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మకే స్మృతౌ


దేవి పాశము అంకుశము ధరించి ఉంటుంది. అవి రాగద్వేషాలకు ప్రతీకలు.

యోగినీహృదయంలో


ఇచ్చాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం


క్రియాశక్తిమయే బాణధనుషీ దధ దుజ్జ్వలమ్‌ ॥


పాశము - ఇచ్చాశక్తి. అంకుశము - జ్ఞానరూపము. ధనుర్బాణములు

క్రియాశక్తిమయాలు.


ఏదైనా జీవి హింసించబడేటప్పుడు, అది ఆ బాధ భరిస్తూ, ఎదిరించలేక “ఓ దేవీ! నన్ను హింసిస్తున్నారు. వారిని ఎదిరించే సామర్ధ్యము నాకులేదు. ముందు జన్మలోనైనా

ఇటువంటి వారిని ఎదిరించే సాహసము నాకు కలుగ జెయ్యవలసినది” అని ఏడుస్తూ

ప్రార్థిస్తుంది. ఈ జన్మలో దాని శరీరము నశించినప్పుటికీ ప్రతీకారజ్వాల మాత్రం దాని

మనసును అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడు మరుజన్మలో ఆ జీవికి అది క్రోధము

అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి హింసా ప్రవృత్తికీ గతజన్మలోని

అనుభవాలే కారణము. అదే పరమేశ్వరి చేతిలోని అంకుశశక్తి. పాపం చేసినటువంటి

వారికి ఇది అంకుశము. మిగిలినటువంటివారికి ఇది ఆభరణము. శ్రీచక్రంలోని ఎనిమిదవ

ఆవరణ అయిన త్రికోణంలో దీన్ని పూజిస్తారు.

ఓంఐంహ్రీంక్రోంక్రోం సర్వస్తంభనాభ్యాం

కామేశ్వరీ కామేశ్వరాంకుశాభ్యాం నమః అంకుశశక్తి

శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః

 

దుర్వాసుడు శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 44వ శ్లోకంలో అంకుశాన్ని ధ్యానిస్తూ


యః స్వాన్తే కలయతి కోవిద స్త్రీ లోకీ


స్తంభారంభణచణ మత్యుదారవీర్యం ।


మాత స్తే విజయమహాంకుశం స యోషా


న్దేవా స్పృమృయతి చ భూభుజోల న్యసైన్యమ్‌ |


తల్లీ ! ముల్లోకములను స్తంభింపచేయకల నీ అంకుశబీజమును ఉపాసన చేసేవాడు సకల స్త్రీలను, దేవతలను, రాజులను, శత్రువులసైన్యాలను కూడా స్తంభింపచేయగలుగుతాడు.


శ్రీ మాత్రే నమః



*పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..*


*పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..*


తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన


గానం. 

1. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

2. శోభారాజ్ గారు


రాగం. మోహన


స్వర రచన. డి. పశుపతి గారు


తాళ్లపాక వేంకటశేషాచార్యుల

వ్రాతప్రతి పుట: 52 సంకీర్తన: 51

ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 194

రేకు రాగము: శంకరాభరణం


పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము

నెడయకవయ్య కోనేటి రాయడా


కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల

నేరిచి పెద్దలిచ్చిన నిధానమా

గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు

చేరువ చిత్తములోని శ్రీనివాసుడా


భావింప కైవసమైన పారిజాతమా, మమ్ము

చేవదేర గాచినట్టి చింతామణీ

కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము

తావై రక్షించేటి ధరణీధరా


చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా

లడచి రక్షించే దివ్యౌషధమా

బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము

గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా


విశ్లేషణ :


 - శ్రీ తాడేపల్లి పతంజలి గారు


     ఓ అయ్యా ! విష్ణు రూపమైన ( పురుషోత్తమా ) శ్రీ వేంకటేశ్వరా ! మిమ్మల్ని చూశాము ( పొడగంటిమి ). మిమ్ము చూసే ఆనందాన్ని మాకు దూరం చేయకు. పుష్కరిణి అనే కోనేరుకు ప్రభూ ( కోనేటి రాయడా ) ! మమ్మల్ని ఎప్పుడూ విడువకవయ్యా (ఎడయకవయ్య )!



1. మా కులానికి దేవుడివి నువ్వు. ఏరికోరి మమ్మల్ని పాలిస్తున్నావు. (ఏలినట్టి ). ఎంతో నేర్చుకున్న మా పెద్దలు  'ఈ స్వామి నిధి ( నిధానామా )' అని నిన్ను మాకు ఇచ్చి పోయారు. ఆ నల్లటి మేఘం నీటిని ఇచ్చి మా దాహాన్ని తీరుస్తుంది. స్వామీ ! నువ్వు కూడా ఆ కాలమేఘం (కాలమేఘమా) వంటివాడివి. మమ్మల్ని ఆదరించి ( గారవించి ) మా విజ్ఞాన దాహాన్ని పోగొడుతున్నావు. శ్రీనివాసుడా ! నువ్వు మా దగ్గరగా ( చేరువ ) వున్నావు. మా మనస్సులలో కూడా వున్నావు. ఎంత అదృష్టవంతులమయ్యా !


2. స్వామీ ! ఆ స్వర్గ లోకంలో ఎవరేది అడిగినా ఇచ్చే పారిజాతం ( సముద్రం వలన పుట్టింది ) ఉంటుందట కదా ! మేమందరం కలిసి ఆలోచించి ( భావింప) ఒక తీర్మానానికి వచ్చాము. మా ఆధీనంలో ఉన్న ( కైవసమైన ) పారిజాతానివి నువ్వే !  ఆ దేవలోకంలో ఉన్న చింతామణి అనే మణి దుఃఖాలను పోగొడుతుందట. మా చింతలన్నింటిని పోగొట్టి మాకు శక్తి ఇచ్చి రక్షించిన ( గాచినట్టి ) చింతామణివి నువ్వే ! మా పనులన్నింటిని పూర్తి చేసి ( కావించి ) మా కోరికలన్నీ తీర్చే కామధేనువు నువ్వే ! 


3. ' శ్రీ వెంకటేశాయ నమః ' అని భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ! చెడు అనేది కలగనే కలుగదు ( చెడనీక ). ఎటువంటి కష్టాన్ని అయినా పోగొట్టి బతికించి అన్ని లాభాలు కలిగించే మంత్రం అది ( సిద్ద మంత్రమా ).  ఆ మంత్రానివి నువ్వే. మాములు రోగాలు పోవటానికి ( అడచి ) వైద్యుడి రూపంలో నిలిచి ( మందు ) ఇస్తావు. భవరోగాలు ( సంసారము ) పోవటానికి కూడా నిన్ను శరణు కోరటమనే గొప్ప మందును ( దివ్యఔషధం ) ఇచ్చి మమ్మల్ని రక్షించావు. ఎప్పుడూ మమ్మల్ని విడువక మా వెంట ఉండి మాతోనే తిరుగుతుండే ( బడిబాయక ) మా ప్రాణ సమానమైన చుట్టానివి ( ప్రాణ బంధుడా ) నువ్వే ! మమ్మల్ని కల్పించిన ( గడియించినట్టి ) శ్రీ వెంకటగిరి పర్వత రాజువి ( శ్రీ వెంకట నాధుడా ) నువ్వే !🙏🏻


*విశేషాలు:*


*నాన్నగారు* అంటే గౌరవం. మనస్సుకు కొంచెం దూరం. *అయ్య* అంటే మనస్సుకు చాలా దగ్గర. *అయ్య* అని పిలవ వలసిన తీరులో పిలిస్తే, ఎదుటివాడి శరీరంలో రక్తం కాసేపు ప్రవహించటం మానేసి, ఆత్మీయత ఉరకలెత్తుతుంది. ఆ ప్రేమశక్తిని గ్రహించిన అన్నమయ్య - జగాలను కన్న తండ్రిని *'అయ్య'* అని పిలిచాడు. 


నిధానము (= నిధి), నిధనము (= మరణము) దగ్గర సంబంధమున్న పదాలు. ధన సంబంధం దేనిలో పోతుందో అది నిధనం. దేనిలో ఉంటుందో అది నిధానం. అసలైన ధనం మనమనుకొనే ఆస్తులు కాదు. స్వామి అనుగ్రహం అనేది ఒక నిధి అని పెద్దలు నేర్చుకొని, తరతరాలకు తరగని నిధిలా దానిని మనకు ఇచ్చిపోయారట. నిధనము వచ్చేలోగా స్వామి అనుగ్రహం కోసం తాపత్రయ పడమని కవి ఉపదేశిస్తున్నాడు.


మనస్సులను ప్రేరేపిస్తుంది కాబట్టి నలుపు రంగుకు కాలమని ఇంకొక పేరు. తడిపేది మేఘం. నల్లగా ఉన్న స్వామి అన్నమయ్యకు కాలమేఘమయ్యాడు. ఆర్తుడు, జ్ఞానుల్లో సామాన్యమైన లక్షణం తహ తహ. ఇది దాహానికి సంకేతం. 'ఈ దాహాన్ని పోగొట్టే నల్లటి మేఘం నీ ఎదురుగా ఉంది. ఇతర దాహాలు మానేసి నిరంతరం స్వామిని పాడాలనే దాహం పెంచుకో! తప్పకుండా ఆ కాలమేఘం ఆదరించి (= గారవించి) దాహాన్ని పోగొడుతుందని కవి అభయం.


 మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం అని అయిదు దేవ తావృక్షాలున్నాయి. ఎవరేది అడిగినా, అది ఇచ్చే ఆ పారిజాతం ఇంద్రుడి ఆధీనంలో ఉంటుంది. కాని మన అధీనంలో ఉన్న పారిజాతం స్వామి అని కవి చమత్కారం. 


వరాహావతారంలో స్వామి భూమిని మోశాడు. అందుకే ఆయన ధరణీధరుడు. తిరుమలలో స్వామివారు ఉండటానికి స్థానాన్నిచ్చింది వరాహస్వామి. అందుకు ప్రతిఫలంగా మొదటి దర్శనం వరాహస్వామి పొందాడు. తిరుమల వెళ్లినవారు వరాహస్వామిని చూడకుండా వేంకటేశ్వర దర్శనం చేసుకోకూడదు. ఇద్దరూ ఒకటే అని జ్ఞాపకం చేస్తూ, 'తావై' అన్నమాటలో వరాహస్వామి విశిష్టతను కవి తెలియజేశాడు. 


వైద్యోనారాయణో హరిః అంటుంది మన సంప్రదాయం. అన్నమయ్య కూడ స్వామివారిని వైద్యునితో పోల్చి, ఆయన ప్రసాదించిన శరణం అనే ఔషధాన్ని భక్తితో సేవించమన్నాడు. 


ప్రీతిని కలిగించేవాడు బంధువు. వేంకటేశ్వరస్వామి ప్రాణ బంధువు. మనకున్న పంచప్రాణాలలో ఒకటి వాక్కు అనే ద్వారంలో ఉంటుంది (నాగం). రెండోది కంటి రెప్పలలో ఉంటుంది (కూర్మం). మూడవది ముక్కులో ఉంటుంది (కృకరం). నాలుగవది కంఠం అనే ద్వారంలో ఉంటుంది (దేవదత్తం). అయిదవది శరీర మంతటా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు శరీరానికి బలం ఇస్తుంది (ధనంజయం). ఈ ప్రాణాలు ప్రతి జీవికి చాలా చాలా ఇష్టమైన బంధువులు. ఈ అయిదు ప్రాణ వాయువులలో ఏ ఒక్క బంధువు తన దగ్గరనుంచి వెళ్లటానికి జీవి ఇష్టపడడు. మనలిని విడవకుండ ఉండే ఈ ప్రాణాలంటే ఎంత ఇష్టపడతామో, స్వామి అంటే కూడ అంతే ఇష్టపడాలని అన్నమయ్య ఆయనని ప్రాణబంధువన్నాడు. 


*'ఓం నమో వేంకటేశాయ'* సిద్ధమంత్రం. అంటే ఏది కావాలన్నా ఆ సిద్ధిని కలిగించే మంత్రం. పరమేశ్వరుడు మన కంటికి కనిపించే విగ్రహ రూపంలో, మంత్ర రూపంలో, యంత్ర రూపంలో ఉంటాడు. *'చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా'* అనే పాదంలో మంత్ర రూపంలో ఉన్న స్వామిని అన్నమయ్య కీర్తించాడు. స్వస్తి.🙏🏻






*గసడదవాదేశ సంధి:*



 గసడదవాదేశ సంధి మూడు రకాలుగా జరుగుతుంది

1)ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.

పరుషములు: క చ ట త ప అను ఐదు వర్ణములు పరుషముల స్థానమున గ స డ ద వ అనే ఐదు వర్ణములు ఆదేశంగావస్తాయి

క - గ, చ - స, ట - డ, త - ద, ప - వ

ఉదా: వాడు+కొట్టె = వాడుగొట్టె - వాడుకొట్టె (వైకల్పికం అంటే రావచ్చు, రాకపోవచ్చు)


లెస్స+కాను =లెస్సగాను (నిత్యము అంటే తప్పనిసరి గా వస్తుంది)

అపుడు + చనియె = అపుడు సనియె/అపుడు చనియె

నీవు + టక్కరివి = నీవు డక్కరివి/నీవు టక్కరివి

మీరు +తలఁడు= మీరు దలఁడు/మీరు తలఁడు

వారు + పోరు = వారు వోరు/వారు పోరు.

అలాగే కళలగు క్రియా పదములమీద సహితం కనపుడుతున్నది.

రారు + కదా= రారు గదా/రారు కదా

వత్తురు +పోదురు = వత్తురు వోదురు/వత్తురు పోదురు


2)తెనుగులమీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు

 

తెనుగుల మీది అంటే అచ్చ తెలుగు పదాల పరమైన, సాంస్కృతిక అంటే సంస్కృత పదాల లోని పరుషములకు గసడదవలు రావని సూత్రార్థము


ఉదా!! వాడు+ కంసారి

     వాడు అనునది అచ్చ తెలుగు పదము

  దానికి కంసారి అను సంస్కృత పదంలోని క అను పరుషము పరమైనది .ఆ పరుషము గ గామారదు

కావున

వాడు కంసారి అనే ఉంటుంది.


వీడు + చక్ర పాణి - వీడు చక్రపాణి

ఆయది + టంకృతి = ఆయది టంకృతి

అది + తథ్యము = అది తథ్యము

ఇది + పథ్యము = ఇది పథ్యము.


ఇవి పైన వాడి కంసారి వలె రూపసాధన చేసుకోవాలి.


3)ద్వంద్వంబున పదంబుపై పరుషంబునకు గసడదవలగు


ద్వంద్వంబున అంటే ద్వంద్వ సమాసంలో

పదంబుపై అంటే పూర్వ పదానికి పరమైన పరుషం స్థానంలో గసడదవలు వస్తాయి


తల్లి+తండ్రి = పరపదంలోని త స్థానంలో గసడదవలలోని ద వచ్చి తల్లిదండ్రులు అవుతుంది.


కూర + కాయ = కూరగాయలు

కాలు + చేయి = కాలుసేతులు

టక్కు + టెక్కు = టక్కుడెక్కులు

ఊరు + పల్లె = ఊరువల్లెలు.


✍️ పైడి నాగ సుబ్బయ్య.

Friday, December 6, 2024

ఆశు కవిత్వం

 *తురగవల్గన రగడ*


అండ నిలుౘు తండ్రివీవు ఆది పురుష! వందనములు

దండి నొసగి మాదు మదిని ధైర్యనిధిని చందనములు

మెండు పూసి పూజ సేయ మేదినీ పతి! మము గాౘు

కొండ నిలయ! బ్రతుకు శోభ గూర్చుమయ్య సవ్యసాచి




ఉత్పలమాలిక


వారధి గట్టి నీదు పరివారము సంద్రము దాటి చేరి యా

తీరము, గాచినారు సుదతీ! రహి రూపిణి! తల్లి సీతనిన్

తారక రామ! నీవును సుతారము నొప్పవ ధర్మ వర్తనల్

గారడి చేయు వారి నయగారము ద్రుంచెడి తండ్రివీవయా

కారణ జన్మ నీది! మమకార వికారము లంటనీయవే

కోరము నిన్ను యే విషపు కోరల వంటి వరమ్ములన్ సదా

ధారగ నీదు నామము సుధారస పానము ౘాచాలు దేవరా

హారతి నిత్తుమయ్య! సుమ‌హార‌‌ము తోడను! లోకనాయకా





హరిగతి రగడ

వేడుట మానితి శ్రీనరసింహా! ప్రేమను పంచెడి నీకడ నేలన

పీడల గూర్చిన చర్చలు! మానెద! పెన్నిధివై మములందఱ గాచిన

వాడవు భక్త శుభాశ్రిత సజ్జన పాలక! పూర్వపు కర్మల వాసన

వాడును గదనీ యర్చనతో మది ప్రాణము నీవయ బాపుమ వేదన



ౘూడక యుంటివ! ధరపై

కీడును! కన్నులు తెరువుమ! క్లేశము నిండెన్!

వేడుక బదులుగ వేదన

యాడెను రక్షింౘుమయ్య! అయ్యప దేవా



లంకను దాటెను గానీ

పెంకి తనము గల మనుజుల వెఱ్ఱి తనమునే

లంకిణి వలె ద్రుంౘవె మా

వంకకు ౘూడవ కరుణను! పవన కుమారా


శరవణ శరణము వేడుౘు

కరుణను గోరుౘు నిలచిన కనవే మమ్మున్

ధరపై బాధలు వెతలును

పెరిగెను పలుకవ! యిల దిగి వేగమె రమ్మా




విత్తమారబోసి చిత్తమందును లేక

శుద్ధి గాని భక్తి శోభగాని

కొల్చినట్టి భ్రమను కొట్టుకున్నను రాడు

విభుడు మనదు చెంత! వింత గాదు 



ముమ్మూర్తుల రూపమ! మా

సమ్మానము గైకొని మము సాకుమ! గురువై!

యిమ్మహి నడచెడి పథమే

యిమ్మా! దత్త స్వరూప! యెంౘక గుణముల్




కన్నులు తడిపే ఘటనలు

పెన్నును పట్టుకు రచించి పెన్నిధి కథలన్

మిన్నగ జనులకు దెలుపుట

వెన్నును నిమురును! నిశి విడి వెలుగును దివ్వెల్

యండమూరి గారి దీప్తి టపాకు




On యండమూరి గారి గోడ. లంకె: 


https://www.facebook.com/share/p/15dkqS7JFf/


మధుమేహము రానీయని

మధువీ తెనుఁగని ప్రతీతి మహిలో జనులా

సుధలొలికించెడి నీతులు

దధిలో చక్కెరలు చేదు తగలదు వినినన్.



లెక్కింౘగ తరమా యే

ఒక్కఱికైనను మహిమలు! ఉజ్జ్వల రూపా

చిక్కులు దీసెడి నిన్నే

మక్కువ పూజించెదమయ మారుతి! తండ్రీ.




జననీ వేంచేసితివా

యనలము రూపుమున! మాకు యాశీస్సులతో

ఘనముగ సేమము నొసగన్!

జనకునికి ప్రణతి తెలుపుమ! చండీ! గౌరీ!




తాత్విక అద్వైతం లో


సీసము: శంకర స్తుతి:


కర్మ ఫలమ్మును కాల్చని కంటికి

తప్పులు ౘూౘుట గొప్ప దగునె?

జ్ఞానమెఱుఁగని పానములైనను

నేర్పవె తండ్రిగనోర్పు తోడ?

వామపు భాగము శ్రీమాత యుండగా

తెవియవా భక్తుల తిప్పలన్ని?

ఇంకా నిదుఱనుంటివేల యోడగ

గరళము నీ ముందు! హర! కపర్థి!



తేటగీతి: 


లోక పాలక! నాయక లోపములను

ౘూౘుట సరిగాదుగ! యెట్లు చోద్యమగును?

వాని మాన్పకుండ శిశుల పట్ల యేల

రౌద్ర రసము! కరగుమయ్య యద్రి వాస.



సీసము:


కొండను మోయు కాకుత్స సేవక! మాదు

కష్టములను గాచి కరగి పోవు

వెన్న వంటి మనసు! యన్నుల మిన్నగ

గాౘుౘుంటివ మమ్ము! కరుణ రూప!

దశకంఠు మించిన తనువు మా హృదినందు

పట్టు విధమ్ముగ వంగినావె!

నీ కరుణను దెల్ప నాకు వశమ! తండ్రి

కన్నుల బిందువు కార్చెదనయ


తేటగీతి:


స్మృతిన సతము దలౘుకుంటు! కృపను! మేము

మరచినను గాని విడువక మారుతి! యిల

తోడు యుండి దాటించి యా పీడలన్ని

నిలిపి రామ నామ మహిమ నేర్పినావె!




గాహే తవ జయ గాథా

సోహము భారతి ధరణికి శోభవు నీవే

మా హారతి గైకొని మము

మోహము నుండియు నడుపుమ! పుణ్యము దిశగన్.



జయ సూర్య పట్నము గుడి group:


ఆరంభించెద నుతులను

ధారగ వ్రాయుటకునేడు దమశ హరేశా

నీ రమణీయపు కరుణను

సారించుమ నా దిశగ! కుశలత నొసగుమా


దత్తాత్రేయా! ప్రణతులు

నుత్తమ గుణ శీల! ధాత్రి యుజ్వల భవితన్

చిత్తపు శాంతియు గాచెడి

కత్తరమౌ నీకు పద్య కానుక నిదియే.


కత్తర = కవచము





స్వంత శక్తి నమ్మి సాగించి పయనము

గెలువవౘ్చు కాని గేలి ౙరుగు

విధము పరుల చెంత వేడుట యేలన!

జగతి సత్యమిదియె జయముఁ గూర్చు.





సీసము:


నీవెట్లు గొప్పవో నీరజ లోచన!

అత్యంత పొట్టి నేనల్పురాల

నాగుండె నిండుగ నేగూడు కట్టనే

అయినను యుంటివి యౘట నీవు

యింత కొంచెము జాగ యెట్లు ౘాలును 

తండ్రి! గాని తరలి తల్లి చేరె

ఒకఱికిరువురుండ నుర్వియాయెను గద

నాదు మనసు నేడు! వేద వినుత!



తేటగీతి:


యిపుడు ఘనులింకెవఱయా ప్రహేళిక యిది

బదులు నేను యనక నన్ను పట్టి విడక

కరుణ ౘూపిన ౘాలునే శరణు శరణు

హారతులు గైకొనుమయ మా యార్త పోష!




పాలు తెచ్చి గోరి మేలు శిశువునైతి

భాను మూర్తి నాకు బంధువగుౘు

రక్షనీయ వయ్య రయము చెంతన నిల్చి

వేడి యనను తండ్రి! వీడకయ్య.



వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


06.01.2025 సోమవారము 


అంశము: వర్ణన (చలికాలము)


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్.


బాలలకేమో బడులట

తేలగలేమే యుదయము! తీయుచు రగ్గుల్

పాలన మిఱియము వేసిన

లోలో మేలగును గాని రోత వెలుపలన్.


పూవులు సైతము తరువున

రావే రంగులగులాబిలసలే లేవే

యీ వసుధ కప్పబడెనిట

యో వరుసన మంచు బిందువులతో సతమున్.






దేవీ ప్రసాద్ గారి ఫేస్బుక్ గోడ పై


"నడక" నేర్పినారు నారాయణులు మాకు

స్వస్థతకు పథమ్ము ౘక్కగాను

ౘూపినట్టి ఘనులు తాపీగ నుండుటే

తగదు యనెదరండి! పగలు రేయి 


ఆట వెలఁది 


నవ్వు గూర్చి వారు పువ్వు వంటి పలుకు

తీపి రుచిన మనకు తెలిపినారు

ఒదిగియుండు నెంత యెదిగి యున్నను తాను

మార్గదర్శి మనకు! మరువమెపుడు.




అహమసలెరుగని మీరే

యిహమును వదిలితిరదేల యీవీవీ మా

గుహవంటి బ్రతుకులకు రవి

గ్రహమై పంచిరి నగవుల కలిమిని! భళిగన్.


Stars shining ✨🌟 

Skies lining

Minimal lightning

Good Night Bhogi



సినుకు రవ్వలు లో సంక్రాంతి కి

గాలి పటమ్ములు యువతుల

కాలికి అందెల రవళులు కళకళలాడే

బాలల భోగి వినోదపు

లీలలు యెగసెడి మంటల రీతుల్ భళిలే.


ముగ్గులు గొబ్బెమ్మలతో

మొగ్గలు దండలు విరియగ ముంగిలి నిండున్

సిగ్గులు కురిపింౘుౘు యే

పగ్గములెఱుగక పఱుగిడు వనితలు భళిలే.



అనిల్ రావిపూడి గోడ పై


ఆట వెలఁది 

హాస్యమాడుతూనె హాని కారకలను

మట్టు పెట్టు కథను మాకు పంచి

విజయమందినారు విషెస్సు మీకివే

యనిలు గారు గొనుమ! యద్భుతముగ.





తాత్త్విక అద్వైతం సమూహము 

నా గారములన్నీ మీ

జాగాలోనే గద హర! సాగును కోటన్

పాగా వేసితి గాౘుమ

జోగెద మీ వడిననే ప్రచోదనమనుౘున్.


వందనములు చాలవనుచు విడువవలదు

మమ్ము తల్లి! తండ్రి! మదియె మీకు

మందిరముగ నుంచి మసలుచుంటిమి గాద!

కమ్ముకొన్న నమ్మకమ్ము తోడ.




రుద్రా నీవే యొసగుమ

భద్రత లోకము నశించె వనరులు జనులే

నిద్రను మునిగిరి ధర్మము

ఛిద్రమయేనయ! దయగొని క్షేమమునిమ్మా.



వాత్సల్యము గావలెనను తలపును పట్టును మనసే నినుగాంచగ నే

సత్సాంగత్యము విడువక నీకథ శ్రవణము మననముయును చేసెదనే

మత్సరగుణమును బూనిన మనుజులు మాలిన్యముతో గొట్టిన నను నీ

ప్రోత్సాహము నడిపించగ నిను పూజించుచు దరి చేరెద నేనే



వాత్సల్యము గావలెనను తలపును పట్టును నృసింహ! నినుగాంచగ నే

సత్సాంగత్యము విడువక నీకథ శ్రవణము మననముయును చేసెదనే

మత్సరగుణమును బూనిన మనుజులు మాలిన్యముతో గొట్టిన నను నీ

ప్రోత్సాహము నడిపించగ నిను పూజించెద పుత్రికనై మదినే.




శరణమన్నవాని హరి యు హరుడు గాచు

వేరు భావనేల పృథివి వాస!

దండమిదిన ౘాలు నండయై నిలుౘునే

దైవమెపుడు మనకు దారి గూర్చు.



తన హృదిన లోకమెయుండగ

మనకెందుకు భయము బెరుకు మంగళమౌనే

ఘనముగ వెన్నయు వేణువు

కనపడగ కరములనందు! కన్నులు మురియున్.



శంకలేల మనకు శంకరుడుండగా

పంకజాక్షి హిమజ భరతభువిని

వంకలేని విధము పరి రక్షణను సేయు

బింక వీడి పిలుమ విభుని హృదిని.


సామవేదమంటు సంగీతము కొరకు

తల్లి వాణి దలచి ౘల్లదనము

గొంతునుట్టిపడగ కొంతైన వౘ్చునా!

కళలు నేర్చుటెపుడు కాదు సులువు!



గరిమెళ్ళ వారికి

వెడలినారదేల వేంకటేశుని చెంత

నిలచు యానమిపుడె! నిశ్చలముగ!

మొదలు పెట్టినార! పుణ్యాత్మ ప్రణతులన్

మావి దెలుపరండి! మాత పితకు.



ఇంత అందమౌ వసంత కోకిల బోలు

పద్యమల్లలేను విద్య రాదు!

మనసు చిన్నబోయె ప్రణతులిడుటయు నా

పదమునందు పలుకు పట్టలేక.


హనుమా:

నిమరవె యీ శిరమును యో

సుమనస్కుడ! హనుమ నీకు ౙోతలునివియే

యమరెద నీ బిడ్డగ నే

నమస్సులర్పింౘుౘు నువు నా తండ్రివయా.



ధర్మము గాౘగ రావే

నిర్మాతవు నీవు రామ! నేర్పవె గుణముల్

కర్మల ఫలమును బాపే

మర్మము మదిలోన నీదు స్మరణమె కాదా!



https://www.facebook.com/share/p/16KifnciAz/

శివుని కరమున నరుడు


నీ హస్తము ౘాలును నా

దాహములన్నియు జలనిధి దయ నందును యే

మోహములుండక యందును

దేహము శుభముల ఫలముల దీవెన! తండ్రీ.


https://www.facebook.com/share/p/1APxLwfESr/

శివునకు శిలమున పైనను

భవని కర్ణమున నీవె! ప్రార్థన వినుమా

నవవిధ భక్తులసైతము

భవమున బడినే నెఱుగను! పథమునొసగుమా.


ఉదయత్త వాట్సప్లో గణపతికి:

మూలాధారము వంగిన

తేలుట వశమా గణేశ! దీవెనలిమ్మా

యీ లఘు పూజలగొని మము 

లాలించుమ శైలజసుత! ప్రణతులు తండ్రీ.



వెంటనే వచ్చిన కాణిపాక వినాయక పాటకు అత్త వాట్సప్ లోనే:

పిలువగనే వచ్చితివా

కలికికి తనయుడవు మాకు కపిలాగ్రజువై

నెలకొల్పవె శాంతి సిరులు

తలవాకిటనే గణేశ! దయగొను దేవా.



వైద్యం గురువు గారికి


తాటంకములే గాచును

యాటంకములను తగువిధమారోగ్యమునే

మూటగ నొసగును గద! యీ

పాటను వింటిని శిశువుగ! బామ్మల చెంతన్.




అవగాహన విద్యా వికాస పరిషత్ సమూహంలో మరుమాముల గురువుగారి సందేశానికి ప్రతి స్పందనగా ఈ పద్యం

కలదు మనపై వినాయక కరుణ గాని

గాంౘమేమో మనము గాన కష్టములను

మాత్రమే దలంచుచు నేడ్చి నేత్రములను

కడలి చేసికొందుమ యిది కాల మహిమ.




వైజాగ్ లో డా కొచ్చెర్లకోట వారి యింటి ప్రక్కన


కొండల రాయ! గొల్చి నిను కొంగున సన్నిధి కట్టుకొందుమే

యండవు నీవు! కర్మ ఫలమంటగ నీయని తండ్రి వై సదా

దండిగ రక్ణనీయవె! సుదర్శన ధారి! వధించి వైరులన్

పండుగ గూర్చుమా! యిలకు వైభవమంతయు నీ దయే గదా.




విశ్వావసు యా పై యే

యశ్వాసము యతన మేలు యందును ధరకున్

శాశ్వతముగ ధర్మమునే

యీ శ్వాసను నింపినంత హేలలె పండున్.




ఒక్కరు యున్న ౘాలును సమున్నతమౌ గుణమబ్బి లోకముల్

ౘక్కదనంబు నేర్పడును సంస్కృతి సాగుౘు వృద్ధి గూర్చి యో

మొక్కను పెంచినట్లుగ సమూహమునందున బాలబాలికల్

ప్రక్కకు పోవనీయని సువాసన గూర్చును తోటమాలియై.

Sunday, November 3, 2024

నా బాధలు

 ల(క్షణ) ప్రాస‌పద్య రాజము:




విలువలు పలుౘన నలుపుౘు


వలువలు పలు గట్టగలమ! లత తనువులకున్


సొలసిన కలికిని యలతిగ


కలతను నిలుపుట ఫలమ్మ! కలిమా! యిలపై




నీదే తెలివిగ మురియుౘు


భావించి నితరులనెల్ల వ్యర్థమ్ముగ యీ


తావిన యమరని యిమడని


పూవైతివిగా హతవిథి! పుణ్యము రాదే!




చేసితి వ్రాసితి నొందితి


వాసిగ రాసిగ ఫలములు భావింౘుౘు నీ


దాసిగ పలుకుట తగునా!


ౘూసితివా నా ఘనతను! చోర! కిషోరా!




అలసితి! సొలసితి నైనను


కలికీ యడుగను బహుమతి కలవే


కరముల్


పలు సంఖ్యను! చేయుటకై


సులువుగ పనులను! పలుకున ౘులకన తగునా!






విరిసిన కుసుమపు సొగసులు


మురిపింౘగ మనసు కందముయు పుట్టెగదా


శిరమున చేరిన యాగున!


తరుణికి ముఖమున చెదరని దరహాసములే




 స్వయముకు పిన్నత్తకు నా

వ్యయమగు పతికిని శిశువుకు నస్వ్థతలే

భయమిక పడలేనమ్మా

నయముగ ననుగని మనవిది! నగజా ప్రణతుల్


పాలును తేనీరును నే

బేలగ పట్టితి నిరుడును! వెలసిన తనువే

తాలిమి గోరెను నిన్నే

లీలలు చూపించుచు నను శ్రీ సతి! గనుమా


విశ్రాంతములే కరవే

నే శ్రమ పడలేనిక నను నీ దరి గొని యో

యాశ్రయమిమ్మా చాలును!

మా శ్రీ దేవీ! శరణము మంగళ మూర్తీ


అలసిన తనువుకు లేదా

కొలదిగ నైనను విరామ కోటా హయ్యో

నిలుపుమ స్వస్థత గృహమున!

బలి తీసుకునుందువ నను! వగచెడి దానన్


లోకపు మాటలు చాలును

నా కను పాపలు నడిగెను నయముగ సెలవున్

పీకుట పాకము బెట్టుట

లేకి తనంబవద! తల్లి! శ్లేషలదేలన్


మరచితి పొయ్యిని గట్టుట

శిరమున పెరుగగ బరువులు చింతలు మదిలో!

కరుణను చూపించుచు నను

తెరపిన పెట్టుమ సురనుత! దీవెనలిడుమా


శిశువుకు తల్లియు టీచరు

వశముగ చెల్లెండ్రు చేసె పనులను! నేనే

నశియించిన పిదపను! నా

యశమును గమ్మత్తు గణన యవసరమా! ఏ?


లెక్కలు చేసెడి జనులే

యొక్కఱు హితమును సహాయముసగరు నైనన్

చుక్కలు చూపించెదరే తగునా

యక్కట! యీ దౌష్ట్యములు సుఖేసిని! జననీ



నిందలు వేయుటదేలన!

బొందిని దీసెడి తలపులు పుణ్యములేనా

సందును జొప్పించి మఱీ!

విందెటులగునో యివి మఱి! వినడా భవుఁడే



అలసితి సొలసితి బలమును

పలుకును నిలువక తరలగ వదలితి తలపున్

కలిమిని కలమును పిలువక

వెలుగక నలిగితి లలనను! వెతలన పడితి

న్



ౘదివితి గాని శాస్త్రములు సన్నిధి లేదు కపర్థి! బ్రోవరా

కుదుపులు లేని జీవితపు కోటలు లేవను సత్య వాక్కునే

మది గదినందు తోౘక ప్రమాదపుటంౘును చేరి యుంటినే

వదలక నాదు హస్తమును! పాదము తోడుగ నుంౘు తండ్రిగా


అనిల కుమార! భక్త శిఖరాగ్రవు కాదయ దేవువీవెగా

యనవరతంబు సాయముగ హస్తమునుంచుమ చెంత వీడకన్

కనులను కారు నీరు నను కాల్చుచు నుండగ నేడ్చి సోలితిన్

నిను మది నమ్మినాను నను నీలపు నీడన ముంౘబోకుమా




బిడ్ఠల వృద్ధిని కోరుౘు

గడ్డలు దాటెడి జనాళి ఘనులయ ధాత్రిన్!

తెడ్డును దాౘుౘు ముంచిన

విడ్డూరముగ! శిశువు వేదన పడునే


సీసము:

చాకిరి చేసెడి ౙాబిలి యారిన!

యిక కాచెడి తన వాఱెవ్వఱంట

తగవులు జగడము తంపులు చేయుౘు

కీడును కోరుౘు కీర్తి యశము

సహితము విడువక ౘంపెడి వృద్ధులు

తుదికంట తరుణుల తోసి వైచి

నంగిగ నగుపించి నయ వంచనము చేసి

ముదమునొఅందెదరు! బోలెడంత


తేటగీతి: రాయల శైలి


త్యాగ నిరతి తోడ తమను తామె శిశువు

యాహుతిగ చేసి యున్నను యాగరు గద

ఫలము నంది విశ్వాసపు వలువలేవి

యెఱుఁగనట్టి వారు! పరుల యేడ్పు గోరు


ఏక పక్షిని చేసి సహేతుకముగ

దానినే దలంౘుౘు గొడి తరుణి మణిని

నవ్వుకొందురు ప్రజలు సనాతమగున!?

వీరి గుణముల నెంౘుట నేరి తరము?



అంతర్యామీ అలసితి

సుంతైనను దయను ౘూపి సుపథమునిమ్మా

చెంతను నిలువక వెడలిన

యంతమె బ్రతుకుకు! మనసున ఆక్రందనతో 


మానితి! యాత్రలు, బ్రతుకుట

మానిని! నలుగుౘు నలుగుఱి మధ్యన తుదకున్

మానై మిగిలితి, నీవే

మానవ జాతికి దెలుపుమ! మంచి తనమునే


వగచెడి వనిత వధింౘుట

తగునా హతవిథి యెఱుఁఖరు ధర్మము నరులున్

తగిలించి గాట్లు మనసున

నగవులు చిలుకును వెలుపల నయ వంచనలే


మారున! ధర్మము తలకొక

తీరుగ! తగునా! యుసురుల తీయుట నటుపై

శౌరి నటింౘుట! యెఱుఁగడు!

యా రమ నాథుడివి యేమి! యనుకొను నరుడా

(అంతరంగమందు నపరాధములు చేసి /

మంచి వాడు గాను మనుౙుడుండు

యితరులెఱుఁగకున్న యీశ్వరుడెఱుఁగడా

విశ్వదాభిరామ వినురవేమ)


ఏడు గడిచె గాని ఏఁడుపే మిగిలెనే

ఒక్క రోౙునైన యులుకు లేక

సాగలేదు బ్రతుకు! జవములుడిగి తీసె

యుసురు తృప్తి లేదు యూరికెపుఁడు




ఆపరేషనన్న ఆట గాదు నరుల!

శ్రమయు హద్దు మీరి రక్ష‌ లేక

పాట్లు పెంచె గాద! వాక్కులేలన యింక!

యన్న వదలలేదు ఆకసమ్ము


నీతులు మీకొక విధముగ

గోతుల నను ముంౘు విధము! కొద్దిగ నైనన్

మీ తలపున లేదా యీ

రీతి సబబు కాదు యని! శ్లేషాత్మకులా!


విశ్రాంతము లేకుండగ

నా శ్ర మనంతయును దోచి! నడి సంద్రమునే

యాశ్రయముంౘక మ్రింగుట!

మిశ్రమ‌ గుణములు కలిగిన మీకది సుళువే


నా బాబును సాకుటకై

నే బతుకును కోరలేదు! నీతియు గననే

మీ బాధ్యతలే నావయ!

యీ బరువును మోసి తుదకు నేడ్చుౘు ౘనెదన్


యే బంధము ఉన్నది యిటు

నా బాధల గని దరి నిల్చి నయముగ ౘూడన్!

నే బదులీయగ లేనుగ

యీ బలముయు పోవ! చచ్చి యిచ్చెద గెలుపున్


నిందలు మోపుట సుళువే

బొందిని లాగుట భళి భళి పుణ్యము అది యే

విందయ మీకెపుడూ నను

తొందఱగను పంపి తృప్తి తోడను నిలుమా




అలసితి సొలసితి విధికే

అలుసై పోయితి బ్రతుకను యంబుధి తేలే

అలలే నిలువగనీవే

అలవాటైనది గద యిది అతివ జగతికే.



వాత్సల్యంబే కల్లయు

మత్సరమే నిజము నటన మహ తీపి గదా

యుత్సాహముతో గ్రోలుౘు

తాత్సారము లేక మ్రింగి తాగెదరిలపై.



కర్మ ఫలముఁ దీయ కల్మష నాశ! నీ

శక్తి చాలదేల! స్మరణ తోడ

వేడుకున్న వినక కీడు దీయని నిన్ను

మనసు నిలుపనేల! మానినాను.



నిన్ను నమ్మి యున్న నిర్వీర్యమవ్వదే

కర్మ యొక్క శిక్ష! కనుఁక యికను

భక్తి యొకటె నిలిపి బాధల్లు భరియిస్తు

బ్రతుకవలెను నిజము! వందనములు.



కలియుగంబు నీవు కల్ప తరువువంటు

నమ్ముకొన్న గూడ నాశనంబు

గుప్పిటందు నుంచి తప్పులె సాకుగా

చూపు జనని! యోటమాపలేవు.




నిండు భక్తి యుండె! నీడ నీవని నమ్మి

గాౘవేలనయ్య! కల్ల గాద

రక్షకుడవనెడి యరాౘకపు పలుకు!

స్వస్తి స్వస్తి స్వస్తి ౘాలు స్తుస్తి.



తృప్తి లేని మనసు తీరని కోరికల్


మెలికి పెట్టుౘుండ తలచి నదియె


తెలివి యంటు సాగు తీపులే ముంౘునే


నరుని బ్రతుకు ధరను! కరగు శాంతి.








కష్టపడకుండ కరుగదు కండ గాని


కలిమి తరిగిపోవును యున్న గనుల నుంచి


గాన కలశము నింపుమా కళలు కలల


తోడ కలత యుండదపుడు తోషమేను.




// తేటగీతి






తెలుగు లోగిలి సమూహంలో 




తోటికోడలి విరుపులు సాటి లేవు


అత్త ఆడపడుౘులారడులకు


మామ బావ యింక మరుదుల గోలలూ


వంటరైన వారి వఱకు రావు




ఉమ్మడికుటుంబమందుకె


యిమ్మహి ౙారెను కలవర హేతువు గనుకన్


చెమ్మను ౘూడని కన్నుల


కొమ్మలు లేవుగ గృహమున కొట్లాటలెగా.





కవిత లేదు పాట కవనమల్లగ లేను

కలము నిలచి కలలు కరిగి

మౌనమొక్కటె పరిమళమైన వేళన

యక్షరములె కాౘు లక్షణముగ.



Friday, November 1, 2024

02 November , 2024

 కార్తిక పాడ్యమి, క్రోధి


జ్ఞానమునకు నధిపతివే

మానవ జాతికి వరమిడి మహినే దాటే

నీ నవ పథమును ౘూపవ!

ధ్యానము ముద్రను ధరింౘు హరహర! దేవా


గౌరీ తనయా కపిలా

వారింౘక కర్మ ఫలము భరియించితిమే!

పారింౘవ నీ కరుణను

ధారుణి వాసులకు మదిని దయతో నికపై


దత్తాత్రేయా నీవే

నుత్తమ రూపుడవయ! మము నుర్విని గాౘన్!

వృత్తము చక్రములేలన!

విత్తము నీ దరి! నిౙమున! వినుమా మనవుల్


ఆపదనందు దల్చుకొని యానక వీడను తల్లి! మాకు నీ

ౘూపులు ౘాలునమ్మ! నిల జ్యోతులు వెల్గులు నిండి పోవునే

మూపున భారమింక మది మోయగ శక్తియు లేదు పాపముల్

బాపుౘు మమ్ము నీదు కనుపాపల వోలెను గాౘు శాంభవీ!



Thursday, October 17, 2024

To read to learn Poetry

 విశ్వనాథ వారి రచనలు ఇంతవరకూ చదవనివారు, చదావాలన్న ఆసక్తి ఉండి చదవగలమా అనుకునేవారు, ముందుగా వారు వ్రాసిన "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ఆపైన "హాహా హు హు" చదివితే వారి రచనలంటే "కొందరు" కలిగించిన భయం పోతుంది. అలాగే "పాతి పెట్టిన నాణెములు", "జేబు దొంగ నవలలు" కూడా.


మనుచరిత్ర 

భాస్కర శతకము 

బర్హిలేశ్వర శతకము - 3 గాయత్రమ్మ గారు చెప్పినవి

Wednesday, October 16, 2024

అనంత ఛందము

 నీ దరి చేరుట ధ్యేయము!

మోదము నీ సన్నిధి గద! భూమిన ప్రజకున్

రాదే శోకము! తలచిన!

శ్రీ దాక్షాయణి! నిను మది! క్షేమము గలుగున్

Puujalu

 Vaddiparthi పద్మాకర్ గారు చెప్పారు అక్క, గత జన్మలో ఈశ్వరుడికి పూజ చేస్తే డబ్బులు ఉంటాయట, దుర్గా పూజ చేస్తే అర్థం చేసుకునే భార్య /భర్త వస్తారట, విష్ణువుకి పూజ చేస్తే అధికారం పదవి వస్తాయట, శివపార్వతుల పూజ చేస్తే ఎంత  కష్టంలో ఐనా ఒక సుఖం ఇస్తారట, రుద్రాభిషేకం చేస్తే కవిత్వం, జ్ఞానం, సంగీత జ్ఞానం వస్తాయట. నేను అందుకే శివుడు అమ్మవారు బాగా నమ్ముతాను ఈ జన్మ ఇలా ఉంది వచ్చే జన్మ ఏమో అని


సౌందర్యలహరి ఐదవ శ్లోకం 108 సార్లు చదివి పళ్ళు లేదా పాలు నైవేద్యం పెట్టాలి ఉదయం లేదా సాయంత్రం వీలైతే ఐదు - ఆరు గంటల మధ్యలో - ఎదుటివారు మంచిగా మారటానికి








జనవరి 30 నుండి శ్యామల దేవి గుప్త నవరాత్రులు మొదలు...


మాస నివేదన:

 ఆవు నెయ్యి 

తిథి నివేదనలు:

పాడ్యమి ‌‌:ఆవు నెయ్యి 

విదియ: పంచదార 

తదియ: క్షీరం 

చవితి:ఆపూపములు

పంచమి: అరటి పండు 

షష్ఠి: తేనె 

సప్తమి: బెల్లం 

అష్టమి: నారికేళం 

నవమి: పేలాలు

Wednesday, October 9, 2024

NavaDurgas

 దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా 


1. #శైలపుత్రి 


ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.


2. #బ్రహ్మచారిని


ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.


3. #చంద్రఘంట 


శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశ భుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దరికి రావు అని నమ్మకం.


4. #కూష్మాండ 


శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహ వాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.


5. #స్కందమాత


నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.


6. #క్యాత్యాయని


నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడి కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనం ఇచ్చే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.


7. #కాళరాత్రి 


నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.


8. #మహాగౌరి 


నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.


9. #సిద్ధిధాత్రి


శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.


ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా.... ఈ తొమ్మిది అవతారాలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.

Friday, September 27, 2024

AmmaVaaru

నాగవుల తల్లి పార్వతి! సనాతని! వందనమో ఉమా!

ఖగపతి విష్ణు సోదరి! ప్రకంపనలన్నియు దీయ నీవెగా

జగములనేలు నాయకివి! శౌర్యము ఘూపి కపర్థినీ సదా

గగనము దాటి మా దరిని కాంతిగ నిల్వుమ యద్రి వాసినీ


అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ, దసరాలలో, క్రోధి, 2024, అక్టోబర్ 4


రావమ్మా జననీ మా

భావము గమ్యము సురనుత! భ్రమరీ నీవే

పావని! యూయలనూగు

దీవింఘుమ‌ మము! శుభగుణ! ధీరా! హిమజా






కీర్తన వాళ్ళ గుడి లో, క్రోధి సంవత్సరం దసరాకు మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవికి

వాణీ శర్వాణి యో

వీణాపాణి గొలుఘును వేదములన్నీ

శ్రేణిన నిలఘు నిన్నే

రాణి ౘదువులనొసగుమ లక్ష్యము కొఱకున్


జ్ఞానము నీవే ధరణికి

రాననబోకుమ! శుభాంగి! బ్రహ్మ కళత్రా!

ధ్యానము నిలిపెడి కరుణను

మానవులకొసంగవలె సుమధుర వచన!


నా మనస్సున వీడకుండను నాద బిందు కళాత్మికా

నీమమన్న విధంబుగా కరుణించి యాడు సమున్నతా

నామమన్నది దల్చినంతనె నాదు నేత్రములందునన్

నోము పట్టిన! కాచుచుండు మనోన్మణీ ! శరణంబిదే.

ఉత్పలమాల 


తెల్లని వస్త్రధారణయు తీయని పల్కుల తల్లి వాణి తా

ఘల్లదనమ్ముతో మనకు జ్ఞానమొసంగు సంస్కరింగా

తల్లిని గొల్చుకుందుమని ధాత్రి నివాసులు పూజ సల్పుఘున్

పల్లవి పాడుకుందురట భారతి నామము తోడ నిత్యమున్




బంగారు రంగున వెలసిన

రంగము నాయకి! సురనుత! లక్షణముగ యే

భంగము నొందని జ్ఞానము 

చెంగున నిమ్మ యని యిట చెప్పెద వినతుల్



వీణయు నక్షమాలను ప్రవీణ! ధరించెడి వాణి దీర్ఘమౌ

బాణిన రాగమాలికలు పాడుఘు వేడెద జ్ఞానమీయుమా

పాణి కలమ్ము కావ్యములు వ్రాసెడి భాగ్యమున్నఘో

శ్రేణి తలంబున జీవులిక చేరును నీ దరి! మాయ దాటుఘున్




దుర్గమ మార్గము నడిపెడి

భర్గుని పత్నీ! ప్రణవపు పంజర వాసీ

అర్గళ దేవీ మనవిది

నిర్గుణ రూపా! బ్రతుకున నింపుమ’ వెలుగుల్



ధాన్యము ధనమది యేలన

దైన్యము సరసన నిలువదు ధైర్యము నీవై

మాన్యత గాచిన చేరదు

శూన్యత బ్రతుకున! మనసున! శుభగుణ! తల్లీ!


ధాన్యము ధనమది యేలన

శూన్యము గాదైనను మది ఘూచిన నిన్నే!

దైన్యము దరిమెడి శక్తివి!

మాన్యత గాచెడి సురనుత! మంగళదాయీ



చంద్రవంక ధారి! మందర స్వరమ్మున

కీర్తనలను పాడి కేళి యాడి

శిశువులమగు మేము! యశమును ముదమును

వొందెదమిల! జనని! ఉమ! సురనుత



నవదుర్గాలుగా వెలసెనె

శివసతి ముఘ్చట గొలుపు చిరునవ్వులతో

భవభయ హారిణికివియే

నవనీతముతో ప్రణతులు! నగజకు భక్తిన్






తెలుగు లోగిలి లో నళినీ ఎఱ్ఱా గారి టపా

దీపపు కాంతుల నడుమన

శ్రీ పద్మావతి! వెలసెను సిరులను చిలికెన్

పాపపు రాశిని చీల్చు

నాపదలెల్లను దరుముఘు నంది యుండున్


కొలువరె కాచెడి తల్లిని

నిలుపరె మనమున సుగుణపు నిధియౌ సిరినే

తలచిన ఘాలును జయములు

కలిగింఘును లక్ష్మి! విష్ణు కళత్ర! పెర్మిన్




ఇంట్లో పెరట్లో రరోలు వద్ద దీపం పెట్టినపుడు కనిపించిన అమ్మ కనులకు ఈ పద్యమూ, పాట

[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: వేంచేసితివా జననీ

కంచీ పురవాసిని మము కరుణింఘుఘు నీ

పంచన చేర్చుట కొఱకని!

కంచెల తెరతీయుమిక వికాసమొసగుమా

[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: నీ కనులే మము గాంఘగ భువికి జేరెలే

శ్రీకరి శుభగుణ సుధాబ్దిజ ధన్యవాదమే ,|| నీ కనులే ||


తిమిరము హరియింఘుటకని దివి వీడిన జ్యోతి

సమరములను బాపు నడిపించే తల్లీ ||తిమిరము||

సతతము నీ స్మరణే నిరతము నీ భజనే ||సతతము||

మా యిల వేలుపు నీవేనే మంగళదాయని సురనుత || నీ కనులే||


అందఱి బంధువు నీవయి ఆడే లోకమాతవే

సుందర వదనా నిగమాగమమే మాకు నీయవే

నవ్వుల పువ్వుల కొమ్మకు పడతుల’ వందనంబులే

సకల కళల రాణి శాశ్వతి పరమేశ్వరి మంగళ దాయిని


|| నీ కనులే||



పురివిప్పిన నెమలిక తో

సరసుకు చెంతన నిలచిన జననీ ప్రణతుల్

సురనుత భారతి పద్యము

సరి యగు విధముగ రచించు జ్ఞానము నిమ్మ



అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రం: 08/11/2024

అమ్మ నీవే దిక్కని

నమ్మిన భక్తుల గృహముకు నడిచెడి కరుణే

మమ్ముల నిలుపును! వేగమె

రమ్మా యనగానె చేరి రక్షింఘు సదా


అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రం: 05/01/2024


భృగువు వారమందు మగువలంత కలిసి

సలుపు పూజ కొఱకు సంధ్య వేళ

యిలకు చేరు తల్లి! యీశ్వరీ ప్రణతులే

మమ్ము కావ మనవి! మంగళముగ




కన్న భుజమ్ము నందు గని గారము చేసెను మాతృమూర్తి యే

యన్నుల మిన్నకై మనసు నాతృత నిండును నిత్యమున్ గదా

వెన్నెల వంటి ఘల్లనగు పేర్మి ప్రతీకయె సృష్టిలో సదా

వెన్నను జిల్కు నామె సమ వేలుపు లెరుగ ఘూడగన్ ధరన్




క్షీరాబ్ధి ద్వాదశి, క్రోధి వత్సరము

క్షీర సాగర కన్యక చేర రావె

మదు గృహములకు హరిని చేదుకొను

తులసి ధాత్రి సహితముగ వెలసి మమ్ము

కనికరింఘవమ్మ! సిరి! యవని నీవు



తులసీ మాటకు ప్రణతులు

తొలితొలి ఝామున సుమముల తోరణ మాలల్

తిలకము పసుపు గంధము

తలమానికమౌ నుతులును తల్లీ గొనుమా


"త" గుణింత కంద పుష్పము




త్రిజగన్నుత! శరణము నీ

నిజ రూపము గాంఘలేని నీరసమున నే

భజనలు సహితము విడచితి

గజ రాజ సుపూజిత! నను కరుణింఘుమికన్


మౌనము ౘలునంటిని రామధవ! భౌతికలోక బాధలో

నీ నను ముంఘనేల హరి! నే కను పాపను కాన! దేవరా

ధ్యానము సేయకున్నని దైన్యత లో పడవైచి నవ్వు

పానము లాగి నావుగ! సబాంధవ! ఘాలయ శిక్షలాపుమా


జలనిధి కన్యకామణి! ప్రజాపతి మాటవు ధాత్రి నిండుగన్

కలిమిని పంఘు నాయకి! సకాలము రైతుకు పంట భాగ్యమున్

ఫలముగ నిమ్మ యచ్యుతుని పత్ని! యష్ట విధమ్ముల మేలగున్

కలి యుగ బాధలేవి యిక కానగ రావుగ శాంతి నిండినన్!



కైలాసము నిండెనుగా

తేలెను వైకుంఠమేమొ తీయందనమున్

స్త్రీలు సలుపు పూజలతో

మేలు కొలుపు గీతముల సమేతముగ భళిగా



నిదుఱన యున్న మాధవుని నెరుగ‌ చేరెను శంభుడే వెసన్

పదునుగ నున్న ప్రశ్నకు ౙవాబు కోసము సేన తోడుగన్

చెదరగ దృష్టి! శాంతము చిత్తమునందున నింపి యాతృతన్

హృదయమునీయ దాటక ప్రహేళిక పొంగును మౌనముద్రతో!


అంబుధి నిండి పోవగ మహామహ’ దేవుని సేనతో గనుల్

యంబిక గానరాక హరి యచ్చెరువొందెగ లక్ష్మి దేవియున్

యంబర వీధి దాటెనని యప్పుడు గాంచెను విష్ణు మూర్తియే

సంబర వేళ ధాత్రినని సత్యమెఱిఁగెను! దివ్య దృష్టితో 


క్షీర సముద్రమేమొ బహు చిత్రము మారెను స్త్రీలు హస్తమున్

ధారగ పూజ సల్పెడి విధానము వైచెడి పస్పు కుంకుమల్

తీరుగ చేరి రంగులను దిద్దగ కెంపులు పఘ్చదనమ్ముతో

శ్రీ రమ నాథుడున్ హరుడు జీవుల భక్తికి మెచ్చె మొదమున్


గాంఘగ శైలమంత యును



షోడశ సేవలన్ని నిను ఘూచెడి భాగ్యము కోసమే కదా

వాడలలోకి పిల్చుకొని భక్తిగ నిత్యము గొల్చినాము నీ

ౙాడను పట్టి మోదమున ఘక్కని సేవలు జేయుచుందుమే

వీడక మమ్ము నీదు మది పేర్మిని పంఘుమ విశ్వమాతగా




అల్లితిమమ్మా కరులను

ఘల్లని తల్లీ! విరులును! జగమంతా నీ

పిల్లలమే కదా! పంఘుమ

యెల్లలనెఱుఁగని మమతను! యిల వాసులకున్.



నీ కబరీబంధము గని

మా కన్నులు మురిసెనేమొ! మంగళ గౌరీ

యా కురులందున కరుణకు

శ్రీ కామాక్షీ! ప్రణతులు చేకొనుమమ్మా.



నీదయ ఘాలును నాకిల తండ్రీ నృసింహ! నిత్యము రమ్మ దరికే

వేదన లేవియునుండవు నపుడిక ప్రీతిగ నడుఘును బ్రతుకులు యురికే

మా దినచర్యలు మరఘును స్వస్థత మారము చేసేడి వైరులు పలికే

ఖేదపు తలపులు ముంచెను కావు! కీర్తించెద నిను! నిరతము వదలక! 


*హరిగతి ఱగడ, 8 చతుర్మాత్ర గణాలు, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము*



నాగిని లాగిన్

https://www.facebook.com/share/p/1BBRuEVHrn/


వెలసెను బ్రహ్మ తోడను వీణను పట్టి కరమ్ముల యందు తల్లియే

చిలుకుఘు మోమునందు వికసించిన పద్మము వోలె హాసమే

పలికెడి వాక్కులన్ని మము బంగరు బాటల వైపు నిల్పగన్

కలుగును మోక్షమే యిక సకాలము ౙాగును లేక సత్యమే.




https://www.facebook.com/share/p/1BBRuEVHrn/


కలువలనందునుండునట కాంచన వర్ణపు శోభనాంగి నీ

చెలియగదెట్లు నాడునయ చిత్తముపైన వసింఘునందురే

పలుకులదేమి యిత్తఱిని పాడుఘు తెల్పెదరంట మాకు యీ

తలపులదెల ఘాలునయ! తల్లి దయామృతంబు నిత్యమున్.






బ్రహ్మ రసనాగ్రవు జనని వాణి ప్రణతి

విద్య నొసగు జ్ఞానము ప్రీతి మీర

పంఘు హిమజ జలజ సఖి! వసుధ నిలచి




కలికీ నీదర్శనమే

కలిమాకిలపై గిరి సుత! కళ్యాణి యే

కలతలు రానీయకుమని

కలమును పట్టు యడిగెద కాఘుమ జగతిన్.

శాంతి చేకూర్చ మనవి! ప్రసన్న వదన!


శ్యామల! శారద! శాంభవి!

భ్రామరి! అంబిక! సురనుత లావణ్యముతో

మా మనసుల నిలువుమ యీ

సీమను గాచెడి శుభగుణ క్షేమమునిమ్మా.



ప్రతి వారము నీ పూజకు

యతివలమంతా నిలచుచు యనుభూతులతో

నుతియించెదమో జననీ

స్థితి గతి స్థిరముగ నిలుపుమ శ్రేయము తోడన్.



ఆట వెలింది:


నలుపు గాడు హరియు తెలుపు గాడు హరుడు

అసలు రంగదేమో! నాయు లేదె!

పసిడి యెఱుపులున్న పడతులతో గూడు

వాఱు రూపమెవఱు పట్టలేరు.


తేటగీతి:


యింతులందఱు చేయు యీవిధమగు

సేవలన్ని చేరగ నాట దేవనగరి

యిట్లు నిండిపోవగ రంగులీని జగతి

వర్ణభూరితమయె బాగ! వంక లేక.



తాటంకములే రవి శిశి

మాటలు మా కష్టములను మాట వినవా

యోటమి వెతలను తరముమ!

బాటను నీవే నడీపుమ పంజర నిలయా.



శుక్రవారపు ఘడియలో శుభములొసగు

సింధువాసిని పూజకు సిద్ధమవరె!

మేలు గలుగ జేయు తనదు లీలతోడ

తల్లి దరిని చేరిన ఘాలు! దక్కు ఫలము.



ఆట వెలఁది/ ఒడలు పులకరించి కడలిని దాటి / తుదకు దరిని చేర్చు త్రోవ ఘూపు/ సన్నివేశము యిది స్వామి దయను వొంది / సంతసించె మది వసంతమాయె

 - ఈ లింక్ కింద: https://youtube.com/shorts/qyZvquIk388?feature=shared 





ఏమని వ్రాసెదనమ్మా

నా మది నిండిన తలపులు! నాద స్వరూపా

పామర వనితను దయగొని

యీ మనవిని గైకొనుమిదె! యిమ్మా పథమున్.



గజమాలలు గైకొని నీ

నిజ దర్శనమీయవే ప్రణీతములివియే

ఋజువర్తనులమ్ము రమా

యజ గాంచుమ నీ శిశువులమమ్మ! జననీ.


కేశములనుగంటిమిగా

క్లేశములను దొలగజేసి క్షేమమునిమ్మా

యీశుని పత్నీ మమతల 

పాశము వదలని మము గను బాంధవి! ప్ర ణతుల్.




ప్రార్థన విన్నది మన శ్రీ మాతే దయతో

ప్రారంబించెను తన సంరక్షణనే

స్వస్థత స్వచ్ఛత సంపద సఖ్యతలన్నిటినీ

ౘాఘిన కరముల మనకందించెనుగా

రాముని రాజ్యము లక్ష్యముగా సాగే

మారుతి సేనకు మంగళమామేగా

వేదన స్థానము వేడుకదే యికపై

జ్ఞానపు దివ్వెతో భ్రాంతిని ద్రుంచేనే.


[నమ్మిన నా మది... పాట పల్లవి రాగానికి అనుసరణీయం లో]


ఈ అమ్మవారి దర్శనం కలిగినప్పుడల్లా నాకు అందిన శుభములకు కృతజ్ఞతగా పై పాట, ఇక్కడ పూజ చేస్తే తప్పకుండా అమ్మ ఆ జగన్మాత స్వీకరించి మనలను కాస్తుందనే అర్థం తో..స


సఖియా,


సహనమధికమని వలదు సానుభూతి 

కొరకు ౘూపు సాగు పథము వరకు

బాధ్యతలను భారమనక బంధమన్న

తృప్తిమీర నెరపుమ! నీ దీప్తి వెలుగు.



సింహ వాహిని! కమలముల్ చేతబట్టి

కదళి వనమున గూర్చిన కనక దుర్గ 

కనకమును కురిపించెడి కళల లక్ష్మి

వాక్కు గూడ నొసగుమమ్మ! వాణి! దయను.



జీవన యానపు నౌకవు

నీవే చుక్కాని గూడ! నీరజ నేత్ర

మా వేదన దీర్పవె నీ

దీవెనలే అమ్మా! తృప్తినొసగునే.




ఉదయత్త పెట్టిన చిత్రం:


పాణిన విపంచి నల్లని

వేణియ శిరమున కలిగిన విద్వన్మణి యో

బాణిన రాగము నేర్పుమ

వైణిక కులమునకధిపతి! వాణీ! మాకు.




దండలు గైకొను మాట

దండంబుల నందుమమ్మ దైత్యుల నెల్లన్

దండన చేసేడి శక్తివి

దండిగ పూజల గొని యిల దయతో గనుమా.




చేరలేక యున్న శ్రీ గౌరి! నీ పూజ

సలుపుౘోట! ణనసు స్మరణ చేయు

నిన్నె గాన మ్రొక్క వన్నె తీరినటుల

మమ్ము గాౘ రావె! మాత! దయను.


అంతయు పసిడియె నా పూ

బంతుల చేమంతి చంద్రవంకయు పతితో

నింతి నివాసము రజతము!

వింతగ లేదే కనుటకు! పెద్దింటమ్మా.


Harini intlo Sri Saraswati Maata Photo:

ఉత్పలమాల 

భారతి! నీకు సేవలిడు భాగ్యము దక్కిన ౘాలు; వెన్నెలన్

శారద రాత్రులందు గని ౘల్లని తల్లి! స్మరించి గొల్చెదన్

ధారగ కైతలల్లు మది స్థాపన చేసెడి శక్తినీయవే

వేరగు సంపదల్ మఱిక వేడనుగా నిను! వందనంబిదే.



[25/03, 21:47] Durga Madhuri Devi Nagini: 

ఆట‌‌ వెలఁది

అంచ యాన! వెనుఁక యస్ఖలితమునకు

చిహ్నమైన నెమలి చేరె! భళిగ

నీలవర్ణమందు నీరు యా పద్మంబు

శోభ గూర్చె నిండు! సుందరాక్ష.


మత్తకోకిల 


శ్వేత వర్ణమునాడు వస్త్రము వెల్గు నింపు మనస్సులో

గీత మేటిగ తీర్చి దిద్ది లిఖింౘుమా! రస‌ భారతీ

ఖ్యాతి యప్పుడు నుండు గాద! జగాన వందనమాలలే

ప్రీతి మీరగ నిన్ను గొల్చిన విద్యనీయుమ! పేర్మితో.


[25/03, 22:05] Durga Madhuri Devi Nagini: 

PadmaNabha Vrttamu 8 Ta Ganas 5.1 Yati

రాయంౘ యందంగ నీ వెంట చేరంగ ప్రార్థింౘు మా కాంక్షలన్ దీర్చు శ్రీవాణి!

సాయంబు జ్ఞానంబు మేధావిలోకాన చైతన్యమేనింప! నాకేమొ యాభక్తి

నీయమ్మ వేరైన వర్ణాలు నాతల్లి! నే మోయలేనంటి! నాభారమే చేటు

నీ యాలయంబందు స్తోత్రంబులే వ్రాయు నేర్పున్న ధన్యాత్మనౌ జన్మ నాదేను!


విశ్వావసు ఉగాది నాడు నా అంతరాత్మ మాధురీ ఇంగువ, పంపిన సింహ వాహిని చిత్ర పటానికి:


సాయుజ్యంబును గోరనేల! జననీ! సాన్నిధ్యమందించుమా

గేయంబుల్ పద పల్లవంబులను యో కేళీవిలాసంబుగా

యే యాటంకము లేక వ్రాయ వలనే! హృద్యంబుగా యీశ్వరీ!

యా యానందముకేది సాటి! గద బ్రహ్మాణీ! వరంబీయవే.


[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: మానస నేత్రము గంటిని

నేనీ పూజను! కపర్థినీ యది యే నీ

యానతి యని నమ్మితిగా

చీనాంబరి! వందనమిది చేకొనుమమ్మా.

[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: వత్సరముల గణనము నీ

వత్సలమగుమా మనసుకు స్వస్థత కొఱకే!

సత్సాంగత్యంబీ విధి

నుత్సాహముతో జరుపుట యో రీతి గదా.

[04/04, 18:27] Durga Madhuri Devi Nagini: కన్నుల పండువ పూజలు

వెన్నుని సోదరి! గొని మము పేర్మిని గనవే

యన్నుల మిన్నగ గాౘవె

చిన్నారులమని! మనవిదె! చేమంతులతో.


Dr. Prakash Sir,

Vascular Surgeon's Clinic


Ammavaari Photo

1.

కలశముఁ జిందగ సిరులను

కలలను తీర్చెడి హరి సతి! కన్నుల నిన్నే

కలవా లేవా యనకనె

కలతను బాపెడి సురనుత! గంటిని సతమున్.

02.

కమలము కరముల నిలువగ

యమర పురాధిపుడు గొల్చు నమృత వల్లీ

సుమమలు సొబగులు తూగున!

మమతల నీ వదనమునకు మంగళ రూపా.

03.

హరి పత్నీ వందనములు

విరిబోణీ నీలవేణి! వీక్షించుమ యీ

ధరపై కష్టములెల్లను

నరులను గాపాడవేల నయముగ తల్లీ.

04.

తగునా రోగము వ్యాధులు

తగవులు బిగువులు దిగులును దాక్షిణ్యముతో

వగచక నీయక మమ్ముల!

నగవులనీవే సరసిజ నామము విడువన్.

05.

కర్మన పాపము చేయని

నిర్మాల్యము లేని మమ్ము నీ కన్నులతో

ధర్మము వైపుగ నడుపవ!

మర్మమమదియేమి తల్లి! మాతవు! ప్రణతుల్.

06.

అన్యమునెరుగక నీయని

పుణ్యమునీవీయకున్న పూరుషులకు యీ

దైన్యత తొలగుటదెట్లో

శూన్యము నిండున గద మరి! ౘూపవ దయనే.

07.

పూర్వపు ఫలముల పాపము

నుర్వినివాసులకొసగుట యుత్తమమేనా

సర్వము నీవని నమ్మిన

శర్వాణీ రక్ష! శరణు శరణము తల్లీ.

08.

భయమున వడలితి వలదే

నయమగుటకు శస్త్రము యని నమ్మిన నిన్నే

ప్రియముగ వేడితి గాదే

క్షయమును జేయవె క్షితుల సుజనులాశ్రితవై.

09.

వంకలదేలన గాచగ!

శంకల! మాపై కినుకయ! సవరింౘవ నీ

బింకము కరుణా రసమును

పంకజా నేత్ర! కురిపించు! ప్రార్థనలివియే.

10.

కడలిన నున్నటి నీ దరి

వడలిన మేమెట్లు చేరి వందనలిడి నీ

యడుగుల పట్టుట తల్లీ

విడబోకుమ మా కరమును! వేదన వలదే.

11.

విత్తమదేదైనను నీ

యుత్తమమౌ ౘూపుయున్న నున్నతమవదే

చిత్తము జీవుల తలపులు

దత్తము చేసిన కలుగును! ధర్మము యొకటే.

12.

బంగరమే యంతను మా

బెంగను దీర్చెడి జననికి వెలుగే కరుణై

పొంగగ బాసెను కలతలు

యంగనులందరికెపుడిక యానందములే.


13.

నీ నామమునే విడువక

మానసమందున మెలిగెడి మంచి వరమునే

ప్రాణాధికముగ‌ జూచుచు

మానవులకొసగుమ లక్ష్మి! మాధవుఁ పత్నీ.


14.


ౘాలును ౘాలును ౘాలును

బేలతనంబు గలిగించు వెతలిక ౘాలున్

లీలలు ౙూపుౘు చిటికెన

కేళియ వలె దీయుమమ్మ! కీడును తల్లీ.


15.

యుగములు కల్పములన్నియు

జగములు గూడను విరించి జనని! నీవే

యగునే పంతములేలన

ఖగ వాహుని పత్ని! రక్ష‌గా నిలుమమ్మా.


16.


నీరసమాయెను మనసున

నీ రస‌ధార కురిపించి నీడనొసగుమా

నీరజ నేత్రా శరణము

నేరములకు క్షమ ౘూపు! నిండు మనసుతో.


17.

ఏమని వేడెదనింకను

నీ మనసే కరుగకున్న నింగియు నేలన్

మేమిట్లు గొలిచినను నీ

స్వామికి చేరున! శశిముఖి! జయములనీవే.


18.