Tuesday, March 4, 2025

ఛందం సంకలనం కోసం

1.


స్వాగతమమ్మ! చంచల! కృపారసమే కనులందు పొంగగా

యాగమనంబె క్షేమమగునమ్మ! సనాతని! పూర్వ పుణ్యమే

మా గతమైన నీ దయన మన్నన సేయుౘు కాౘుౘుందువే

రాగ సుధా రసామృతము శ్రావణి! పూర్తిగ మాకొసంగుమా.

2.


ప్రీతిగ త్రికోణమితి నేర్చి లెక్కలందు

బుద్ధిమతిగ పేరును బాగ వొందినాను

పాఠశాలలోన పెరిగె! పరపతియును

బ్రహ్మ సతియె కరుణ మెండు పంచగానె.



3.

*మారికి వేసిరి ప్రియముగ మల్లెల దండల్*


రా! రాకుమారి యని సుకు

*మారికి వేసిరి ప్రియముగ మల్లెల దండల్*

హారము వలె చెలికత్తెలు

నారీ మణి పరిమళముకు నయముగ మురిసెన్.


4.

వరమేయడుగను తండ్రి! ప్రార్థన నీకే

శరణంబను పలుకేగ! శంకర! రావా

ధరపైనకు మము గాచ తాండవ రూపా

పరమేశ నుతులివే కపర్థి! త్రినేత్రా.


5.


మోక్ష పథము కొరకు నింపి మోహమంత

*శివుఁని బూజింప ముక్తి కించిత్తు రాదు*

యెట్టి కాంక్షలు లేక సహేతుకముగ

బ్రతుకు నడిపినంత కలుగు రక్ష‌ తుదకు.


6.


కమ్మని తేనెను ధధి క్షీ

*రమ్మును బోసిరి శివునకు రభసము తోడన్*

చెమ్మను తుడుచుచు పిదపన్

రమ్మా యిలకని పిలచిరి ప్రజలున్ భక్తిన్.




కథలలోన వచ్చు వ్యథలలో వాక్యంబు

*పతిని గొట్టి సతియె పరుగు దీసె*

ౘదివి నవ్వుకొనెచు ఛందమున యిటుల

వ్రాసి యిచ్చె మాకు! భళిగ హంస. (అక్క)


🙏🏻🙏🏻🙏🏻


వెండి కొండపై శంభుడు పెండ్లి యాడు

ఘట్టమును ౘూచి శివరాత్రి ఘడియ వేళ

లోకమాత పార్వతి మెడ లోన జూచి

*అయ్యఁ తాళి గట్ట మురిసెనంట తనయ*




(*ఓ*) నమాలు నేర్పి యోర్మితో నొౙ్జయే

పద్య(మ)న్న మేటి విద్య లోని

ఛందము (గు)రులఘువు సారమున్ దెలిపిరి

(వా)రికిదియె ప్రణతి! భక్తి మీర!


ఓ లలనా... సరి లేరు నీకెవ్వరుకు...


తిమిరము దరిమెడి సూర్యుని

సమముగ కష్టించు మూర్తి! చైతన్యమువే

యమవాస్య నిశిని నగవుల

సుమవదనముతో జయించు శోభవు నీవే



అనలేనీ పలుకును నే

*జనకుని కులమును జెరుపగ జానకి బుట్టెన్*

ప్రణతులనే దెలిపెద యా

మునిజన సన్నుతకు రామ మూర్తికి సతమున్.




స్వామిని చేరెడి తపనల
*కామమె మోక్షంబు నొసఁగుఁ గలిలో నెపుడున్*
ప్రామాణికమౌ విధమిది!
నామము విడువని స్మరణము! నవవిధములలో.

అండగ సతతము నుండెడి
కొండల రాయుని నిలుపుట కొంగుకు వెనకన్
నిండుదనంబవ్వదుగా
దండలు వేసిన శుభమిది! తరుణీ వినుమా.

వేడి నీరు గాచి పిల్లవానికి లాల
పోయుట మరచితిని బోలెడన్ని
పనులు కార్యాలయమువియె పట్టుకొనగ
నుదయమున చరవాణిలో! నుస్సురనుౘు.

నారీ మణులను జెరచెడి
యారాక్షసులను హరించి యాదుకొనెడి యా
శ్రీ రాముని! తమ వైరుల
*వైరిని జూచియు మురిసిరి వన్నెల వనితల్.*

దేవ లోకమున విచిత్రమే విరిసెన
*కంది చెట్టుకు మామిడి కాయ గాచె*
నేను ౘూడలేదు యిది జగాన విన్న
యో పుకారు! లేదీ వింత యుర్వినందు.






*పూలతోటను బెంచినంతనె మోక్షమెట్టుల వచ్చునో*

శ్రీలు చిందెడు రత్నగర్భను చిత్స్వరూపిణినిన్ మదిన్

వేలుపై యిల విద్య పంచెడి వీణ ధారిణి వాణినిన్

తేలికైన పదాలతో వినుతించు భాగ్యము యుండగన్




ఎండలు మండుౘుండగ రవీంద్రుని తాపము తాళలేక యో

బండన వాలిపోవగను బక్కని తాతను కాౘుకొందుకై

*గుండెల పైన గ్రుద్దుచును కొట్టుచు ప్రాణము నిల్పిరక్కటా*

నిండుగ గాలి పీల్చగనె నెమ్మదిగా తన యింట దింపిరే.





ప్రసవ / వసుధ వృత్తము, స, స‌గణములు, ప్రాస కలదు, యతి లేదు,  ఛందం పద్య కార్యశాల, 15.04.2025

విరజాజులనే

తరుణీమణియే

తురిమెన్ సిగలో

మురిసెన్ కురులే


Wednesday, February 19, 2025

శైలి - భలభద్ర పాత్రుని రమణి

 శైలి ని ఆడపిల్ల నడక తో పోల్చారు వీరేంద్రనాధ్ గారు..ఒక్కొక్కరి నడక ఒక్కొక్కలా వుంటుంది..ఎలా వున్నా అందంగా సౌకుమార్యంగానే వుండాలి తప్ప మాయా శశిరేఖ లా వుండకూడదు..నేను ఎవరు పుస్తకం ఇచ్చినా వెంటనే చదవడం మొదలు పెడతా..కొత్త రచయితలూ పాత రచయితలూ ప్రసిద్ధులూ అని లేదు..మొదలు పెడతా..చదివించడం రచయిత చెయ్యాలి..ఆ నడక రుచించక బోర్ గా నస గా మందకొడిగా లేదా వెకిలిగా అసభ్యంగా లేదా వారి ఇంట్లో ఊళ్లో మాట్లాడతారు కాబట్టి బాగా లేని, అర్ధం కాని పదాలు వాడుతూ వుంటే చదవబుద్ధి కాక వదిలేస్తా ..

    పేరు వచ్చి అసంఖ్యాకం గా పుస్తకాలు వేసుకున్న కొందరికి కుడా శైలి డెవలప్ అయి వుండక పోడం విచారకరం..అందుకే వారి రచనలు కొని చదవాలని అనుకోము..సింపుల్.

  కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టీవ్ నవల ల లో సైతం ఒక వరవడీ శైలీ వుండబట్టే అవి ఇప్పటికీ విషయ ప్రధానమైన నవల లు అయినా మళ్లీ మళ్లీ చదువుతాం..

  శైలి అంటే అక్షరాల వెంట కళ్లు పరుగులు పెడ్తుంటే ఆపలేక పోవాలి..అన్నానికి కుడా పో బుద్ధి కాక పుస్తకం పట్టుకునే వుండేట్లు రాయగలగడం..అందులో ఓ లయ,శృతి,జతి ,ఒరవడి ఇవన్నీ వుండాలి..అందరికీ రాదు కొందరికే భారతీ దేవి ఆ వరం ఇస్తుంది..కానీ అందరికీ రావలసింది నిజాయితీ..చెప్పే విషయం పట్ల అవగాహనా సూటిగా మన మనసుకి తాకేట్లు చెప్పి మనని అంటే, పాఠకులని కన్వీన్స్ చెయ్యగలడం..ఇది కుడా లేకుండా తెలీని విషయాల గురించి అసహజం గా రాస్తుంటారు..సిన్సియారిటీ లోపిస్తే పాఠకులకి ఇంట్రెస్ట్ వుండదు..

  చాలా మంది విమర్శించే రచయిత్రి రంగనాయకమ్మ గారికి శైలి ఆవడకి దేవుడిచ్చిన వరం.. ఆవిడ ఆయన్ని నమ్మకపోయినా!..స్వీట్ హోం జానకి విముక్తీ ఎన్ని సార్లు అయినా చదవగలను..శైలి కోసం..

  యద్దనపూడి సులోచనా రాణి గారి ఆయుధం అందమైన శైలి..ఊపేసారు మధ్యతరగతి పాఠకులను.😍.వీరేంద్రనాధ్ గారు శైలి గురించి చాలా జాగ్రత్త తీసుకుంటారు..ఆయన ఏం రాసినా నమ్ముతాం..మల్లాది గారు సూటిగా నిక్కచ్చిగా సిన్సియారిటీ తో రాస్తారు..కధనం ఎంత వేగంగా వుంటుందీ అంటే మనం పేజీలు తిప్పడం బుక్ అయ్యేదాకా మానలేం..అనువాదాల లో కుడా ఆ జడి అందం గమకం మనం చక్రపాణి గారు అనువదించిన శరత్ నవల లో భిభూతి భూషణ్ గారి నవలలు అనువదించిన సూరంపూడి విశ్వం గారూ కాత్యాయిని గారిల నవల లో చూస్తాం..వారు అనువాదం లా కాక స్వంత అనుభూతుల లా అవి వుంటాయి.

  అక్షరాలు విసర్జించ కూడదు..సృజించాలి..

  మంచి శైలి కి ఉదాహరణ గా చలం గారిని చెప్పుకోవాలి..ఆయన భావజాలం, స్వీయ జీవితం నాకు నచ్చకపోయినా..ఆయన నాలుగు వాక్యాలు తో కట్టేస్తారు..కొబ్బరి నీళ్ల లాంటి స్వచ్ఛత తీపిదనం మనని మెస్మరైజ్ చేసి చివరంటా చదివిస్తాయి..ముళ్లపూడి వెంకట రమణ గారు తెలుగు సాహిత్యం లో శైలి మీద వేసిన ముద్ర ఎవరూ మరిచిపోలేనిది..🙏

  విశ్వనాధ గారిని అర్ధం చేసుకున్న పాఠకులకి ఆయన శైలిలో వేగం తెలుస్తుంది..ఆయన చూడని లండన్ నగరం వర్ణన ఎంత మనోహరంగా చేసి మనని ఒప్పించారో అని ఆశ్చర్యం వేస్తుంది..గ్రాంధికం గా వుండటం వల్ల ఈ తరం పాఠకులకు దూరం అయ్యారేమో🙏🙏..రావి శాస్త్రి గారూ నామినీ సుభ్రమణ్యం గార్ల లా మాండలీకం రాయగలిగితే పసందుగా వుంటుంది..కానీ పట్టు లేనిదే మాండలీకం ముట్టుకోరాదు🤫 

  ఇంకా గొప్ప గొప్ప వారు అనేకులున్నా కొంతమంది గురించే ప్ర స్తావించాను..లేకపోతే వంద పేర్లకి తక్కువ రాయలేను..

  మా నవలలూ కధలూ ఎందుకు పాత రచయితల పుస్తకాల లా మలి ముద్రణ లు అయి అమ్ముడు పోవడం లేదూ అన్న సందేహాలకు జవాబు ..విషయం బాగున్నా పాఠకుడిని ఆకట్టుకో లేక పోవడం..బారిస్టర్ పార్వతీశం..వేయి పడగలూ స్వీట్ హోం హౌస్ సర్జన్ శరత్ సాహిత్యం మళ్లీ మళ్లీ వేస్తూనే వున్నారు..మీరు చూస్తున్నారు..కొనండి అనే ప్రచారం ప్రాధేయ పడడం అక్కరలేదు..

   శైలి గురించి డెఫినెషన్ చెప్పలేం..its abstract..అయినా కొంత ప్రయత్నించాను చెప్పడానికి..నేను రాసేవి గొప్ప రచనలు కాక పోవచ్చు కానీ నా అభిమానులు కాలం దాటని కబుర్ల లో హాస్యం చదివినా ఆలింగనం..సడి సేయకో గాలి లో తీవ్రత కి స్పందించినా రేపల్లె లో రాధ లో ప్రేమ ని మెచ్చుకున్నా నా శైలి గురించే మాట్లాడతారు..మా గురువులు అలాంటివారు..మేము సాహిత్యం బాగా  విరివిగా చదవడం..వర్క్ షాప్స్ కి కుడా వెళ్లడం సాటి రచయితలతో పెద్దలతో గంటల తరబడి సాహితీ గోష్ఠి లు చేయడం ఇవన్నీ పనికొచ్చాయి..నవల 6 వెర్షన్లు కుడా రాసిన రోజులున్నాయి మొదట్లో..

  రాసేకా నాలుగు సార్లు చదివి నగిషీలు దిద్ద లేని వారు టయిం లేని వారు ఓపిక లేని వారు తప్పులు దిద్దుకోలేని వారు రాయకండి..అంతే!

  ఓ రచయిత్రి మొదటి పేజీలో పెట్టిన కథానాయిక పేరు చివరి పేజీలో మారిపోయింది..చెప్తే చదవడానికి టైంలేకపోయింది పంపేసా అంది..ఇంకో సీనియర్ రచయిత్రి తల్లి పేరు అలేఖ్య కూతురి పేరు మంగతాయారు అని పెట్టింది..చదువుతుంటే ఊహకి రాక అడిగితే మా ఊళ్లో వుండేవారు అంది..ఇంకొకావిడ శృంగారం అనుకుని సున్నితత్వం లేని అశ్లీలం రాసేది..ఎక్కువగా స్వాతి మధ్య పేజీల లో..ఇలాంటి కధలు వచ్చేవి..నవలంతా చదవడం ఇబ్బంది..ప్రధమ పురుషలో మొదలు పెట్టి తృతిీయ పురుషలో ముగించిన రచయిత్రిని ఆ వెబ్ మాగ్జైన్ సంపాదకుడు కుడా వెనకేసుకొచ్చాడు..కొత్త రకం రచనలు అని!!!అంటే నా పేరు లత అని మొదలు పెట్టి సడెన్ గా లత సముద్రం కేసి నడవసాగింది..అని ముగించడం.

 శైలి మీద కృషి చెయ్యండి.ఎవరినీ అడగాల్సిన పని వుండదు మా పుస్తకం కొనండి చదవండి అని..

  ముందు మాటలు నేను రాయను..బుక్ అవిష్కార్ లకి వెళ్లను..నచ్చని పుస్తకం బలవంతంగా పొగడను..అందులో తప్పులు చెప్తే కొందరు  శతృవులయ్యారు కుడా..

  అడగకపోయినా నచ్చిన పుస్తకం గురించి మంచి రెవ్యూలు రాస్తాను..ఆ రచయితలు ఎవరో తెలీక పోయినా..ఉదాహరణ ఇటీవల శ్రీదేవీ మురళీధర్ గారు రాసిన స్వయంసిద్ధ..ఆటో బయోగ్రఫీలూ నాన్ ఫిక్షన్ లూ రాసేవాళ్లు విషయ సేకరణ మాత్రమే కాదు శైలి మీద దృష్టి పెట్టాలి..నేను శైలి గురించి ఇప్పటికీ కృషి చేస్తాను.

 ..  సెలవు ఇప్పటికి🙏

   బలభద్రపాత్రుని రమణి.

Friday, February 7, 2025

వ్యాస సంపుటి


1.  శ్రీ మాత్రే నమః 

మనకి చాలా ఊర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఆయా ఊర్లకు సంబంధించిన, సంస్కృతి సంప్రదాయాల గురించి, విగ్రహ‌ ప్రతిష్టాపనల గురించి. 

మనకున్న ఎన్నో గుళ్ళల్లో చాలా గొప్ప వింతలు విశేషాలు ఉన్నాయి. ఆయా ఊర్లకు సంబంధించి చరిత్ర పుటల్లోనే ఒక గొప్ప వ్యక్తి కానీ, ఓ కళాకారుడో, ఒక నేతనో, ఓ క్రీడాకారుడు, ఓ మేధావి, ఓ ఆవిష్కర్త పుట్టి ఉండవచ్చు. 

వారు దేశానికీ, సమాజానికీ, శాస్త్ర రంగానికీ ఎంతో మేలుల చేసి ఉండవచ్చు.

ఎన్నో కీర్తి ప్రతిష్టలూ, పథకాలూ, అవార్డులూ, రివార్డులూ అందుకుని ఉండవచ్చు. వారు ఏ రంగంలోని వారైనా కావచ్చు. నిష్ణాతులై ఉండవచ్చు. 

అలాగే వారు గతానికి సంబంధించిన వారు కావచ్చు. వర్తమాన కాలానికి సంబంధించిన వారు కావచ్చు. కానీ వాళ్ళ గురించి ఆ ఊరిలోని వాళ్ళకి ఎంతమందికి తెలిసి ఉంటుంది, ముఖ్యంగా, ఈ తరం వాళ్ళకి?

ఒక వేళ ఆ విజేతలు గత కాలానికి చెందిన వారైతే, అలాగే ఈ కాలానికి చెందిన పిల్లలు కూడా చాలా మంది ఉండొచ్చు, మట్టిలో మాణిక్యాలు పేద కుటుంబంలో పుట్టి ఘనంగా ౘదువుకోవటము ఇంకా ఏదైనా శాస్త్రానికి సంబంధించి ఒక ఆవిష్కరణ చేయడం, ఓ గణిత సూత్రాన్ని పరిష్కరించడం వంటివి చేసి ఉండవచ్చు.

కానీ వారి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ విషయం వారికి ప్రచారం లభించిందా, లేదా అన్నది కాదు, వారు మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిస్తే, ఇంకా ఎంతో మంది అలా ఎదిగే అవకాశం ఉంటుంది.

లేదా వారు చేసిన ఆవిష్కరణలూ, చూపించిన పరిష్కారాలూ, మిత్రులకు మేలు చేయవచ్చు కదా! పాము కాటుకు గురవకుండా సాయం చేసే యంత్రాలు, రాత్రిపూట రైతులు ఇంటి వద్ద నుండే మోటర్ వేసే యంత్రాలు, నీళ్లు మహిళల కోసం తోడి పెట్టే యంత్రాలు, విద్యుత్ ఆదా చేసే పరికరాలు, వంటివన్నీ సమాజానికి ఉపయోగకరమైనవే కదా!

ఆ రకంగా అందరికీ ఈ గొప్ప వారి గురించి చెప్పే విధంగా మనం కృషి చేస్తూ ఉంటే, అది అవసరంలో ఉన్న వారికి ఉపయోగము, ఆవిష్కర్తలకు మరింత ప్రోత్సాహము ‌కదా!

కాబట్టి అటువంటి వారి గురించి మనం ఆయా ఊర్లలో ఎక్కువగా, విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉండాలి. దానికి మనకి ఎన్నో సాధనాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని అవలంబిస్తూ ఉండవచ్చు. 

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ఊర్లో చూసినా, గాంధీ, నెహ్రూల విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు ఉంటున్నాయి. అది తప్పు కాదు, కానీ, ఓ కరెంట్ ఆఫీస్ లో పని చేసే వ్యక్తికీ, కేబుల్ టీవీ ఆఫీసులో పనిచేసే వ్యక్తికీ అందఱితో పాటే శలవులు ఉండక పోవచ్చు. ఎందుకంటే, శనీ, ఆదివారాలు, పండగ సెలవులు రోౙుల్లోనే మిగతా ఉద్యోగస్తులు అందరూ వారి వారి ఇళ్ళల్లో మరమ్మత్తులనో, మఱోటనో పనులన్నీ వీళ్ళ చేత చేయించుకుంటారు కనుక.

చివరికి ఆగస్టు 15, జనవరి 26 వ తారీఖు కూడా ఆయా పనిముట్ల రంగాల వాళ్ళకి అధికారికంగా సెలవులు ఉన్నా, పనులు దొరికేది ఆ రోౙులలోనే గనుక, విరామమంటూ ఉండదు కదా మరి!

అటువంటి వారికి, అంబేద్కర్ తెలియకపోయినా వారి ఊరి వాళ్ళు అయితే తెలియాలి కదా! అదే ధర్మం కదా.

అందుకని, ఈ సదరు దేశ నేతలతో పాటు గానో, వారి విగ్రహాలకు బదులు గానో వారి ఊరి వ్యక్తుల లేదా వారి ఊరి పరిసర ప్రాంతాల వ్యక్తుల విగ్రహాలు పెడితే కదా, ప్రయోజనకరం. ముందు చెప్పుకున్న లక్ష్యాన్ని సాధించగలం.

ఆయా ఊర్లకు సంబంధించి పైన ప్రస్తావించుకున్నట్టు వారు ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారి విగ్రహాలు లేదా వారికి సంబంధించిన సైన్ బోర్డులు పెట్టాలి. ఉదాహరణకు, కూచిపూడి అనే ఊరిని తీసుకుందాం. ఆ ఊరికి సంబంధించి, నాట్యం అనేది చాలా ప్రఖ్యాతి చెందిన విషయం ఎంతోమంది కళాకారులకు ఉపాధిని చూసేవారికి ఆనందాన్ని కలిగించే ఓ గొప్ప కళ. ఆ కళకి మూలపురుషుడు ఎవరో, వారిని చూడాలి. లేదా ఆ కళని బయటకు తీసుకురావడానికి మూల పురుషుడైన వారెవరో, విదేశాలలో చేత మన ఖ్యాతిని పెంపొందింపజేసిన ఘనులెవరో వారి పేర్లు లేదా వారికి సంబంధించిన విగ్రహాలు, కనీసం ముఖం వరకు పెడితే, ముఖం వరకు పెట్టినందుకు ఖర్చు తక్కువే అయినా, అంత మంచి విగ్రహాలు పెట్టినందుకు చాలా మేలు జరుగుతుంది కదా, జనాలకు వాళ్ళు ఎవరో తెలిసేదీ! గాంధీ గారూ, అంబేద్కర్లు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా ప్రజలకి, మన కళలకీ, మన గొప్ప వారికీ మనమే గుర్తింపునీ, గౌరవాన్నీ ఇవ్వకపోతే, వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? ఎక్కడో దేశాల్లో ఎవరెవరో సాధకులని, గొప్ప వారిని వారందరూ కీర్తించుకుంటున్నారు, మనకే చేతకాదు అని ఎంత సేపు మనం అనుకుంటూ ఉండటమా, మన వారిని విస్మరించటమా? ఇలాగైతే భవిష్యత్ తరాలకి మార్గదర్శకత్వం ఏమిటి? వారికి ఏంటి మనం ఇస్తున్న స్ఫూర్తి?


https://www.facebook.com/share/p/1JuZqAJFuq/








2.



#వ్యాససంపుటి 


2. శ్రీ రామ శ్రీ మాత్రే నమః 


ఈ వ్యాస సంపుటి ఆస్తికుల కోసం. నాస్తికులని నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు దూరం జరపట్లేదు. సృష్టి స్థితిలో ఎవడైతే నడిపిస్తున్నాడో, మనం నిద్రపోతున్నప్పుడో, ఎవరైతే మన శ్వాసని ఆగకుండా కాపాడుతున్నారో, తల్లి గర్భంలో నుండి శిశువుని ఎవరైతే రక్షిస్తూ బయటకు తెస్తున్నారో, ఈ సమస్త సృష్టికి మూలకారమైన వారు ఎవరున్నారో, వారిని నుతిస్తూ చెబుతున్న మాట. 


"కలౌ స్మరణాన్ ముక్తిః" అన్నారు పెద్దలు. 


యుగధర్మం ఒక్క యుగానికి ఒక్కో విధంగా ఉంటుంది. దయ అనీ, దానమనీ, ధర్మమని ఇలా చెప్తూ ఉంటారు పెద్దలు. 


అంటే దేవుని సన్నిధి చేరుకోవడానికి సులువైన మార్గం ఏమిటి? 


ఎందుకు చేరుకోవాలి అనే దానికి ౙవాబు నేడు ఆవిష్కరింపబడుతున్న Quantum Theory అనే శాస్త్రంలో కూడా ఉంది. అందుకని ఆ అంశాన్ని నేను స్పృశింౘటము లేదు.


ఇక సూటిగా ఎలా చేరుకోవాలి అనే అంశంలోకి వచ్చేస్తున్నాను. 


ఇందుకు రెండు మెట్లు. 


1. చేస్తున్న పనిలో లీనం అయిపోతూ, "కర్తను" మాత్రం నేను కాదు అనుకుంటూ, "కర్మఫలం" పై ఆశ వదిలేస్తూ, ముందుకు సాగిపోవాలి. ఈ జీవన విధానంలో భాగంగా, ఎక్కడైనా అన్యాయం, అధర్మం వంటివి ౙరిగితే, చేతినేనంత వరకు నిలబడగలగాలి. అలాగే, రెండు చేతులు అర్థించి ప్రార్థిస్తే ఖచ్చితంగా "తధాత్మానం సృజామ్యహం, సంభవామి యుగేయుగే" అన్నట్లుగా దైవం తప్పకుండా మనల్ని రక్షిస్తుంది. ముందే చెప్పినట్లు, ఇవన్నీ దేవుని నమ్మే వారి కోసమే. ఇందులో "తర్కం ఏమిటీ", అంటారా, that is "Vibration". మన ౘుట్టూ ఉన్న "ఆరా"లో ఈ శక్తి తరంగాలు నిండి, విశ్వంతో మనని అనుసంధానించి, కోరుకున్నది జరిపించేందుకు బాటలు పరుస్తాయి. అది ధర్మబద్ధమైనదై, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. అదీ విషయం. 


2. ఇక రెండవ మెట్టు, "నిరంతరము వీడని నామస్మరణ, సాధనమున పనులు సమకూరు ధర లోన". 

కనుక, తెలియని దారులు వెతుక్కుని అందులో నుంచి వెళ్లకుండా, ఇబ్బందులు పడకుండా, సులువైన విధానం నామ స్మరణం. 


ఎలా చేయాలి? ఎంత చేయాలి అంటారా దానికి హద్దులు ఉండవు కదా మరి. మనం ఒక్కసారి పిలిస్తేనే చుట్టూ ఉన్న వివిధ పాత్రధారులు పలుకుతూ ఉన్నప్పుడు అదే పదే పదే పిలిస్తే దైవం పలకదా మరి! 


ఒక చిన్న లెక్కతో మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. 


లెక్క పెట్టుకుంటూనే 10 నిమిషాలకు ఒకసారి 10 సార్లు ఏదైనా నామం చదువుదాం. రామా అనో, శ్రీ మాతా అనో, లలితమ్మా అనో, చంద్రమా అనో, పది నిమిషాలకు ఒకసారి 10 మార్లు అన్నామంటే, రెండు గంటలు తిరిగేసరికి వందసార్లు అవుతుంది. వీలును బట్టి ఇలా 24 గంటలలో మనం మెలకువగా ఉండే 18 గంటలలో అవకాశాన్ని బట్టీ కనీసం అర్థ సహస్రం ఒక్క రోజుకి చేయగలిగితే నెల తిరిగేసరికి 1500 అవుతుంది. మనలా మరో 10 మంది కలిసి ఇలాగే చేస్తే 15000 అవుతుంది. అంటే వంద రోజులు తిరిగేసరికి మనమందరం కలిసి లక్ష పూర్తి చేస్తాం. కేవలం 10 మంది చాలు. మనకున్న వాట్సప్లోనో, మరో విధంగా సమూహంగా ఏర్పడి, counts పెట్టుకుంటూ పోతే, వంద రోజులు తిరిగేసరికి లక్ష సార్లు అవుతుంది. 


ఇలా ప్రతి 10 మంది కలిసి చేస్తూ పోతే ఎంత తొందరగా సంఖ్య కోట్లు దాటుతుంది చెప్పండి! 


భలే సులువుగా ఉంది కదా!


అప్పుడు మనం కోరుకున్న రామరాజ్యం వచ్చి మనందరి జీవితాలు బాగు పడిపోతాయి.


ఎవరో వచ్చి మనని బాగు చేయాలనుకోవడం కంటే మనకు మనమే బాగు చేసుకుంటాం. ఒకవేళ ఆ ఎవరో రావాలంటే, ఆ వచ్చేది, మన లాంటి వాడే అయితే, సామాన్య మానవులమే కదా మనమందరం మనలో ఒకడు వస్తాడా, ఆ వచ్చిన నాయకుడికి మద్దతు ఇద్దాం. లేక దైవమే వస్తుందేమో, పిలిచేద్దాం, ఏమంటారు?


["రామరాజ్యం" వస్తే, సంసారాలలో తగవులూ, విడి పోవటాలూ, అనారోగ్యం తో పడి పోవటాలూ, అధర్మం తో పోరాటాలూ, అందుతాయా లేదా కావలసినవి అంటూ ఆరాటాలూ, తల్లిదండ్రులను పిల్లలు అగౌరవించటాలూ, సరైన విద్య అబ్బక పోవటాలూ, పెద్దల ముందర పిల్లలు పడిపోవటాలూ ఉండవు. అందుకే ఆ ధ్యేయంతో స్మరణ మొదలుపెడదాం ఆ సంకల్ప సిద్ధిని కోరుకుంటూ చేద్దాం].


ప్రార్థన: ఇది నేను మతపరంగా చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడుతున్నాను. దయచేసి ఎటువంటి వివాదాలకూ తావీయవద్దు.



https://www.facebook.com/share/p/1E7S8f25XL/



3.

[4/12/2024, 21:06] Durga Madhuri Devi Nagini: బ్రాహ్మణుల ఇళ్లల్లో వివాహం సమస్య కావటానికి కారణం 


1. 

ఒకరకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగమే

ఇది లేక ముందర బ్యాంకు ఉద్యోగస్తులని టీచర్లని అయినా చేసుకునేవారు ఎందుకంటే సేఫ్టీ ఉన్న జాబ్స్ అని

అది అబ్బాయి అమ్మాయి నైనా అమ్మాయి అబ్బాయి నైనా 

ఇక డాక్టర్లు ఎటు డాక్టర్లని చేసుకుంటారు 

ఇంజనీర్లు తొందరగా దొరకరు ఎందుకంటే చదవడం కష్టం కాబట్టి కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చాక ఇంజనీరింగ్ చదవడం సులువు అయిపోయింది జీవన ప్రమాణాలు పెరిగాయి ఎందుకంటే జీతం భత్యం పెరిగాయి కాబట్టి 

కనుక ఒకరకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఇంత కష్టానికి కారణం 

కానీ ఇక్కడతో ఆగిపోలేదు 

2.

మరో ముఖ్యమైన విషయం క్రిందటి తరం వరకు ఎక్కడో పరిస్థితిని అనుకూలించక కానీ ప్రతి ఇంట్లో ఒకరికన్నా ఎక్కువ సంతానం ఉండేవారు ఇప్పుడు వాళ్లే యువతీ యువకులు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వాళ్లలో ఆడపిల్లలు ఉంటే అన్నదమ్ముల్ని చూసి వాళ్లు బయట అదే అడుగుతారు అలాగే ఈ కూతుళ్ళని చూసి వచ్చే కోడలని అత్తగార్లు కూడా అలా ఆశిస్తున్నారు 

ఇదివరకు పంటలు ఉండేవి ఎకరాలు ఎకరాల పొలాలు ఉండేవి బ్రాహ్మలకి ఇప్పుడు అవి లేవు కట్నం జీతం ఏదో ఒకటి ఆడపిల్ల నుంచి ఆశించకుండా జీవితాంతం ఎందుకు పోషించాలి మందు మాకు తిండిబట్ట అని మగ పెళ్ళి వాళ్ళ ఆలోచన ఏ తరంలో అయినా 

అది ఈ తరానికి పొలాలు మిగలలేదు కాబట్టి మరి ఆడపిల్ల జీతం కావాలి కూతురు ఉన్నవాళ్లు కూతురుని చూసి కూతురు సాఫ్ట్వేర్ జాబ్ లో ఉంటే అది కోడలి నుంచి కూడా ఆశిస్తున్నారు మరి కూతుర్లు లేని వారు కూతుళ్లు ఉన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో లేని వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే అటువంటి కుటుంబాలు తక్కువ ఆ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉన్నాయో మనకి పూర్తిగా తెలియకపోవచ్చు 

కానీ చాలావరకు సమాజం ఇలా ఉంది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగిలకే కదా జీతం ఎక్కువ లేదా బ్యాంకు ఉద్యోగాలు కూడా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లతోని కాబట్టి ఆదిశ గాని ఆలోచిస్తున్నారు 

కర్మకాలి కోడలు వచ్చిన తర్వాత ఇచ్చే జీతం సరిపోవట్లేదు వాళ్ళకి పెళ్లికి ముందర సంపాదించింది కూడా తెమ్మంటున్నారు మరి ఇంజినీరింగ్ చదివించిన తల్లిదండ్రులకు డబ్బు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాళ్లు ఆ డబ్బు ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఒక విషయం చూడాలి వాళ్ళకి నిజంగా అంత డబ్బు పెళ్లికి ముందర జీవితాలు రూపంలో అవసరం లేకపోతే ఆ డబ్బు అత్తగారు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేయొచ్చు అయితే ధనాసేపరులు అది తమ బిడ్డ అత్తారింటికి అంత డబ్బు ఇచ్చేయటం మంచిది కాదు అనుకుంటే పిల్లల పేర్లు ఫిక్స్ డిపాజిట్ వేయడం ఏదైనా స్థిరాస్తి కొన్ని పేపర్లు పెట్టడం లాంటిదో చేసి ఆరోపణ ఇవ్వాలి అది బ్యాంకు లోకంలో ఉంచాలి. పిల్ల సేఫ్టీ కూడా చూసుకోవాలి 

ఇలా జరగని పక్షంలో పెళ్లిళ్లు అయినా పిటాకులు అవుతున్నాయి కేవలం 70 ప్రధాన కారణం 

ఆడపిల్లలు లేని వాళ్ళకి ఏమో కోడలను ఎలా చూసుకోవాలి తెలియకపోవచ్చు కానీ లేని కూతురిని ఆమెలో చూసుకోవచ్చు కదా చూసుకోరు

ఆడపిల్లలు ఉన్నవాళ్లు మాత్రం తక్కువ తిన్నారా తమ కూతురికి అల్లుడు దాసోహం అనాలి అత్తమాములు ఉండకూడదు అనుకుంటూనే తాగు మాత్రం కోడళ్ళని ఆరెళ్ళు పెడుతున్నారు మనకు తెలియని విషయం కాదు ఈ కథ 

కానీ ఎవరు సమాజ శ్రేయస్సు దిశగా ఆలోచించట్లేదు వాళ్ల డబ్బు అవసరాలు తీరి కోడలు చాకిరీ చేసిందా కూతురు సుఖ పడిందా ఇదే ఆలోచన 

ఇటువంటి కథలు చూసి నవతరం యువతులు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లా పెళ్లిళ్లు ఆలస్యం అవ్వటము ఒక వర్గం వరకే పెళ్లి అవ్వటమో మాత్రమే జరగట్లేదు. అసలు పెళ్లిల్లే జరగట్లేదు ఇది వాస్తవం. ఇది బ్రాహ్మలలోనే కాదు యావత్ భారతంలోనూ ఉంది 

పెళ్లయ్యాక పోనీ అత్త మామ భర్త మాత్రమే పెట్టారు ఉంటాయా ఆడపిల్లకి 

అత్తమామల తోబుట్టువులు వారి ఇళ్లలో వాళ్ళతో సహా అందరూ ఆడుకునే వాళ్ళు ఆడపిల్లని 

ఆడపడుచు అత్తగారిని చూడదు మరిది భార్య చెప్పు చేతుల్లో ఉండి అమ్మానాన్నని అన్న వదిన దగ్గర పెట్టేస్తాడు వదిన మళ్లీ ఉద్యోగం చేయాలి వదిన చావటం చూడు దాకా వెళ్లి వచ్చిన వదిన అమ్మా నాన్నను చూడాలి ఉద్యోగం చేయాలి. కానీ భార్య కందిపోకూడదు తన అక్క చెల్లి కూడదు బంగారాలు కొనాలి బట్టలు కొనాలి అక్కకి భార్యకి వదిన ఆహుతి అయిపోవాలి 

అక్కడ ఇంటి పెద్దకొడుకు అన్న మాత్రం సరిగ్గా ఉంటాడా ఉండడు భర్తగా 

ఇటువంటి ఆ రెండు చూసి చూసి ఆడపిల్లలకి పెళ్లి అంటే వెగటు వస్తుంది 

ఇటు ఆడపిల్ల వైపు వాళ్ళు ఇప్పుడు తక్కువ తినట్లేదు 

తల్లి మెడలో మాంగల్యం దగ్గర నుంచి ఎన్ని చిహ్నాలు వేసుకుంటుంది కూతుర్ని మాత్రం వేసుకొని చుట్టుపట్టు బట్టలు వేసుకుని మగవాళ్ళు తిరిగే ఇంట్లో హాయిగా సోఫాలో కాలు మీద కాలు మడిచి కూర్చోమని చెప్తుంది 

కూతురు వంట చేయకూడదు ఉద్యోగం చేస్తే తన జీవితం తనకే ఉండాలి ఇలాంటివి మనం ఎన్నో ఇళ్లలో చూస్తున్నాం చివరాత్రికి ఆడపిల్లని మొగుడు శుక్రవారం ఎవరైనా తాంబూలానికి ఇవ్వడానికి వచ్చినప్పుడు మెడలో కనీసం మంగళసూత్రం నల్లపూసలు వేరే గొలుసులు కాదు కాళ్ళకి మెట్టెలు కాదు పట్టీలు అసలే కాదు నుదుటి బొట్టు తాళిబొట్టు మాత్రమే వేసుకోమంటే కూడా పెటాకులు అయిపోతుంది పెళ్లి

[4/12/2024, 21:16] Durga Madhuri Devi Nagini: అక్కా ఇవి పైకి కనిపించే బాహ్య ప్రపంచపు సామాజిక విషయాలు 

ఇప్పుడు లోపల అంతర్లీనంగా జరుగుతున్నాయని నాకనిపిస్తున్నవి చెప్తున్నాను ఈ విషయం మాత్రం నేను ఎక్కడా ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే ఇది నా ఊహ మాత్రమే అందుకని నా ఊహని దానితో పాటు పరిష్కారాన్ని నీకు పర్సనల్గా ఇక్కడ చెప్తున్నాను 



మన భారతీయ వ్యవస్థని కూల్చడం అనేది విదేశీ శక్తులన్నీ ఇంతకు ముందర ఒకరితో ఒకటి చేతులు కలిపి చేయలేదు కానీ కుట్రలైతే చేశాయి ప్రయత్నాలు అయితే చేశాయి దాడులు చేశాయి మనకి తెలియని విషయం కాదు పరిశీలించిన అందరూ వచ్చారు మన దేశానికి చివరి ఆఖరికి బ్రిటిష్ వారు ఈ మధ్యలో ఎడారి మతాలు కూడా వచ్చే జగద్విదితమే


మన పంటలను నాశనం చేసి మన వాన పాముల్ని నాశనం చేసి వాళ్ల వానపాములు తెచ్చి ఇక్కడ డిప్లయ్ చేసి వాటి ద్వారా వచ్చే శక్తిని మనకందించి రకరకాలుగా మన ఆహారాన్ని పాడుచేసి మనం నైతిక విలువలని పాడుచేసి డివైడెడ్ రూల్ కింద మనని పాలించారు 

కలసి ఉంటే కలదు సుఖం కదా అందుకని విడగొట్టారు 

అందులో భాగంగానే ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నాము కులాల విభజన చేశారు స్త్రీ పురుషుల మధ్య భేదాలు పెట్టారు ఆడపిల్ల వారు మగపెళ్ళి వారు అని సృష్టించారు 

మన మధ్య ఆ కలతలు మొదటి నుంచి లేవు 


నేను పదేపదే వివిధ వేదిక మీద చెప్తున్నాను 


కౌసల్యాదేవి సుమిత్రా దేవి కైకే దేవి సహగమనం చేయలేదు రుక్మిణి దేవి అవతారం సాధించింది అంటాము కానీ సహగమనం సత్యభామ దేవి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంది సీతమ్మ తల్లి ముందే వెళ్లిపోయింది కానీ అక్కడ ఎక్కడ ఆమెను స్త్రీగానో భార్యగాను అవహేళన చేసి వదులుకోలేదు రాముడు ఈ విషయాలు మనకు తెలియదు మనకి రామారావు చూపించినదే రామాయణ భారతం కాదు 

మనకి ఇప్పుడు ప్రవచన కారులో చెప్తున్నారు లక్ష్మణ రేఖ అనే విషయం లేనేలేదు 

అలాగే ఏ కలర్ ని బొటనవేలు ఎందుకు అడిగారో కూడా కారణం మనకి చెప్పారు నేను గతంలో చెప్పాలనుకుంటా ఏకలవ్యుడు కుక్క పుట్టుమచ్చ మీద ఐదు బాణాలు వేశాడు తన సౌర్య ప్రతాపాన్ని చూపించడానికి అంతటితో ఆగేడా ఈ ప్రజ్ఞ్య కారణం ద్రోణాచార్యుడు అని చెప్పాడు ద్రోణుడు ఏమీ తనకు సహకరించకపోయినా దాని ఫలితం ఏమిటి అర్జునుడికి మధ్య విభేదాలు సృష్టించడం అతని కపటి క్రూరుడు ఆవేశపరుడు 

అటువంటివాడు చేతికి మంత్రవిద్య లేదా అస్త్ర శాస్త్రవిద్య ఇస్తే వాడు అది ప్రపంచ వినాశనానికే వాడుతాడు. రుజువు అతని యుద్ధంలో కౌరవుల పక్షాన ఉండటం 

అలాగే ఉపపాండవుల విషయంలో జరిగిన తప్పులు అశ్వద్ధామ విషయంలో జరిగిన అవమానాలు అవస్థలు అన్నీ మనకి రామారావు చూపించిన సత్యాలు కాదు వాస్తవాలు కాదు అసలు కర్ణుడు ఆ యుద్ధ విద్యల పరీక్ష సమయంలో కలవలేదు దుర్యోధనాదులని

గురుకులంలోని వీళ్ళందరూ కలిసే విద్య నేర్చుకున్నారు కర్ణుడు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు కర్ణుడు నూనె తీసి ఇస్తే భూమాత శపించింది అన్నది అబద్ధం అర్జునుడి రథచక్రాన్ని కనులు ఎత్తి పట్టుకున్నాడు యుద్ధనీతి కింద అన్నది అబద్ధం. రాముడు రావణాసురుని యుద్ధం గెలవడం కోసం ముహూర్తం పెట్టమన్నాడు అన్నది అబద్ధం. సహదేవుడు కృష్ణుడు నీ అడగకుండా నాడిగో మహాభారత యుద్ధానికి ముహూర్తం పెట్టాడు అన్నది అబద్ధం సహదేవుడికి భవిష్యత్తు తెలిసినది నిజం కానీ పాండురాజు వేరు తిన్నాడనేది అబద్ధం ద్రౌపదీ దేవి సభలో నవ్వింది అన్నది అబద్ధం ఆ సమయంలో ఆవిడ పుట్టింట్లో ఉంది ఆవిడ కన్నుండి పెళ్లి చేసుకోవాలని ఉందని కోరింది అన్నది అబద్ధం

అందుకే అంటున్నాను నందమూరి రాముడు చూపించినది కాదు రామాయణం ఏమో తెలియదు 


కానీ మనకి ఇవన్నీ తప్పుగా చూపిస్తూ వచ్చారు. అంటే జరగని తప్పుల్ని వీళ్ళు సొంతంగా రాసి చూపిస్తూ వచ్చారు. 


నంది తిమ్మన పారిజాతాపహరణం రాశారు అంటే ప్రబంధ కావ్యం దానిలో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆయనెక్కడా హద్దులు మీరు రాయలేదు జరగని దాన్ని రాయలేదు జరిగినదాన్ని దాచలేదు 


సరదాగా రాశాడు ఒక అవసరం కోసం రాశాడు అందులో దోషం లేదు ఆయన సమాజ హితం కోసం రాశాడు సమాజ హితం అంటే ఏంటి రాౙూ రాణీ బాగుంటేనే కదా దేశం బాగుండేది 


అటువంటి నిజాలు అన్ని చూపించే మన కళా రంగం ముప్తమైపోయింది ఇప్పుడు 

పుట్టపర్తి నారాయణచార్యులు వారు జాన్ పెద్ది హనుమత్ శాస్త్రి గారు ఆదిమట్ల నారాయణదాసు గారు చూపించినవని ఇప్పుడు ఎవరికీ తెలీదు 

అంతా ఇప్పుడు హీరోలు చేసేది క్రిస్మస్ ట్రీలు ఇంట్లో పెట్టుకునే హీరోలు చేసేది విన్యాసం ఇప్పుడు 


అటువంటి పరిస్థితుల్లో మన పురాణ గాదులు ఎలా తెలుస్తాయి అందులో సమాజానికి పనికి వచ్చేలా ఉన్నవి ఎలా తెలుస్తాయి 


ఒక్క విషయాన్ని ఎవరైనా స్పృశించారంటే పురాణం గాదుల్లో అది మనకి ఇప్పుడు అనైతికము అసాంఘికము అరాచకం అనిపించొచ్చు కానీ అది ఎందుకు చెప్పారు ఏ ఉద్దేశంతో చెప్పారు అన్నది బయటకు రానీయకుండా 

సగం సగం వీడియోలు చూపించి ఫేస్బుక్లో సొంత ప్రయత్నాలతో వ్యాఖ్యలు రాసి ప్రవచన కారులని మనకు దూరం చేస్తున్నారు 

ఇదంతా ప్లాంట్ గా జరుగుతోంది ప్రింట్ మీడియా అలా కింద అలా ఒత్తు రాయదు ల ఒత్తు రాస్తుంది ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఆదా అవ్వాలి కాబట్టి ఇలా మన భాషని మృగ్యం చేసేస్తున్నారు 


ఈ పరిస్థితుల్లో మనకు అసలు నీతి మంచి ఎవరు చెప్తారు మన దగ్గర లేనివి ఉన్నాయని ఉన్నవి లేవని చెప్పిన దాన్ని ఖండించి సరైన వివరాలు వాస్తవాలు ఎవరు వెల్లడి చేస్తారు 


ఇవన్నీ మనకు తెలియదు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి విడాకులు లేదా పెళ్లి కాకపోవటం 


ఈ విషయానికి వస్తే నేను పైన పేర్కొన్నట్టు కౌసల్యాదేవి ఇత్యాధులు సహగమనం చేయలేదు. ఆడపడుచు ఆరులు లేవు అత్తగారి ఆడోళ్ళు వాళ్లకి లేవు తోడుకోడలి ఆరులు లేవు ఆ తర్వాత సీతమ్మ తల్లి కోడలుగా ఏమీ ఆరేళ్లు పడలేదు భార్యగా ఏమీ ఆరేళ్ళు పడలేదు వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేశారు 


అనసూయ దేవి అరుంధతి దేవి వాళ్ళు చేయాల్సిన వాళ్లు చేశారు సతీసమే కదా మనం పూర్తిగా తెలియదు ఆవిడ బుట్టలో పెట్టి పోయిన దానికి ఫలితం తర్వాత వచ్చింది సత్యసంధత అక్కడ భర్త పట్ల మాత్రమే భయంతో ఉండటం కాదు సత్యసంధత నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను అంటే దానికి అంకితం అయిపోతాను అది మనం ఈరోజుల్లో అయినా అలా చేస్తేనే మనకి నిజంగా జీవితం బాగుంటుంది సత్య సంగతి ఉన్నవాడి జోలికి ప్రమాదాలు మొదట్లో వస్తే గాని రాను రాను అవి రావు అక్క ఎన్నో జీవితమే సాక్ష్యాలూ ఉదాహరణలూ


కాబట్టి మన పెద్దలు చెప్పిన అసలు వాస్తవాలను మనం ఎప్పటికైనా గ్రహించుకోవాలి. స్త్రీలను ఎక్కడా మన పురాణాలలో బాధ పెట్టలేదు అది గ్రహించి నేటితరం యువత అన్న మళ్లీ అవన్నీ చదువుకుని మాట్లాడుకుని అందరూ కలిసి ఒక వేదిక మీద కలుసుకుని ఇంటి ఆడవాళ్ళని ఎలా చూడాలి? వదిన అయినా తమ్ముడి భార్య అయినా వేరే దృష్టితో చూడకూడదు వాళ్లే సేవకులుగా ఉండిపోకూడదు వాళ్ళ అక్కలు చెల్లెళ్లకు ఒక నీతి భార్యకి ఒక నీతి అని ఉండకూడదు తల్లి సమాధానపరుచుకోగలగాలి తండ్రులు కూడా కూతురులా చూడమని చెప్పాలి స్వార్థం ఉండకూడదు అని నేటి యువత కూర్చుని మాట్లాడుకోవాలి అలాగే యువతులు కూడా మనం తాళిబొట్టు వేసుకోవాలి అది మన ఆరోగ్యం కోసం అలా చెప్తే వినమని మొగుడు పేరు పెట్టారు ఇలాంటి విషయాలు వాస్తవిక విషయాలు శాస్త్రవేత్తమైన విషయాలు తెలుసుకుని జీవితాన్ని బాగు చేసుకోవాలి

[4/12/2024, 21:24] Durga Madhuri Devi Nagini: ఇప్పుడు నేను మరో ముఖ్యమైన విషయం నీతో ప్రస్తావించదలచుకున్నాను అక్క 


ఇది నేను భవిష్యత్తును ఊహిస్తూ చెప్తున్నాను 


20 ఏళ్ల క్రితం నేను ఉద్యోగుల్లోకి వచ్చిన కొత్తల్లో సీనియర్స్ నాకు ఎన్నో విషయాలు సాంకేతికంగా నా ఉద్యోగానికి సంబంధించిన నేర్పేవారు అలాగే మనవాళ్లు కొందరు నాకు జీవిత పాఠాలు కూడా నేర్పారు కొన్ని వారి జీవితాన్నిభవాల ఆధారంగా 


వాళ్లలో ఒక అమ్మాయి పాపం అత్తగారింట్లో చాలా అవస్థలు పడుతూ ఉండేది ఏదో మాటలతో సంతాన పరిచేదాన్ని నేను అప్పుడప్పుడు డిగ్రీ అయి ఉన్నాను ఏం చెప్తానో చెప్పు కానీ నేను కూడా ఎందరో ఇతరుల జీవితాన్ని చూసి అనుభవం మీద ఇలా ఒకరినొకరు ఓదరుస్తూ ఉండేదాన్ని 


అప్పుడే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న ఒంటరి జీవితం లాగానే తన కూతురికి సంబంధించిన విషయాలను తనే చూసుకుంటూ ఉండేది నేను ఒంటిగా పెంచాలి భర్త పక్కనే ఉన్నా కాబట్టి నాకు డబ్బులు ఎక్కువ కావాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ చదివించాలంటే అని బాధపడుతుండేది తనలా ఇంజనీరింగ్ తన కూతురు చదవలేదేమోనని అప్పుడే నేను తనకి చెప్పేదాన్ని అక్క నువ్వు అలా ఆలోచించకు ఇప్పుడున్నట్టుగా పదేళ్ల తర్వాత ఉండదు ప్రభుత్వాలు మారిపోతాయి మనం హిందుత్వ గవర్నమెంట్ ని గనక గెలిపించుకుంటే మన విద్యా విధానం మారిపోతుంది అక్క అని ఇప్పుడు నిజంగానే మోడీ గారు ఆ మార్పులు తీసుకువస్తున్నారు. రచయితలకి దూరదృష్టి ఊహ శక్తితో పాటు వాస్తవిక దృక్పథం కూడా ఉంటుందంటారు యండమూరి గారు ఒక పుస్తకంలో నేను ఆ ప్రిన్సిపుల్ నేర్చుకుని అనుసరిస్తూ భావితరాలు ఎలా ఉండబోతున్నాయో ఎలా ఉండాలో కొన్ని ఊహిస్తున్నాను ఎలా ఉండబోతున్నారు అన్నది ఎలా ఉంటారు అన్నది కొన్ని సూచనలు నాకు నేనే ఇట్ల రాసుకుంటున్నాను రాలేకపోయినా మనసులో పేర్చుకుంటున్నాను సమయం చిక్కదు కదా 


అట్లా ఇప్పుడు నేను ఊహిస్తోంది ఏమిటంటే 


1. మోడీ గారు మన విద్యా విధానం మార్చేస్తారు 

2. ఇంజనీరింగ్ లనే కాదు మన కులువృత్తిని పైకి తీసుకువస్తారు చేనేత చీరలు ఇతర నేత వృత్తులు కుల వృత్తులు కుమ్మరి కమ్మరి అందరూ చక్కగా మళ్లీ బయటకు వస్తారు 

3. రైతులకు భరోసా తీసుకొస్తారు జవాన్లని కాపాడుతారు శాస్త్ర సాంకేతి విద్యను ముందుకు నడిపిస్తారు 

4. మందులలో కల్తీలు ఆహారంలో కల్తీలు ఎగిరిపోతాయి 

5. ఇవన్నీ విద్యా వైద్యం ఆరోగ్యానికి సంబంధించినవి. ఇప్పుడు సమాజానికి సంబంధించి మరికొన్ని చెప్తున్నాను 

6. మెట్రోలు రింగ్రోడ్లు బాగా పుంజుకుంటాయి కానీ ఫ్లయ్ ఓవర్లని లేదా ఈ మెట్రోలు ఎంఎంటిఎస్ లు ఓఆర్లు అంటూ ఇకనుంచి రైతుల భూములు లాక్కోరు 

7. స్కూల్లకి కాలేజీలకి పిల్లలు వెళ్లడం కూడా దూరాభారాలు వెళ్లేలా ఉండదు. పుస్తకాల సంౘుల బరువులు‌ ఎక్కువ ఉండవు ఎక్కువ స్కూళ్లు కూడా ఉంచరు ముయించి వేస్తారు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పరిశీలించి మధ్య చేయడం లాంటివి చేస్తారు సమర్థవంతమైన ఫ్యాకల్టీని ఎక్కడెక్కడ ఉన్నారో సేకరించి వాళ్ళందర్నీ ఒక దగ్గరే ఉంచుతారు 

8. హాస్పిటల్స్ ఉద్యోగాలైన అంతే ఎక్కువ శాతం దురా భారం ప్రయాణాలు ఉండవు ఇటుపైన 

9. పర్సనల్ వాహనాల్లో ప్రయాణాలు కూడా ఉండవు సామాజిక మాధ్యమాలే ఉంటాయి 

10. ఇది రవాణా వ్యవస్థని నవీకరించడంతోపాటు ఆక్సిడెంట్ వంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఎవ్వరూ హెల్మెట్లు పెట్టుకోరు సీటు బెల్ట్ లు వేసుకోరు డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు భర్త అయినా ఆడవాళ్ళని దింపుతుంటే షాట్లు వేసుకుని వేస్తున్నారు ఆటో వాళ్ళతో సహా ఇవన్నీ ఎగిరిపోతాయి 

11. మరో ముఖ్యమైన విషయం తగ్గేదేలే అంటూ వచ్చే పుష్ప గాడు గానీ ఎక్కడ తగ్గాలో తెలిసి ఉంటే ఇంకే దేవుడు గానీ ఇటువంటి సినిమాలు అన్నీ అంతరించి పోతాయి సినిమాలే కాదు సీరియల్స్ ఇతరత్రా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ బిగ్ బాస్ లాంటి షోస్ ఇవి ఏవి నేను చూడను మా ఇంట్లో టీవీ కూడా లేదు కార్తీకదీపం సీరియల్ గురించి ఒకానొక వ్యాసంలో చదివాను 

12. ఇకనుంచి అవి ఉండవు సరైన విధంగా తీసిన రామాయణ భారతాలు మాత్రమే ప్రసారమవుతాయి ప్రవచనాలు పురాణాలు శాస్త్ర విషయాలు వాటిలోని సూక్ష్మాలు ఉంటాయి వీటితోపాటు మనం అనుసరించవలసిన విధివిధానాలు ఉంటాయి నండూరి గారు గరికిపాటి గారు సామవేదం గారు సత్యభామ చాగంటి వారు కాకుమాను వారు బాచంపల్లి వారు మైలవరపు గారు ఇటువంటి వాళ్లే ఉంటారు వీళ్ళే ఉంటారు 

13. పండుగలకు దేశం అంతా చక్కగా సంబరాలు ఉంటాయి టపాకాయలు కాల్చకూడదు తూటాలు పేల్చకూడదు గాలిపటాలు ఎగురవేయకూడదు సెలవులు ఉండకూడదు ఇటువంటివి ఉండవు 

14. తీర్థయాత్రల దగ్గర కూడా జన నష్టం జరగకుండా పుష్కరిణిలో ఘాట్ల దగ్గర కూడా సరైన విధానాలను అమలులోకి వస్తాయి 

15. ఇప్పటికీ తీవ్రవాదులు వారి చర్యలు అంతమైపోయాయి అరుణాచల్ ప్రదేశ్ వంటివి మనదేశంలోని అంతర్భాగం అవుతాయి మన దేశస్థులను కాదు అని తమను భావించుకుని ఈశాన్య ప్రాంతా రాష్ట్రాల ప్రజలు కచ్చితంగా తమ భారతీయులమని ఆనందంగా గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు

16. దేశపు జెండాకి గవర్నమెంట్ లభిస్తుంది 

17. ప్రాంతీయ భాషలు యాసలు పేరుందని వీపులేని కొంకనీ వంటి భాషలు ఊపొందుకుంటాయి 

18. కళాకారులకి రైతులకి జవాన్లకి పురోహితులకూ మంచి రోజులు ఉంటాయి

19. కల్పనా చావ్లా సునీత విలియమ్స్ పరాయి దేశాల్లో పడ్డ కష్టం ఇక ఉండదు

[5/12/2024, 11:44] Durga Madhuri Devi Nagini: ఇప్పుడు కొనసాగింపు ఏంటంటే ఎక్కువ శాతం అందరూ అమెరికాలకి వెళ్ళిపోతున్నారు అని లేదా ఇతర విదేశాలలో స్థిరపడిపోతున్నారు ఈ తరం పిల్లలు అన్నది ఒక పెద్ద బాధాకరమైన విషయంగా ప్రస్తావించడం జరిగిపోయింది అది ఎందుకు తప్పయినదో నాకు అర్థం కావట్లేదు. ఈ క్రింది విషయాలను ఒకసారి పరిశీలిద్దామా


1. సినిమాలలో కథానాయకుడు చెప్తే నేనా మీరు చిన్నప్పుడు విలుసు గురించి విజయవాడ రావచ్చు కానీ ఇప్పుడు విజయవాడ నుంచి మీ పిల్లలు వాళ్ల పిల్లల కోసం విదేశాలకు వెళ్ళకూడదు అని. ఈ ఆలోచన మన సామాన్య జనాలకు ఎందుకు రావట్లేదు 

2. సరే పోనీ ఇక్కడే అందర్నీ ఉండమందాము చోటు సరిపోతుందా మన ఇంట్లో మనకి చోటు చుట్టాలు వస్తే సరిపోదు బాత్రూములు సరిపోవు పువ్వులు సరిపోవు వంట వండాలంటే అవస్థ ఎంతమందికని ఎన్ని వనరులని సమకూర్చాలి కూరల పట్టుబట్టల దుప్పట్ల ఏం సమకూర్చగలం మనము ఒక చిన్న ఇంట్లోకి మామూలుగా వచ్చే చుట్టాలు మన వాళ్ళు వస్తేనే ఆపసోపాలు పడిపోతాము మరి ఈ దేశం ఇంకా ఎంతమందిని accommodate చేయగలుగుతుంది

3. అలా విని పుట్టిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోవటమే దారా లేక అసలు జనాభా పెరగడమే తప్ప అని అనట్లేదు. పెరుగుతున్న జనాభా కనుగుణంగా చోటు సరి పోవడం కోసం కొంచెం వనరులు అటు ఇటు చేసుకుంటూ కాళ్లు మడత పెట్టుకోవడం చాపుకోవటం వంటి చిన్న చిన్న మార్పులు మనకు అలవాటైనవే కదా. 

4. ఇప్పుడు ఇక మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. ఎంతసేపు స్థూలమైన విషయాలు మాట్లాడటం కాదు. Meaning not just outliners. Coming to the real life. అదే సామాజికం, లేదా గృహస్థ స్థాయి. 

5. ఈ గృహస్థ స్థాయిలో అంశాలు ఎలా ఉంటాయో మనకు తెలియనిది కాదు. ఇంటికి చుట్టాలు వస్తే పెట్టే బట్టల దగ్గర నుంచి అన్నిటికీ సమస్యలే. పైన వనరుల గురించి వసతుల గురించి చెప్పుకున్నాం. ఇదే విషయం గా. కానీ ఇప్పుడు మనస్తత్వాలు గురించి చెప్పుకుంటున్నాం. అన్న భార్యకి ఒకరకం చీర ఆడపడుచుకి ఒకరకం చీర పెడతారు ఆడవాళ్లు అని ఒక నానుడి. ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో వేడుక చేస్తే నువ్వు పెట్టే చిన్న చీర గురించే ఈ స్థాయికి వెళుతున్నాము. ఇక పెద్దపెద్ద విషయాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక ఇంట్లో వాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదివితే ఎంత మంది ఈర్ష్య, మత్సరాలు లేకుండా, నిస్వార్ధంగా ఆనందంగా చిత్తశుద్ధితో అభినందిస్తారు 

6. ఎవరైనా కష్టంలో ఉంటే ఎంత మంది తన బాధ్యతగా వెళ్లి ఆదుకుంటారు. వైద్య అవసరము డబ్బు అవసరమో వస్తే వైద్యానికి డబ్బు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు రక్తము ఇతర రకమైన సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రార్ధించే పదులు సాయం చేసే చేతులు ఉంటాయి. డబ్బు అవసరం అయితే పోని ఎవరు డబ్బు వాళ్ళు ఉంచుకోవాలి ఎవరికి ఇవ్వద్దు. కానీ ఒకళ్ళు కష్టం లో ఉంటే అయ్యో అని బాధ పడేవాళ్లే వాళ్ళు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు అంటే ఏంటి అందరూ కిందిస్థాయిలోనే ఉండాలి మనం జాలి చూపించే స్థాయిలోనే ఉండాలి అని ఒకళ్ళు అనుకోవటమే కదా మరి ఆ ఒకల గురించి పక్క వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా అంటే ఏ రకంగానూ కూడా మానసిక పరిపక్వత లేకుండా అంటే ఆలోచనలలో కాదు ఈర్ష్య లేని విషయంగా పరిపక్వత లేకుండా ఎందుకు మనం ఎదుటివారి కష్టాన్ని చూసి అయ్యో అంటూనే వాళ్ళ గెలుపుని చూస్తే అబ్బా అనుకోవాలి 

7. ఒక ఇంట్లో విద్యా వైద్యం ఇల్లు వనరులు ఆహారం ఆరోగ్యం తను ఇలా ఏ రకంగానూ కష్టాలు లేకుండా ఆ ఇల్లు చాలా బాగుందని ఈ గృహస్తులు చాలా ఆనందంగా ఉన్నారని అనుకుందాం. అది చూసి ఎంతమంది ఓర్చుకోగలుగుతున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళ కుటుంబాల్లో చిచ్చురాపటం మనుషుల మధ్య తంపులు పెట్టడం కాపురాలు కూల్చడం వంటివి ఎంతమంది చేయట్లేదు. 

8. ధర్మము నీతి మనుషుల్ని బట్టి మారుతూ ఉంటాయి. ముందర విషయంలో చెప్పుకున్నట్టు తన భార్య తన అక్క తన తల్లి తన బామ్మ ఎవరు కష్టపడకూడదు తన మేనత్తతో సహా ఎవరూ కష్టపడకూడదు కానీ మేనత్త గారికి కష్టపడొచ్చు తన తల్లి అత్తగారు కష్టపడకూడదు ఇంత సంకుచితంగా మగవాడు ఆలోచిస్తాడు. అప్పుడు ఆడది మాత్రం ఏం చేస్తుంది, చేతకానిది భర్తను అనుసరించి ఏడుస్తూ చావు దాకా వెళుతుంది చాకిరి చేసి వనరులు లేక చివరికి ఆదరణ లేక గుర్తింపు ఉన్న అది బయటకు రాని అహాల మధ్య నలిగిపోతుంది. లేదు చేతనైనదైతే చాటుగానో సూటిగా నేను భర్తను ఎదిరించి తన వాళ్ళని గెలిపించుకోవాలని తను నిలబడాలని ప్రయత్నం చేస్తుంది. దీని మధ్య తెలిసావో తెలియకుండానే నలిగిపోయేది పిల్లలే కదా మరి. ఇది చూసిన పిల్లలు ఎవరైనా ఇటువంటి వారి మధ్యలో ఉండాలి అనుకుంటారా.

9. అందుకని వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండటమే కరెక్ట్ అనుకుంటారు 

10. దానికి ఉన్న మార్గం ఉన్న ఊరు వదిలి రావడం ఆ తరంలో వాళ్ళు చేసింది అది పొలాలమ్ముకుని ఉద్యోగాల పేరుతో వేరుకాపురం అని సూటిగా చెప్పకుండా బయటికి వచ్చేసారు మరి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఎవరైనా చూస్తూ ఊరుకున్నాదా ఏదో ఒక రకంగా మాటలతో హింసిస్తూనే ఉన్నారు. లేదా ఏదో పని ఉన్నట్టు ఊరి నుంచి పట్నంలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్లి సహాయాలు పొందుతారు సహాయం ఆశ్రయం పొందినంత వరకు ఎవరు ఏమీ అనుకోరు కానీ తిన్న ఇంటివాసాలు లెక్కబెట్టి ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి పిల్లలు మనసులో కల్మషరాన్ని విషాన్ని నూరిపోస్తున్నారు. 

11. అందుకని ఈ తరం పిల్లలు ఏం చేశారు ఇవి కూడా వినపడనంత దూరంగా వెళ్లిపోవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకడం ఒకదారి అక్కడికి మాత్రం రాలేరా ఇంటి చేతనైన వాళ్ళు ఇక్కడిదాకా వచ్చినవాళ్లు ఇంకెక్కడికైనా రాగలవు పైగా ఆ రాష్ట్రాలలో వారి మాతృభాష రాకపోతే మనబడి కష్టం. మనదేశంలో కర్మకుద్ది హిందీ మాట్లాడే వాళ్ళ కన్నా విదేశీ పాలనలో ఆంగ్లం మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఈ ఆంగ్లం మాట్లాడే చోటికి పారిపోతే ఇంకా బెటర్ పైగా దేశీయంగా అయితే ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలరు చూపించమని కూడా వచ్చేస్తారు పనీపాటా లేకపోతే ఊరికి రావడానికి అంటే హైదరాబాద్ విశాఖ నుండి మహానగరాల్లో స్థిరపడ్డ కుటుంబాల ఇళ్లల్లోకి ఏమో ఈ ఊళ్ళో ఆ పని ఆవుల్లో పంచాయతీ వస్తారు గుజరాత్ కి ఢిల్లీకి అలా రాలేరు కదా అందుకని ఇది చూపించే అది చూపించు అంటూ వచ్చేస్తారు వచ్చిన వాళ్ళు కచ్చితంగా పెట్టిస్తారు అక్కడితో ఆగుతుందా మనం ముందుగా చెప్పుకున్నట్టు తంపులు పెడుతుంటారు.

12. అందుకని ఆంగ్లం మాట్లాడి ఎవరు అందుకోలేని చోటకి వెళ్ళిపోవాలి అంటే అది విదేశాలు దానికి కారణం మీసాలు అడ్డు ఉంటాయి. 

13. కర్మకాళి అక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ ఉన్న తమ‌ తల్లిదండ్రుల, ఇతర బంధువుల, మాటలు విని భార్యను లేదా భర్తకి నువ్వు కాల్చుకు తినే స్త్రీ పురుషులు ఇప్పటికీ ఉన్నారు అక్కడా ఉన్నారు 

14. కానీ ఇక్కడతో పోలిస్తే అక్కడిదాకా ఆ మాటలు చేరే అవకాశం తక్కువ పైగా ఇక్కడిదాకా కాదు అక్కడ స్త్రీలకు రక్షణ ఉంటుంది మనకి ఏదైనా ఇబ్బంది అయితే చట్టాలు మనని ఆదుకుంటాయి పైగా ఇక్కడ ప్రమాదాలు జరిగితే రక్షణ కరివే ఆక్సిడెంట్ అయినా సరే కానీ అక్కడ నైల్ లెవెల్ విషెస్ వచ్చేస్తాయి అలా ఒకళ్ళు మొదలుపెట్టిన పైనుంచి అదొక వైరస్ లాగా మిగతా వారికి వ్యాప్తి చెందింది అదే సమయంలో మనదేశంలోకి సాఫ్ట్వేర్ రంగం విస్తృతంగా ఎదిగేంత బాగా వచ్చేసి వేళ్ళూనుకుంది.

15. "రాౙు తలుౘుకుంటే దెబ్బలకు కొదువా", అన్నట్టు, ఇక తల్లిదండ్రులందరూ తల తాకట్టు పెట్టైనా సరే డబ్బు తెచ్చి పిల్లలు చేత ఆ ఇంజనీరింగ్ చదివి చదివించడం మొదలుపెట్టారు అ

 


Tuesday, January 28, 2025

For Kids

Take breathe till stomach for concentration and 


Saraswati Kavacham and Slokam for grasping 



[29/01, 08:48] MadhuriDevi Somaraju: before they sit to study, make them listen to Neela Saraswati mantra for 15 minutes andi... it will help with their focus and concentration.

[29/01, 08:48] MadhuriDevi Somaraju: Also, the rule is to study in the night and revise in the morning

[29/01, 08:48] MadhuriDevi Somaraju: any new topic, they have to do it this way

[29/01, 08:48] MadhuriDevi Somaraju: there is another mantra that you can ask to chant 108 times everyday before they sit to study if possible

[29/01, 08:48] MadhuriDevi Somaraju: KRING KRING KRING

భరత వేదమున

 శ్రీ మాత్రే నమః 


మనకందరికీ ఎంతో నచ్చిన పీడలు ఒకటైన శిరావెన్నెల గీతారామశాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఓ గ్రంథం సరిపోదు. 


వారిని దగ్గరగా చూసిన వారికి అంటే ప్రత్యక్షంగా కాదు, పాటల ద్వారా..


ఒక విషయం స్పష్టమవుతుంది. 


"ప్రతిగీతలోనూ ఉన్నది ఒకటే భావన ప్రతి జీవి లోనూ ఉందని ఒకటే పరమాత్మ అన్నట్టు. సందర్భానుసారంగా పగల నుంచి రే అయ్యేవరకు వచ్చే రోౙులను సమయాల లాగే పాటలోని ప్రస్తావనలు ఉంటాయి అంతే. నిౙానికి జీవితం కూడా అంతే." అన్నదే ఆ సారం. 


ఇదే ఉద్దేశంతో, వారి ప్రతిపాటని వివరించే సాహసం నేను ఎప్పుడు విడిగా చేయలేదు. 


కానీ, మహామహులు కూడా ప్రస్తావించే "ప్రాగ్దిశ వేణియ" అన్న పదము, భావన - నాకు సాహిత్యాన్ని బాల్యంలో పరిచయం చేశాయి. 


అలా అలా వింటూ వచ్చిన వారి పాటలలో, ఇన్నేళ్ళయినా వన్నె తరగని ప్రతీ పూవుల మాల లోంచీ, ఓ అక్షర కుసుమం పై నా ఈ ప్రత్యేక విశ్లేషణ. 


"భరత వేదమున నిరత నాట్యముగా" పాటలో, "నీలకంధరా ౙాలి పొందరా, కరుణతో నన్ను గనరా, నేల కందరా శైల మందిరా, మొర విని బదులిడరా" ఓ ప్రత్యేకతను కలిగి ఉంది.



శైలము కలిగినదా శైలి అంటే, ఎందుకంటే, "శిల" అంటే‌ కదలనిది, అచలము.


ఇక్కడ మంౘు పర్వతము కదులుతూనే ఉంటుంది, కారణం, హరుని శిరము నున్న జలనిధి గంగమ్మ పారటమో, లేదా భస్మ‌ నేత్రము నుండి ౙాలు వారే అగ్ని తాపమునకు వెండి కొండ నుండు మంౘు కరగి పౌవటమో కాదు!


"Larger than Life" అనబడే గురువు గారి గీతాలలోని సారమూ, నా మనసు లోని భావమూ, "శైలమూ" అంటే, స్వామి శంభుని కరుణతో భక్తుల కడకు చేరి పోయే గుణము.‌ 


"శంకరా!" అనగానే, "శరణూ" అన్న ఆర్తి అన్నా విన్నాడో లేదో కానీ, ఆ ఆక్రందన పూర్తయే లోపలే స్ఫూర్తి యై మూర్తీభవించిన దయా సముద్రుడు, ఈ "తాపసి".


అందుకే, "శైల మందిరా" అంటే, అక్కడి "తాపసి" నేలకు, నేల మీది వారికీ తప్పకుండా " అంద"టమే "అందమని" కదా!


నల్లని/ నీల వర్ణపు మెడ‌గల నీలకంధరుడు, ౙాలి పొంది, కరుణా రసమనే శైల‌ మందిరం నుంచీ నేల కంది, మన మొరలకు బదులీయాలన్నమాట!


ఎంత గొప్ప భావన! ఎంత ౘక్కగా అల్లబడిన విన్నపము!


మన మనవులను మహేశునికి గురువు గారు చెప్పేశారు కనుఁక, ఇక మన పనేమీ లేదు, గురువు గారికి "ధన్యత"ను తెలపటం తప్ప!


మాఘమాసమారంభమయే వేళ, సూర్యనేత్రుని స్తుతింౘుకుంటూ,



"శరణు శరణు సురేం

ద్ర సన్నుత, శరణు శరణు శంభో శంకర".






అన్ని పోటీలకు

 గణతంత్ర దినోత్సవ కవితల పోటీకి:


28.01.2024 మంగళవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


*పద్యములు:*


మేదురదన్త వృత్తము, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము, 8 భ‌ గణములు.


కాలము చెల్లెను రాౙుల పాలన గానగ రాదిల దేశపు భాగ్యము

మేలును దాగెను చిత్తము శుద్ధిగ మింటి సమమ్ముగ నుండెడి చేతిన

వాలు జయంబులు ముంగిట భావి తరంబుకు స్ఫూర్తి విరాజిలి

బేల తనంబసలుండదు ప్రీతిగ రాజ్యపుటమ్మును నేర్చిన


ఏడు దశాబ్దములైనను

వేడుక మానక నడచిన విజయమదగునా

కీడును దరిమిన నేతల

ౙాడన సాగుట మన విధి! స్వస్థత కలుగున్.


మార్చుచు పాత విధంబులు

నేర్చి వినూత్నపు సరళులు నేతలమైనన్

గూర్చును జయమా విధియే

చేర్చుమ యావిష్కరణలు శిశువుల కొఱకున్.






వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము 


19.04.2024 ఆదివారము 


సంక్రాంతి పై పద్యముల పోటీకి


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ పద్యములు నా స్వీయ సృజన, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


*వాణీ: ర న భ భ ర వ యతి 13*


ఆకశాన నడయాడెడి దేవతలార! భూమి పై

మీకు మోదమును పంౘుట కోసము మేము చేయు యీ

సోకులన్ని గని దీవెనలీయరె! జ్యోతులైన మీ

రాకకై యిౘట ౘూచెడి లోకుల రక్ష‌ సేయరే.


*అంబా: భ భ ర వ; యతి 7*


ముంగిట ౘక్కటి ముగ్గు లద్దియా

ఛెంగున యాడెడి యాడపిల్లలే

నింగిని దేవత నిండు రూపమై

పొంగలి పండుగ ముందు నిల్పునే.


*నాగర: భ‌ ర వ, యతి లేదు.*


మంటలు భోగి రోౙునే

వంటలు యన్ని వేళలూ

పంటల పుణ్యమా యనే

యింటన సందడే సదా.


*ధరధన్వితాళ: ర న, యతి లేదు.*


గాలిలోన

తేలుచుండు

బాలలాడు

యాలయాలు


*సీసము:*


గాలిపటాలేగ గగనసీమను చేరి

బ్రతుకు విలువ తెలుపగలవు మఱి

నేల పైనను ముగ్గు నింగిన పటములు

ఉదయము మంటలు హృదిన వేడి

బొమ్మలు వంటన పులుసులు తరువాత

భోగి పండ్లు భళిగ మొదటి రోౙు

పొంగలి కూరలు మురిపెములన్నియు

సంక్రాంతి నాడు ప్రసారములుగ


తేటగీతి:


కనుమ నాడు తర్పణములు మినుములంటు

కాకి కూడ కదలదుగ! గంగిరెద్దు

తోటి హరిదాసులు తిరుగు మేటి కళగ

విరిసి వెలుగు పండుగ గద! సిరులు చిలుకు.




*కర్నూలు జిల్లా కవితా సంకలనం కోసం*


అంశము: *సామాజిక అభ్యుదయము*


28.01.2025 మంగళవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


ఉత్సాహము: 7 సూర్య గణముల పై ఓ గురువు, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము.


1.


కల్లకపటమెఱుఁగనట్టి కలిమి బాలల‌మది యే

యెల్లలుండనట్టి పేర్మి యింట పంౘుౘుందురే

ౘల్లదనము గాక కుళ్ళు జ్వాల నింప వలదవే

పల్లమునకు నడిపి ముంౘు భావికాలమందునన్.


2. ఉత్సాహము:


స్వార్థగుణము మొదటనుండు బాగుగానె గాని యే

యర్థమొందబోదు భవితనందు ముంచి మ్రింగునే

వ్యర్థమౌ తలపులు కుట్ర వంచనలు మదముయు యీ

స్పర్థలన్ని దీసి మంచి వర్తనమును నడువుమా


3. ఆట వెలఁది 


తుదకు నేమి వెంట తోడ్కొని పోముగా

ధాత్రి నున్న వేళ తగవులేల

కలిమదెంత యున్న కలకాలమందదే


స్వార్థగుణము మేల!? వదులమండి.



*జాతీయ తెలుగు పరిరక్షణ సమితి*


*విశ్వవసు ఉగాది కవితల పోటీ కొరకు*


అంశము: *నేటి తెలుగు భాష స్థితి గతులు*


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన అని హామీ ఇస్తున్నాను.


*పద్యములు:*


1. *కందము*


జీవన విధములు తెలిపెడి

నావకు చుక్కాని వంటి నానుడులేవీ

రావయె నేటి తరమునకు

భావము పదమే యెరుగరు భాషయు మరుగే.


*ఆట వెలఁది*:


2.


నాటి సూక్తులన్ని మేటి నడిపి మన

బ్రతుకు బంధములను పట్టు విడుపు

పండుగలన వలయు పద్ధతులన్నియున్

తెలియ జేయు; నేడు పలుకరెవరు.


3.


భుక్తి రుచులు గాని యుక్తికి మూలమౌ

ధాన్యపు సిరి విలువ శూన్యమాయె

భాష నందు గాని బ్రతికెడి రీతిన

గాని తెలుగు వెలుగు కానరాదు.


4.


భావ గర్భితములు పద్యములన్ని యా

నవరసముల నిధులు కవనములును

స్ఫూర్తినొసగు గాని ప్రోత్సహింౘవు యిలన్

దుష్ట బుద్ధి; వలదు ద్రోహమనును.



5.


యుద్ధ కాంక్ష‌ గాక నుర్వి హితము గూర్చు

చర్యలన్ని నేర్పి జైత్ర యాత్ర

వైపు గమన విధము పాఠముగ దెలుపు

శ్లోకశనిధులు గలవు! చూడరండి.


6.


గీత భాగవతము కృష్ణ రాయల వారి

భక్తి గాథలన్ని పద్యములుగ

రక్షనొసగు గాని రారు నేటి యువత

వాని నేర్చుకొనగ! పాతశయనుచు.


7.


పశ్చిమాద్రి గాంచి భానోదయములన్ని

విడచి వ్యథల పడుచు కడకు బ్రతుకు

దుఃఖభరితమవగ దోసిలిన ముఖము

దాచుకొనుచు యేడ్చు తరము నిదియె.


8.


గొప్ప కవుల సేవ గుర్తించు కనులేవి

భరత జాతి దాటి బయటనున్న

వారు నయము సేవ బాగ‌‌ సేయుచునుండె

తెలిసి తెనుఁగు భాష‌తీయదనము.




సాహితీ చైతన్య కిరణాలు సమూహము కొఱకు 


అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రణతులిడుతూ...


30.01.2025 గురువారము


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్.


9963998955.


1.


తేటగీతి 


నీలి మేఘమాలికలేమొ నిండె రంగు

తెల్ల దనము కారణము యాదిత్యుడుండె

తల్లి తాటంకముగ గాన ధగధగలను

గగన సీమ‌‌ గాంచెను చిరు నగవుతోడ.


2.


సూర్య మండల సంస్థిత శోభనాంగి

లక్ష్మి భాను మండల వాసి భ్రమర పూజ్య

వీరి సఖియ వాణి రథము బృందమవగ

కాంతివంత యాదిత్య నీ కళలు మెండు.


3.


భువిని మేలు చేయు పుణ్య నదుల నీరు

త్రావకుండ వదలి లవణమున్న

యబ్ధి గణన మాకు నంద జేసిన ౘాలు

కృపను ౘూపుమయ్య నృపుల పూజ్య


4.


కర్మసాక్షి వైన కాచి మా దోషముల్

మంచి బుద్ధి నొసగి మలినములను

తొలగ చేసినంత తూర్పున యున్న నీ

దయను యెఱిగి జనులు ధైర్యమందు.




ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


#######################################


విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య, విజయనగరము వారి


శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ రాష్ట్ర స్థాయి పద్య రచనల పోటీకి:


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన. దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.



1. స్వాగత వృత్తము, ర న భ గ గ గణములు, యతి 3 వ గణాద్యక్షరము

స్ఫూర్తివంతులుగ ముందుకు రారే

కర్తలై నడిపి కార్యములన్నీ

యార్తి చేయుచు ప్రయాస లేకన్

పూర్తిగా సలిపి మోదమునీరే


2. ద్రుత విలంబితము:-- న, భ, భ, ర. యతి 7వ అక్షరము.


మనసు పెట్టుటె మంత్రము బాటనన్

తనువు శక్తికి ధామము నిల్పి భూ

వనము నింపరె పూవులు పండ్లతో

కనుల నిండుగ గర్వము పొంగగా.


3. ద్రుత విలంబితము:-- న, భ, భ, ర. యతి 7వ అక్షరము.


పణము వద్దని ప్రాణము నెప్పుడున్

రణము మాన్పరె రక్షణ సేయరే

తృణముయున్నను తృప్తిగ సాగినన్

మణులు దక్కును మంగళమే ధరన్.


4. అంబురుహ:--భ భ, భ భ, ర స వ .యతి మైత్రి 13

విద్య వివేకము నేర్చుచు నందు ప్రవీణ్యమందిన మేలగున్

సేద్యము వీడక పంటల మెండుగ సృష్టి చేసిన దండి నై

వేద్యము వేరుగ పెట్టగనేల సుభిక్షమవ్వగ నేల యే

వాద్యము చెప్పగ‌ లేదు వసంతపు పాటలన్ తమ నోటితో.


5.


వంశస్థ:-- జ, త, జ, ర . యతి 8వ అక్షరము.


ప్రమాణమున్ చేయరె! బాట నందు యే

ప్రమాదమున్నన్ తగు భద్రతందియే

ప్రమోదమౌ గమ్యము వైపు యానమున్

ప్రమత్తతన్ సాగిన భాగ్యమౌననిన్.


6. ఇంద్ర వంశ:-- త,త, జ, ర యతి 8వ అక్షరము.


మద్యంబు త్రావంగ ప్రమాదమేగదా

యుద్యోగమే యున్న ప్రయోజనంబగున్

విద్యార్థి యైశ్వర్యము విత్తు మూలమే

పద్యాన సందేశము పట్టి మారుమా.


7. పాదప వృత్తము(తోవక):-- భ భ భ గ గ యతి 7వ అక్షరము.


మాదక ద్రవ్యము మత్తు విపత్తే

వాదనలేలన వద్దనరండీ

చేదుగ నున్నను శ్రేయము గూర్చే

వేదము వంటిది విద్యయె చాలున్.


8. సుగంధి వృత్తము 7 హ గణములు పైన గురువు యతి స్థానము 9వ అక్షరము.


మత్సరంబు స్థానమందు మంచి యన్న మాటనే

కుత్సితంబు లేక తీపి గుర్తుగాను ధాత్రితో

వత్సయన్న మేటిదైన బంధమున్న చాలుగా

వత్సరంబు మారినట్లు వార్ధి మారదెన్నడున్.


9. రతోద్ధత:--ర, న, ర, వ. యతి 7వ అక్షరము.


ఆకలన్న యపుడారగించుమా

లేకి యాశ మది రెక్క ద్రుంౘునే

నాకమన్న యది న్యాయ బుద్ధియే

ప్రాకబోకు యతి పైకమందగన్.


10. ఉపేంద్ర వృత్తము - జ, త, జ, గ, గ గణములు యతి 8వ అక్షరము.


ప్రయోగశాలల్ మన వాసమై

ప్రయోజనాలే తగు లక్ష్యమై

ప్రయత్నమే చేసిన పండునే

ప్రయాణమందున్ మరి పంటలే.


11. తరలి వృత్తము:-- భ న న జ న ర యతి11

పెద్దల పలుకులె మనకు పెన్నిధి తగు రీతినన్

హద్దుగ మసలుచు ననునయంబుగ మరి సాగుచూ

యొద్దికగ నడచిన భవితోన్నతమగు నేర్చినన్

విద్దెను యనుభవము గల వీరి సరసనన్ భళా.


12. పంచచామరము: జ ర జ ర జ గ‌ యతి 10వ అక్షరము.


నిరాశవీడి సాగనట్టి నింద యున్న వేదనన్

నిరంతరమ్ము మోయనేల నిత్య మల్లి మీరెగా

నిరీక్షణంటు చేసినంత నిప్పు గూడ యారునే

నిరామయంబగున్ ధరన్ ప్రణీతమౌను యానమే.


##############################££££#####£


మహా కుంభమేళా పోటీలకు:


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్ 


ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


శంభుని దయకై సాగుౘు

కుంభము నందున మునుగుట కొరకై యేగెన్

డంభము నెరుగని జనులే

గంభీరముతో నదులు సగౌరవమందెన్.


నూరేండ్లకు పైబడెనే

యీ రీతిగ కుంభము మన యిల చేరుటకై

ధారగ నీరే పారగ

తారకలే గాంచె దృశ్య ధామము ప్రియమున్.


మూడు నదులలోన మునక యొక్క పరియె

ౙరుగ జలధి కరుణ యుర్వి చేరె

వేరు వరములేల ప్రియమార యంజలి

దెలుపుకున్న ౘాలు! తీరు ఋణము.



వాగ్దేవి సాహితీ వేదిక కొఱకు 


నానీల పోటీలకు


06.02.2025 గురువారము 


1.


శలవుల కోసం

ౘూడదు పడతి

విరామమెరుగని

భూమే ఆమె కద


2.


తూరుపు

గడియారము

గంట కొట్టె

పడతి మెలకువ చూసి


3.


ధనము నవ్వింది

బిడ్డను కాదని

డబ్బును కొలిచే

మగడిని ౘూసి


4.


అంతరిక్షమే

తిరిగి పంపినా

అతివను

రానీయరేలా


5.


కూడును పెట్టిన

చేయి నరికే

నరులకె రోౙులు

పాపం పండే వరకే.





సాహితీ చైతన్య కిరణాలు సమూహము కొరక


18.02.2025 మంగళవారము 


అంశము: తెలుగు భాష 

[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా] 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


సీసము:


ఇతర భాషలలోకి యిముడుౘూ మార్పులన్

సుళువుగ నందెడి జ్యోతి తెనుఁగు

యిలను మురిపెముతో యింపుగా తిరుగాడు

మువ్వల సవ్వడి ముగ్ధ పరుగు

విడువ వలదు మాతృగడపను పలుకును

వృద్ధికదియె చెట్టు 🌲 వేరు నరుడ!

అందరు మెచ్చిన సుందరమైనది

వర్ణింౘనలవియ! పదములందు


ఆట వెలది:


పాలరాయి వంటి ప్రసన్నత గలిగి

వసుధ యంత ఖ్యాతి పట్టినట్టి

యందమైన భాష‌ యాంధ్రులకే దక్కె!

అౘ్చు

తోడి ముగియు యద్భుతంబు.




Murthy Garu WhatsApp 9704867867


నమస్కారం అండీ, ద్విపదల సంకలానికి నా సమర్పణము:


28.02.2025 శుక్రవారము 


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్ 


ఈ ద్విపదలు నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


*ద్విపదలు:*


1.


సత్యసంధత గాని స్వచ్ఛత యైన

నిత్యముంచరు మది నిజమే యెరుగరు


2.


ముసుగుతో సులువుగా మోసమే చేసి

యసలు రూపంబు ప్రయాసతో దాచి


3.


మనసను సాక్షిని మరుగున వేసి

మనుగడ సాగించు మనిషియె విషము


4.


పక్షపాతము ద్వంద్వ వైఖరి వంటి

లక్షణములతో విరాజిల్లుచుండు


5.


స్వార్థపరులతోడ సంసారమైన

వ్యర్థమే యైననూ వదలగలేము


6.


నదులను మార్చక నరకముగ పలు

చెదల పూరితమగు చెత్త పేర్చకుమ


7.


తరువులు నిధులు స్వార్థ పరుల వలన

కరుగుచు నుంటివి కాపాడ వలెను


8.


స్వస్థత కోసము స్వచ్ఛమౌ తలపు

దుస్థితి బాపు వ్యవస్థను మార్చు


9.


మంచితనంబును మనుజులలోన

యెంచిన గనమే సహించుటె దారి.


10.


తపములెన్నియు నున్న దాటగ వశమె

అపమృత్యువును విధి యాట యిది గద!


###₹####₹₹_&-+()////////&--+())@₹_&+()////////))/



శ్రీ మాత్రే నమః 



అవధాన విద్యా వికాస‌ పరిషత్ వారు నిర్వహించే పద్య ఖండిక పోటీల కొఱకు:


హామీ పత్రము:


ఈ పద్యముల రచన నా స్వంతము, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.



1. తేటగీతి 


ధరను వత్సరముల సంఖ్య పరుగులిడుచు

యో సహస్రము దాటగ యుత్సవములె

భరత సీమ హద్దుల వద్ద పొరుగు వారు

చిౘ్చు రేపగ యుద్దపు మౘ్చ రగిలె.


2. ఆట వెలఁది 


ఱెండు వేల యేండ్ల పండగ ముందరే

దండయాత్ర చేసె దాడికి దిగె

కుట్ర పూరితముగ తమ కూటములను

ఱెచ్చ గొట్టి రణమునకై లేవదీసె.


3. ఉత్పలమాల 


కంచెను దాటి శత్రువులు కత్తులు కాల్పుల తోడ వీరులన్

ముంచుటకై చరించగ సమున్నతులైన జవానులంత యా

పంచకమందు చేరి తమ పట్టు బిగించి జయంబునందిరే

పంచిరి సంతసంబు తమ‌ భావి తరంబుకు కీర్తిమంతులై.


పంచకము = యుద్ధభూమి 


4. ఉత్పలమాల 


వంచన చేయు రక్కసులపై తమ శక్తిని చూపుచు పారద్రోలి యా

మంచును లెక్క‌సేయక ప్రమాదము పట్లను భీతి లేక‌ గా

వించిరి పోరు సైనికులు వీరులు భారత మాత బిడ్డలే

కంచెగ నిల్చినారు మన గడ్డకు ప్రాణము లెక్క సేయరే.



5. ఆట వెలఁది


అంత వఱకు జనులు స్వంత పనుల వైపె

దృష్టి నిలిపి యుండె సృష్టి రీతి

నదియె గాగ గాని యటు పైన మాత్రము

సైనికులకు తోడు సాగె సతము.



6.


ఉత్సాహము; చతుష్పాదము, సప్రాస, 7 సూర్య గణముల పై ఓ గ గణము, 5వ గణాద్యక్షరము యతి స్థానము.


మదిని లేదు చింత భరత మాత రక్ష కోసమై

పొదలు మాటునుండు శత్రుమూక చీల్చు మీ

చెదరనట్టి శక్తి యుండ! క్షిపణి నైన ద్రుంౘుౘూ

యదను ౘూసి యోర్పు తోడ నాడు యుక్తిమంతులై


7.


ఉత్సాహము; చతుష్పాదము, సప్రాస, 7 సూర్య గణముల పై ఓ గ గణము, 5వ గణాద్యక్షరము యతి స్థానము.


కదనరంగ‌మందు వడిగ కదలు ధీమతులు సదా

పెదవి యంౘు దాటనీక వేదనేది యున్ననూ

కొదవ లేదు శక్తికనుౘు కోట దాటనీక తా

మదుపునందు మసలునటుల యరుల నాపు ధీరులే


8.


ఉత్సాహము; చతుష్పాదము, సప్రాస, 7 సూర్య గణముల పై ఓ గ గణము, 5వ గణాద్యక్షరము యతి స్థానము.


పదిలముండవలయు మీరు వసుధ నిలచు వరకు మా

నిదుర నందు నైన తలపు నిండు మీ కుశలము కై

వదలుకోము మీ కుటుంబ బంధువులను యండయై

తుదకునంట వెన్ను దన్ను తోడు నీడ లౌదుమే.



9. తేటగీతి 


అని భరోసాగ పల్కుచు యనుదినమ్ము

సాగు సమయమున నచికేత శత్రు సేన

శిబిరమందు చిక్కగ తన శిశువు కొఱకు

భరత మాత అండగ నుండె! వెరవకుండ.


10. చంపకమాల 


పరుగుల తోడ సాగు మన భారత పౌరులు యొక్కసారి యాగెనే

పొరుగున్న నుండు వారు రణ భూమిని వీరుని ఖైదు చేయగా

ఝరి వలె పొంగె నెత్తురు సజావుగ నాతని పంపకున్నౘో

చెర విడిపించి మాతృభువి క్షేమము పంపుటకై తపించిరే


11. కందము:


ద్వైపాక్షిక చర్చ ౙరిగి

యాపద తలపెట్టక వైరులాతని విడచెన్

సోపా‌నమిదియె గెలుపుకు

నోపుగ వైచి యడుగులు సయోధ్య గొనవలెన్.


(ఓపు = ఓర్పు)



12. కందము:


పునరావృతమయె నిటులే

యనిలపు సీమ విహరింౘు నభినందనుకే

వెనుకకు రప్పించెనుగా

మన నేతలు తక్షణమ్ము! మంత్రాంగముతో.


13. కందము:


ఇదియే నిజమగు గెలుపని

మది సంతసమందె గాని మంటలు రేపే

వదలని వైరము గోరదు

యెదురుగ నిలచెడి కలహము నెపుడు యడగదే.



14. తేటగీతి:


ఎట్టి రక్తసంబంధమే యెఱుఁగకున్న

నొకఱికొకఱు నిలచు రీతి యున్నతముర!

యట్టి సద్గుణశీలురే పట్టు విడరు

భారతీయ గుణము బహు బంధు ప్రీతి



15. ఆట వెలఁది:


రైతుకైన ధనము లాభమే పంౘు మా

లక్షణంబు చిలుకు లక్షలన్ని!

శాస్త్రవేత్తలకు నజాతశత్రువులగు

సైనికులకు సతము జయము జయము.


16. ఆట వెలఁది:


జయ జవాను జయ కిసాను నినాదమే

శాస్త్రవంతులకును సాగి యువత

మదిని స్ఫూర్తి నింపి మంగళమొసగెనే

స్వంతవారె యంత! జనులు మాకు.



17. ఆట వెలఁది:


ఇట్లు స్వార్థమసలె యెఱుఁగని జాతిలో

లోన మాత్రమెపుఁడు రోత సృష్టి 

ౙరుగుౘుండె సాటి వాఱి గెలుపు 

నొప్పి గలుగచేసి ముప్పు తెచ్చె.


18. ఆట వెలఁది 


ఇంట అత్త మామ యల్లుడు కోడలు

మంచి వారు యనరు! మాట కరకు

యాడపడుౘు వదిన యాగర్భ శత్రులే

బావ లేక మరిది బద్ధ వైరి.


19. ఆట వెలఁది 


ప్రక్క వారి యింట పత్రమైనను లేక

సవ్వడైన ౘాలు జగడమేను

యేమి తత్త్వమిది సహేతుకమా యని

తలపు నందు రాదు! తగవు ప్రీతి.


20. కందము


ఖండాంతరములు దాటుట

మెండుగ కోరు పరివారమే యధికములై

దండిగ పంపిరి బిడ్డల

నిండుగ నిలిపిరి యమెరిక నేలన! ప్రియమున్.


21.


మధురగతి రగడ 8 + 8 మాత్రలు, యతి 3వ గణము మొదటి అక్షరము, అంత్య ప్రాస 



బిడ్డలు తరలగ విడిచి బయటకు

గడ్డుగ మారెను కాలము సాగక

యొడ్డుకు చేరుట యోకల యే యిక

గొడ్డలి పెట్టే కుటుంబ యమరిక


22. పద్మ వృత్తము: స‌ స స జ గ యతి 9 


బరువాయెను పిల్లలు భారతావనిన్

దొరలైనను తామెగదోయుౘూ 

కరవాయెనె యిౘ్చట కాసులంటునే

తరలించిరి దేశము దాటి యత్నమున్


23. పద్మ వృత్తము: స‌ స స జ గ యతి 9


పొరపాటయెనే అని ముప్పు తాకగా

స్వర పేటికనందున బాధ యేలనో

పరువున్ సిరులంటు తపస్సు చేసి యీ

యిరుకిల్లని వీడుట హేల గాదయా



24. సీసము:


అని పాఠములిపుడు యందముగా చెప్పి

తమను ౘూౘుట లేదు తనయులనుౘు

నింద యొకటి వైచి నిప్పు రాజేయు యీ

ఇంటి పెద్దలతీరు కంటకమ్ము

ౘదువులేలన నాడు సాగించి యమెరికా

దీక్ష పూని యిపుడు తిట్టనేల

ఆట పాటలనన్ని యటకలెక్కించి యే

వేడుకలేలేని బింకమొంది.


తేటగీతి 


పుస్తకములకు బిడ్డల మస్తకముల

నంకితముగ చేసి ప్రణాళికాంకమందు

మాతృభూమి మఱియు భాష మసలనీక

నెట్టి వైచిరి బయటకు గట్టిగాను.



25. సీసము:


పిదప దిరిగి మీరు కుదురుకోక నౘట

యిటకు వచ్చి పలుకుటేల హితవు

పట్నమొదిలి మాదు బాల్యమందున మీరు

మరలి ౘూడగ లేదు మమత తోడ

నేడు వదిలి యట్టి నీతి మమ్ములనిట్లు

తూలనాడుట దృష్టి దోషమనరె!

మీదు యవసరము మిన్ను చేరునటుల

పరువు ధనము యింక బయటి నేల.


తేటగీతి:


సర్వ కాంక్షలు దీరగా ౘాలుననుౘు

మీదు లెక్కలే గణనకు మీకు గాద!

మాకు యవకాశములిౘట లేక మేము

పాట్లు పడుట తగున! వద్దు తూట్లు నికను.



26. కందము


ఈ వాక్కు పిల్లలలదై

యో వాదన తెచ్చె! పెంచెనుక్రోషమునే

యే వైపు నిలౘునో విధి!

యావేశము శూన్యమయిన హ్లాదమె మిగులున్.


27. కందము:


అల్లుడు చెల్లడు నొకఱికి

మెల్లగ గోతులు యగవులు మెరిపింౘుచు తా

మెల్లరు సుఖముగనుందురు

తల్లులు చెప్పరు సుగుణము తనయలకెపుడున్.



28: కందము


కోడలు శత్రువు కావలె

మేడలు వంటలు పనులును మేటిగ నెపుడున్

నాడరు మెట్టిన గృహమున

కీడును తలపెట్టెదరట! క్రీడగ హయ్యో.


29. కందము


గగనపు సీమల చేరిన

తగవులు మానని మనుజులె! ధరణిన నెపుడున్.

బిగువులు పంతములు విడక

నగుమోములు విడచెదరట! నాశమె తుదకున్.


30. కందము:


నీతికి బదులుగ స్వార్థము

గోతులు ద్రవ్వెడి కపటము కుట్రలు మదిలో

జ్యోతుల వెలుగులు కరవై

నూతిన పడదోయటమె వినూత్నము ధరపై.



31.


అతివినయ చతుష్పాదము, ప్రాస నియమము కలదు, 17 లఘువులు, ఒక గురువు, యతి స్థానము 11వ అక్షరము


ఇరుగుపొరుగు కలియుటనెఱుగరు కలహమే

యరమరికలు‌‌గనగసహజమయెగృహమునన్

కొరతలె మమతలకు చిగురులు తొడగదు గా

చెరువున కలువలు తగు సిరులును తరుగగా.



32. అపరాజితము


న న ర స‌ ల గ చతుష్పాదము ప్రాస‌నియమము కలదు యతి స్థానము 9వ అక్షరము


శ్రమపడి సిరులెవ్వఱైనను పొందినన్

తమ పలుకులనందు తంపుల చెప్పునే

క్షమయను గుణమే ప్రశాంతతనొసగినా

భ్రమల విడచి యేమి మారరు జనులిలన్.



33. ఆట వెలఁది 


ఇట్టి మనుజులున్న యిలను బంధములన్ని

స్థిర‌ తత్త్వము గలిగి యమరవు ౘూడ

మానవత్వము మెండుయె గాని మనసు

స్వార్థమెఱుఁగక యుండదు పచ్చి నిజము.



34. తేటగీతి 


గగన సీమకు చేరిన గాని యట్టి

ఘనత మెౘ్చుటకు ౙతగ మనిషి చెంత

సాటి వాఱె

వఱును లేక జయముఁ గాదు

బంధము విలువ తెలిసిన బ్రతుకె బ్రతుకు.


35. ఆట వెలఁది 


ఉన్నదొక్క జగతి! ఉడుకుతనమదేల

నరుల జాతి గూడ కొఱత పడిన

మిగులు సిరులవేవి!? తగవుల మానిన

పండు తరతరములు వసుధనందు.



ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి 

కలము పేరు: నాగిని,

హైదరాబాద్,

చరవాణి: 9963998955

ధన్యవాదాలు తల్లీ


Show quoted text


%©°}{^€|{[$€{§∆∆\]®€£${∆∆}]✓€€°}\\]]}\∆∆∆\\\


పద్య సారస్వత పీఠము వారి "పద్య వైభవము" సంకలనము కోసము


1. చంపకమాల : పద్యము గొప్ప తనము:


బ్రతుకున మంచి చెడ్డలను పాదములందున దెల్పు విద్యయై

హితవచనంబులన్ని మనకింపుగ నేర్పెడి పెన్నిధే కదా

వెతకగ‌ లేదు యింత ఘన విత్తము వేరగు భాష లోన యీ

రతనము వంటి సంపదల రాశి తెనుంగుకె స్వంతమాయెనే.


2. ఉత్పలమాల: ఛందస్సు ఘనత


వేదమునున్న సూక్తులను విద్యను పొందు విధంబు ఛందమే

యాదిగ‌ యీ జగంబుకు సహాయము చేయుచు నేర్పుచుండగా

నీదుట తేలికౌను ప్రజకీ యిల యానము మార్గమంతయున్

పాదము దీర్ఘ హ్రస్వములు ప్రాసల తోడన నిండి యుండునే.


3. అంబా: భ భ ర వ యతి 7 *పద్యము శక్తి*


భావి తరంబుకు భవ్యమౌ సిరుల్

కావవి యాస్తులు కాసులెన్నడున్

జీవన యానము చెప్పు సూక్తులున్

భావము నిండిన పద్య పాదముల్.


4. నాగర: భ, ర, వ, యతి‌లేదు *సాహిత్యము లో పద్యము స్థానము* 


వీడకు పద్యమెన్నడున్

పాడుౘు సాగు వానికిన్

నీడనొసంగునే సదా

వేడుక నేర్చినంతనే


5. కందము: *పద్య శాశ్వతత్త్వము*


తరతరముల నిధి దాటెను

పర పాలనలను సహితము! పట్టుగ నిలచెన్

నరులకు మేలొనగూర్చెడి

సిరియై నిలచెను మహిమను చెప్పగ వశమా.










పద్య సారస్వత పీఠము వారి "పద్య వైభవము" సంకలనము కోసము


1. నాగర: భ, ర, వ, యతి‌లేదు 

సాహిత్యము లో పద్యము స్థానము / పద్యము ఘనత

ఆయుధమౌను పట్టినన్

ధ్యేయము పద్యమైనచో

మాయను దాటవచ్చునే

యే‌ యమ యాతనుండదే


2. నాగర: భ, ర, వ, యతి‌ లేదు *ఛందస్సు ఘనత*

వేదము సాగు రీతినే

పాదమునందు ౘూపునే

వాదన వేరదేలనో

మోదము నిందుయున్నదే.


3.  నాగర: భ, ర, వ, యతి‌లేదు *పద్యము శాశ్వతత్వము* 

భావి తరంబుకీయరే

దీవెన పద్య రూపమున్!

కావుగ యాస్తులే సిరుల్

జీవము యిట్టి విద్యయే.

4. నాగర: భ, ర, వ, యతి‌లేదు *సాహిత్యము లో పద్యము స్థానము* 


వీడకు పద్యమెన్నడున్

పాడుౘు సాగు వానికిన్

నీడనొసంగునే సదా

వేడుక నేర్చినంతనే


5.  నాగర: భ, ర, వ, యతి‌లేదు: పద్యము శక్తి


యల్పమనెంచబోకుమా

తెల్పును నీతి సూక్తులన్

వేల్పుగ కొల్చి నేర్చినన్

స్వల్పము గాదు శక్తియే





వాగ్దేవి సాహితీ వేదిక 2 


వారు నిర్వహిస్తున్న పోటీలకు:


అంశము: *కార్పొరేట్ విద్య - మిథ్య*


31.03.2025


నా వివరములు: 


పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [కలము పేరు: నాగిని]


ఊరు: హైదరాబాద్ 


హామీ పత్రము: ఈ కవనము నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.


శీర్షిక: వృద్ధి.


ప్రక్రియ: పద్యములు.


సీసము:


విత్తనమునకైన వృద్ధికై జలము

    సూర్య కిరణములు చూపినంత

వృక్షమగును యట్లే పిల్లల భవితకై

   విద్య ముఖ్యము గాన పెంచవలయు

గురువుల వద్ద వనరులు యవసరమే

    గాని హద్దును మీరి కాల మహిమ 

యనుచు సౌకర్యములార్తినేల నొసగి

    సంచి బరువు గూడ పెంచనేల.


తేటగీతి:


ౘల్లదనము శీతల యంత్రసాయమంది

గదిన సాగుటదేల! సెగలు వెలుపల

కలుషితము జేయునని పుస్తకమున లేద!

వ్యర్థమైన యాహారము స్వస్థతలను

మ్రింగి వేయు గాద! బడిన మేటి గాని

భోజనపు శాల విక్రయములను జేయు

విష పదార్థములను గొన్న పిల్లలకది

కీడొనర్చునైనను మార్పు ౙాడ లేద?





మహతీ వేదికకు:


శీర్షిక: తల్లిదండ్రులు 


కవి పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని]


ఊరి పేరు: హైదరాబాద్ 


కవిత:


1. సీసము:


కైలాసము దిగి మాకై యిలకు వచ్చిన

తల్లిదండ్రులు మీరు! ధన్యులమ్ము

మేమంతయును! గని మిము నర రూపమున్

మీదు దయకు గారె మాదు కనుల

యానంద బాష్పముల్! హర్షమునకు

సీతమ్మ! రామయ్య! శిష్టులకును

హద్దులు! లేవుగ! యవనిని వీడక

నిౘటనే యుండుమా యిచ్ఛ మీర!


తేటగీతి:


అలిగి చెరగి మేము పలుకునందు మిమ్ము

దయను ౘూపవలదు యన్న! దరిని జేరో

మమ్ము గాౘు కరుణ మీది మాత పితలు

మీరు గాక దిక్కును మాకు వేరు యెవరు!


తేటగీతి:


శ్రమను మిమ్ము చేరగనీక లక్ష్మణుండు

భరత శత్రుఘ్న మారుతి త్వరితగతిన 

మాకు కలుగు యన్యాయము మాపుదురని

యనుభవమ్ములు గలవు! ప్రయొస‌ రాదు


తేటగీతి:


మీదు పరివారమును నమ్మి మేలు వొంది

మీకు దండము లిడెదము చీకు చింత

చేరనట్టి యదృష్టమంది! చిగురు తొడుగు

నామని ఋతువు విడదింక యవనినెపుడు.


మత్తకోకిల:


విన్నపంబిదె తల్లిదండ్రులు వేగమే యిల చేరరే

చిన్నబోవగనీక రక్షను చేర్చి చేకొనరే సదా

కన్న బిడ్డలమేగ! పేర్మిని గాంచి కౌశలమీయరే

వెన్నపూసను మించి మెత్తగ ప్రేమ వెల్లడి చేయరే.


హామీ పత్రము: ఈ కవనము నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.





వారం వారం కవిత:


01.04.2025 మంగళవారము


అంశము: సీతారాములు


ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్


బిడ్డల మైన మేము కాదన్న విడువకుండ 

మాది యలుక యని యెఱింగి కాచరే

తల్లిదండ్రులార! సీతా రాములార!

పేర్మి యంటే‌ మీరే! పెద్దలార!



కైలాసంబును వీడి మానవ రూపులై

మాతో కలిసి నడయాడి మము మీ దయతో

మురిపించ బూనిరే యుత్సాహమును మది నింపిరే

ఎంతటి సహృ'దయ'త గనుకనే యిలవేల్పులైరి.



ధర్మము గాడిని తప్పెను ధైర్యము సన్నగిల్లెను

కంటన నీరే యాగదే కాపాడగ రారే యిపుడే

మీ పాలనలో యుండవే వెతలని నమ్మిన

శిశువులమౌ మము చేకొనరే సతతము


పెద్దల ముందర పిన్నలు దివికేగరుగా

వైభవమే‌తప్ప వైధవ్యములుండవు యే

అవమానములూ యతి సారములూ యంటవు

ప్రార్థన యభ్యర్థన గైకొనరే వినరే మొరలను


కలియుగమైనను యేమిటి యడ్డంకి

కరుగక యున్నను యేమిటి! మీ ఘనత

కలలను తీర్చగ కళలను బెంౘగ కదలాడరే

కలిమికి నెలవై కాపాడరే కరుణతో



ఆరోగ్యంబులు కరగనె ఆవేశములే అంతటా

యుద్ధము కుట్రలు స్వార్థమనర్థంబులు నిండెనే

రాకున్నను మీరు యీ అవనికి మీ కరుణకు

యిక విలువ యేది మాకు రక్షణ యేది


Thursday, January 23, 2025

కాకినాడ సాహిత్య సాంస్కృతిక కళా వేదిక పోటీ కొఱకు:

కాకినాడ సాహిత్య సాంస్కృతిక కళా వేదిక పోటీ కొఱకు:

ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.

ఉత్పలమాల 

అక్షరమన్న జాతికది యమృత భాండము నేర్పు యానమున్

శిక్షణ వేఱదేల మన్ని చిన్న దలంపును గూడ వ్రాయవౘ్చునే

లక్షణమైన సంపదలు రక్షణ రేఖలు మానవాళికిన్

దక్షత నేర్పి లక్ష్యముకు దారిని ౘూపు జయమ్ము గూర్చునే

అక్షము పారనీదు మనకాపద చేసెడి వారినుంచి తా

నక్షిణియై సదా శ్రియము హ్లాదము మోదమునందజేయునే

పక్షములుండు చందురుని పట్లను గాని మధించినన్ మదిన్

వృక్షము వంటి సూక్తులను వృద్ధియె దక్కును సాహితీ సిరుల్.


అక్షము = పాచిక, యక్షిణి = దేవత


మత్తకోకిల ర స‌జ జ భ ర యతి 13


సాహితీ సిరులన్ పఠించిన గల్గు జ్ఞానము తీరునే

దాహమంత వసుంధరన్ బ్రతికించు దారి ప్రాప్తమై

మోహమే యిక పారిపోవుగద విమోచనమందునే

దేహమున్నను దేనిపైనను రాదు తీపియు నిక్కమే.

Sunday, January 19, 2025

Chandam Ganam quick reference

 ఛందస్సు--వృత్తములు

1.ఉత్పలమాల:--భరనభభరవ. యతి10

2.చంపకమాల:---నజభజజజర. యతి 11 

3.మత్తేభము :--సభరనమయవ. యతి 14 

4.శార్దూలము:--మసజస తతగ. యతి 13

5.మత్తకోకిల:--రసజజ భర.యతి 11 అ

6.తరలము:--నభరససజజగ. యతి 12 అ

7.మానిని:--7భ,గురు యతి 7-13-19

8.పంచచామరము:-- జర జర జగ.యతి 10

9.స్రగ్ధర:--మరభనయయయ.యతి 8-15 అ

 10.మహాస్రగ్ధర:--సతతనరరగ. యతి 9-16అ

11.కవిరాజ విరాజితము:--6 నగణములు,జ,వ.

 యతి8-14-20 అ.

12.స్రగ్విణి:-- రర రర. యతి 7 అక్షరము

13.తోటకము:--స,స, స,స. యతి 9 అ

14.మాలిని:-- న,న,మ,య,య .

యతి 9 అ

15.సుగంధి:-- 7హ,గు.యతి‌.9 అ

16.వసంతతిలకము:-- తభ జజగగ .యతి 8

17.మదన వృత్తము:-- త,భ,జ,జ,గ,గ.యతి 9 అ.

18.భుజంగ ప్రయాతము:--

యయ యయ యతి 8 అ.

19.పాదప వృత్తము(తోవక):--

భభ భగగ యతి 7 అ.

20.తరలి వృత్తము:--

భనన జనర యతి11

21.శిఖరిణి:--య,మ,నస భ,వ.

యతి13 అ.

22.ఇంద్ర వ్రజ:--త,త జ, గగ

యతి 8 అ.

23.ఉపేంద్ర:---జ,త,జ గగ

యతి 8 అ.

24.రతోద్ధత:--రన ,రవ.

యతి 7 అ.

25.స్వాగత:--రన ,భ,గగ. 

యతి 7 అ .

26.ఇంద్ర వంశ:-- త,త జ,ర

యతి 8 అ.

27.వంశస్థ:--జ,త జ,ర .

యతి 8 అ.

28.మేఘ విస్ఫూర్జితము:--

యమ,నస,రరగ .

యతి మైత్రి 13 .

29.ద్రుత విలంబితము:--

న,భ, భ,ర. యతి 7 అ.

చంద్రకళా:--రస, సత, జజగ 

యతి మైత్రి 11 అ.

30.అంబురుహ:--భభ, భభ, రసవ .యతి మైత్రి13.

31.క్రౌంచపద :--భమస, భనన ,నయ .యతిమైత్రి 11- 19.

32.సాధ్వీ:--భనజ, నస, భగు.

యతి మైత్రి 8--22 .

33.మలయజ:--నజన, సన, నభ ,నవ. యతిమైత్రి 5-12-22.

34.ప్రభువృత్తము:-- నన నజ జజ జజవ యతి మైత్రి 9-15-21

36.మంగళమహా శ్రీ వృత్తము:--భజసన, భజసన,గగ.

యతిమైత్రి 9-17

37.లయగ్రాహి:--భజసన, భజసన ,భయ ప్రాసయతి 9-18-27

38.లయ విభాతి:-- నసనన, సన నన జసగ. ప్రాసయతి 10-20-30

39.లాక్షణి:--భనన ,నన, భన ,నస. యతి 16.

40.రమణక :-- 9నగణములు, వ గణము.

యతి 9-17-25


41.దండకము:-- మొదట స,న,హ గణములు, పిదప తగణముల మితము.తుది.గురువు ఉండవలెను.

Tuesday, January 7, 2025

NavaGraha

 నవగ్రహాల దేవతల వివరాలు.............!!

01. ఆదిత్యుడు 

కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞా చక్రం, సహస్రారం )

వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు.

సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు

పుష్పం : తామర

వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం

జాతి రాయి : కెంపు

నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

02. చంద్రుడు 

చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.

అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.

కుంభ రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.

ప్రత్యధిదేవత : గౌరి

వర్ణం : తెలుపు

ధాన్యం : బియ్యం / వడ్లు

పుష్పం : తెల్లని తామర

వస్త్రం : తెల్లని వస్త్రం

జాతి రత్నం : ముత్యం

నైవేద్యం : పెరుగన్నం

03. మంగళ 

అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.

భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి

వర్ణం: ఎరుపు

ధాన్యం : కందిపప్పు

పుష్పం : సంపంగి మరియు తామర

వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం

జాతి రత్నం : ఎర్రని పగడం

నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

04. బుధుడు 

తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.

మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.

అధిదేవత : విష్ణు

ప్రత్యధిదేవత : నారాయణుడు

వర్ణం : చిగురాకు పచ్చ

వాహనం : సింహం

ధాన్యం : పచ్చ పెసర పప్పు

వస్త్రం : పచ్చని రంగు వస్త్రం

జాతి రత్నం : పచ్చ

నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

05. గురు 

బృహస్పతి అని కూడా అంతము. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.

పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 

ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ

ప్రతదిదేవత : ఇంద్రుడు

వర్ణం: పసుపు

వాహనం : గజరాజు

ధాన్యం : వేరుసెనగ పప్పు

పుష్పం : మల్లె

వస్త్రం : బంగారు రంగు వస్త్రం

జాతి రత్నం : పుష్య రాగం

నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

06. శుక్రుడు 

ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.

అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.

వృషభ, తులరాశులకు అధిపతి.

అదిదేవత : ఇంద్రుడు

వర్ణం : తెలుపు

వాహనం : మొసలి

ధాన్యం : చిక్కుడు గింజలు

పుష్పం : తెల్లని తామర

వస్త్రం : తెల్లని వస్త్రం

జాతి రత్నం : వజ్రం

నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

07. శని 

సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.

శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలంటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.

కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : యముడు

ప్రతదిదేవత : ప్రజాపతి

వర్ణం : నలుపు

ధాన్యం : నల్ల నువ్వులు

వస్త్రం : నల్లని వస్త్రం

జాతి రత్నం : నీలం

నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

08. రాహువు 

సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.

పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.

పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.

అదిదేవత : దుర్గ

ప్రత్యధిదేవత : పాము

వర్ణం : నలుపు

వాహనం : నిలపు సింహం

ధాన్యం : మినుగులు

పుష్పం : అడవి మందారం

జాతిరత్నం : గోమేధుకం

వస్త్రం : నల్లటి వస్త్రం

నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

09. కేతువు 

భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.

ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు

ప్రత్యధిదేవత : బ్రహ్మ

వర్ణం : ఎరుపు

వాహనం : గద్ద

ధాన్యం : ఉలవలు

పుష్పం : ఎర్రని కలువ

వస్త్రం : రంగురంగుల వస్త్రం

జాతి రత్నం : వైడుర్యం

నైవేద్యం : ఉలవల అన్నం

సర్వేజనా సుఖినోభవంతు












[08/04, 07:19] Satya Murthy Gaaru: *అసలు పంచాంగం అంటే ఏమిటి* ?


*"తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమ్"* అన్నారు. 


పంచాంగంలో అయిదు ముఖ్యవిభాగాలు ఉంటాయి.


 అంటే 

1. తిథి, 

2. వారం, 

3. నక్షత్రం, 

4. యోగం, 

5. కరణం 

అనే అయిదు అంగాల శుభాశుభ ఫలితాలను తెలియచేసేది అని అర్థం. 


వీటిలో : 

1. *తిథి* – శ్రేయస్సును ఇస్తుంది.

2. *వారం* – ఆయుష్షు కలిగిస్తుంది.

3. *నక్షత్రం* – పాపాలను తొలగిస్తుంది.

4. *యోగం* – రోగాలను నివారిస్తుంది.

5. *కరణం* – కార్యాలను సిద్ధింపచేస్తుంది.

[08/04, 07:19] Satya Murthy Gaaru: *పంచాంగం గురించి:*

నిత్య పూజా విధిలో ఈ అయిదింటినీ స్మరించుకోవడమే *సంకల్పం*. 


వీటిని తెలుసుకునేందుకే పంచాంగం. 


తెలుగువారి పంచాంగాలు *చాంద్రమానాన్ని* ఆధారం చేసుకుని రూపొందిస్తారు.


*చాంద్రమానం& అంటే చంద్రుడి గమనం అని అర్థం. 

భూమిచుట్టూ తిరిగే చంద్రునికి పదహారు కళలున్నాయి. 

అవే *పాడ్యమి నుంచి పౌర్ణమి* లేదా *అమావాస్య వరకూ* ఉన్న తిథులు. 


వీటిలో *పాడ్యమి నుంచి పౌర్ణమి* వరకూ శుక్లపక్షంలో చంద్ర కళలు వృద్ధి పొందుతాయి.


తిరిగి *పాడ్యమి నుంచి అమావాస్య* వరకూ బహుళ లేదా *కృష్ణపక్షంలో* చంద్రకళలు క్షీణిస్తాయి. 


చంద్రకళల ఆధారంగా శుక్ల పాడ్యమి నుంచి అమావాస్య వరకూ మనకు *ఒక మాసం* అవుతుంది. 


*చైత్రం నుంచి ఫాల్గుణం* వరకూ ఉండే పన్నెండు మాసాలు ఇలా ఏర్పడినవే.